G20 Meet: శ్రీనగర్‌లో జి 20 సదస్సు... మెరైన్ కమాండోలు, జాతీయ భద్రతా గార్డులతో భారీ భద్రత
శ్రీనగర్ : జమ్మూకశ్మీరులోని శ్రీనగర్ లో సోమవారం నుంచి జి20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మీట్ జరగనున్న నేపథ్యంలో సాయుధ భద్రతను కట్టుదిట్టం చేశారు.జీ20 సభ్య దేశాల నుంచి 60 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు..
ఉగ్రవాదులు జి20 ఈవెంట్‌కు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించవచ్చన్న నివేదికల మధ్య ఆర్మీ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్), సశాస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బి),జమ్మూ కాశ్మీర్ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.
జి20 ప్రతినిధులు ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ కదలికపై కూడా ఆంక్షలు విధించారు.లాల్ చౌక్ ఏరియాలోని దుకాణాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దుకాణాలు తెరిచి ఉంచేందుకు ప్రత్యేక పాస్‌లు జారీ చేశారు.
జి-20 దేశాల పర్యాటక కార్యవర్గ సమావేశం విజయవంతం కావడం వల్ల జమ్మూ కాశ్మీర్‌లో పర్యాటకుల రాక, పెట్టుబడులు పెరుగుతాయని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు..
SB NEWS
May 22 2023, 12:05