Terrorists Links In Hyderabad : హైదరాబాద్ ఉగ్రవాదుల కేసులో కొత్త కోణం .. ప్రజాస్వామ్యదేశాలే టార్గెట్‌గా కుట్రలు

హైదరాబాద్ ఉగ్రవాదుల కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హిజబ్ ఉట్ తెహ్రిర్ సంస్థతో సంబంధాలున్నట్లుగా ఏటీఎస్ గుర్తించింది..

హైదరాబాద్‌లో మరోసారి ఉగ్రవాద కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో మరోసారి ఉగ్రవాద మూలాలు కనిపిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. నగరంలో మొత్తం ఆరుగురు ఉగ్రవాద సానుభూతిపరులను అధికారులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సల్మాన్ సైతం అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో అరెస్టైన ఆరుగురు, భూపాల్ లో అదుపులోకి 11 మందిని ఏటీఎస్ అధికారులు కోర్టులో హాజరు పర్చారు. దీనికి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ ప్రత్యేక న్యాయస్థానం మే19 వరకు కస్టడీ విధించింది..

విచారణలో భోపాల్ టు హైదరాబాద్ కు ఉగ్రవాదుల లింక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దాడుల కోసం అడవుల్లో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఒకరితో మరొకరికి నేరుగా కాంటాక్టు లేకుండా డార్క్ వెబ్ ద్వారా సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. పెద్ద నగరాలను టార్గెట్ చేసుకున్న నిందితులు అక్కడే సాధారణ పౌరులుగా స్థిరపడినట్లుగా తెలుస్తోంది..

కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారంతో మధ్యప్రదేశ్ ఏటీఎస్, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నిర్వహించాగా..మహమ్మద్ సలీల్, అబ్దుల్ రెహ్మాన్, షేక్ జునైద్, మహమ్మద్ అబ్బాస్, హమీద్ లను అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిలో సలీమ్ ఓ మెడికల్ కాలేజీలో హెచ్ఓడీగా పని చేస్తున్నాడు.

అబ్దుల్ రెహ్మాన్ ఎంఎన్ సీ కంపెనీలో క్లౌడ్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. షేక్ జునైద్ పాతబస్తీలో డెంటిస్ట్ గా పని చేస్తున్నాడు. మరో ఇద్దరు మహమ్మద్ అబ్బాస్, హమీద్ రోజువారీ కూలీలు. సల్మాన్ అనే కూలీ పరారీలో ఉన్నాడు. సల్మాన్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పట్టుబడ్డ వారికి హిజ్బుత్ తహ్రీర్ సంస్థతో సంబంధాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు..

నేడు ‘దోస్త్‌’ నోటిఫికేషన్‌

వచ్చేవిద్యాసంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ను గురువారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆర్‌ లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ విడుదల చేయనున్నారు. ఇంటర్‌ ఫలితాలు మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

Pawankalyan: ఆఖరి ధాన్యం గింజ కొనేవరకు జనసేన ఉద్యమం ఆగదు..

రైతాంగ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఆఖరి ధాన్యం గింజ కొనే వరకు జనసేన ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు..

రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి పర్యటనలో పంట నష్టాలను తన దృష్టికి తీసుకుని వచ్చిన రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని మంత్రులు, ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. అన్నం పెట్టే రైతులపై దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. అతివృష్టి, అనావృష్టితో రైతులు తీరని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు..

ప్రభుత్వం తాత్సారం చేయడం వలనే రైతులకు ఈ దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయడంలేదని, క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయకపోయిన ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని సూచించారు. రుణమాఫీ చేయకపోయిన పర్వాలేదు. పంటలు వేసుకోవడానికి రైతులు పెట్టుబడులు కోరుతున్నారని తెలిపారు. ప్రభుత్వం సక్రమంగా చర్యలు తీసుకోకపోవడం వలన రైతులు ఇబ్బందులు పడుతున్నారని పవన్‌ కల్యాణ్ అన్నారు..

SB NEWS

SB NEWS

Delhi vs Centre: దిల్లీలో పాలనాధికారం స్థానిక ప్రభుత్వానిదే..

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi)లో పాలనా సర్వీసులపై (Administrative Services) నియంత్రణాధికారం ఎవరికి ఉండాలనే వివాదంలో అరవింద్‌ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సర్కారుకు సుప్రీంకోర్టు (Supreme Court)లో భారీ విజయం లభించింది..

ప్రభుత్వాధికారులపై ఎన్నికైన ప్రభుత్వానికే సర్వాధికారాలు ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ మేరకు ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ) కట్టుబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. శాంతిభద్రతలు మినహా మిగతా అన్ని అంశాలపై దిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని తెలిపింది..

SB NEWS

SB NEWS

SB NEWS

సమయం లేదు మిత్రమా!! తక్షణమే విధుల్లో చేరండి

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం చర్చలకు పిలిచింది అని జరుగుతున్న ప్రచారం నిజం కాదని, నిబంధనలు, ఒప్పందాలకు విరుద్ధంగా చేస్తున్న సమ్మె ను వారు వెంటనే విరమించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం రోజున ఒక ప్రకటన విడుదల చేశారు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్:

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం చర్చలకు పిలవలేదు

ప్రభుత్వం తరపున నేను గానీ, మరెవ్వరు గానీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను చర్చలకు పిలవలేదు

అలా ప్రభుత్వం చర్చలకు పిలిచింది అని జరుగుతున్న ప్రచారం అబద్ధం

అలాంటి ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మ వద్దు

ఇప్పటికైనా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమిస్తే బాగుంటుంది

సీఎం కెసిఆర్ మనసున్న ముఖ్య మంత్రి

సీఎం కెసిఆర్ కు జూనియర్ పంచాయతీ కార్యదర్శులపై మంచి అభిప్రాయం ఉంది

ఆ పేరును చెడ గొట్టుకోవద్దు

ప్రభుత్వాన్ని శాసించాలని సాహసించడం, నియంత్రించాలని అనుకోవడం తప్పు

JPS లు సమ్మె విరమిస్తే, సీఎం వారికి తప్పకుండా సాయం చేస్తారన్న నమ్మకం నాకు ఉంది

జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేయడం నిబంధనలు మరియు చట్ట విరుద్ధం

జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి కూడా విరుద్ధం

సంఘాలు కట్టబోమని, యూనియన్ లలో చెరబోమని, సమ్మెలు చేయబోమని, ఎలాంటి డిమాండ్ల కు దిగబోమని మీరు ప్రభుత్వానికి బాండ్ రాసి ఇచ్చారు

మీరు రాసిచ్చిన ఒప్పందాలను మీరే ఉల్లంఘిస్తున్న తీరు బాగా లేదు

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నిలిపివేయాలి

మీరు నాతో ఫోన్ ద్వారా మాట్లాడారు. మీరు మీ సమస్యలు చెప్పుకున్నారు

మీరు సమ్మె విరమించాలని నేను సూచించాను

కానీ, ప్రభుత్వం చర్చలకు పిలిచింది అని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు

అలాంటి ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు

ఇప్పటికైనా మించిపోలేదు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వెంటనే సమ్మె ను విరమించి. విధుల్లో చేరాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు హితవు తో కూడిన సూచన, విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌లో దారుణం.. జిమ్ ట్రైనర్ సజీవదహనం

జయకృష్ణ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడా ? లేక అగ్నిప్రమాదమా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు

కూకట్‌పల్లి ప్రసన్న నగర్‌లో ఈరోజు మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. ఈ మంటల్లో ఒకరు మృతి చెందారు. మృతుడు జిమ్ ట్రైనర్ జయకృష్ణగా గుర్తించారు పోలీసులు. ఐదు రోజుల క్రితమే భార్య, పిల్లలను జిమ్ ట్రైనర్ జయకృష్ణ ఊరికి పంపించినట్లు నిర్ధారించారు పోలీసులు.

దీంతో ఆత్మహత్యా అన్న కోణంలోనూ పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదం సమయంలో జయకృష్ణ ఒక్కడే ఇంట్లో ఉన్నట్లు పోలీసులు తేల్చారు. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఫస్ట్ ఫ్లోర్ లో మంటలు చెలరేగడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్ సాయంతో మంటలు ఆర్పి వేశారు. అప్పటికే జయ కృష్ణ మృతి చెందాడు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుడు, భార్య పిల్లలు గత కొద్దిరోజుల క్రితం సొంతూరు భీమవరం పంపించాడు.

ఈరోజు ఉదయం బంధువులతో కలిసి మద్యం సేవించి.. వారంతా బయటకు వెళ్లిన సమయంలో బెడ్రూంలో పడుకొని పోయాడు జిమ్ ట్రైనర్ జయకృష్ణ. అదే టైంలో మంటలు ఇల్లంతా వ్యాపించాయి. బయటకు వెళ్లలేని పక్షంలో మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే జయకృష్ణ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడా ? లేక అగ్నిప్రమాదమా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

SB NEWS

ఇది సమ్మెల తెలంగాణా : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

2013లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ సభలో మాట్లాడుతూ, ఇక సమ్మెలు లేని తెలంగాణను తెచ్చుకుందాం అని చెప్పినట్లుగా గుర్తుంది. కానీ నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన తర్వాత కూడా సమ్మెలు, రోడ్లపై ధర్నాలు ఆగలేదు. గత పది రోజులుగా జూనియర్ పంచాయితీ కార్యదర్శులు నిరవధిక సమ్మె చేస్తున్నారు.

నేను నల్గొండ జిల్లాలోని మునుగోడు, నార్కట్‌పల్లి ప్రాంతాల్లో వారి సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపాను. నిన్న మొన్నటి వరకు గ్రామాలను అందంగా తీర్చిదిద్ది, అవార్డులు తెచ్చి, ప్రభుత్వానికి పేరు తెచ్చిన ఉద్యోగులు రోడ్ల మీద కూర్చోవటం చూస్తే, వారి పసిపిల్లలు ‘కేసీఆర్ తాతా! మా అమ్మను రెగ్యులరైజ్ చేయండి!’ అంటూ ఫ్లకార్డులు పట్టుకొని సమ్మెలో పాల్గొనటం చూస్తే... గుండె బరువెక్కింది. బాగా చదివి పరీక్ష రాసి మెరిట్ ప్రకారం ఉద్యోగం సంపాదించి నాలుగేళ్లు సేవలందించి మళ్లీ రోడ్లపైకి రావడం బహుశా దేశం మొత్తంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే జరుగుతుంది. వారంతా పీజీ, పీహెచ్‌డీలు చేసిన ఉన్నత విద్యావంతులు. పాలకుల స్వార్థం, కుట్రపూరిత రాజకీయాల వల్ల గతిలేక ఉద్యోగంలో చేరవలసిన పరిస్థితి వచ్చింది.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ పంచాయితీ అవార్డుల్లో, 2.5లక్షల గ్రామ పంచాయితీలు పాల్గొనగా, 46 గ్రామాలు అవార్డులు పొందితే, అందులో 13 గ్రామాలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవేనని అంటే దాదాపు 30శాతం అవార్డులు సాధించి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి దయాకర్ రావు ఆనందం వ్యక్తం చేశారు. నేడు అదే శాఖకు చెందిన కార్యదర్శులు వేల సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చి, మాకు భద్రత కావాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 2018లో ప్రభుత్వం నోటిఫికేషన్ నెం.2560/సీపీఆర్ & ఆర్‌ఈ/బి2/2017 ప్రకారం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. మూడేళ్లను ప్రొహిబిషనరీ కాలంగా నిర్ణయించి, ప్రతిభ ఆధారంగా రెగ్యులరైజ్ చేస్తామని నోటిఫికేషన్‌లోని పేరా నెంబరు ఆరు, ఐటమ్ నెంబరు ఐదులో స్పష్టంగా పేర్కొన్నది. వాస్తవానికి ప్రొహిబిషనరీ కాలం ఏ ఉద్యోగానికైనా రెండేళ్లకు మించి ఉండదు. అంటే ఈ నోటిఫికేషన్ చట్టవిరుద్ధం. అయినా మూడేళ్ళే కదా అని కష్టపడి పనిచేస్తే, మోసపూరితంగా ప్రభుత్వం జీవో నెం.26 ప్రకారం ప్రొహిబిషనరీ కాలాన్ని మరో ఏడాది కాలం పాటు పెంచింది. అయినా పంచాయతీ కార్యదర్శులు మరో ఏడాది పనిచేసి ప్రభుత్వానికి ఎనలేని సేవ చేశారు. ఈ నాలుగేళ్ళ కాలం పాటు, తమకంటే చిన్న ఉద్యోగి కంటే కూడా తక్కువ జీతం తీసుకొని గొడ్డు చాకిరీ చేశారు. జీవో కాలపరిమితి కూడా ఈ నెల ఏప్రిల్ 11తో ముగిసింది. ప్రభుత్వం మళ్లీ మాట తప్పింది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కిందిస్థాయి ఉద్యోగి ఒక్కరు కూడా సంతోషంగా లేరు. గతంలో గ్రామీణ ప్రాంతంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లు పే స్కేల్ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, పనిభారం ఒత్తిడి పెంచుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.4779 రద్దు చేయాలని, 18 రోజులపాటు సమ్మె చేసినందుకు ప్రభుత్వం వారిని విధుల నుంచి తొలగించింది. తిరిగి రెండేళ్ళ తరువాత డిమాండ్లు నెరవేర్చకుండానే విధుల్లోకి తీసుకుంది. అనంతరం రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తెస్తున్నామని చెబుతూ, వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి, వారందరినీ ఇష్టవిరుద్ధంగా ఇతర శాఖలకు బదిలీ చేసి ప్రభుత్వ నిరంకుశ, నియంత పోకడలను ఋజువు చేసుకున్నారు. అనంతరం వీఆర్‌ఏలు తమకు పే స్కేల్ అమలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించి, కారుణ్య నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేస్తూ, దాదాపు 80రోజుల పాటు సమ్మె నిర్వహిస్తే, మునుగోడు ఎన్నికల సందర్భంగా, స్వయంగా రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ రెండుసార్లు పిలిపించి మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేశారు. అప్పటి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కూడా పిలిపించి ఉద్యోగులను పిలిపించి బుజ్జగించడంతో వీఆర్‌ఏలు అందరూ నమ్మి తిరిగి విధుల్లో చేరారు. మునుగోడు ఎన్నికలు ముగిసి నేటికి ఆరు నెలలు గడిచాయి. కానీ వారిని పట్టించుకున్న నాధుడే లేడు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీలు, ఆయాలు పనికి తగ్గ వేతనం, సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తూ, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని, కనీస వేతనం చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరితే, ఇప్పటివరకు వాళ్లనూ పట్టించుకోలేదు. పైగా పనిభారం పెంచుతున్నారు. ఇదిలా ఉండగా గ్రామాల్లో మహిళా పొదుపు సంఘాల్లో పనిచేసే వీఓఏలు కనీసం ఉద్యోగులుగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని అడిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కోసం, అమలు కోసం మాత్రమే వీరిని వాడుకుంటున్నారు. విద్యుత్ సంస్థల్లో పని చేసే ఒప్పంద ఉద్యోగులను ఆర్టిజన్ ఉద్యోగులుగా మార్చి, ఇతర ఉద్యోగుల కంటే ఎక్కువ పని చేయించుకుంటున్నారు. కానీ ఉద్యోగ భద్రత ఇవ్వడం లేదు. ప్రశ్నిస్తే, రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా సమ్మె చేస్తామంటే, ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరించి, అక్రమంగా అరెస్టులు చేసి, సమ్మె విరమించాలన్నారు తప్ప, వారి బాధలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. 2009 బ్యాచ్‌కు చెందిన ఎస్సైలు తమకు పదోన్నతులు కల్పించాలని, తమకంటే జూనియర్లకు ప్రమోషన్లు ఇచ్చి తమకు మాత్రం ఇవ్వలేదని, ఇది ఆత్మగౌరవ సమస్య అని, మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారని వేడుకుంటూ దాదాపు 47సార్లు వినతి పత్రం ఇచ్చినా, కనీసం ఫైల్ చూడని దుర్మార్గపు పాలన తెలంగాణలో కొనసాగుతుంది. 317 జీవో వల్ల నష్టపోయిన వారు, ఇబ్బంది పడుతున్న వారు ఇంకా ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ప్రతి నెలా ఒకటవ తేదీన జీతాలు రాక, సీపీఎస్ పెన్షన్ విధానం వల్ల ఇబ్బందులకు గురవుతున్న ఉద్యోగులను పట్టించుకోకుండా ప్రభుత్వం, ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూపుతూ, అవమానకరంగా వ్యవహరిస్తున్నది.

ఇది బంగారు తెలంగాణ కాదు, సమ్మెల తెలంగాణగా మారింది. ఉద్యోగులే తమకు న్యాయం కావాలని సమ్మె కార్యక్రమాలు నిర్వహించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే టాప్‌లో ఉంది. కార్యదర్శులు, ఇతర ఉద్యోగులు ప్రభుత్వంలో పనిచేయడం లేదా, వారికి హక్కులు లేవా? వారికి ప్రభుత్వ నిబంధనలు వర్తించవా? వారు నెలకు 4.25 లక్షల జీతం అడగడం లేదు కదా? ప్రభుత్వం స్పందించాలి, సమాధానం చెప్పాలి.

ఇది పేద వర్గాల సమస్య. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేదలే మెజారిటీ ఉద్యోగులుగా ఉన్నారు. వారంతా ఆ ఉద్యోగాలను నమ్ముకొని, ఇతర అవకాశాలన్నీ వదులుకొని జీవిస్తున్నవారు. ఇది వారి ఆత్మగౌరవ సమస్య, జీవన్మరణ సమస్య. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం మొండివైఖరితో వ్యవహరించకూడదు.

గాలికి పోయే కంప ను మన సారు.....

కరీనంగర్ నుంచి జగిత్యాల వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సులో దారుణం చోటుచేసుకుంది. సీటు కోసం ఆడవాళ్ల మధ్య గొడవ జరిగింది. అయితే.. ఆ గొడవ పెట్టుకున్న మహిళల్లో ఒకరు ఎస్సై భార్య ఉంది. దీంతో.. గొడవ విషయం తన భర్తకు ఫోన్ చేసి చెప్పటంతో.. సినిమా స్టైల్‌లో ఆ ఎస్సై ఎంట్రీ ఇచ్చాడు. అంతేనా.. నోటికొచ్చినట్టు అమ్మాయిని తీడుతూ.. జుట్టు పట్టుకుని బయటకు లాక్కొచ్చి కొట్టాడు.. బూటు కాలితో తన్నాడు కూడా. ఈ ఘటన ఇప్పుడు జగిత్యాలలో తీవ్ర చర్చనీయాంశం మారింది.

ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం గొడవలు జరుగుతుండటం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. అయితే.. అలాంటి గొడవలు.. సాధారణంగా సీటు దొరికితేనే.. సదరు ప్రయాణికుల గమ్యస్థానాలు వస్తేనో.. లేదా బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులు మందలిస్తేనో, సముదాయిస్తేనో సద్దుమణిగిపోతాయి. కానీ.. ఇక్కడ మాత్రం సీటు కోసం జరిగిన గొడవలో ఓ ఎస్సై సినిమా స్టైల్‌లో బస్సును కారుతో ఛేజ్ చేసిన మరీ ఎంట్రీ ఇచ్చారు. అక్కడి వచ్చి ఇద్దరిని మందలించి సమస్యకు పరిష్యారం చెప్పాడా అంటే.. ఆయన కూడా ఓ యువతిపై దాష్టికానికి దిగారు. అమ్మాయిని అందరి ముందే జుట్టుపట్టుకుని కిందికి లాక్కొచ్చారు. బూటుు కాలితో తంతూ.. కర్కశంగా వ్యవహరించారు. ఈ దారుణమైన ఘటన.. కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్తున్న ఓ బస్సులో చోటుచేసుకుంది.

అయితే.. బెజ్జంకి నుంచి షేక్ ఫర్హా (22) అనే MBA విద్యార్థిని, ఆమె తల్లితో కలిసి జగిత్యాల వెళ్లేందుకు ఓ ఆర్టీసీ బస్సు ఎక్కింది. అయితే.. అదే బస్సులో జగిత్యాల వెళ్తున్న మరో మహిళ కూడా ఎక్కింది. అయితే.. ఫర్హా, ఆమె తల్లి కూర్చుకున్న సీటులోనే కూర్చుంది. అయితే.. బస్సు వెళ్తున్న సమయంలో పదే పదే ఇంకొంచెం జరగాలంటూ విసిగించటంతో.. వాళ్లు అసహనానికి లోనయ్యారు. దీందో.. వాళ్ల మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది. ఒకరికొకరు మాటలు అనుకున్నారు. దీంతో.. ఆ మహిళ వెనకి సీటులోకి వెళ్లి కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత మళ్లీ ముందు కూర్చుకున్న సీటు దగ్గరికి వచ్చి కూర్చుంది. తన భర్త ఎస్సై అని.. అతనికి ఫోన్ చేసి.. జరిగిన గొడవ గురించి చెప్పాని.. కాసేపట్లో వచ్చి మీ సంగతి చూస్తాడు అంటూ ధమ్కీ ఇచ్చింది. దానికి.. వాళ్లిద్దరూ జగిత్యాల బస్టాండులో దిగిన తర్వాత మాట్లాడదామని తెలిపారు..

అయితే.. బస్సు జగిత్యాలలోని బస్సు డిపో దగ్గరికి చేరుకోగానే సినిమా స్టైల్‌లో కారుతో అడ్డగించి సివిల్ డ్రెస్సులో ఎస్సై అనీల్, ఖాకీ డ్రెస్‌లో ఒక కానిస్టేబుల్ బస్సును అడ్డుకున్నారు. బస్సులోకి ఎక్కి తన భార్యతో ఎవరు గొడవ పెట్టుకున్నారంటూ అసభ్య పదజాలంతో దూషించాడు. షేక్ ఫర్హా, ఆమె తల్లిని తన భార్య చూపించడంతో వారి దగ్గరికి వచ్చి దూషిస్తూ.. తీవ్రంగా బెదిరించాడు. భయపడ్డ అమ్మాయి తన ఫోన్‌లో వీడియో చాట్ ఆన్ చేసి ఫ్రెండ్ నెంబర్‌కి పెట్టింది.

అది గమనించిన ఎస్సై అనిల్ ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ.. ఆ అమ్మాయి మీద ఎస్సై అనిల్ చేయి చేసుకున్నాడు. అమ్మాయి జుట్టుపట్టి మరీ బస్సు నుండి బయటికి లాక్కొచ్చి కొట్టాడు. బూటు కాళ్లతో తన్నాడు. అనిల్ భార్య ఆ అమ్మాయి తల్లి మీద చేయిచేసుకుంది. అక్కడ అంతమంది జనాలు ఉన్నా చూస్తున్నారే కానీ ఏవరూ ఆపే సాహం చేయకపోవటం గమనార్హం. చివరికి ఒక మహిళ ధైర్యం చేసి అనీల్‌ని నిలదీసింది. దీంతో ఆ అమ్మాయి పగిలిన ఫోన్, బస్సు టికెట్లు, పర్సు లాక్కొని అక్కడి నుండి వెళ్లిపోయాడు ఎస్సై. కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకునే అధికారులు ఎస్ఐ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

మద్యం దుకాణానికి తాళాలు వేసి బైఠాయింపు

మర్రిగూడ, ఇటీవల ప్రభుత్వం తగ్గించిన ధరలకే మద్యం విక్రయించాలని మద్యం ప్రియులు డిమాండ్‌ చేశారు. మర్రిగూడ మండలకేంద్రంలోని మూడు వైన్‌షాపులకు బుధవారం రాత్రి తాళాలు వేసి బైఠాయించారు. ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించినట్లు ప్రకటించినా స్థానిక పద్మావతి, వెంకటసాయి, శ్రీసాయి మద్యం దుకాణాల యజమానులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి పాత ధరలకే మద్యం విక్రయిస్తున్నారని తెలిపారు.

ప్రభుత్వం తగ్గించిన ధరలకు మీరు ఎందుకు విక్రయించడం లేదంటూ నిర్వాహకులను ప్రశ్నించారు. పాత స్టాక్‌ ఉన్నందున దానిపై ఉన్న ధరలకే విక్రయిస్తున్నామని, కొత్త స్టాక్‌ వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రకటించిన ధరలకు విక్రయిస్తామని వైన్‌ షాపుల యజమానులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రంగారెడ్డి మద్యం దుకాణాల వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు.

మూడు దుకాణాల యజమానులు సిండికేటై ఇష్టానుసారం మద్యం విక్రయిస్తున్నారని ఎస్‌ఐకి చెప్పారు. ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించిన మాట వాస్తవమేనని, కానీ పాత స్టాక్‌ ఉన్నందున తాము వాటిపై ఉన్న ధరలకే అమ్ముతున్నామని నిర్వాహకులు తెలిపారు. మద్యం ప్రియులకు ఎస్‌ఐ రంగారెడ్డి నచ్చజెప్పి దుకాణాలను తెరిపించి యథావిధిగా కొనుగోలు చేయించారు.

SB NEWS

SB NEWS

ఏపీలో పెరిగిన విద్యుత్ వినియోగం..కరెంట్ కోతలు తప్పవా !

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. గత మూడు రోజులు ఎండలు మండిపోతుండటంతో విద్యుత్‌ వినియోగం విపరీతంగా పెరిగింది..

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం విపరీతంగా పెరిగడంతో.. సింహాద్రి ఎన్. టి.పీ.సీ లో నాలుగు యూనిట్లలోను ఉత్పత్తి ప్రారంభం అయింది.

దీంతో అందుబాటులోకి రెండు వేల మెగావాట్లు వచ్చాయి. ఇటీవల కురిసిన వర్షాలకు విద్యుత్ వినియోగం తగ్గడంతో యూనిట్లను అండర్ రిజర్వ్ షట్ డౌన్ లో పెట్టింది NTPC.

ఇక ఇప్పుడు సింహాద్రి ఎన్. టి.పీ.సీ లో నాలుగు యూనిట్లలోను ఉత్పత్తి ప్రారంభించారు. ఏపీలో కరెంట్‌ కోతలు లేకుండా.. ప్రణాళికలు చేస్తున్నారు అధికారులు.

ఇది ఇలా ఉంటే, నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఈ తరుణంలోనే తెలంగాణ, ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. కోస్తాంధ్ర జిల్లాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది..

SB NEWS

SB NEWS