గృహసారధుల సేవలు ఎంతో కీలకం -ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను*_
గృహసారధుల సేవలు ఎంతో కీలకం -ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను
నూతనంగా నియమితులైన గృహసారధులు సచివాలయ కన్వీనర్లు ప్రతి కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ గత ప్రభుత్వానికి,మన జగనన్న ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలకు తెలియజేయాలని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను తెలియజేసారు.
మంగళవారం నాడు పెనుగంచిప్రోలు పట్టణంలోని GSR ఫంక్షన్ హల్,మరియు తంబరేణి గార్డెన్స్ నందు నందు పెనుగంచిప్రోలు మండల గృహసారధులతో ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను గారు,వారి తనయులు నియోజకవర్గ నాయకులు సామినేని వెంకట కృష్ణ ప్రసాద్ బాబు శిక్షణ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయభాను గారు మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చెయ్యాలని సూచించారు,ముఖ్యంగా కేటాయించిన గృహాలపై అహగాహణ కలిగి ఉండటంతో పాటు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు,అభివృద్ధి ప్రజలలోకి పూర్తీ స్థాయిలో తీసుకువెళ్లేలా ఉండాలని అన్నారు.వాలంటీర్ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న ప్రతినిధులుగా పరిచయం చేసుకోవాలని అన్నారు.
మా నమ్మకం నువ్వే జగన్ అని ముద్రించిన కరపత్రాలతో గత ప్రభుత్వంలో చంద్రబాబు ఏమిచేశాడో,మన జగనన్న ఏమి చేసారో ప్రజలకు వివరించాలని అన్నారు.
మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కుల మత,ప్రాంత,పార్టీలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారని తెలిపారు,గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు పొందాలంటే తెలుగుదేశం నాయకులు చెప్పిన వారుకో లేదా పసుపు కండువా వేసుకున్నవారికే సంక్షేమ పథకాలు ఇచ్చేవారు అని అన్నారు,నేడు అలాంటి దుస్థితి లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారు అని అన్నారు, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ గెలుపుకు కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,సచివాలయ కన్వీనర్లు,గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు.
Feb 22 2023, 19:37