*భారత్‌ బౌలింగ్‌.. తుది జట్టు ఇదే*

భారత్‌ బౌలింగ్‌.. తుది జట్టు ఇదే 

Streetbuzz news :

దిల్లీ: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ బెర్తు దిశగా టీమ్‌ఇండియా మరో సమరానికి సై అంటోంది. మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే రెండో టెస్టు మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ కెప్టెన్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై మరోసారి ఆసీస్‌ను చిత్తుచేసి.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించాలని టీమ్‌ఇండియా భావిస్తోంది. ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో ఆడిన 24 టెస్టుల్లో భారత్‌ 20 టెస్టుల్లో గెలిచింది. నాలుగు డ్రా అయ్యయి. భారత్‌ తుది జట్టు: రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌, పుజారా, కోహ్లి, శ్రేయస్‌, జడేజా, కేఎస్‌ భరత్‌, అశ్విన్‌, అక్షర్‌, షమి, సిరాజ్‌.

ప్రమాదవశాత్తు డీసీఎం లో మంటలు*

ప్రమాదవశాత్తు డీసీఎం లో మంటలు              

*మాడుగులపల్లి :

మిర్యాలగూడ నుండి నల్గొండ వైపు వెళ్ళుతున్న డిసిఎం వాహనంలో ప్రమాదవశాత్తు మంటలు చలరేగిన సంఘటన గురువారం రాత్రి మండలంలోని కుక్కడం సమీపంలో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోతమిషన్ తీసుకొని వెళ్తున్న డీసీఎం వాహనము కుక్కడం సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమతమై కోత మిషన్ కిందికి దించాడు. కాగా డీసీఎం కు మాత్రం పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ ఇంజన్ తెప్పించి మంటలు అర్పించే ప్రయత్నం చేశారు. సంఘటన స్థలంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు.

Pawan kalyan: అంబులెన్స్‌ ఇవ్వని సీఎం.. విశాఖను రాజధాని చేస్తామంటే ఎలా నమ్మాలి?: పవన్‌

Pawan kalyan: అంబులెన్స్‌ ఇవ్వని సీఎం.. విశాఖను రాజధాని చేస్తామంటే ఎలా నమ్మాలి?: పవన్‌

అమరావతి: కేజీహెచ్‌లో చనిపోయిన బిడ్డను తరలించేందుకు అంబులెన్స్‌ ఇవ్వని ముఖ్యమంత్రి.. విశాఖను రాజధానిగా అభివృద్ధి చేస్తామంటే ఎలా నమ్మాలని జనసేన (Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) ప్రశ్నించారు..

బిడ్డ మృతదేహాన్ని తీసుకుని 120 కిలోమీటర్లు ద్విచక్రవాహనంపై వెళ్లిన ఆ గిరిజన దంపతులకు సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పాడేరు ప్రాంతంలోని కుమడ గ్రామానికి చెందిన మహేశ్వరి, కొండబాబు దంపతుల పుట్టెడు శోకాన్ని దిగమింగుకొని మృతదేహాన్ని తీసుకెళ్లటం చూసి ఎవరికైనా గుండె తరుక్కుపోతుందన్నారు. కానీ, రాతి గుండె ప్రభుత్వంలో మాత్రం కనీస స్పందన లేదని దుయ్యబట్టారు. కేజీహెచ్‌లో గిరిజనులకు సాయపడేందుకు ఎస్టీసెల్‌ ఉన్నా, ఆసుపత్రిలో ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం అమానవీయమన్నారు. 

ఆసుపత్రుల నిర్వహణ, ప్రజారోగ్యంపై పాలకుల అశ్రద్ధకు ఈ ఘటనే నిదర్శనంగా అభివర్ణించారు. కొద్ది నెలల కిందట తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి బిడ్డ మృతదేహాన్ని తరలించేందుకు ఓ తండ్రి పడిన ఇబ్బందులను పవన్‌ గుర్తు చేశారు. అలాగే మచిలీపట్నం సముద్ర తీరంలో ఓ బాలుడు చనిపోతే ఆ బిడ్డ మృతదేహాన్ని బంధువులు బైక్‌ మీద తీసుకెళ్లారన్నారు. మహాప్రస్థానం వాహనాల పథకం ఏమైందని ప్రశ్నించారు. బెంజిసర్కిల్‌లో అంబులెన్స్‌లు నిలబెట్టి డ్రోన్‌ విజువల్స్‌ తీసి జెండా ఊపితే చాలదన్నారు. వైద్యారోగ్యశాఖకు రూ.14వేల కోట్ల బడ్జెట్‌ ఇచ్చినట్టు గొప్పలు చెప్పటం మాని.. క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందేలా చూడాలన్నారు. ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు కల్పించలేని పాలకులు తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు విశాఖను రాజధానిగా అభివృద్ధి చేస్తాం.. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని పవన్‌ దుయ్యబట్టారు.

Byreddy Siddharth Reddy: నారా లోకేష్‌పై బైరెడ్డి సిద్దార్ధ్‌ రెడ్డి ఫైర్‌

Byreddy Siddharth Reddy: నారా లోకేష్‌పై బైరెడ్డి సిద్దార్ధ్‌ రెడ్డి ఫైర్‌

తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌బాబుపై ఏపీ శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్దార్థ్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు..

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 2,3 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని సంచలన కామెంట్స్‌ చేశారు. అవినీతిపై నారా లోకేష్‌ మాట్లాడటం సిగ్గుచేటు అంటూ వ్యాఖ్యలు చేశారు.. 

కాగా, బైరెడ్డి సిద్దార్ధ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ఇల్లు కట్టుకుని రాజకీయాలు చేయమని టీడీపీ నేతలే చంద్రబాబుకు చెబుతున్నారు. సీఎం జగన్‌పై లోకేష్‌ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మంగళగిరిలో గెలవలేని వ్యక్తి పార్టీని అధికారంలోకి తీసుకువస్తాడంటా. లోకేష్‌ ఒక ఫెయిల్యూర్‌ పొలిటీషియన్‌. వచ్చే ఎన్నికల్లో టీడీపీ భారీ ఓటమి చవిచూస్తుంది..

బీబీనగర్ :ముప్పు తప్పించిన అత్యాధునిక టెక్నాలజీ..

బీబీనగర్ :ముప్పు తప్పించిన అత్యాధునిక టెక్నాలజీ..

Streetbuzz news :

బీబీనగర్-ఘట్‌కేసగర్ స్టేషన్ల మధ్య గోదావరి ఎక్స్‌ప్రెస్ (Godavari Express Train) రైలు పట్టాలు తప్పింది. ఎస్1 నుంచి ఎస్4, జనరల్, లగేజీ బోగీలు పట్టాలు తప్పాయి. పట్టాలు తప్పాక..కిలోమీటర్ వరకు బోగీలను ఈడ్చుకుంటూ ముందుకు వెళ్లాయి. కాంక్రీట్ స్లీపర్స్ ముక్కలు ముక్కలయ్యాయి. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. ఇంత జరిగినా.. ఒక్క కోచ్ కూడా బోల్తాపడలేదు. పట్టాలు తప్పినప్పటికీ.. అలాగే నిలబడిపోయాయి. అలా జరగడం వల్లే.. పెను ముప్పు తప్పింది. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో LHB (లింక్ హాఫ్‌మ‌న్ బుష్) కోచ్‌లు ఉండడం వల్లే.. ముప్పు తప్పింది.

ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు కాకుండా.. సాధారణ కోచ్‌లు ఉంటే.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఒక కోచ్‌లోకి మరో కోచ్‌లు దూసుకెళ్తాయి. ఒకదానిపైకి మరొకటి ఎక్కుతుంటాయి. కానీ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఎక్కడివి అక్కడే ఉండిపోయాయి.

 ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు బరువు తక్కువగా ఉంటాయి. గ‌రిష్టంగా 140-160 కిమీ వేగంతో ప్ర‌యాణం చేసేలా వీటిని తీర్చిదిద్దారు. ఇందులో డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. లోకో పైలట్ బ్రేక్ అప్లై చేసినప్పుడు.. ఎక్కుడున్న బోగీ అక్కడే ఆగిపోతుంది. అంతేకాదు ఎప్పుడైనా పట్టాలు తప్పినప్పుడు... రైళ్ల చక్రాలు పట్టాల నుంచి బయటకు రావు. రెండు పట్టాల మధ్యే ఉండిపోతాయి. అలాంటి అధునాతన టెక్నాలజీ ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల సొంతం.

ప్రస్తుతం 50 శాతానికి పైగా రైళ్లలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. 2020 మార్చి నాటికే 10,000 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను రూపొందించారు.

ఎల్ హెచ్ బీ కోచ్‌లు యాంటీ టెలిస్కోపిక్. అంటే, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ కోచ్‌లు వాటి ముందున్న కోచ్‌లపైకి ఎక్కే ఆస్కారం ఉండదు. అధిక వేగంలోనూ సమర్థమైన బ్రేకింగ్ కోసం ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలో 'అడ్వాన్స్‌డ్ న్యూమాటిక్ డిస్క్ బ్రేక్ సిస్టమ్'ను వినియోగిస్తున్నారు ప్రమాదం జరిగినప్పుడు ఆటోమేటిక్‌గా వేగం తగ్గి నిలిచిపోయేలా ఈ బోగీలను రూపొందించారు. రైళ్లు పరస్పరం ఢీకొన్నా, పట్టాలు తప్పినా.. బోగీలు ఒక దానిపైకి మరొకటి ఎక్కే ముప్పు ఉండదు.

ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలో సెంటర్ బఫర్ కప్లింగ్ (CBC) వ్యవస్థ ఉపయోగిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఒక కోచ్ మరొక కోచ్‌తో ఢీకొట్టుకోకుండా ఈ వ్యవస్థ నివారిస్తుంది. 

ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు 1.7 మీటర్లు అధిక పొడవు ఉంటాయి. 'కంట్రోల్డ్ డిశ్చార్జ్ టాయిలెట్ సిస్టమ్ (సీడీటీఎస్)' ఉంటుంది. వీటిలో బయో-టాయిలెట్లు అమర్చి ఉంటాయి. ఇవి పర్యావరణ అనుకూలమైనవి.

గుట్టలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన*

గుట్టలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన

Streetbuzz news : నల్గొండ జిల్లా :

యాదాద్రి భువనగిరి జిల్లా:

యాదగిరిగుట్ట పట్టణంలో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గురువారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 

ఆలేరు ఏరియా హాస్పిటల్ ను అప్ గ్రేడ్ చేయడం కోసం రూ.కోటి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. 

వైద్య రంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని,అందుకే వైద్యంలో దేశంలోనే తెలంగాణ మూడో ప్లేస్ లో ఉంటే,బీజేపీ అధికారంలో ఉన్న యూపీ చివరి స్థానంలో ఉందన్నారు. యాదాద్రి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తుంటే బీజేపీ నాయకుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నయని,

యువతను రెచ్చగొట్టే రాజకీయంగా లబ్ధిపొందాలని బీజేపీ కుట్ర చేస్తుందన్నారు.వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు.

కూల్చటోళ్లు,పేల్చటోళ్లు తెలంగాణ ప్రజలకు అవసరం లేదని,

మేనిఫెస్టోలో పెట్టని పనులు కూడా చేశామని తెలిపారు.రాజకీయాల కోసం కాదు భక్తితో ఆలయాలను కేసీఆర్ కడుతున్నారని,మతం పేరుతో రాజకీయ లబ్ధిపొందాలని చూసే నీచ సంస్కృతి బీజేపీదని విమర్శించారు.తెలంగాణలో తప్ప దేశంలో ఏ రాష్ట్రంలో ఉచిత 24 గంటల విద్యుత్ సరఫరా లేదని,త్వరలో యాదాద్రి జిల్లాలో ఏప్రిల్ మొదటి వారంలో 'కేసీఆర్ న్యూట్రిషన్ కిట్' పథకాన్ని ప్రారంభించబోతున్నామని

చెప్పారు.బీఆర్ఎస్ కార్యకర్తలు మరింత గట్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్రపంచం ముందు దేశ పరువును తీస్తున్నరని,

వార్తలు రాశారని బీబీసీపై కేంద్రం ఐటీ దాడులు చేపిస్తోందని దుయ్యబట్టారు.ప్రతిపక్షాల కుట్రలో ప్రజలు పడొద్దని,

డబుల్ బెడ్రూం ఇండ్లు పథకం ఒక్కటే ప్రజలకు బాకీ ఉన్నమని,సొంతింటి స్థలంలో డబుల్ ఇండ్లను నిర్మిస్తమని అన్నారు.

విజయవంతంగా పోలీస్ దేహదారుడ్య పరీక్షలు*

విజయవంతంగా పోలీస్ దేహదారుడ్య పరీక్షలు

Streetbuzz news : నల్గొండ జిల్లా :

నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహిస్తున్న 

మహిళా కానిస్టేబుల్,ఎస్సై 

దేహదారుఢ్య పరీక్షలు రెండవ రోజు గురువారం విజయవంతంగా పూర్తి అయ్యాయి.ఇందులో 1012 మంది అభ్యర్థులకు గాను 327 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

ఈ దేహదారుఢ్య పరీక్షలను జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారి డాక్టర్ పి.శబరీష్ ఐపిఎస్ పర్యవేక్షణలో జరుగాయి.మొత్తం 1012 మంది అభ్యర్థులకు గాను, 797 అభ్యర్థులు హాజరు కాగా,వీరిలో 327 మంది అభ్యర్థులు (ఫిజికల్ టెస్ట్లు) దేహదారుఢ్య పరీక్షలలో ఉత్తీర్ణత సాధించారు.215 మంది అభ్యర్థులు గైరాజరయ్యారు.

అప్రకటిత విద్యుత్ కోతలు నివారించాలి: ప్రజాపంథా*

అప్రకటిత విద్యుత్ కోతలు నివారించాలి: ప్రజాపంథా

  

Streetbuzz news :నల్గొండ జిల్లా :

సూర్యాపేట జిల్లా:   సిపిఐ(ఎంఎల్)ప్రజాపంథా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అప్రకటిత విద్యుత్ కోతలు నివారించాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యుత్ ఎస్ఈకి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ర్టనాయకులు మట్టపల్లి అంజయ్య,

పీ.డీ.ఎస్.యూ రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుండి అప్రకటిత కరెంటు కోతలతో పంటలు ఎండిపోయి రైతుల నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు ఎలాంటి కష్టాలు లేకుండా కేసీఆర్ 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తానని ప్రగల్భాలు పలికి అప్రకటిత కరెంటు కోతలు విధిస్తూ అన్నదాతలను

ఆగం పటిస్తిండని మండిపడ్డారు.కరెంటు ఎప్పుడు ఉంటుందో ఉండదో తెలియక రైతులు సతమతవుతుంటే అసెంబ్లీలో మాత్రం ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నామని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.ఇప్పటికే అనేక చోట్ల పంటలు ఎండిపోయి రైతులు నిరాశకు గురవుతున్నా, రైతులను పట్టించుకొనే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదన్నారు.ఇకనైనా రైతులు నష్టపోకముందే కరెంట్ సక్రమంగా అందించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో రైతులతో కలిసి రాష్ర్ట వ్యాప్తంగా కరెంటు ఆఫీస్ లు ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా రాంజీ,పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి,ప్రజాపంథా పట్టణ కార్యదర్శి గులాంహుస్సేన్, జీవన్,వాజిద్,నగేష్,బావ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి...!*

యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి...! 

Streetbuzz news :నల్గొండ జిల్లా :

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపుర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వద్ద

గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

తేజ ఫుడ్ ఇండస్ట్రీస్ కి మహిళా కూలీలతో వెళ్తున్న ఆటోను,అదే సంస్థకు చెందిన బస్సు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న చౌటుప్పల్ మండలం దేవులమ్మ నాగారం గ్రామానికి చెందిన ఏడుగురు మహిళా కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హాస్పిటల్ కి తరలిస్తుండగా పరిస్థితి విషమించి శిరీష,ధనలక్ష్మి, నాగలక్ష్మి,అనసూయ అనే

నలుగురు మహిళా కూలీలు మృత్యువాత పడగా,ముగ్గురు తీవ్ర గాయాలతో చికిత్ర పొందుతున్నారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఓకే గ్రామానికి చెందిన నలుగురు మహిళలు మృతి చెందడంతో 

చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం బాధిత కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంపూర్ణ అంధత్వ నిర్ములన ప్రభుత్వం లక్ష్యం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య*

సంపూర్ణ అంధత్వ నిర్ములన ప్రభుత్వం లక్ష్యం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Streetbuzz news :నల్గొండ జిల్లా :

సంపూర్ణ అంధత్వ నిర్ములన ప్రభుత్వం లక్ష్యం అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.గురువారం నకిరేకల్ మండలం గొల్లగూడెం గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పరిశీలించి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..భౌతికంగా చూపు కోల్పోయిన వారికి తిరిగి చూపు ప్రసాదించడానికి చేపట్టిన కార్యక్రమమే కంటి వెలుగు అన్నారు.మానవ శరీరం లో అన్నిటి కంటే  ప్రధానమని తెలిసి కూడా కంటి చూపు పట్ల నిర్లక్ష్యం వహిస్తూ శాశ్వతం గా చూపు కోల్పోతున్న లక్షలాది మంది ని చైతన్య పరిచే,అదుకోవాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుండి పుట్టినదే కంటి వెలుగు కార్యక్రమం అని అని ఆయన అన్నారు. తెలంగాణ లో కేసీఆర్ ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం దేశం మొత్తానికి వెలుగు నిస్తుంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో. నకిరేకల్ జడ్పీటీసీ మాద ధనలక్ష్మినగేష్,తదితరులు పాల్గొన్నారు.