గుట్టలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన*
గుట్టలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన
Streetbuzz news : నల్గొండ జిల్లా :
యాదాద్రి భువనగిరి జిల్లా:
యాదగిరిగుట్ట పట్టణంలో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గురువారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఆలేరు ఏరియా హాస్పిటల్ ను అప్ గ్రేడ్ చేయడం కోసం రూ.కోటి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
వైద్య రంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని,అందుకే వైద్యంలో దేశంలోనే తెలంగాణ మూడో ప్లేస్ లో ఉంటే,బీజేపీ అధికారంలో ఉన్న యూపీ చివరి స్థానంలో ఉందన్నారు. యాదాద్రి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తుంటే బీజేపీ నాయకుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నయని,
యువతను రెచ్చగొట్టే రాజకీయంగా లబ్ధిపొందాలని బీజేపీ కుట్ర చేస్తుందన్నారు.వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు.
కూల్చటోళ్లు,పేల్చటోళ్లు తెలంగాణ ప్రజలకు అవసరం లేదని,
మేనిఫెస్టోలో పెట్టని పనులు కూడా చేశామని తెలిపారు.రాజకీయాల కోసం కాదు భక్తితో ఆలయాలను కేసీఆర్ కడుతున్నారని,మతం పేరుతో రాజకీయ లబ్ధిపొందాలని చూసే నీచ సంస్కృతి బీజేపీదని విమర్శించారు.తెలంగాణలో తప్ప దేశంలో ఏ రాష్ట్రంలో ఉచిత 24 గంటల విద్యుత్ సరఫరా లేదని,త్వరలో యాదాద్రి జిల్లాలో ఏప్రిల్ మొదటి వారంలో 'కేసీఆర్ న్యూట్రిషన్ కిట్' పథకాన్ని ప్రారంభించబోతున్నామని
చెప్పారు.బీఆర్ఎస్ కార్యకర్తలు మరింత గట్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రపంచం ముందు దేశ పరువును తీస్తున్నరని,
వార్తలు రాశారని బీబీసీపై కేంద్రం ఐటీ దాడులు చేపిస్తోందని దుయ్యబట్టారు.ప్రతిపక్షాల కుట్రలో ప్రజలు పడొద్దని,
డబుల్ బెడ్రూం ఇండ్లు పథకం ఒక్కటే ప్రజలకు బాకీ ఉన్నమని,సొంతింటి స్థలంలో డబుల్ ఇండ్లను నిర్మిస్తమని అన్నారు.
Feb 16 2023, 20:54