కడప జిల్లా.. నేడు జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన..

కడప జిల్లా..

నేడు జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన..

జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లి లో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టనున్న సీఎం..

జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని కన్యతీర్ధం వద్ద ఏర్పాటు చేస్తున్న జిందాల్ స్టిల్ కంపెనీ పరిశ్రమ ...

గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానం ద్వారా కడపకు రానున్న సీఎం..

అనంతరం నేరుగా స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన ప్రాంగణానికి రానున్న సీఎం...

జిందాల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్..

అనంతరం కంపెనీ ప్రతినిధులతో సమావేశం..

అనంతరం అక్కడి నుండి నేరుగా పులివెందులకు చేరుకొని ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొననున్న ముఖ్యమంత్రి..

తర్వాత కడప విమానాశ్రయం చేరుకుని గన్నవరం బయలుదేరి వెళ్లనున్న ముఖ్యమంత్రి

బీబీనగర్ వద్ద పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్*

బీబీనగర్ వద్ద పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్

Streetbuzz news : నల్గొండ జిల్లా :

గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా.. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌ సమీపంలో ట్రైన్‌ పట్టాలు తప్పింది. మొత్తం 4 బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. ఊహించని ఘటనతో రైలులోని ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక హాహాకారాలు చేశారు. రైలు వేగం తక్కువగానే ఉండటంతో లోకో పైలట్‌ వెంటనే ట్రైన్‌ను నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులంతా రైలులోంచి కిందకు దిగేశారు.ప్రమాదంలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. బోగీలు పట్టాలు తప్పినప్పటికీ.. కిందపడకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డామని ప్రయాణికులు వెల్లడించారు. ఘటనలో అందరూ సురక్షితంగా బయటపడ్డట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులందరినీ గమ్యస్థానాలకు చేర్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రమాదంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

సైకిల్ తొక్కండి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకొని ప్రకృతిని కాపాడండి పెద్దపళ్ల పీహెచ్సీ వైద్యులు డాక్టర్ భవాని శంకర్..

సైకిల్ తొక్కండి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకొని ప్రకృతిని కాపాడండి

పెద్దపళ్ల పీహెచ్సీ వైద్యులు డాక్టర్ భవాని శంకర్..

Streetbuzz news :

భారత ప్రభుత్వం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి నేతృత్వంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పెదపళ్ల పీహెచ్సీ పరిధిలో డాక్టర్ భవాని శంకర్ ఆధ్వర్యంలో సైకిల్ తొక్కండి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకొని ప్రకృతిని కాపాడండి అనే కార్యక్రమం ద్వారా మంగళవారం మండలంలోని పలు గ్రామాలలో ఏఎన్ఎం,ఆశ వర్కర్లు సహకారంతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ పీవీ రమణారావు మాట్లాడుతూ శారీరక వ్యాయామంతో పాటు సైకిల్ తొక్కి ఆరోగ్యం,శారీర దృఢత్వం రక్షించుకోవాలని తెలియజేసి మోటార్ వాహనాలకు బదులుగా సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యం మెరుగు చెందడమే కాకుండా వాతావరణ కాలుష్యాన్ని నివారించి ప్రకృతిని కాపాడుకోవచ్చని ఆయన తెలియజేశారు.అనంతరం వైద్య ఆరోగ్య మేలా కార్యక్రమాలు నిర్వహించి మధుమేహం(షుగర్),అధిక రక్తపోటు (బిపి),సీజనల్ వ్యాధులు వంటి వాటికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వెంకటరత్నం,హెల్త్ విజిటర్ ఉమా,హెల్త్ ఎగ్జిక్యూటర్,ఎంహెచ్ఎల్పిలు, ఏఎన్ఎం,ఆశ వర్కర్లు,తదితరులు పాల్గొన్నారు.*

పరిశ్రమల స్థాపనకు పర్ఫెక్ట్ ప్లేస్ ఏపీ : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి*

పరిశ్రమల స్థాపనకు పర్ఫెక్ట్ ప్లేస్ ఏపీ : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి

మౌలిక సదుపాయాలతోనే పరిశ్రమలు తరలివస్తాయి

తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయడమే మా ధ్యేయం.

పని ఎక్కువ..ప్రచారం తక్కువ ఉండాలనేది ముఖ్యమంత్రి లక్ష్యం.

పరిశ్రమలకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్ లకు ఏపీలో లోటు లేదు.

నైపుణ్య వనరులు పుష్కలం..అన్ని రంగాల్లో పెట్టుబడులకు అనుకూలం

బెంగళూరు పారిశ్రామిక సదస్సులో ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి

జిల్లాకో ప్రత్యేకత ఉంది..ప్రాంతానికో ప్రాధాన్యత మాది

ఉద్యానవన పంటలకు రాయలసీమ చిరునామా

పారిశ్రామికవేత్తలకు కావలసిన పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారుల వంటి వసతులున్నాయి

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేతుల మీదుగా ఎల్ ఓ సి అందజేత.*

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేతుల మీదుగా ఎల్ ఓ సి అందజేత!.  

 

Streetbuzz news : నల్గొండ జిల్లా :

నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని రామన్న పేట  

పట్టణానికి చెందిన బోడ హర్ష వర్ధన్ ఆనారోగ్యం కారణంగా అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి పథకం కింద ఎల్ ఓ సి ద్వారా మంజూరైన 3,00,000/- రూపాయల ఎల్ ఓ సి పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అందజేసారు.

బాల సధనాలను పరిశీలించిన బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ శ్రీ కేసలి అప్పారావు.

బాల సధనాలను పరిశీలించిన బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ శ్రీ కేసలి అప్పారావు.

  

Streetbuzz news : నల్గొండ జిల్లా :

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ శ్రీ కేసలి అప్పారావు విజయవాడ లోని బాల సాధనాలను పరిశీలన చేశారు.ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ రాష్ట్రంలో బాలలుతో పనిచేసే వసతి గృహాల సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని,తరుచుగా బాలలు వైద్య పరీక్షలు నిర్వహించాలని,ఇతరులును అనుమతి లేకుండా కేంద్రంలోకి రాకుండా చూడాలని సూచించారు.జిల్లా బాలల సంక్షేమ సమితి అనుమతి ,ఆదేశాలుతో మాత్రమే బాలలను కేంద్రంలో చేర్పించాలని తెలిపారు. వార్డ్ స్థాయి సచివాలయం మహిళా పోలీస్ సిబ్బంది తరుచుగా కేంద్రాన్ని పర్యవేక్షణ చేయాలని, పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.సీసీ కెమెరాలు తప్పని సరిగా ఎల్లవేళలా పనిచేయాలని,ఫిర్యాదులు పెట్టేను అందుబాటులో ఉంచాలని తెలిపారు.వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు సమక్షంలో తెరిచి రికార్డ్ చేయాలని సూచించారు.సిబ్బంది కొరతను సంభందిత ఉన్నత అధికారుల దృష్టకి తీసుకొని వెళ్ళారు,తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.బాలికలు వసతి గృహాల్లో మహిళలును మాత్రమే సెక్యూరిటీ సిబ్బంది గా నియమించాలని తెలిపారు.కొంతమంది బాలికలు కంటి చూపుతో ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని,తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించాలని,మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పదక సంచాలకులు శ్రీమతి జీ.ఉమాదేవి బాల సదన్ పర్యవేక్షకరాలు జ్యోత్స్న, సూర్య కుమారి పాల్గొన్నారు

సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రజలకు రైల్వే శాఖ విజ్ఞప్తి*. _ఇటీవల రైళ్లపై రాళ్లు రువ్వడం వంటి సంఘటనల దృష్ట్యా ప్రజలకు సూచన_

సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని  ప్రజలకు రైల్వే శాఖ విజ్ఞప్తి.

    ఇటీవల రైళ్లపై రాళ్లు రువ్వడం వంటి సంఘటనల దృష్ట్యా ప్రజలకు సూచన  

తిరుపతి:

 

Streetbuzz news: నల్గొండ జిల్లా :

భారతీయ రైల్వేల తరపున దక్షిణ మధ్య రైల్వే సాధారణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న విషయం ఏమనగా జాతీయ ఆస్తులకు నష్టం లేదా విఘాతం కలిగించే సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని అలాగే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి కార్యకలాపాలను అరికట్టేందుకు సహకరించాలని ప్రజలకు సంబంధించిన ఆస్తులను రక్షించాలని దక్షిణ మధ్య రైల్వే సాధారణ ప్రజలను అభ్యర్థిస్తున్నారు . ఇటీవల కాలంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు  రాళ్ల పై దాడి చేస్తున్న ఘటనలు మరియు అటువంటి ఘటనలు వెలుగులోకి వచ్చిన దృష్ట్యా రైల్వే శాఖ ఈ మేరకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. 

  దేశంలోని ప్రతిష్టాత్మకమైన సంస్థలలో భారతీయ రైల్వేలు ఒకటి. భారత దేశ ప్రజలకు 160 సంవత్సరాల నుండి రవాణా రంగంతో పాటు వివిధ రకాలైన సేవలు చేయడమే కాకుండా దేశ ప్రగతికి ఎంతో దోహదపడుతున్నాయి.  దేశంలోని వివిధ ప్రదేశాలను రైలు  మార్గాలతో కలుపుతూ మిలియన్ల మంది ప్రయాణీకులకు సురక్షితమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన రవాణాను అందిస్తుంది. దేశంలో కోవిడ్-19 మహమ్మారి అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్న సమయంలో దేశమంతా లాక్‌డౌన్ బరిలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో కుడా భారతీయ రైల్వే  సేవాదృక్పథంతో దేశ ప్రయోజనాల దృష్ట్యా రైలు సేవలను 24 గంటలూ నడిపింది. వివిధ సరుకుల సరఫరా సమతుల్యం చేయడానికి గాను అవసరమైన వస్తువుల లభ్యతను దృష్టిలో ఉంచుకొని  దేశవ్యాప్తంగా ప్రజలకు నిత్యావసర వస్తువులను రవాణా చేయడం జరిగింది. 

  అయితే, ఇటీవల కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులు విచ్చలవిడిగా వందే భారత్ రైళ్ల పై  రాళ్లదాడి వంటి ఘటనలకు పాల్పడడంతో రైళ్ల కు  తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ రకమైన సంఘ వ్యతిరేక చర్యల మూలాన సాధారణ ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా, రైళ్లు మరియు రైల్వే స్టేషన్‌లు, ప్రజల ఆస్తుల నష్టం జరిగినట్టే . ఎందుకంటే ఇవన్నీ  ప్రజల డబ్బుతో  నిర్మించి ప్రజల కొరకు  సేవలు అందిస్తున్నాయి . ఈ దాడుల మూలాన కల్గిన నష్టాన్ని తిరిగి ప్రజలే భరించవలసి ఉంటుంది . కాబట్టి ప్రజలకు సంబంధించిన ఆస్తులకు  నష్టం కలిగించవద్దని రైల్వే శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది .

  ఈ అంశంలో రైళ్ల పై రాళ్లు విసరటం లేదా రువ్వడం వంటి దుశ్చర్య కార్యకలాపాలకు పాల్పడటం ద్వారా రైల్వే ఆస్తులకు నష్టం కలిగించవద్దని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేస్తోంది . రైలు ప్రయాణీకులకు సురక్షితమైన మరియు ఇబ్బందులు లేని రైలు ప్రయాణాన్ని అందించేందుకు సాధారణ ప్రజలతో పాటు రైలు వినియోగదారుల సహకారం వుండాలని దక్షిణ మధ్య రైల్వే ఈ సందర్బంగా ప్రతి ఒక్కరినీ విజ్ఞప్తి చేయడంతో పాటు అభ్యర్థిస్తోంది .

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం. అర్థరాత్రి మండలంలోని గుంటుపల్లి 44వ నెంబర్ రేషన్ షాపు పై పీడీఎస్ డీటీ,రెవిన్యూ సిబ్బంది ఆద్వర్యంలో తనిఖీలు.

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం.

అర్థరాత్రి మండలంలోని గుంటుపల్లి 44వ నెంబర్ రేషన్ షాపు పై పీడీఎస్ డీటీ,రెవిన్యూ సిబ్బంది ఆద్వర్యంలో తనిఖీలు

400కేజీలు రేషన్ బియ్యం స్టాక్ కి మించి ఉండడంతో షాపుకి సీలు వేసిన అధికారులు

నిన్న మధ్యాహ్నం గుంటుపల్లి లో మొబైల్‌ రేషన్ వాహనం నుండి ఆటో లోకి బియ్యం తరలిస్తుండగా ఆటోను,మొబైల్ రేషన్ వాహనాన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు

మొబైల్ వాహన లోడింగ్ రేషన్ షాపు 44వ నెంబర్ కావడంతో సమాచారాన్ని గోప్యంగా ఉంచి అర్థరాత్రి తనిఖీలు చేసిన అధికారులు

మౌనంగా ఉండే నాయకుడు కోటలో ఉన్నా.. పేటలో ఉన్నా ఒకటే: పవన్ కల్యాణ్‌..

పవన్ కళ్యాణ్ : మౌనంగా ఉండే నాయకుడు కోటలో ఉన్నా.. పేటలో ఉన్నా ఒకటే: పవన్ కల్యాణ్‌..

అమరావతి: తాడేపల్లిలో అంధ యువతి హత్య పూర్తిగా శాంతిభద్రతల వైఫల్యమేనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు అసలు రక్షణ ఉందా?..

సీఎం నివాసం దగ్గరలోనే ఘాతుకాలు జరిగినా మౌనమేనా? అని ప్రశ్నించారు. తాడేపల్లి అసాంఘిక శక్తులకు, గంజాయికి అడ్డాగా మారిందన్నారు. తాడేపల్లిలోనే గతంలో జరిగిన రేప్‌ కేసులో ఒక నిందితుడిని ఇప్పటికీ పట్టుకోలేకపోయారని విమర్శించారు.

''తన నివాసం పరిసరాల పరిస్థితులనే సీఎం సమీక్షించుకోలేకపోతే ఎలా? తల్లి పెంపకంలోనే లోపం ఉందని చెప్పే మంత్రులు ఉన్న ప్రభుత్వమిది.. దొంగతనానికి వచ్చి రేప్‌ చేశారని చెప్పే మంత్రులు గల ప్రభుత్వమిది.. అఘాయిత్యాలు జరుగుతుంటే మహిళా కమిషన్‌ ఏం చేస్తోంది? గంజాయికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్‌ని మార్చారు. మౌనంగా ఉండే నాయకుడు కోటలో ఉన్నా.. పేటలో ఉన్నా ఒకటే. యువతిని కిరాతకంగా చంపిన మృగాడిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి దారుణ ఘటనలపై అన్ని వర్గాలు స్పందించాల్సిన అవసరం ఉంది'' అని పవన్‌ పేర్కొన్నారు.

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి*

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

Streetbuzz news. నల్గొండ జిల్లా :

కట్టంగూర్ మండలంలోని గార్లబాయిగూడెం గ్రామంలో రూ. 15 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

అనంతరం మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మరమ్మత్తు పనులకుగాను 9 లక్షలతో పూర్తి చేసిన ప్రాథమిక పాఠశాలను ఆయన ప్రారంభించారు.ఈ కార్యక్రమoలో. కట్టంగూర్ జడ్పీటీసీ తరాల బలరాం, ఎంపీటీసీలు,సర్పంచ్ లు,టీచర్లు, వార్డు నెంబర్లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.