సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రజలకు రైల్వే శాఖ విజ్ఞప్తి*. _ఇటీవల రైళ్లపై రాళ్లు రువ్వడం వంటి సంఘటనల దృష్ట్యా ప్రజలకు సూచన_
సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రజలకు రైల్వే శాఖ విజ్ఞప్తి.
ఇటీవల రైళ్లపై రాళ్లు రువ్వడం వంటి సంఘటనల దృష్ట్యా ప్రజలకు సూచన
తిరుపతి:
Streetbuzz news: నల్గొండ జిల్లా :
భారతీయ రైల్వేల తరపున దక్షిణ మధ్య రైల్వే సాధారణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న విషయం ఏమనగా జాతీయ ఆస్తులకు నష్టం లేదా విఘాతం కలిగించే సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని అలాగే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి కార్యకలాపాలను అరికట్టేందుకు సహకరించాలని ప్రజలకు సంబంధించిన ఆస్తులను రక్షించాలని దక్షిణ మధ్య రైల్వే సాధారణ ప్రజలను అభ్యర్థిస్తున్నారు . ఇటీవల కాలంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల పై దాడి చేస్తున్న ఘటనలు మరియు అటువంటి ఘటనలు వెలుగులోకి వచ్చిన దృష్ట్యా రైల్వే శాఖ ఈ మేరకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.
దేశంలోని ప్రతిష్టాత్మకమైన సంస్థలలో భారతీయ రైల్వేలు ఒకటి. భారత దేశ ప్రజలకు 160 సంవత్సరాల నుండి రవాణా రంగంతో పాటు వివిధ రకాలైన సేవలు చేయడమే కాకుండా దేశ ప్రగతికి ఎంతో దోహదపడుతున్నాయి. దేశంలోని వివిధ ప్రదేశాలను రైలు మార్గాలతో కలుపుతూ మిలియన్ల మంది ప్రయాణీకులకు సురక్షితమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన రవాణాను అందిస్తుంది. దేశంలో కోవిడ్-19 మహమ్మారి అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్న సమయంలో దేశమంతా లాక్‌డౌన్ బరిలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో కుడా భారతీయ రైల్వే సేవాదృక్పథంతో దేశ ప్రయోజనాల దృష్ట్యా రైలు సేవలను 24 గంటలూ నడిపింది. వివిధ సరుకుల సరఫరా సమతుల్యం చేయడానికి గాను అవసరమైన వస్తువుల లభ్యతను దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా ప్రజలకు నిత్యావసర వస్తువులను రవాణా చేయడం జరిగింది.
అయితే, ఇటీవల కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులు విచ్చలవిడిగా వందే భారత్ రైళ్ల పై రాళ్లదాడి వంటి ఘటనలకు పాల్పడడంతో రైళ్ల కు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ రకమైన సంఘ వ్యతిరేక చర్యల మూలాన సాధారణ ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా, రైళ్లు మరియు రైల్వే స్టేషన్‌లు, ప్రజల ఆస్తుల నష్టం జరిగినట్టే . ఎందుకంటే ఇవన్నీ ప్రజల డబ్బుతో నిర్మించి ప్రజల కొరకు సేవలు అందిస్తున్నాయి . ఈ దాడుల మూలాన కల్గిన నష్టాన్ని తిరిగి ప్రజలే భరించవలసి ఉంటుంది . కాబట్టి ప్రజలకు సంబంధించిన ఆస్తులకు నష్టం కలిగించవద్దని రైల్వే శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది .
ఈ అంశంలో రైళ్ల పై రాళ్లు విసరటం లేదా రువ్వడం వంటి దుశ్చర్య కార్యకలాపాలకు పాల్పడటం ద్వారా రైల్వే ఆస్తులకు నష్టం కలిగించవద్దని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేస్తోంది . రైలు ప్రయాణీకులకు సురక్షితమైన మరియు ఇబ్బందులు లేని రైలు ప్రయాణాన్ని అందించేందుకు సాధారణ ప్రజలతో పాటు రైలు వినియోగదారుల సహకారం వుండాలని దక్షిణ మధ్య రైల్వే ఈ సందర్బంగా ప్రతి ఒక్కరినీ విజ్ఞప్తి చేయడంతో పాటు అభ్యర్థిస్తోంది .
Feb 14 2023, 16:20