Andrapradesh

Nov 23 2021, 16:18

కల్నల్‌ సంతోష్‌ బాబుకు మహావీర్‌ చక్ర పురస్కారం 

 


న్యూఢిల్లీ, ఏపీ హైలెట్స్ : భారత్‌ - చైనా సరిహద్దులోని గాల్వాన్‌ లోయలో వీర మరణం పొందిన కల్నల్‌ బిక్కమల్ల సంతోష్‌బాబుకు మహావీర్‌చక్ర పురస్కారం లభించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా సంతోష్‌ భార్య, తల్లి ఈ అవార్డును స్వీకరించారు. కాగా యుద్ధ సమయాల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు అందజేసే రెండో అత్యున్నత పురస్కారమే మహావీర్ చక్ర. 

Andrapradesh

Nov 23 2021, 15:48

ఏపీ శాసనమండలి రద్దును వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం తీర్మానం

 ఏపీలోని జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ 
శాసనమండలి రద్దును వెనక్కి తీసుకుంటూ మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది.
ఈ మేరకు అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. గత ఏడాది జనవరి 27న మండలి రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. దీంతో గత 22 నెలలుగా ఈ తీర్మానం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. ఇప్పటివరకు కేంద్రం నిర్ణయం రాకపోవడంతో తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
శాసనమండలి రద్దు తర్వాత ఒక సందిగ్ధం ఉండిపోయిందని. సందిగ్థతను తొలగించేందుకు మండలిని కొనసాగించాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు మంత్రి బుగ్గన వెల్లడించారు. మండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రవేశపెట్టిన తీర్మానం కాపీని త్వరలోనే ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. 

Andrapradesh

Nov 23 2021, 15:47

అమరావతి: రేపు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరపాలి; హైకోర్టు

 


కృష్ణాజిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

 

రేపు ఎన్నిక జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఎన్నిక ప్రక్రియ ముగించి తమకు నివేదిక అందజేయాలని పేర్కొంది.

పిటిషనర్లకు రక్షణ కల్పించాలని స్పష్టం చేసింది.

 

కాగా కొండపల్లిలో 29 వార్డులకు గాను టీడీపీకి 15 మంది, వైసీపీకి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు.

టీడీపీ, వైసీపీకి ఒక్కో ఎక్స్ అఫీషియో ఓటు ఉంది. 

Andrapradesh

Nov 23 2021, 12:52

అనంతపురం:

 


వాగులో చిక్కుకున్న 20 మంది కూలీలను కాపాడిన పెద్దపప్పూరు పోలీసులు

 

వాగు ఉధృతిలో చిక్కుకున్న 20 మంది కూలీలను పెద్దపప్పూరు పోలీసులు కాపాడారు. పెద్దపప్పూరు మండల పరిధిలోని జోడి ధర్మాపురం గ్రామంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాద స్థాయిలో వాగు ప్రవహిస్తుండంతో పోలీసులు గుర్తించి ఆ రహదారి గుండా ఎవరూ వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంపలు వేశారు. అవేమీ పట్టించుకోకుండా ఈరోజు ఉదయం 20 మంది కూలీలతో ఐచర్ వాహనము ద్వారా వాగు దాటడానికి ప్రయత్నించారు. వాగులో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో ఐచర్ వాహనము చిక్కుకుంది. కూలీలు హహాకారాలు చేయడంతో గ్రామస్తులు పెద్దపప్పూరు పోలీసులకు విషయం తెలియజేశారు. వెంటనే స్పందించిన ఎస్సై మహమ్మద్ గౌస్ హిటాచిని తీసుకుని తన సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తానే స్వయంగా వాహనం మీద కూర్చుని వాగు లోకి వెళ్లి... ఒక్కొక్క మహిళను హిటాచిలోకి జాగ్రత్తగా లాక్కున్నారు. సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పెద్దపప్పూరు పోలీసుల సహాయక చర్యలను అభినందించారు. 

Andrapradesh

Nov 23 2021, 11:56

వాంభే కాలనీలో దోంగ జోరు కాలనీ వాసులు బేజారు

 


విజయవాడ,: వాంబే కాలనీలో దోంగలు తాళం వేసిన షాపులను,బడ్డి కోట్లను తాళలు పగల కోట్టి చోరిలు చేస్తున్న సంఘటలు.జరుగుత్తున్నాయి.తాజాగా వాంభే కాలనీ జి బ్లాక్ లో మణి కంఠ మెడికల్ షాప్ లో జరిగింస్ది.షాపు తాళాలను కోసి 30 వేల నగదు దోంగిలిచ్చినట్లు షాపు యజమాని మంచిగంటి మణికంఠ తెలిపారు.గత నెలలో ఇదే షాపు ఫ్రిజ్ నుండి చాక్లెట్లు దోంగతనం చేసినట్లు తెలిపారు.ఆటో టైర్లు,బ్యాటిరిలు చోరీలు జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.జి బ్లాక్ లోని చిన్న ,చిన్న బడ్డి కొట్లు తాళలను పగలకోట్టి నగదు దొంగిలిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.చోరిలు జరగకుండా కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని వాంభేకాలనీ వాసులు కోరుతున్నారు. 

Andrapradesh

Nov 23 2021, 11:03

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావం వల్ల నవంబర్ 27 నుంచి భారీ వర్షాలు.

 


బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా మరోమారు ఈ నెల 27 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప​, ప్రకాశం జిల్లాల్లో పడనున్నాయి. అనంతపురం, గుంటూరు-కోస్తా, కృష్ణా-కోస్తాలో భారీ వర్షాలుంటాయి. 

 

ఈ వర్షాల వల్ల వరద ఉదృతి మరింత పెరిగనుంది. అన్ని చెరువులు, నదులు, వాగులు, వంకల్లో వరద నీరు అలాగే ఉంది. ఇక ఈ వర్షం తోడైతే భారీ వరద సంభవించే అవకాశాలున్నాయి. అప్రమత్తంగా ఉండటం మంచిది. మీకు కావాల్సిన సరుకులు, ముఖ్యమైన పనులు ఉంటే ఈ నవంబర్ 26 లోపు పూర్తి చేసుకోండి. వరద నుంచి ఉపసమనం ఉండదు. చిన్న వర్షానికే వరద వచ్చే అవకాశాలున్నాయి. జాగ్రత్త పడండి.​

తమిళనాడు కంటే మన రాష్ట్రంలోని దక్షిణ భాగాల పైన తీవ్రమైన ప్రభావం ఉంటుంది. మిగిలిన జిల్లాలు - కర్నూలు, ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం లో మోస్తరు వర్షాలు డిసంబర్ 4/5 దాక మనం చూడొచ్చు. 

Andrapradesh

Nov 23 2021, 09:40

పాడేరు కస్తూరిబాయ్ గాంధీ విద్యాలయంలో రాత్రి భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత

 


విశాఖపట్నం...

 

పాడేరు కస్తూరిబాయ్ గాంధీ విద్యాలయంలో రాత్రి భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత. నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఈ సంఘటన జరిగినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపణ...
విశాఖ, పాడేరు: విశాఖ ఏజెన్సీ పాడేరు డివిజన్ కేంద్రంలో ఉన్న కస్తూరిబాయి గాంధీ విద్యాలయం లో విద్యార్థులు రాత్రి భోజనం తిని అస్వస్థతకు గురయ్యారు. దీంతో డ్యూటీలో ఉన్న సిబ్బంది అస్వస్థతకు గురైన విద్యార్థులకు స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. మరికొందరికి108వాహనాలు వచ్చి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.పాఠశాల నిర్వాహకులు నిర్లక్ష్యంతో విద్యార్థులకు నిలువ భోజనం పెట్టడంతో ఈ కలుషిత ఆహారం తీసుకోవడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తేల్చారు.ఆహారంతో పాటు తాగునీటి కలుషితం మలినలు ఉన్నట్లు వైద్య బృందం తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించి దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు ,గిరిజన సమైక్య,విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ డిమాండ్ చేశారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

Andrapradesh

Nov 22 2021, 20:08

చిత్తూరు జిల్లా

 


తిరుపతి టీటీడీ అటవీ కార్మికుల సమస్యలపై నవంబరు 26న భారీ నిరసన ... 365 రోజులకు చేరుకుంటున్న నిరాహార దీక్షలు

 

ఏడాది కాలంగా దీక్షలు చేస్తున్నా టిటిడి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం టిటిడి అటవీ కార్మికుల గురించి పట్టించుకోకపోవడం అన్యాయమని, నవంబరు 26న భారీ నిరసనను చేపట్టనున్నామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘం గౌరవాధ్యక్షులు కందారపు మురళి ప్రకటించారు. తిరుపతి ఎంబి భవన్ లో సోమవారం నాటి ఉదయం కె. సురేష్ అధ్యక్షతన కార్మికుల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కందారపు మురళి ప్రసంగిస్తూ గత ఏడాది నవంబరు 26న టిటిడి అటవీ కార్మికులు సమస్యల పరిష్కారంకై రిలే నిరాహార దీక్షలు చేపట్టారని, ఈ ఏడాది కాలంలో 14 సార్లు భారీ నిరసన కార్యక్రమాలతో పాటు, 365 రోజులుగా నిరాహార దీక్షలు సాగిస్తున్నా, టిటిడి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. టిటిడి పాలక మండలిలో అటవీ కార్మికులకు టైం స్కేల్ ఇస్తామని తీర్మానం చేసి, రెండేళ్లు పూర్తయినా అమలు చేయలేదని, హైకోర్టు ఆదేశాలను, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీని అమలు పరచలేదని తీవ్రంగా విమర్శించారు. 26న చేపట్టే నిరసన కార్యక్రమంలో అన్ని పక్షాల నేతలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అటవీ కార్మికుల సంఘం నేతలు ఈశ్వర్ రెడ్డి, పురుషోత్తం, మునిరాజా, వెంకటరెడ్డి, వాసు, మునికృష్ణ, మల్లికార్జునతో పాటు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు... 

Andrapradesh

Nov 22 2021, 19:10

రాయల చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉంది..చెవిరెడ్డి హెచ్చరికలు

 


తిరుపతిలో రాయల చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని సమీప ప్రజలు పునరావాసా కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదిక ద్వారా పలు ట్వీట్స్ చేశారు. ఒక వేళ రాయలచెరువు కట్ట తెగిపోతే సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్దంగా ఉన్నాయని, హెలికాఫ్టర్‌లను కూడా సిద్దం చేశామని ప్రకటించారు. తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఆర్సీపురం ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి, ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు రాయలచెరువు కట్టను పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు.

 

 రాయలచెరువు గండి పడి నీరు లీకేజీ అవుతున్న ప్రాంతంలో ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి రాయలచెరువు ముంపు ప్రాంత గ్రామాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఎప్పటికప్పుడు వరద ఉదృతిని పరిశీలిస్తూ, చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన సూచించారు. మరో రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆయన హెచ్చరించారు. రామాపురంలోని వెరిటాస్‌ సైనిక్‌ స్కూలు, గంగిరెడ్డిపల్లెలోని ఏఈఆర్‌ ఎంబీఏ కళాశాల, కమ్మకండ్రిగ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, తిరుచానూరులోని పద్మావతి నిలయంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో 2 వేల కుటుంబాలకు వసతి, భోజన సదుపాయం కల్పించామన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. తాము చర్యలు తీసుకోవడం జరిగిందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెల్లడించారు.

 దిగువ ప్రాంతానికి నీరు లీకవుతుండడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఏ క్షణమైనా రాయల చెరువు కట్ట తెగే ప్రమాదం  ఉండడంతో.. నీటి మట్టాన్ని, గండిని పరిశీలించారు కలెక్టర్‌ హరి నారాయణ్‌, ఎస్పీ వెంకట అప్పలనాయుడు. గండి పూడ్చివేత పనులను పరిశీలించారు. ముందస్తు చర్యగా సుమారు 20 గ్రామాల  ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముంపు బాధితులకు రెండు సురక్షిత కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు రెవెన్యూ అధికారులు. లోతట్టుప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు హెచ్చరించారు. కొండ ప్రాంతాల నుంచి చేరిన వర్షపునీరుతో రాయల చెరువు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరింది.

 దీంతో చెరువు దిగువనున్న ముళ్లపూడి, పాడిపేట, కుంట్రపాకం, తనపల్లి, పద్మవల్లి పురం, బలిజ పల్లి, గంగిరెడ్డి పల్లి గ్రామాలకు ముంపు పొంచి ఉంది. సంతబైలు, ప్రసన్న వెంకటేశ్వరపురం, నెన్నూరు, సంజీవరాయపురం, కమ్మపల్లి గ్రామాలకు వరద పోటెత్తే ప్రమాదం ఉంది.  గొల్లపల్లె, కమ్మ కండ్రిగ, నడవలూరు, వెంకట్రామపురం, రామచంద్రాపురం, మెట్టూరు గ్రామాల ప్రజలనూ అధికారులు అప్రమత్తం చేశారు. ఆయా గ్రామాలను ప్రజలంతా ఖాళీ చేయాలని హెచ్చరించారు. రాయల చెరువుకు చిన్న గండి పడడంతో.. ఈ రూట్‌లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. 

 

 రాయల చెరువుకు పడిన చిన్న గండితో ప్రస్తుతానికి ప్రమాదమేమీ లేదన్నారు కలెక్టర్‌ హరినారాయణ్‌. అయితే చెరువు ఏ క్షణమైనా తెగే ప్రమాదం ఉందని.. ముందస్తు చర్యగా ప్రజల ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా అలర్ట్‌ ప్రకటించామన్నారు.* 

Andrapradesh

Nov 22 2021, 18:51

కృష్ణా జిల్లా ఎస్పీ తనదైన శైలిలో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు

 


తనతో సమానంగా విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లను తన ప్రక్కనే ప్రెస్ మీట్ లో కూర్చోబెట్టిన జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్..

 

పోలీస్ శాఖలో ఏదైనా కేసును ఛేదించితే, కేసు చేదనలో కృషి చేసిన సిబ్బందికి కాకుండ పోలీస్ ఆఫిసర్లకు మాత్రమే గౌరవం దక్కేది..

విధి నిర్వహణలో ర్యాంకులతో సంబంధం లేదని అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తే ప్రతి ఒక్కరికి తన పక్కన సముచిత స్థానం ఉంటుందని నిరూపించారు కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్

మునుపెన్నడూ లేనివిధంగా అవనిగడ్డ బాలుడి కిడ్నాప్ కేసును చేదించడంలో కృషి చేసిన కానిస్టేబుల్స్ యొక్క ప్రతిభను గుర్తించి, ప్రత్యేకంగా అభినందించి, వారిని తన పక్కన కూర్చోబెట్టుకుని, విలేఖరుల సమావేశం నిర్వహించి,తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు కృష్ణా జిల్లా ఎస్పీ....

 

ఆయన పక్కనే కూర్చోబెట్టి ఆయనతో సమానంగా ఇచ్చిన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపిన కానిస్టేబుల్స్...

 ఇలాంటి ఎస్పి జిల్లాకు వచ్చినందుకు తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేసిన కానిస్టేబుల్స్...