TSNews

Jun 10 2021, 09:00

నేడే సూర్య గ్రహణం... 
 

 గోల్డెన్ రింగ్ లా సూర్య గ్రహణం... 
 
  ఈ రోజు సూర్యుడు భూమికి మధ్య చంద్రుడు రావడం వల్ల సూర్య కిరణాలు చంద్రుడిపై పడి చంద్రుడి నీడ భూమిపై పడటంతో ఈ గ్రహణం ఏర్పడుతుంది. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ప్రభావం భారతదేశంలో ఉండదు. చంద్రుడు సూర్యుడికి పూర్తిగా అడ్డుగా రావడం వల్ల అది ఓ రింగ్‌లా ఏర్పడటంతో దీన్ని పాశ్యాత్యులు రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ అని పిలుస్తున్నారని పేర్కొన్నారు. 

2021లో నాలుగు గ్రహణాలు సంభవిస్తాయి. ఇటీవల ఒక చంద్రగ్రహణం ఏర్పడగా.. జూన్‌ 10న సూర్య గ్రహణం, నవంబర్‌ 19న పాక్షిక చంద్ర గ్రహణం, డిసెంబర్‌ 4న సంపూర్ణ సూర్య గ్రహణం రానున్నాయి. ఈ నాలుగు గ్రహణాలూ భారతదేశంపై ప్రభావం ఉండదు.

జూన్‌ 10న ఏర్పడే సూర్య గ్రహణం మనదేశంపై ప్రభావం చూపకపోవడం వల్ల ఎలాంటి గ్రహణ నియమాలూ పాటించాల్సిన అవసరం లేదన్నారు. ఈ సూర్య గ్రహణం గ్రీన్‌లాండ్‌, కెనడా, ఉత్తర అమెరికా, ఆర్కిటిక్‌, అంటార్కిటిక్‌, యూరప్‌, రష్యా, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో కనబడుతుంది.
  ఈ గ్రహణం ఆయా దేశాల్లో మధ్యాహ్నం 1.42గంటల నుంచి సాయంత్రం 6.41గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు.

భారత్‌లో నివసించేవారు ఈ గ్రహణంలో ఎలాంటి నియమాలూ పాటించక్కర్లేదు. పైన పేర్కొన్న దేశాల్లో నివసించే భారతీయులు మాత్రం గ్రహణ సమయంలో వారి పరిస్థితులను బట్టి జప, తప, తర్పణ, స్నాన మరియు హోమ విధులు నిర్వర్తించుకోవచ్చు. ఈ గ్రహణం రోహిణి నక్షత్రంలో ఏర్పడటం వల్ల వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం సంభవించే దేశాల్లో వృషభ రాశివారు గ్రహణ సమయంలో సూర్యారాధన, రాహు, దుర్గాదేవి జపం ఆచరించడం మంచిది.

TSNews

Jun 10 2021, 08:45

卐 ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః 卐 
 

 卐 ఓం శ్రీ గురుభ్యోనమః 卐

ఈ రోజు రాశిఫలాలు...
 గురువారం, జూన్ 10, 2021 

 మేషం : చేపట్టిన పనులను పక్కా ప్రణాళికతో పూర్తి చేస్తారు. కాలం శుభప్రదంగా ఉంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈశ్వరుడిని ఆరాధిస్తే మంచిది.

 వృషభం : కార్యసిద్ధి ఉంది. దైవబలంతో ఒక పనిని పూర్తిచేస్తారు. మొదలుపెట్టిన పనులను ఉత్సాహంగా పూర్తిచేస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. క్షమాగుణంతో ఉంటే మేలు జరుగుతుంది. లక్ష్మీదేవి దర్శనం శుభప్రదం.

 మిథునం : శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. నూతనంగా చేపట్టే పనులను కుటుంబ సభ్యుల అంగీకారం తర్వాతే మొదలుపెట్టండి. కుటుంబానికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. శత్రువులకు దూరంగా ఉండాలి. ఇష్టదేవతా ధ్యానం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

 కర్కాటకం : తోటివారి సాయం అందుతుంది. ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. శివారాధన శుభప్రదం. 

 సింహం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.

 కన్య : మొదలు పెట్టిన పనిలో సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. సమయానికి సహాయం చేసేవారున్నారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. లింగాష్టకం చదివితే మంచిది.

 తుల : పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ముఖ్య విషయాల్లో ఆచితూచి అడుగేయాలి. కలహాలు ఎదురయ్యే అవకాశం ఉంది కనుక మాట విలువను కాపాడుకోవాలి. హనుమ ఆరాధన శుభప్రదం.

 వృశ్చికం : ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. అనవసరంగా గొడవల్లో చిక్కుకునే అవకాశం ఉంది కనుక అందరినీ కలుపుకొని పోవడం ఉత్తమం. కుటుంబ సభ్యుల తోడు ఉంటుంది. లక్ష్మీదేవి నామ స్మరణ మంచిది. 

 ధనస్సు : ముఖ్యమైన పనుల్లో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో మేలైన ఫలితాలుంటాయి. మనోధైర్యం రక్షిస్తుంది. దుర్గాదేవిని, వేంకటేశ్వరుడిని పూజిస్తే శుభం జరుగుతుంది. 

 మకరం : ధర్మసిద్ధి ఉంది. సమస్యలు తొలగడానికి అవకాశం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

 కుంభం : చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. దైవబలంతో ఆటంకాలను ఎదుర్కొంటారు. అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా వ్యవహరించాలి. శని జపం అనుకూలతనిస్తుంది.

 మీనం : గ్రహబల

TSNews

Jun 10 2021, 08:40

卐 ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః 卐 
 

 卐 ఓం శ్రీ గురుభ్యోనమః 卐

ఈ రోజు రాశిఫలాలు...
 గురువారం, జూన్ 10, 2021 

 మేషం : చేపట్టిన పనులను పక్కా ప్రణాళికతో పూర్తి చేస్తారు. కాలం శుభప్రదంగా ఉంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈశ్వరుడిని ఆరాధిస్తే మంచిది.

 వృషభం : కార్యసిద్ధి ఉంది. దైవబలంతో ఒక పనిని పూర్తిచేస్తారు. మొదలుపెట్టిన పనులను ఉత్సాహంగా పూర్తిచేస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. క్షమాగుణంతో ఉంటే మేలు జరుగుతుంది. లక్ష్మీదేవి దర్శనం శుభప్రదం.

 మిఇస్తుంది. సంబంధించిన ఒక శుభవార్త వింటారు. శత్రువులకు దూరంగా ఉండాలి. ఇష్టదేవతా ధ్యానం మంచి ఫలితాన్ని ఇస్తుంది

 కర్కాటకం : మంచి పనులు చేపడతారు. ఉద్యోగులకు అనుకూలమైన సమయం. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. లింగాష్టకాన్ని పఠిస్తే బాగుంటుంది.

 సింహం : సంతోషకరమైన వార్తలను వింటారు. శరీర సౌఖ్యం ఉంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. కొన్ని విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

 కన్య : చిత్తశుద్ధితో చేసే పనులు మంచినిస్తాయి. చంచల నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. మనోధైర్యాన్ని కోల్పోకూడదు. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర కలహాలతో సమయాన్ని వృథా చేయకూడదు. నవగ్రహ ధ్యానం శుభాన్నిస్తుంది.

 తుల : అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. సాయిబాబా నామాన్ని జపించడం ఉత్తమం.

 వృశ్చికం : మొదలుపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ.. వాటిని అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం శుభప్రదం.

 ధనస్సు : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి మిశ్రమ కాలం. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఆరోగ్య పరిరక్షణ అవసరం. మనోబలం పెరగటానికి లక్ష్మీ ధ్యానం శుభప్రదం.

 మకరం : చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో మీకు డబ్బు చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివుడిని ఆరాధిస్తే అన్ని రకాలుగా మంచిది.

 కుంభం : మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. పెద్దల సహకారం లభిస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

 మీనం :* అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు

TSNews

Jun 09 2021, 17:40

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంచుతూ  సీజేఐ కీలక నిర్ణయం... 
 


 హైదరాబాద్‌ 

  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ చొరవతో తెలంగాణ హైకోర్టు చిరకాలవాంఛ నెరవేరనుంది. హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కు పెంచుతూ సీజేఐ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు.

న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని కోరుతూ తెలంగాణ హైకోర్టు నుంచి రెండేళ్లుగా సుప్రీంకోర్టుకు అనేక విజ్ఞప్తులు అందాయి. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం సుప్రీంకోర్టు కొలీజియం ద్వారా జరుగుతుంది. వివిధ రాష్ట్రాల హైకోర్టుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను జస్టిస్‌ ఎన్వీరమణ పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను ఏకంగా 75 శాతం వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 42కు చేరనుంది. హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సాధ్యమైనంత త్వరితగతిన పూర్తి చేయాలనే తలంపుతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీజేఐ కార్యాలయం వెల్లడించింది. ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో రెండ్రోజుల పాటు జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా భేటీ అయిన జస్టిస్‌ ఎన్వీ రమణ... కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. 

TSNews

Jun 09 2021, 16:38

ఇంటర్‌ పరీక్షలపై నిర్ణయం తీసుకోలేదు: సబిత
 


తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు రద్దుపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన రాలేదు.

 కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ప్రథమ సంవత్సరం పరీక్షలను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ద్వితీయ సంవత్సరం పరీక్షలను కూడా రద్దు చేయనుందనే ప్రచారం జరుగుతోంది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలపై మంగళవారం కేబినెట్‌ భేటీలో చర్చ జరిగింది. కేబినెట్‌ భేటీ తర్వాత దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

 ఇంటర్‌ పరీక్షల రద్దు విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం మధ్యాహ్నం తెలిపారు. ఇంటర్‌ పరీక్షల రద్దుపై సమీక్ష తర్వాతే ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు.

TSNews

Jun 09 2021, 16:32

భారతీయ విమాన రాకపోకలపై నిషేధాన్ని పొడిగించిన యూఏఈ 
 

 
మన దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి క్రమంగా తగ్గుతుంది. అయినప్పటికీ విదేశాలకు వెళ్లే విమాన సర్వీసులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భారతీయ విమానాలపై నిషేధాన్ని యూఏఈ పొడిగించింది. ఈ మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటన విడుదల చేసింది.
కరోనా వ్యాప్తిని నియంత్రించడం కోసం భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధాన్ని జూన్ 30 వరకూ పొడిగించాలని యూఏఈ నిర్ణయించింది. ఏప్రిల్ నెలలో ఈ బ్యాన్ మొదలైంది. గడిచిన 14 రోజుల్లో భారత్‌కు వెళ్లొచ్చిన విదేశీ ప్రయాణికులెవర్నీ యూఏఈలోకి రాకుండా ప్రభుత్వం నిషేధం విధించింది. ఇప్పుడు ఆ నిషేధాన్ని జూన్ 30 వరకూ పొడిగించింది.

TSNews

Jun 09 2021, 16:21

గురు గ్రహం నుండి అతిపెద్ద చందమామ ఫోటోలు పంపిన జునో స్పేస్‌క్రాఫ్ట్ - నాసా 
 


సౌరకుటుంబంలో భూమికి ఉన్నట్లే ప్రతి గ్రహానికి చందమామ ఉంటాడు. వీటిలో గురు గ్రహానికి సౌరకుటుంబంలోనే అతిపెద్ద చందమామ ఉన్నాడు. దాని పేరు గానిమీడ్‌. నాసాకు చెందిన జునో స్పేస్‌క్రాఫ్ట్ ఇప్పుడా చందమామ ఫొటో తీసి భూమిపైకి పంపించింది. గానిమీడ్ ఉపరితలానికి వెయ్యి కిలోమీటర్ల దగ్గరి వరకూ వెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్ అద్భుతమైన ఫొటోలు తీసింది. గత రెండు దశాబ్దాల్లో ఈ చందమామకు ఇంత దగ్గరగా వెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్ మరొకటి లేదు.
జునో తీసిన హైరెజల్యూషన్ ఫొటోలను నాసా పరిశీలిస్తోంది. అందులో అగ్నిపర్వత బిలాలు కూడా కనిపిస్తున్నాయి. జునోను పరిశీలిస్తున్న స్కాట్ బోల్టన్ స్పందిస్తూ.. జూపిటర్ ఆర్బిటర్‌లోని జునోక్యామ్ ఇమేజర్‌, స్టెల్లార్ రెఫరెన్స్ యూనిట్ స్టార్ కెమెరా ఈ ఫొటోలు తీశాయి. నీటిరూపంలో ఉన్న మంచుతో కూడిన ఓ భాగం మొత్తాన్నీ జునో ఫొటో తీయగలిగినట్లు నాసా వెల్లడించింది. ఈ ఫొటోను జూన్ 7న గానిమీడ్ దగ్గరగా వెళ్లిన సమయంలో జునో తీసింది.

గురుగ్రహానికి ఉపగ్రహమైన ఈ గానిమీడ్‌.. బుధ గ్రహం కూడా పెద్దగా ఉంటుంది. స్పేస్‌క్రాఫ్ట్ సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉన్న గానిమీడ్ వైపు ఫొటో తీసింది. రానున్న రోజుల్లో స్పేస్‌క్రాఫ్ట్ మరిన్ని ఫొటోలు తీసి పంపించనుంది. ఈ ఫొటోల వల్ల గానిమీడ్ గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయని నాసా సైంటిస్టులు తెలిపారు. గురు గ్రహం చుట్టూ కొంత కాలంగా జునో స్పేస్‌క్రాఫ్ట్ తిరుగుతూనే ఉంది. 2011లో లాంచ్ చేయగా.. 2016లో ఇది గురుగ్రహ కక్ష్యలోకి చేరింది.

TSNews

Jun 09 2021, 15:45

రేవంత్‌‌ రెడ్డి చేసిన ట్వీట్‌పై ఘాటుగా స్పందించిన జగదీష్ రెడ్డి 
 ఈటల రాజేందర్ తర్వాత మంత్రి జగదీశ్ రెడ్డేనంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ చేసిన ట్వీట్‌పై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. చెత్త మనుషులకు, చెత్త ఆలోచనలే ఉంటాయని కొట్టిపారేశారు. అలాంటి విషయాలపై తాను స్పందించాల్సిన అవసరంలేదని కొట్టిపారేశారు. బుధవారం ఓ న్యూస్ ఛానెల్‌తో ఈ మేరకు మాట్లాడారు. పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జగదీశ్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం కొన్ని జిల్లా కేంద్రాల్లో డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేసిందని, త్వరలోనే మిగతా జిల్లాల్లోనూ ఆ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. కరోనాకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుతోందని జగదీష్‌రెడ్డి మరోసారి చెప్పారు. మంగళవారం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ సంచలనం అయిన సంగతి తెలిసిందే. ‘రస’కందాయంలో హంపి ‘ధూమ్ ధామ్’... కోవర్ట్ ‘క్రాంతి’ కిరణాలతో కకావికలం... యముడు జగదీశ్ రెడ్డి ‘ఘంటా’ కొట్టినట్టేనా...? అంటూ ఆ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు స్పందించారు. ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, క్రాంతి కిరణ్, మంత్రి జగదీశ్ రెడ్డిలను ఉద్దేశిస్తూ చేసినట్టుగా నెటిజన్లు వ్యాఖ్యానించారు. త్వరలో టీఆర్ఎస్ పార్టీ మరో సంచలనానికి వేదిక కాబోతోందనడానికి ఈ ట్వీట్ సూచిక అన్నారు. అయితే, గత జనవరిలో మంత్రి జగదీశ్ రెడ్డి తన కుమారుడి పుట్టినరోజు వేడుకలను కర్నాటకలోని హంపీలో జరిపారని ట్వీట్‌కు జత చేసిన పత్రికా కథనంలో ఉంది. ఈ వేడుకలకు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కొంతమంది పార్టీ ప్రముఖులు హాజరయ్యారని, పేరుకు పుట్టిన రోజు వేడుకలైనా.. అక్కడ పార్టీ అంశాలే చర్చకు వచ్చినట్టుగా వార్తా కథనంలో పేర్కొన్నారు. 

TSNews

Jun 09 2021, 14:35

మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం... 
 

 ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు రద్దు... 

  కరోనా వైరస్‌ నేపథ్యంలో తెలంగాణలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు రద్దు చేస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. ఫస్ట్‌ ఇయర్‌లో వచ్చిన గ్రేడ్‌ల ప్రకారమే సెకండియర్‌లో గ్రేడింగ్‌ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇంటర్‌ పరీక్షలను నిర్వహిస్తే మళ్లీ కరోనా వైరస్‌ విజృంభించే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, ప‌రీక్ష‌ల ర‌ద్దుతో పాటు, వాటి ఫ‌లితాల విధానాల‌పై ఈ రోజు సాయంత్రం అధికారికంగా ప్ర‌భుత్వం వివ‌రాలు తెల‌ప‌నుంది.

TSNews

Jun 09 2021, 14:25

నేడు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్ 
 


జగిత్యాల జిల్లాలో ఈ రోజు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పరామర్శించనున్నారు సీఎం కెసిఆర్. మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డుమార్గం ద్వారా రేగుంటకు చేరుకోనున్న సీఎం కేసీఆర్..మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు సుమన్ స్వగ్రామం రేగుంటలోని సుమన్ ఇంటివద్ద ఉండనున్నారు. ఈ సందర్బంగా సుమన్ తండ్రి సురేష్ చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించనున్నారు. సుమన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.అయితే ఈటల ఎపిసోడ్ జరిగాక.. మొదటి సారిగా సిఎం కెసిఆర్ ఉమ్మడి కరీంనగర్ కు వస్తున్నారు. దీంతో తెలంగాణ మొత్తం సిఎం కెసిఆర్ పర్యటనపైనే దృష్టి సారించింది. బాల్క సుమన్ ను పరామర్శించడంతో పాటు.. ఎల్. రమణను పార్టీలో చేర్చుకునేందుకు చర్చలు జరిపేందుకు ఈ టూర్ ప్లాన్ చేసినట్లు సమాచారం. మొన్న కేటీఆర్, ఇవాళ అధినేత జగిత్యాల జిల్లాకు వస్తుండటంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అటు ఎల్. రమణ కూడా టీఆర్ఎస్ లో చేరేందుకే సన్నద్దం అయినట్లు సమాచారం. ఇక ఎం జరుగుతుందో త్వరలోనే క్లారిటీ రానుంది.