Andrapradesh

May 21 2021, 08:35

రఘురామ కృష్ణం రాజు అరెస్టు, తదనంతర పరిణామాలపై సుప్రీంకోర్టు మధ్యాహ్నం కీలక విచారణ 
 


నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టు, తదనంతర పరిణామాలపై సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యాహ్నం కీలక విచారణ జరపనుంది. మధ్యాహ్నం 12 గంటలప్రాంతంలో జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ బి.ఆర్‌. గవాయిలతో కూడిన ధర్మాసనం ఎదుట కేసు జాబితాలో 25 నంబర్‌ ఐటమ్‌ గా ఈ కేసు విచారణకు రానుంది. రాజద్రోహం, తదితర కేసులను మోపి సీఐడీ అరెస్టు చేసిన రఘురామ కృష్ణం రాజుకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేసి తమకు నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఈనెల 17వ తేదీన ఆదేశించిన విషయం తెలిసిందే. వైద్యపరీక్షలకు సంబంధించి ఆర్మీ ఆస్పత్రి వైద్యులు రూపొందించిన నివేదిక... తెలంగాణ హైకోర్టు ద్వారా గురువారం సుప్రీంకోర్టుకు చేరింది. మరోవైపు... తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ రఘురామకృష్ణం రాజు వేసిన ఎస్‌ఎల్‌పీకి (స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌) కౌంటర్‌ గా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ కూడా కోర్టు పరిశీలనలో ఉంది. మొత్తం ఉదంతంలో వైద్య పరీక్షల నివేదిక, ఆయనపై మోపిన సెక్షన్లు కీలక పాత్ర పోషించనున్నాయని న్యాయనిపుణులు అంటున్నారు.

Andrapradesh

May 21 2021, 08:34

ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలపై నేడు హైకోర్టు తీర్పు 


ఏపీలో రెండు నెలల క్రితం జరిగిన పరిషత్ ఎన్నికలు.  

ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో పిటిషన్లు. 

ఎన్నికలు జరిపి కౌంటింగ్ ఆపాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు.  

నేడు తీర్పు ఇవ్వనున్న ఏపీ హైకోర్టు.

Andrapradesh

May 20 2021, 18:16

'సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎమ్మెన్వో సాంబ శివుడిని తొలగించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు 
 


అనంతపురము, మే 20

అనంతపురము క్యాన్సర్ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఎమ్మెన్వోగా పనిచేస్తున్న సాంబ శివుడు అనే వ్యక్తిని విధుల నుంచి తొలగించాలని సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంటును ఆదేశిస్తూ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. 

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రెసిడెంట్ మెడికల్ ఆఫీసరు అనుమతి లేకుండా కరోనా పాజిటివ్ వ్యక్తులను బలవంతంగా అడ్మిట్ చేసి, ఆసుపత్రి వైద్య సిబ్బంది మధ్య అనారోగ్యకర వాతావరణాన్ని సృష్టించారని ఎమ్మెన్వో మీద ఆరోపణలు రాగా, ఆరోపణలపై విచారణ చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నోడల్ అధికారి సదరు ఎమ్మెన్వోను తొలగించాలని సిఫార్సులు చేస్తూ నివేదిక ఇచ్చారు. 

నివేదిక ప్రకారం ఎమ్మెన్వో సాంబ శివుడుని విధుల నుంచి తొలగించాల్సిందిగా జిల్లా కలెక్టర్ సర్వజనాస్పత్రి సూపరింటెండెంటును ఆదేశించారు.

Andrapradesh

May 20 2021, 18:16

ప్రాణం విలువ నాకు బాగా తెలుసు: సీఎం
 


ప్రాణం విలువ తనకు బాగా తెలుసని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చనిపోయినప్పుడు.. ఓదార్పుయాత్ర చేసి ప్రతి కుటుంబాన్ని పరామర్శించానని తెలిపారు. రెండేళ్లలో ప్రతి ఒక్కరినీ దృష్టిలో ఉంచుకుని అడుగులు వేశామని పేర్కొన్నారు. గ్రామాల్లో వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు నిర్మిస్తున్నామని ప్రకటించారు. ప్రతి 2 వేల మంది జనాభాకు ఒక ఏఎన్‌ఎంను నియమించామన్నారు. ఫోన్‌ చేసిన 20 నిమిషాల్లో అంబులెన్స్‌ వచ్చేలా మార్పులు చేశామన్నారు. ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, ప్రాణం విలువ తెలుసుకాబట్టే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నామని ప్రకటించారు. సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా చూస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ‘‘ఒకేసారి 1180 అంబులెన్స్‌లను ప్రారంభించాం. ఏపీలో ప్రతిరోజు లక్ష కరోనా టెస్టులు చేస్తున్నాం. నాడు- నేడు కార్యక్రమంతో ఆస్పత్రుల రూపురేఖలు మార్చాం. ప్రపంచానికే కొవిడ్‌ పెద్ద సవాల్‌గా మారింది. గత ఏడాది మార్చిలో ఏపీలో తొలి కేసు నమోదైంది. అప్పట్లో శాంపిల్స్‌ పుణె పంపాల్సిన పరిస్థితులు ఉండేవి.. ఇప్పుడు ఏపీలో 150కి పైగా ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చాం. తొలి వేవ్‌లో 261 ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తే.. సెకండ్‌ వేవ్‌లో 649 ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తున్నాం. బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాలు మనకు లేవు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల సేవలు రాష్ట్రంలో లేవు. కొవిడ్‌ నియంత్రణకు 2,229 కోట్లు ఖర్చు చేశాం. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చాం’’ అని జగన్‌ తెలిపారు.

Andrapradesh

May 20 2021, 18:15

విద్యావ్యవస్థలో మార్పులు: సీఎం
 


 విద్యావ్యవస్థలో మార్పులు తెచ్చామని సీఎం జగన్ ప్రకటించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ నాలుగు బిల్డింగ్‌లు కనిపిస్తే అది అభివృద్ధి కాదు.. నిన్నటి కంటే ఈరోజు బాగుంటే అదే అభివృద్ధి అని వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ల కోసం గ్లోబల్‌ టెండర్లు పిలిచిన తొలిరాష్ట్రం ఏపీ అని చెప్పారు. రాష్ట్రంలో 62శాతం జనాభా వ్యవసాయంపై బతుకుతున్నారని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం అన్నారు. రైతులకు కల్తీలేని విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామన్నారు. పంచాయతీ భవనాలపై నీలం- ఆకుపచ్చ రంగుల్ని.. కుట్రలు పన్ని తుడిచేశారు కానీ జనం గుండెల్లో తీసేయలేకపోయారని జగన్‌ పేర్కొన్నారు.

Andrapradesh

May 20 2021, 14:40

జులై 8 న రూ.250 పింఛన్ పెంపు
 


ఏపీలో పింఛన్ తీసుకునేవారికి శుభవార్త. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్ డబ్బులు పెంచబోతోంది. ఈ మేరకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి. వైఎస్సార్‌ పింఛన్ కానుక కోసం రూ. 17,000 కోట్లు కేటాయించారు. పింఛన్ పెంపుకు సంబంధించి ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పెన్షన్‌ను రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత రూ.2,750కు పెంపుదల చేస్తున్నట్లు చెప్పారు. జులై 8 దివంగత నేత వైఎస్సార్ జన్మదినం రోజున పింఛన్ రూ.250 పెంచి.. మొత్తం రూ.2,500 చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి రూ.2,750కు పెంచుతామన్నారు.

గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి జగన్ పింఛన్ పెంపుపై క్లారిటీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ డబ్బులు పెంచబోతున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. వృద్ధులకు పింఛన్ వయసును 65 నుంచి 60కు తగ్గించామని.. తాము మేనిఫెస్టోలో కూడా పింఛన్ పెంచుకుంటూ పోతామని మేనిఫెస్టోలో చెప్పామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2,250 పెంచామని.. జులై 8 దివంగత నేత వైఎస్సార్ జన్మదినం రోజున మరో రూ.250 పెంచుతాం.. మొత్తం రూ.2,500 చేస్తామని చెప్పారు. టీడీపీ హయాంలో ఇచ్చింది దాదాపుగా 44 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారని.. తాము 61 లక్షలమందికి ఇస్తున్నామన్నారు.

Andrapradesh

May 20 2021, 14:33

లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన రఘురామ కుటుంబసభ్యులు
 


దిల్లీ: లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను ఎంపీ రఘురామకృష్ణరాజు కుటుంబసభ్యులు కలిశారు. రఘురామ సతీమణి రమాదేవి, కుమారుడు భరత్‌, కుమార్తె ఇందూ ప్రియదర్శిని స్పీకర్‌తో భేటీ అయ్యారు. రఘురామకృష్ణరాజును జగన్‌ ప్రభుత్వం వేధిస్తోందని వారు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. రఘురామపై రాజద్రోహం కింద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారన్నారు. అంతకుముందు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోనూ రఘురామ కుటుంబ సభ్యులు సమావేశమయ్యారు.

వైకాపా ప్రభుత్వం రఘురామను కుట్రపూరితంగా వేధింపులకు గురిచేస్తోందని ఫిర్యాదు చేశారు. ఆయన ప్రాణానికి ముప్పు ఉందని.. జగన్‌ ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. నిన్న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమైన రఘురామ కుటుంబసభ్యులు.. నేడు ఓం బిర్లా, రాజ్‌నాథ్‌లతో భేటీ అయ్యారు.

Andrapradesh

May 20 2021, 14:28

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు
 


అమ‌రావ‌తి: తిరుప‌తి రుయా ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌పై హైకోర్టులో మ‌రో పిటిష‌న్ దాఖ‌లైంది. ఘ‌ట‌న‌లో 36 మంది చ‌నిపోతే ప్ర‌భుత్వం 11 మందే అని చెబుతోంద‌ని తెదేపా నేత పి.ఆర్‌.మోహ‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. పిటిష‌న‌ర్ త‌ర‌ఫున న్యాయ‌వాది య‌ల‌మంజుల‌ బాలాజీ వాద‌న‌లు వినిపించారు. ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు ఇచ్చినా ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌లేద‌ని కోర్టుకు తెలిపారు. ఆక్సిజ‌న్ స‌మ‌యానికి అంద‌కే ఘ‌ట‌న జ‌రిగింద‌ని వాదించారు. బాధ్యుల‌పై కేసు న‌మోదు చేయాల‌ని పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది ధ‌ర్మాస‌నాన్ని కోరారు. ఘ‌ట‌న‌పై న్యాయ‌విచార‌ణ‌కు ఆదేశించాల‌న్నారు.

కేంద్రం ఇచ్చిన ఐదు ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు నెల‌కొల్ప‌లేద‌ని ధ‌ర్మాస‌నానికి న్యాయ‌వాది వివరించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం తిరుప‌తి ఎస్పీతో పాటు కేంద్ర‌, రాష్ట్ర  ప్ర‌భుత్వాల‌కు నోటీసులు జారీ చేసింది. వేస‌వి సెల‌వుల అనంత‌రం తొలిరోజుకు త‌దుప‌రి విచార‌ణ‌ను ధ‌ర్మాస‌నం వాయిదా వేసింది. ఇదే విష‌యంపై నిన్న తిరుప‌తికి చెందిన సామాజిక వేత్త హైకోర్టులో పిటిష‌న్ వేశారు. విచారించిన ధ‌ర్మాస‌నం ప్ర‌భుత్వానికి నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే.

Andrapradesh

May 20 2021, 13:46

AP Budget 2021: కోవిడ్‌పై పోరుకు రూ.1000 కోట్లు
 


ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశం కొనసాగుతుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. సభలో పలువురికి సంతాప తీర్మానాలు చేశారు. పలువురు మాజీ ఎమ్మెల్యేల మృతిపట్ల అసెంబ్లీ సంతాపం తెలిపింది.* 

 ఇక బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి 13,840.44 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోలుకు రూ.2,248.94 కోట్లు.. ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమానికి రూ.1535 కోట్లు.. కోవిడ్‌పై పోరాటానికి రూ.1000 కోట్లు.. ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో శానిటేషన్‌కు రూ.100 కోట్లు.. శ్రీకాకుళం జిల్లా పలాస ఆస్పత్రికి రూ.50 కోట్ల చెప్పున కేటాయించింది.

Andrapradesh

May 20 2021, 12:02

2 లక్షల 29 వేల కోట్లలో సంక్షేమానికి పెద్దపీట
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ ఒకరోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీలో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్‌ అంచనా రూ.2,29,779.27 కోట్లుగా తెలిపారు. ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. బీసీ ఉప ప్రణాళికకు రూ.28,237 కోట్లు, కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు, ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు, ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు బడ్జెట్‌లో వెచ్చించారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టున్నారు. సభ ప్రారంభం కాగానే పలువురు మాజీ ఎమ్మెల్యేల మృతిపట్ల అసెంబ్లీ సంతాపం తెలిపింది.
బడ్జెట్‌ కేటాయింపులు ఇలా
బీసీ ఉప ప్రణాళిక: రూ.28,237 కోట్లు
ఎస్సీ ఉప ప్రణాళిక: రూ.17,403 కోట్లు
ఎస్టీ ఉప ప్రణాళిక: రూ.6,131 కోట్లు
కాపు సంక్షేమం: రూ.3,306 కోట్లు
ఈబీసీ సంక్షేమం: రూ.5,478 కోట్లు
బ్రాహ్మణ సంక్షేమం: రూ.359 కోట్లు
మైనార్టీ యాక్షన్‌ ప్లాన్‌: రూ.1,756 కోట్లు
చిన్నారుల కోసం రూ.16,748 కోట్లు
మహిళల అభివృద్ధి: రూ.47,283.21 కోట్లు
వ్యవసాయ పథకాలు: రూ.11,210 కోట్లు
విద్యా పథకాలు: రూ.24,624 కోట్లు
వైద్యం, ఆరోగ్యం: రూ.13,830 కోట్లు
వైఎస్సార్‌ పింఛన్‌ కానుక: రూ.17 వేల కోట్లు
వైఎస్సార్‌ రైతు భరోసా: రూ.3,845 కోట్లు
జగనన్న విద్యా దీవెన: రూ.2,500 కోట్లు
జగనన్న వసతి దీవెన: రూ.2,223.15 కోట్లు
వైఎస్సార్‌-పీఎం ఫసల్‌ బీమా: రూ.1802 కోట్లు
డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులు: రూ.865 కోట్లు
పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలు: రూ.247 కోట్లు
రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు: రూ.500 కోట్లు
వైఎస్సార్‌ కాపు నేస్తం కోసం రూ.500 కోట్లు
వైఎస్‌ఆర్‌ జగనన్న చేదోడు పథకానికి రూ.300 కోట్లు
వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర కోసం రూ.285 కోట్లు
వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం కోసం రూ.190 కోట్లు
వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కోసం రూ.120 కోట్లు
మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు
అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపుల కోసం రూ.200 కోట్లు
రైతులకు ఎక్స్‌గ్రేషియా కోసం రూ.20 కోట్లు
లా నేస్తం కోసం రూ.16.64 కోట్లు
ఈబీసీ నేస్తం కోసం రూ.500 కోట్లు
వైఎస్‌ఆర్‌ ఆసరా కోసం రూ.6,337 కోట్లు
అమ్మఒడి పథకం కోసం రూ.6,107 కోట్లు
వైఎస్‌ఆర్‌ చేయూత కోసం రూ.4,455 కోట్లు
రైతు పథకాల కోసం రూ.11,210.80 కోట్లు