TSNews

May 15 2021, 18:48

బ్రేకింగ్ న్యూస్ 
 


 బ్లాక్ ఫంగస్ పై తెలంగాణా సర్కారు కీలక నిర్ణయం 
 

కోవిడ్ నుంచి కోలుకున్న కొన్ని కేస్ లలో బ్లాక్ ఫంగస్ సమస్య అని తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించారు. బ్లాక్ ఫంగస్ భారిన పడితున్న వారిలో ఎక్కువగా ఈఎన్ టి సమస్యలు వస్తున్నాయని, బ్లాక్ ఫంగస్ కేస్ ల చికిత్సకు నోడల్ కేంద్రం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ ఎన్ టి ఆసుపత్రిని నోడల్ కేంద్రం గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫంగస్ బారిన పడి కరోనా ఉంటే గాంధీ లో చికిత్స చేస్తారు.

బ్లాక్ ఫంగస్ భారిన పడి ఆప్తల్మాలజీ వైద్యుడి అసవరం ఉంటే సరోజిని దేవి ఆసుపత్రి సేవలు వినియోగించనున్నట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో వివరించింది. ఈ మేరకు గాంధీ , సరోజిని దేవి, కోటి ఈ ఎన్ టి ఆస్పత్రుల సుపరిండెంట్ లు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసారు. బ్లాక్ ఫంగస్ కేస్ లు పూర్తిగా కోటి ఈ ఎం టి లో చికిత్స చేస్తారు. కరోనా తో ఉండి బ్లాక్ ఫంగస్ సమస్య ఉంటే గదిలో వైద్యం చేస్తారు. బ్లాక్ ఫంగస్ కి వినియోగించే మందులు సమకూర్చలని టిఎస్ఎంఐడిసికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

TSNews

May 15 2021, 18:05

జర్నలిస్టులను పోలీసులు అడ్డుకోవద్దు: సీఎం కేసీఆర్ ఆదేశాలు 
 

 
పోలీసులు, జర్నలిస్టులకు మధ్య గొడవలు జరిగినట్టు తన దృష్టికి వచ్చిందని ఇరువురి మధ్య గొడవలు మంచిది కాదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హితవు పలికారు. కొవిడ్ లాక్ డౌన్ సందర్భంగా మీడియాకు ప్రభుత్వం పూర్తి అనుమతి ఇచ్చిందని స్పష్టం చేశారు. వారిని అడ్డుకుంటే ప్రజలకు ఎలాంటి సమాచారం లభించదని తెలిపారు.
చివరకు తాను ఏం మాట్లాడినా కూడా ప్రజల్లోకి వార్తలు వెళ్లే పరిస్థితి ఉండదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర డిజిపి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసు శాఖను ఆదేశించాలని సీఎం కేసీఆర్ కోరారు. ప్రభుత్వమే వారికి అనుమతి ఇచ్చిందని ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు వారిని అడ్డుకోవాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

జర్నలిస్టుల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించవద్దని ఆదేశించారు. ఇందులో ఎవరు అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదని, ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వాల్సిన అవసరం మీడియాకు ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.

TSNews

May 15 2021, 18:01

కరోనా థర్డ్ వేవ్ దూసుకొస్తుందా...? మార్గమేంటి...? 
 

 
 
కరోనా వైరస్ వయస్సుతో సంబంధం లేకుండా సోకుతోంది. చిన్నా, పెద్ద అన్న తేడా లేకుండా కబళిస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులు, వృద్ధులే కాకుండా యువతపై తీవ్ర ప్రభావం చూపింది. మొదటి దశలో వృద్ధులు, రెండవ దశలో యువతపై పంజా విసిరింది. లెక్కకు మించి మరణాలు సంభవించాయి.

వాటి నుంచి కోలుకోకముందే మరో ముప్పు పొంచి ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడో దశలో చిన్నపిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందంటున్నారు. తొలి, మలిదశ కంటే మూడవ దశ చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. గత రెండురోజుల నుంచి కేసులు తగ్గుముఖం పట్టినా మరణాల సంఖ్య మాత్రం పెరుగుతున్నాయి.

రికవరీ రేటు కూడా భారీగా పెరుగుతోంది. సెకండ్ వేవ్ ఎప్పుడు ముగుస్తుందో అంతుచిక్కడం లేదు. అయితే మూడవదశ చాలాప్రమాదకరంగా మారుతోందనే అంచనాలు జనానికి నిద్రపట్టనీయడం లేదు. మూడవ దశ అత్యంత ప్రమాదకరమంటున్నారు.

ఫస్ట్ వేవ్‌లో ఒక్కశాతం కంటే తక్కువమంది పిల్లలకు కరోనా సోకగా, సెకండ్ వేవ్‌లో మాత్రం పిల్లల్లో సంక్రమణ రేటు 10 శాతం రేటు పెరిగింది. పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ ఇవ్వలేదు. దీంతో చిన్నారులకు 80 శాతం వరకు ప్రమాదం ఉండొచ్చు అంటున్నారు. మాస్క్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజర్లు వాడటం పిల్లలకు పెద్దగా తెలియదు.

అర్థం చేసుకునేంత స్థాయి కూడా ఉండదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్ వేగంగా విస్తరించే అవకాశాలు ఉందంటున్నారు. ఈ నెల చివరికి కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టి మూడవదశ.. జూన్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

TSNews

May 15 2021, 17:54

హుస్సేన్ సాగర్‌లో కరోనా వైరస్ ఆనవాళ్లు.. షాకింగ్ న్యూస్ చెప్పిన శాస్త్రవేత్తలు
 కరోనా కల్లోలంతో అల్లాడుతున్న హైదరాబాదీలకు ఇది నిజంగా షాకిచ్చే న్యూసే. భాగ్యనగరంలోని పలు చెరువుల్లో కరోనా జన్యు పదార్థాలు కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హుస్సేన్ సాగర్‌తో పాటు నాచారం పెద్ద చెరువు, నిజాం చెరువులో కూడా వైరస్ పదార్థాలు కనిపించాయని, దేశంలో కరోనా రెండవ వేవ్ ప్రారంభమైన ఈ ఏడాది ఫిబ్రవరిలో నీటిలో ఈ జన్యు పదార్థాలు పెరగడం ప్రారంభమైనట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని నిపుణులు చెబుతున్నారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ మరియు అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. మొదటి మరియు రెండో వేవ్ సమయంలో ఏడు నెలల పాటు ఈ అధ్యయనం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన శుభ్రపరచని, మురికి నీటి కారణంగా కరోనా వైరస్ యొక్క జన్యు పదార్థం సరస్సులు, చెరువులలో వ్యాపించినట్లు తేలింది. అయితే ఈ జన్యు పదార్ధం నుండి వైరస్ మరింత విస్తరించదని, అదొక్కటే కాస్త ఊరటనిచ్చే అంశమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి అధ్యయనం ఇతర దేశాల్లో నిర్వహించగా నీటిలోని పదార్థం నుంచి వైరస్ వ్యాప్తికి ఎలాంటి ఆధారాలు లేవని తేలినట్లు సీసీఎంబీ డైరెక్టర్ తెలిపారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇలాంటి అధ్యయనాలు జరిగాయని, అయితే నీటిలో ఇప్పటివరకు లభించిన జన్యు పదార్ధం అసలు వైరస్ కాదని తేలిందన్నారు. ఇలాంటి పరిస్థితిలో ముఖం, నోటి ద్వారా నీటి నుంచి వైరస్ వ్యాప్తి చెందడానికి తక్కువ అవకాశం ఉందని తెలిపారు. అయినప్పటికీ మానవ కార్యకలాపాలు, మురికి నీరు కారణంగా నీటిలో లభించే జన్యు పదార్ధాల పెరుగుదల లేదా తగ్గుదలని పర్యవేక్షించడం ద్వారా రాబోయే వేవ్‌ల గురించి అంచనా వేయొచ్చన్నారు.

TSNews

May 15 2021, 17:45

ఖమ్మం జిల్లాలో బ్లాక్ ఫంగస్ క‌ల‌క‌లం... 
 


  కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నప్పటికీ బ్లాక్ ఫంగస్ భ‌యాందోళ‌న‌కు గురి చేస్తుంది. ఇప్ప‌టికే దేశంలో ప‌లు రాష్ట్రాల్లో క‌ల‌క‌లం సృష్టిస్తున్న బ్లాక్ ఫంగ‌స్ తెలంగాణ‌లోనూ హ‌డ‌లెత్తిస్తుంది. ఇప్ప‌టికే ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ప‌లువురికి బ్లాక్ ఫంగ‌స్ సోక‌గా.. శ‌నివారం ఖమ్మం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసు న‌మోదైంద‌ని తెలిపారు డాక్ట‌ర్లు. మధిర నియోజకవర్గంలోని.. నేరడ గ్రామానికి చెందిన తాళ్లూరి భద్రయ్యకు బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయ‌ని ఖ‌మ్మం ప్ర‌భుత్వ హాస్పిట‌ల్ డాక్ట‌ర్లు తెలిపారు. వెంట‌నే పేషెంట్ ను హైదరాబాద్ గాంధీ హాస్పిట‌ల్ కి రిఫరల్ చేశామ‌ని చెప్పారు. తాళ్లూరి భ‌ద్ర‌య్య ఇటీవ‌లే క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నార‌ని.. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ లక్షణాలను గుర్తించామ‌న్నారు ఖమ్మం ప్రభుత్వ హాస్పటల్ డాక్ట‌ర్లు.

TSNews

May 15 2021, 17:40

కరోనాపై యుద్ధంలో అప్రమత్తంగా ఉండండి - ప్రధాని మోడీ 
 


▪️దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమీక్ష
▪️పాజిటివిటీ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో నిరంతర నిఘా
▪️అవసరమైతే ఇంటింటికీ పరీక్షలు జరిపించండి: ప్రధాని మోడీ

  కంటికి కనిపించని మహమ్మారి కరోనాపై చేస్తున్న యుద్ధంలో అన్ని విభాగాల వారు నిరంతరం నిఘాతో అప్రమత్తంగా వ్యవహరించేలా చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారు. దేశంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్‌పై శనివారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో కరోన పరిస్థితి, టెస్టులు, ఆక్సిజన్ లభ్యత, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, టీకా రోడ్‌మ్యాప్ పై ప్రధాని మోడీకి వివరించారు అధికారులు. మార్చి ప్రారంభంలో వారానికి 50 లక్షల టెస్టులు చేసేవారమని.. ఇప్పుడు వారానికి 1.3 కోట్ల టెస్టుల వరకు పెరిగాయని ప్రధానికి అధికారులు వివరించారు. క్రమంగా తగ్గుతున్న టెస్ట్ పాజిటివిటీ రేటు, పెరుగుతున్న రికవరీ రేటు అంశాలను ప్రధానికి వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ అధికారులకు పలు సూచనలు చేశారు. అధిక టెస్ట్ పాజిటివిటీ రేట్ ఉన్న ప్రాంతాల్లో టెస్టులను మరింత పెంచాలని ప్రధాని మోడీ ఆదేశించారు. ఇంటింటికీ పరీక్షలు, నిఘాపై దృష్టి పెట్టడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ వనరులను పెంచాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆక్సిజన్ సరఫరాపై దృష్టిసారించాలని ఆదేశాలిచ్చారు. వెంటిలేటర్లు, ఇతర అత్యవసర వైద్య పరికరాల ఉపయోగించడంలో ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని ప్రధాని మోడీ ఆదేశించారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగం పెంచేందుకు రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారులకు ఆదేశాలిచ్చారు.

TSNews

May 15 2021, 17:34

కాసేపట్లో అంత్యక్రియలనగా లేచి కూర్చున్న 76 ఏళ్ల బామ్మ
 


ఆవిడో 76 ఏళ్ల బామ్మ.. కరోనాతో చనిపోయింది. బంధువులందరూ వచ్చారు.. పాడె కట్టి శ్మశానానికి తీసుకెళ్లారు. ఇక కాసేపట్లో అంత్యక్రియలు. అంతలోనే బామ్మ సడెన్‌గా లేచి కూర్చుంది. ఈ వింత ఘటన మహారాష్ట్రలోని బారామతిలో జరిగింది.

బారామతిలోని ముధలే గ్రామానికి చెందిన శకుంతల గైక్వాడ్(76) కొన్ని రోజుల క్రితం కరోనా బారినపడింది. దాంతో ఆమెను కుటుంబసభ్యులు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంచారు. కాగా.. వయసురిత్యా ఆమె ఆరోగ్యం మరింత దిగజారింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు.. బామ్మను మే 10న బారామతిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో బెడ్‌లు లేకపోవడంతో బామ్మను వాహనంలోనే ఉంచారు. అలా కాసేపటి తర్వాత బామ్మ అపస్మారకస్థితిలోకి చేరి అచేతనంగా మారింది. దాంతో బామ్మ చనిపోయిందని కుటుంబసభ్యులు భావించారు. తమ బంధువులకు సమాచారమిచ్చి దహనసంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. ఈలోగా ఉన్నట్టుండి బామ్మ పాడె మీద నుంచి లేచి కూర్చుంది. అది చూసిన కుటుంబసభ్యులు, బంధువులు ముందు భయానికి ఆ తర్వాత ఆశ్చర్యానికి లోనయ్యారు. వెంటనే బామ్మను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. బామ్మను పరిశీలించిన వైద్యులు.. ఆమె చనిపోలేదని.. అన్‌కాన్షియస్ అయిందని తెలిపారు. బామ్మను ఆస్పత్రిలో చేర్చుకొని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బామ్మను బారామతిలోని సిల్వర్ జూబ్లీ ఆస్పత్రికి తరలించారు.

TSNews

May 15 2021, 15:49

లాక్ డౌన్ ఎఫెక్ట్... 
 

 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా ప్రయాణీకుల రద్దీ 
 
 సికింద్రాబాద్‌ 

  సికింద్రాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారింది. కరోనా కారణంగా తెలంగాణలో లాక్‌డౌన్ విధించడంతో అంతా సొంతూళ్లకు పయనమయ్యారు. బస్సులు కూడా లేకపోవడంతో ప్రయాణికులంతా రైళ్లను ఆశ్రయిస్తున్నారు.
దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిపోయింది. రైల్వే కనీస వసతులు కూడా కల్పించడం లేదంటూ అంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంటి బిడ్డలతో, లగేజ్‌తో రోడ్డుపైనే ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు.

TSNews

May 15 2021, 15:33

రాష్ట్రాలతో కేంద్రం కీలక చర్చలు... 
 


దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకుని ముందుకు వెళ్తుంది. ఈ నేపధ్యంలో తాజాగా పలు రాష్టల ఆరోగ్య శాఖ అధికారులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సమావేశం నిర్వహిస్తున్నారు. 3 గంటలకు ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్,మధ్యప్రదేశ్, గుజరాత్, రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వీడియో సమావేశం నిర్వహిస్తారు.

రాష్టలలో కోవిడ్ పరిస్థితులు కరోనా కట్టడి అంశాలు, వాక్సినేషన్ ప్రక్రియ అంశాల పై చర్చ జరుపుతారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ కూడా నేడు హైలెవల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్ లో ఆయన వాక్సిన్ ప్రక్రియతో పాటుగా పలు కీలక అంశాలను చర్చించే అవకాశం ఉంది.

TSNews

May 15 2021, 15:12

బెంగాల్‌లో రెండు వారాలు లాక్‌డౌన్ 
 

 
 కోల్‌కతా 

  కరోనా కేసులు పెరుగుతుండటంతో పశ్చిమ బెంగాల్ లో రెండు వారాలు లాక్ డౌన్ విధించారు. ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఈ టైమ్ లో కేవలం ఎమర్జెన్సీ సేవలకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్లు బెంగాల్ ప్రభుత్వం తెలిపింది. హెల్త్ కేర్, ఫైర్ సర్వీసులు, కోర్టులను మినహాయించి మిగతా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు మూసేసి ఉంటాయని సర్కార్ స్పష్టం చేసింది. నిన్న ఒక్క రోజే బెంగాల్ లో 20 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదవ్వడం, వైరస్ బారిన పడి 136 మంది చనిపోవడంతో దీదీ సర్కార్ లాక్ డౌన్ పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది.