Andrapradesh

May 11 2021, 07:52

వ్యాక్సిన్ గురించి స్లిప్పులను అందిస్తున్న ఏపీ ప్రభుత్వం
 


ఏపీలో కేసులు పెరగడంతో కరోనా టీకా కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ప్రస్తుతం 45 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ, తోపులాట అధికంగా ఉండటంతో ఈరోజు రేపు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిలిపివేసింది ఏపీ ప్రభుత్వం. టీకా కేంద్రాల వద్ద రద్దీని తగ్గించేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. ఓటర్ స్లిప్పుల తరహాలో వ్యాక్సిన్ స్లిప్పులను ఓటర్లకు అందించేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం. ఎవరికి ఏ టైమ్ కి వ్యాక్సిన్ అందించాలి అనే సమాచారంతో కూడిన స్లిప్పులను ప్రజలకు అందించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. వ్యాక్సిన్ స్లిప్పులను ఏఎన్ఎం, ఆశావర్కర్ల ద్వారా స్లిప్పులను పంపిణీ చేస్తారు.
అదే విధంగా అర్బన్ ప్రాంతాల్లో ఎస్ఎంఎస్ ల ద్వారా వ్యాక్సిన్ కు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందించనున్నది ప్రభుత్వం. ఇక మొదటి డోసు వేయించుకున్న వేలాది మంది రెండో డోస్ కోసం ఎదురుచూస్తున్నారు. రెండో డోసు వ్యాక్సిన్ పూర్తయ్యాకే మొదటి డోస్ ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది.

Andrapradesh

May 10 2021, 18:36

హైదరాబాద్‌ వెళ్లేవారికి ఏపీ పోలీసుల సూచనలు
 


అమరావతి: వైద్య చికిత్సలకు హైదరాబాద్‌ వెళ్లే వారికి ఏపీ పోలీసులు పలు సూచనలు చేశారు. ప్రైవేట్‌ అంబులెన్స్‌లలో వచ్చేవారికి షరతులతో అనుమతులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అలా వీలు కానిపక్షంలో రోగికి చికిత్స చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని..  సదరు వ్యక్తికి తమ ఆస్పత్రిలో పడక సిద్ధంగా ఉన్నట్లు హైదరాబాద్‌కు చెందిన ఆస్పత్రి యాజమాన్యం నుంచి ముందస్తు అంగీకార పత్రాన్ని తీసుకోవాలని సూచించారు. అలాంటి వారికి తెలంగాణలోకి అనుమతి ఉంటుందన్నారు.

ఏపీ నుంచి హైదరాబాద్‌ వైపు వస్తున్న కొవిడ్‌ అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు ఈ ఉదయం నుంచి అడ్డుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు, కర్నూలు జిల్లా పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద ఆ రాష్ట్ర పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. కొవిడ్‌ రోగులతో వెళ్తున్న అంబులెన్స్‌లను వెనక్కి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు తాజాగా ఈ సూచనలు చేశారు..

Andrapradesh

May 10 2021, 15:38

త్వ‌ర‌లోనే ఏపీలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌... వేరే మార్గం లేదంటా..!
 


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయే త‌ప్పితే అదుపులోకి రావ‌డం లేద‌న్న అభిప్రాయం వైద్య వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. అనేక ప్రాంతాల్లో నిత్యం వంద‌లాది కేసులు న‌మోదవుతున్నాయి. అలాగే మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతున్నాయి. క‌రోనా క‌ట్ట‌డికి ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ర్ఫ్యూను అమ‌ల్లోకి తెచ్చిన విష‌యం తెలిసిందే.కిరాణా షాపులకు, ప్రజల నిత్య అవసరాల కోసం, ప్రజల రోజువారీ కార్యక్రమాల నిమిత్తం మధ్యాహ్నం 12 వరకు అనుమతిని ఇచ్చింది. అనంతరం 12 తర్వాత కర్ఫ్యూ కొనసాగుతుందని ఆదేశాలు జారీచేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ప్రజలు 12 తర్వాత రోడ్లపైకి రాకూడదని నిబంధనలు విధించారు. మరో వైపు పోలీసు అధికారులు సైతం ప్రజా రక్షణ కొరకు 12 తర్వాత కర్ఫ్యూ సక్రమంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.

అయితే నరసరావుపేట ,రొంపిచర్ల మండలాలలో మాత్రం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకే ప్రజల నిత్య అవసరాల కోసం, వ్యాపారాలు, ఇతర పనులకు అనుమతిస్తున్నారు. అనంతరం ఉదయం 8 నుండి రోజంతా పూర్తిగా కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. రొంపిచర్ల, నరసరావుపేట మండలాలలోని పలు గ్రామాల్లో కరోనా కేసులు విపరీతంగా నమోదువుతుండడం, కరోనా మరణాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి అధికారులు ఇలా కర్ఫ్యూ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎస్‌ఐ పి.హజరత్తయ్య ఆధ్వర్యంలో ఈ కర్ఫ్యూ సరిగ్గా జరిగేలా 8 తర్వాత ఎవరూ రోడ్లపై కనపడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

కేసులు పెరుగుతున్న రీత్యం రానున్న రోజుల్లో రాష్ట్రమంతా పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం అధికార వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. పెరుగుతున్న కరోనా విజృంభణకు కళ్లెం వేసే దిశలో ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా లాక్ డౌన్ అంటే ప్రజలు ఇబ్బంది, కంగారు పడతారని కొద్ది రోజులు కర్ఫ్యూ విధించి ఆ తర్వాత పూర్తి స్థాయి లాక్ డౌన్ ను అమలులోకి తీసుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా తీవ్రత తగ్గించి ప్రజల్ని కాపాడాలంటే లాక్ డౌన్ తప్పనిసరి అని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం ప్రభుత్వం త్వరలో తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

Andrapradesh

May 10 2021, 15:37

ఏయ్ సజ్జలా.. ఎవడ్రా నువ్వు.. నిప్పులు చెరిగిన రఘురామ
 


: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిపై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు నిప్పులు చెరిగారు. ఏయ్ సజ్జలా ఎవడ్రా నువ్వు అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తనను టార్గెట్ చేస్తూ ప్రత్యేకంగా మనుషులను నియమించారని.. సోషల్ మీడియాలో ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. సోమవారం నాటి రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. సజ్జల సూచన మేరకు తనకు సుమారు ఒక వంద ఫోన్ కాల్స్ వచ్చాయి జగన్ రెడ్డి అని సీఎం జగన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘నేను ఖాళీగా ఉంటానా రెడ్డీ. నీ దగ్గర నా మనుషులు కూడా ఉన్నార్రా. సజ్జల... సారీ బిజ్జల దిశానిర్దేశంతో.. నన్ను అసహనానికి గురి చేసి కేసులు వేద్దామని ప్లాన్ చేసినట్టు వాళ్లు చెప్పారు’’ అని ఆయన అన్నారు. ‘‘నీ ప్రభుత్వం పతనావస్థలో ఉంది. మీ కుట్రలను త్వరలోనే బయటపెడతాను. సైబర్ క్రైమ్ పోలీసులకు ఇవాళ నా వ్యక్తిగత కార్యదర్శి వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఏపీ ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందని లేఖలో తెలిపాను. వైసీపీ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాను. నన్ను ట్రాప్ చేయడానికి ఓ మహిళ ద్వారా మెసేజులు పంపుతున్నారని చెప్పాను. ఏయ్ సజ్జల ఎవడ్రా నువ్వు.. ఆఫ్ట్రాల్ నువ్వో జర్నలిస్ట్.. అనధికార హోంమంత్రిలా వ్యవహరిస్తున్నావు. మహిళా హోంమంత్రికి ఎలాంటి అధికారాలు ఇవ్వకుండా అన్నీ వ్యవహారాలు చేస్తున్నావు. బహిరంగ చర్చకు సిద్ధమా... నువ్వు చెప్పేది నువ్వు చెప్పు.. నేను చెప్పేది నేను చెబుతా’’ అని సవాల్ విసిరారు.‘‘బుద్ధి తెచ్చుకో.. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. కోర్టులు ఉన్నాయి. మీ వెదవ వేషాలు కనిపెట్టడానికి కోర్టులు ఉన్నాయి. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న అహంకారం వద్దు. సజ్జల, వైఎస్ జగన్ మీ పరిధిల్లో ఉండండి. మీ చేతుల్లో పోలీసులు ఉన్నారని రెచ్చిపోకండి’’ అని రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు

Andrapradesh

May 10 2021, 13:53

టీఎస్ బోర్డర్ వద్ద తెలంగాణ పోలీసుల కొత్త ఆంక్షలు
 


తెలంగాణ లోకి వెళ్తున్న కోవిడ్ పేషేంట్స్ అనుమతిపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్న టీఎస్ పోలీసులు.

తెలంగాణలో ఆసుపత్రిలో బెడ్ కన్ఫర్మేషన్, ఆసుపత్రి నుంచి అనుమతి ఉంటేనే అంబులెన్సులకు అనుమతి.

ఆసుపత్రులకు అనుమతి లేకుండా కరోనా పేషేంట్ ను ఆసుపత్రిలో చేర్చడానికి వెళ్తున్న అంబులెన్స్ లు నిలిపివేత.

ఆంధ్ర బోర్డర్ దగ్గర వెనక్కి తిప్పి పంపుతున్న తెలంగాణ పోలీసులు.

సాధారణ వాహన ప్రయాణికులను మాత్రం అనుమతిస్తున్న తెలంగాణ పోలీసులు..

Andrapradesh

May 10 2021, 13:51

విజయవాడ
 


విజయవాడ
 
 ఎంజీ రోడ్డులో యువకుడి వీరంగం

రాఘవయ్య పార్క్ దగ్గర ఆటో డ్రైవర్ తో వాగ్వాదం

యూ టర్న్ విషయంలో గొడవ., ఆటో డ్రైవర్ పై యువకుడి విచక్షణారహితంగా దాడి

అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై చిందులు

ట్రాఫిక్ పోలీసులపైన, పాదచారులు పైన దురుసుగా వ్యవహరించిన కారులోని యువకుడు

నంబర్ ప్లేట్ లేని వాహనంలో బందరు రోడ్డులో స్పీడ్ డ్రైవింగ్

తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పట్టుకున్న బ్లూ కోల్ట్స్ సిబ్బంది

ఆటో డ్రైవర్ కి తీవ్ర గాయాలు

యువకుడు మద్యం మత్తులో ఉన్నాడని చెబుతున్న పాదచారులు, వాహన చోదకులు 

Andrapradesh

May 10 2021, 08:56

తూర్పుగోదావరి
 


పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నిర్వాకంతో సస్పెన్షన్ కు గురైన ఎంపీడీఓ వెంకటేశ్వరరావు.

నిన్న కొవేగ్జిన్ వ్యాక్సిన్ రెండవ డోస్ మాత్రమే వేయాల్సి ఉండగా 11 మందికి మొదటి డోస్ వేయించిన ఎమ్మెల్యే.

ఎంపీడీఓపై ఒత్తిడి తెచ్చి భార్య, కుమారుడు సహా 11 మంది బంధువులకు మొదటి డోస్ వేయించిన ఎమ్మెల్యే చిట్టిబాబు.

ఈ వ్యవహారంపై అమలాపురం సబ్ కలెక్టర్ విచారణ అనంతరం ఎంపీడీఓ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు.

Andrapradesh

May 10 2021, 08:55

విశాఖలో నిశ్శబ్దంగా ఆర్ ఎస్ ఎస్ నడుపుతున్న ఉచిత కోవిడ్ కేర్ సెంటర్!
 


విశాఖపట్నం నగర శివార్లలోని గుడిలోవలో నిన్నమొన్నటిదాకా కొన్నివేల మంది విధ్యార్ధులకు సంస్కారంతోకూడిన విద్యను అందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కి చెందిన విజ్ఞాన్ విహార్ స్కూలు, ప్రస్తుతం కోవిడ్ కేర్ సెంటర్ గా మారిపోయింది.

అంతేనా, ఈ 100 పడకల కోవిడ్ సెంటర్లో పూర్తి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మే ఆర్ ఎస్ ఎస్ సేవకులు ఇక్కడి కోవిడ్ పేషెంట్లకు వివిధరకాలుగా సేవలందిస్తున్నారు.

ఉచిత వైద్యం, పూర్తి ఉచితంగానే బెడ్, మందులూ, ఆరోగ్యకరమైన మరియూ బలవర్ధకమైన ఆహారంతో పాటు, మామూలుగా కార్పొరేట్ ఆసుపత్రులలో కూడా దొరకని ఇతర సేవలు కూడా ఇక్కడ లభ్యం అవుతున్నాయి. ప్రతిరోజూ పేషెంట్లతో యోగాసనాలు వేయించటం, ప్రాణాయామం చేయించటం మరియూ వైద్యులతో కౌన్సెలింగ్ ఇప్పించటం ఇక్కడి ప్రత్యేకతలు. ఇక్కడ స్త్రీ పురుషులను వేరు వేరు వార్డులలో ఉంచుతారు.

చుట్టూ కొండలతో, మామిడి వృక్షాల తోటలో అహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ కోవిడ్ కేర్ సెంటర్ విశాఖలో ఎంతోమంది కోవిడ్ పేషెంట్లకు ఆర్ ఎస్ ఎస్ ఇచ్చిన గొప్ప వరం.

అత్యవసర సేవల కోసం వీరికి ఇక్కడ రెండు అంబులెన్సులు కూడా ఉన్నాయి. ఐతే, ఈ సెంటర్లో ఆక్సిజన్ సర్వీసు అందుబాటులో లేకపోవటంతో, 50 సంవత్సరాల లోపు వయస్సున్న ఊపిరి సమస్యలు లేని కోవిడ్ పేషంట్లను మాత్రమే తీసుకుంటారు. కనుక, కోవిడ్ లక్షణాలు కనిపించి, ఇంకా పరిస్థితి సీరియస్ అవ్వని పేషెంట్లూ, కోవిడ్ పాజిటివ్ వచ్చిన తరువాత ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ కోవిడ్ నుంచి కోలుకోవాలనుకునే పేషెంట్లకూ ఆర్ ఎస్ ఎస్ చే నిర్వహించబడుతున్న ఈ కోవిడ్ కేర్ సెంటర్ గొప్ప అవకాశమనే చెప్పాలి.

ఈ ఉచిత కోవిడ్ కేర్ సెంటర్ ను ఎలాంటి గుర్తింపూ, పేరు ప్రతిష్టలూ ఆశించని కొంతమంది స్వయం సేవకులు చక్కగా నడుపుతున్నారు. వారికివే మా నమస్సుమాంజలులు!.

Andrapradesh

May 10 2021, 08:55

గుంటూరు జిల్లా
 


ఫిరంగిపురం మండలం వేములూరిపాడు వద్ద బైక్ ను ఢీ కొట్టిన కారు.

గత అర్ధరాత్రి చోటుచేసుకున్న ప్రమాదం.

బైక్ మీద ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి

మృతులు ఫిరంగిపురం మండలంలోని 113 తాళ్ళూరుకు చేందినవారిగా గుర్తించిన పోలీసులు.

మృతదేహాలు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు.

పరారీలో కారు డ్రైవర్.

కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన ఫిరంగిపురం పోలీసులు.

Andrapradesh

May 09 2021, 18:39

ఏపీలో 49 చోట్ల ఆక్సిజన్‌ ప్లాంట్లు
 


ఏర్పాటుకు రూ.310కోట్లు కేటాయించిన ప్రభుత్వం

అమరావతి: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్రంలో ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటు, సరఫరాకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రూ.310కోట్లు కేటాయిస్తూ వైద్యఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలోని 49 చోట్ల ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని.. 50 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్‌ వాహనాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 10వేల అదనపు ఆక్సిజన్‌ పైపులైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్లాంట్ల నిర్వహణకు ప్రతి జిల్లాలకు వచ్చే 6నెలలకు రూ. 60లక్షలు మంజూరు చేసింది..