మర్రిగూడ: మౌలిక సదుపాయాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా కేజీబీవీ అభివృద్ధికి రూ.1 కోటి 50 లక్షలు ఖర్చు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు నియోజకవర్గం, మర్రిగూడ: కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మర్రిగూడ మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో రూ.1 కోటి 50 లక్షల సొంత నిధులతో నిర్మించిన మెరుగైన మౌలిక సదుపాయాలను ( 9 నూతన తరగతి గదులు, 36 బాత్రూంలు, రెండు ఎకరాల ప్లే గ్రౌండ్ మొదలుగునవి ) కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఛైర్పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కస్తూరిబా గాంధీ పాఠశాల విద్యార్థినులు, సిబ్బంది తమ పాఠశాలను సొంత నిధులతో అత్యాధునిక హంగులతో నిర్మించిన భవనాలను ప్రారంభించడానికి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులకు కోలాటాల తో, నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజ్ గోపాల్ రెడ్డి దంపతులు విద్యార్థినులకు స్వయంగా భోజనం వడ్డించి వారితో పాటు కలిసి సహపంక్తి భోజనం చేశారు.

18 రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్న సమస్యలు కూడా పరిష్కరిస్తాం: కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి
కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ మునుగోడు ప్రజలందరిదీ, విద్య వైద్యం విషయంలోనే కాదు ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సిద్ధంగా ఉందన్నారు. మర్రిగూడ కస్తూరిబా పాఠశాల ఒక్కటే కాదు మనుగోడు నియోజకవర్గం లో ఉన్న 18 రెసిడెన్షియల్ పాఠశాలలలో ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు. ప్రతి ఒక విద్యార్థిని విద్యార్థులు బాగా కష్టపడి చదివి మీ తల్లిదండ్రులకు పేరు తెస్తూ ఈ ప్రాంతానికి కూడా పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులను ప్రోత్సహించడానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుందని ఆమె చెప్పారు. రాజగోపాల్ రెడ్డి గారు నియోజకవర్గంలో తండ్రులు కోల్పోయిన ఎంతో మంది పిల్లలకు పోస్ట్ ఆఫీస్ లో లక్ష రూపాయల డిపాజిట్ చేస్తూ సహాయం చేశారని తెలిపారు. కొందరు నన్ను ఎంపీగా పోటీ చేయమని అన్నారు. కానీ సేవ చేయాలంటే పదవులు అవసరం లేదు మంచి మనసుంటే చాలు అని ఆమె తెలిపారు.
14 మంది పాఠశాల సిబ్బందికి నెలకు రూ. 5 వేలు చొప్పున రూ.70 వేలు ఇస్తాం: రాజగోపాల్ రెడ్డి
కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మొత్తం 18 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి, ఈ పాఠశాల సందర్శనకు వచ్చినప్పుడు విద్యార్థులు వాళ్ళ బాధలు చెబితే నాకు భాధ వేసింది. ఆరోజే అనుకున్న ఏదో ఒక చోట ప్రారంభించాలని నిర్ణయం చేసుకొని, అన్ని సౌకర్యాలు ఉండేలా పాఠశాలను తీర్చిదిద్దామన్నారు. సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి పదివేల మందికి పరీక్షలు నిర్వహించి 1500 మందికి ఆపరేషన్లు చేయించాం, మునుగోడు ప్రజల తరఫున కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మికి ప్రత్యేక అభినందనలు అని తెలిపారు.

ఇప్పటి విద్యార్థులే రేపటి మన భవిష్యత్తు, వీరికి ఎంత చేసిన తక్కువే అన్నారు. చదువు విషయంలో పిల్లలపై ఎక్కువగా ఒత్తిడి తీసుకురాకూడదు, చదువుతోపాటు మానసిక దృఢత్వం, శారీరక వ్యాయామం చాలా ముఖ్యం అని చెప్పారు. చదువుతోపాటు క్రమశిక్షణ, సమాజం పట్ల అవగాహన ను పెంపొందించాల్సిన బాధ్యత టీచర్ల తో పాటు పాటు తల్లిదండ్రులకు కూడా ఉంటుందని అన్నారు. మద్యం, డ్రగ్స్ తో యూత్ పెడదోవ పడుతున్నారు, అందుకే ఒకవైపు టీచర్లు మరోవైపు పేరెంట్స్ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పిల్లల్ని తల్లిదండ్రులు అనుక్షణం పరిశీలిస్తూ ఉండాలి, ప్రతి విద్యార్థి పై టీచర్లకు సునిశిత పరిశీలన ఉండాలన్నారు.
విద్యార్థులందరూ క్రమశిక్షణతో చదువుకొని తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిగతా పాఠశాలలో కూడా మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.
కస్తూరిబా బాలిక పాఠశాలలో పనిచేస్తున్న 14 మంది సిబ్బందికి చాలా తక్కువ వేతనాలు వస్తున్నాయని తన దృష్టికి వచ్చిందని, వారు. సమస్యలను ప్రభుత్వంతో మాట్లాడి, వాళ్ళ వేతనాల పెంపు కోసం కృషి చేస్తానని తెలిపారు.

ప్రభుత్వం వాళ్ల వేతనాలు పెంచే వరకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ప్రతినెల వాళ్ళ అకౌంట్లోకి 5000 రూపాయల చొప్పున 14 మందికి 70 వేల రూపాయలు ఇస్తామని సిబ్బందికి ఆయన భరోసా ఇచ్చారు. అన్ని రంగాలలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరం కష్టపడదామని అన్నారు. విద్యార్థులను ఉద్దేశిస్తూ ఇక్కడున్న మహాలక్ష్మి లందరికీ ముందస్తు దీపావళి శుభాకాంక్షలు అని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Oct 20 2025, 00:04
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
12- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.3k