కార్తీకమాసంలో ఉసిరికాయకు పెరిగిన డిమాండ్

కార్తీక మాసంలో ఉసిరికాయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది శివుని రూపంగా మరియు లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతుంది. ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజించడం, ఉసిరి దీపం వెలిగించడం, వనభోజనం చేయడం వంటి ఆచారాలు శివకేశవుల అనుగ్రహాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, సుఖశాంతులను అందిస్తాయని నమ్మకం. పాలకొల్లులో వ్యాపారాలు ఉసిరికాయలను కిలో రూ.200, విడిగా ఒక్కోటి రూ.10కు విక్రయిస్తున్నారు.
నేడు కార్తిక పౌర్ణమి..! భక్తులతో కిటకిటలాడునున్న శివాలయాలు.

తెలంగాణ/ఆంధ్రప్రదేశ్: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కార్తీక మాసం కొనసాగుతుంది. దీంతో ఈ మాసంలో ప్రతి రోజు అధిక సంఖ్యలో భక్తులు వేముల వాడ, కాలేశ్వరం, ధర్మపురి, వంటి దేవాలయాలకు భక్తులు తరలివెళ్తున్నారు. ఇక, శివాలయాల్లో అయితే దీపాల కాంతులతో, శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తున్నారు. సహజంగా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని అర్చిస్తారు. కానీ.. కార్తీక మాసంలో ప్రతి రోజు లక్ష్మీదేవిని ఆరాధి స్తుంటారు. ఈ తరుణంలో మహిళలందరూ ఎదురు చూస్తున్న కార్తీక పౌర్ణమి ఈ ఏడాది నవంబర్ 05వ తేదీన వచ్చింది. అంటే.. కార్తీక పౌర్ణమి.ఈ రోజు చాలా విశిష్టమైన రోజు కాబట్టి కొన్ని ఆచారాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఈ తరుణంలో దేవాలయంలో కానీ, రావి లేదా తులసి చెట్టు వద్ద గానీ, నదీతీరంలో 365 వత్తులతో దీపారాధన చేస్తే మంచిదని పురణాలు చెబుతున్నాయి. అంతేకాదు.. పగలంతా ఉపవాసం ఉండి.. సూర్యా స్తమయంలో దీపారాధన చేసి.. పరమేశ్వరుడిని.. విష్ణుమూర్తిని పూజించాలి. ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు. ఈ రోజున చేసే పూజలు, దీపారాధన గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. కార్తీక పౌర్ణమి తో పాటు గురు నానక్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది.

ఉచిత కంటి శిబిరానికి విశేష స్పందన.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ని కిమ్స్ మల్టిస్పెషలిటీ ఆసుపత్రిలో శ్రీ కొత్తపల్లి వెంకట లక్ష్మీ - చంద్రయ్య మెమోరియల్ సర్విస్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ డాక్టర్ కొత్తపల్లి అనిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి పరీక్షలకు 26 మంది హాజరు కాగా వారిలో 9 మందికి శస్త్రచికిత్స అవసరమని ఈ సందర్భంగా డా. కొత్తపల్లి శ్రీనివాస్  మాట్లాడుతూ కంటి పరీక్షలకు వచ్చిన వృద్దులను అధైర్య పడవద్దని లయన్స్ క్లబ్ ఆఫ్ బెల్లంపల్లి వారి సహకారంతో ఉచితంగా ఆపరేషన్ లు చేపిస్తామని ఈ ఉచిత కంటి శిబిరం ప్రతి మంగళవారం నిర్వహిస్తామని ఈ అవకాశాన్ని ప్రజాలందురు సద్వినియోగ పర్చుకోగలరని అన్నారు ఈ కార్యక్రమంలో ఆప్తమలజిస్ట్ శ్రీనాథ్, ఐ క్యాంప్ ఇన్చార్జి గోపి పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన నిత్య అన్నదాన కార్యక్రమం.

పాల్వంచ అయ్యప్ప స్వామి దేవస్థానం లో దీక్ష తీసుకున్న అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు మాధవన్ నంభూతిరి ఈ రోజు ఘనంగా పూజలు చేసి ప్రారంభించినారు. ఈ సందర్బంగా దేవస్థాన ట్రస్ట్ సభ్యులు మరియు కమిటీ సభ్యులు మాట్లాడుతూ పవిత్ర మాసమైన కార్తీకమాసంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దాతల సహకారంతో ప్రతి రోజు దాదాపు 400 ల నుండి 600 వందల మందికి పైగా అన్నదాన వితరణ చేస్తున్నా మని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మరియు కమిటీ సభ్యులు కోత్వాల శ్రీనివాసరావు, మిడిద సంతోష్ గౌడ్, మిరియాల కమలాకర్, కనగాల రాంబాబు, బేతంశెట్టి వెంకట్, బోగిని శ్రీను, గుండు రాజు, చారి, నాగేందర్,విజయ్, రాము, భూషణం, రమేష్, నరేష్ గౌడ్, ప్రసాద్ మరియు అన్నదాన నిర్వాహకులు బి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మర్రిగూడ: మౌలిక సదుపాయాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా కేజీబీవీ అభివృద్ధికి రూ.1 కోటి 50 లక్షలు ఖర్చు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు నియోజకవర్గం, మర్రిగూడ: కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మర్రిగూడ మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో రూ.1 కోటి 50 లక్షల సొంత నిధులతో నిర్మించిన మెరుగైన మౌలిక సదుపాయాలను ( 9 నూతన తరగతి గదులు, 36 బాత్రూంలు, రెండు ఎకరాల ప్లే గ్రౌండ్ మొదలుగునవి ) కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఛైర్పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కస్తూరిబా గాంధీ పాఠశాల విద్యార్థినులు, సిబ్బంది తమ పాఠశాలను సొంత నిధులతో అత్యాధునిక హంగులతో నిర్మించిన భవనాలను ప్రారంభించడానికి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులకు కోలాటాల తో, నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజ్ గోపాల్ రెడ్డి దంపతులు విద్యార్థినులకు స్వయంగా భోజనం వడ్డించి వారితో పాటు కలిసి సహపంక్తి భోజనం చేశారు. 

18 రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్న సమస్యలు కూడా పరిష్కరిస్తాం: కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి

కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ మునుగోడు ప్రజలందరిదీ, విద్య వైద్యం విషయంలోనే కాదు ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సిద్ధంగా ఉందన్నారు. మర్రిగూడ కస్తూరిబా పాఠశాల ఒక్కటే కాదు మనుగోడు నియోజకవర్గం లో ఉన్న 18 రెసిడెన్షియల్ పాఠశాలలలో ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు. ప్రతి ఒక విద్యార్థిని విద్యార్థులు బాగా కష్టపడి చదివి మీ తల్లిదండ్రులకు పేరు తెస్తూ ఈ ప్రాంతానికి కూడా పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులను ప్రోత్సహించడానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుందని ఆమె చెప్పారు. రాజగోపాల్ రెడ్డి గారు నియోజకవర్గంలో తండ్రులు కోల్పోయిన ఎంతో మంది పిల్లలకు పోస్ట్ ఆఫీస్ లో లక్ష రూపాయల డిపాజిట్ చేస్తూ సహాయం చేశారని తెలిపారు. కొందరు నన్ను ఎంపీగా పోటీ చేయమని అన్నారు. కానీ సేవ చేయాలంటే పదవులు అవసరం లేదు మంచి మనసుంటే చాలు అని ఆమె తెలిపారు. 

14 మంది పాఠశాల సిబ్బందికి నెలకు రూ. 5 వేలు చొప్పున రూ.70 వేలు ఇస్తాం: రాజగోపాల్ రెడ్డి

కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మొత్తం 18 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి, ఈ పాఠశాల సందర్శనకు వచ్చినప్పుడు విద్యార్థులు వాళ్ళ బాధలు చెబితే నాకు భాధ వేసింది. ఆరోజే అనుకున్న ఏదో ఒక చోట ప్రారంభించాలని నిర్ణయం చేసుకొని, అన్ని సౌకర్యాలు ఉండేలా పాఠశాలను తీర్చిదిద్దామన్నారు. సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి పదివేల మందికి పరీక్షలు నిర్వహించి 1500 మందికి ఆపరేషన్లు చేయించాం, మునుగోడు ప్రజల తరఫున కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మికి ప్రత్యేక అభినందనలు అని తెలిపారు.

ఇప్పటి విద్యార్థులే రేపటి మన భవిష్యత్తు, వీరికి ఎంత చేసిన తక్కువే అన్నారు. చదువు విషయంలో పిల్లలపై ఎక్కువగా ఒత్తిడి తీసుకురాకూడదు, చదువుతోపాటు మానసిక దృఢత్వం, శారీరక వ్యాయామం చాలా ముఖ్యం అని చెప్పారు. చదువుతోపాటు క్రమశిక్షణ, సమాజం పట్ల అవగాహన ను పెంపొందించాల్సిన బాధ్యత టీచర్ల తో పాటు పాటు తల్లిదండ్రులకు కూడా ఉంటుందని అన్నారు. మద్యం, డ్రగ్స్ తో యూత్ పెడదోవ పడుతున్నారు, అందుకే ఒకవైపు టీచర్లు మరోవైపు పేరెంట్స్ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పిల్లల్ని తల్లిదండ్రులు అనుక్షణం పరిశీలిస్తూ ఉండాలి, ప్రతి విద్యార్థి పై టీచర్లకు సునిశిత పరిశీలన ఉండాలన్నారు.

విద్యార్థులందరూ క్రమశిక్షణతో చదువుకొని తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిగతా పాఠశాలలో కూడా మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. 

కస్తూరిబా బాలిక పాఠశాలలో పనిచేస్తున్న 14 మంది సిబ్బందికి చాలా తక్కువ వేతనాలు వస్తున్నాయని తన దృష్టికి వచ్చిందని, వారు. సమస్యలను ప్రభుత్వంతో మాట్లాడి, వాళ్ళ వేతనాల పెంపు కోసం కృషి చేస్తానని తెలిపారు.

ప్రభుత్వం వాళ్ల వేతనాలు పెంచే వరకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ప్రతినెల వాళ్ళ అకౌంట్లోకి 5000 రూపాయల చొప్పున 14 మందికి 70 వేల రూపాయలు ఇస్తామని సిబ్బందికి ఆయన భరోసా ఇచ్చారు. అన్ని రంగాలలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరం కష్టపడదామని అన్నారు. విద్యార్థులను ఉద్దేశిస్తూ ఇక్కడున్న మహాలక్ష్మి లందరికీ ముందస్తు దీపావళి శుభాకాంక్షలు అని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

ఉచిత చేపపిల్లల పంపిణి పైన చితచ్చుద్ది ఉందా రేవంత్ రెడ్డి? జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

- చేపల టెండర్లలో అధికారులు, హస్తం నాయకుల హస్తం.. 

- హస్తం నాయకుల హస్తం తోనే టెండర్లు కాలయాపన...

ఉచిత చేప పిల్లల పైన చిత్తశుద్ధి ఉందా రేవంత్ రెడ్డి?

గత సంవత్సరము ఇచ్చిందేమీ లేదు ఈ సంవత్సరము కూడా ఏగ వేతేనా రేవంత్ రెడ్డి?

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు

ముదిరాజుల పైన మత్స్యకారుల పైన దూతరాష్ట్ర ప్రేమను వలకబోసిన రేవంత్ రెడ్డి నిండా ముంచి రాజ్యమేలడం మీకు న్యాయమా అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

మంగళవారం రోజు మాజీ మంత్రి హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు మేడికాయల వెంకటేశం, జిల్లా నాయకులు రెడ్డి యాదగిరి ముదిరాజులతో కలిసి జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కేసీఆర్ గారి ప్రభుత్వం మీద నిందలు మోపిన రేవంత్ రెడ్డి ఈనాడు ముదిరాజ్ మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలు ఇవ్వకుండా ఎగ నామం పెడుతున్నాడని గత సంవత్సరంలో చేప పిల్లలకు ఎగనామం పెట్టి ఈ సంవత్సరం టెండర్ల పేరుతో కాలయాపన చేస్తున్నాడని చేప పిల్లలు వదిలే సీజన్ అయిపోయి నెల గడుస్తుంది అని జూన్ జూలైలో ఇవ్వాల్సినటువంటి చేప పిల్లలు ఇప్పటివరకు కూడా టెండర్లు పూర్తి చేయకపోవడం చూస్తా ఉంటే ముదిరాజ్ మత్స్యకారుల పైన రేవంత్ రెడ్డికి ఏ పాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చేపలు పిల్లలు చేయడంతోనే రాష్ట్రంలోని అన్ని చెరువు కుంటలు డ్యాములలో చేప పిల్లల్ని 100% వదిలిపెట్టేదని ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ముదిరాజ్ మత్స్యకారుల పరిస్థితి ఆగమ్య గోచారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఐనాక రేవంత్ రెడ్డి చేప పిల్లలు ఎగనామం సబ్సిడీ వాహనాలు ఎగనామం సబ్సిడీ పరికరాలు ఎగనామం ఇవన్ని లేకుండా చేస్తే ముదిరాజు మత్స్యకారులు ఎలా బతుకుతారని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అప్పులోళ్లు ఇండ్ల ముందు కూర్చొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇలా జరగడానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు గత సంవత్సరం నుండి చేప పిల్లలు ఇచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని వారు అన్నారు తక్షణమే పూర్తిస్థాయిలో చేపపిలల్ల పంపిణి చేయాలనీ లేదా మత్య్ససోషైటి లకు నగదు బదిలీ చేయాలనీ అన్నారు.

ఇట్టి కార్యక్రమంలో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, మేడికాయల వెంకటేశం, కోనయ్యగారి ఎల్లం, ఇట్టమేన శ్రీనివాస్, అప్పలయచేరువు మాజీ సర్పంచ్ శ్రీనివాస్, రెడ్డి యాదగిరి ముదిరాజ్, గాడిచర్ల నాగరాజు, కొత్త శంకర్, యాట రాజేష్, శిలాపూర్ రాజు, మైలారం వంశీ తదితరులు ఉన్నారు.

ముదిరాజుల పట్ల పాలకుల నిర్లక్ష్యం జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు

ముదిరాజుల పట్ల పాలకుల చిన్నచూపు!

న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే తప్ప ముదిరాజులకు పాలకులు న్యాయం జరగడం లేదు!

ఖాజీపూర్ మత్స్య శాఖ సొసైటీ తెలంగాణ ముదిరాజులకు దిక్సూచిగా నిలుస్తుంది!

తేది: 03-08-2025 బుధవారం

చిన్నకోడూర్ న్యూస్

పాలకుల నిర్లక్ష్యం వల్ల ముదిరాజులు నలిగిపోతున్నారని చట్టపరంగా న్యాయంగా ప్రభుత్వ జి.ఓ ల ప్రకారం అందాల్సిన ఫలాలు ముదిరాజులకు అందకుండా పాలకులు అడ్డుపడుతున్నారని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

ఖాజీపూర్ ముదిరాజులకు చేపల సొసైటీ ఏర్పడిన సందర్భంగా ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ రాష్ట్ర యువత అధ్యక్షులు అడిగే ప్రశాంత్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడికాయల వెంకటేశం మీడియా జిల్లా కన్వీనర్ పుప్పాల బాలేష్ లను కాజీపూర్ ముదిరాజులు చిన్నకోడూరులో కలిసి శాలువాతో వారిని సన్మానించారు ఈ సందర్భంగా జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ తరాలు మారిన పాలకుల తత్వం మారడం లేదని ఏ పాలకుడైన ముదిరాజ్ లకు చేసింది ఏమీ లేదని కాజీపూర్ సొసైటీ ఏర్పాటు కోసం ఎన్నో అవంతరాలను దాటాల్సి వచ్చిందని చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే తప్ప న్యాయం జరగలేదని పాలకులు న్యాయస్థానాలు ఉన్నాయన్నా విషయాన్ని మరిచిపోయి ముదిరాజులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొన్ని గ్రామాలలో ముదిరాజులు పాలకుల కుట్రలలో నలిగి పోవాల్సి వస్తుందని వారు అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులను బిసి డి నుండి బిసి ఏలోకి మారుస్తానన్న రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టినాక ముదిరాజ్ జాతిని విస్మరించాడని కనీస న్యాయం కూడా చేయడం లేదని గతంలో తెలంగాణ ఏర్పడ్డాక మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలు సబ్సిడీ కింద వాహనాలు ఇచ్చారని ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం చేప పిల్లలను కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు ఖాజిపూర్ సొసైటీ ఏర్పటుకు న్యాయంగ సహకరించిన గౌరవ తెలంగాణ ఉన్న న్యాయస్థానం మరియు అడ్వాకేట్ డిల్ పాండు ముదిరాజ్, సిద్ధిపేట జిల్లా కలెక్టర్ మరియు వారి కార్యాలయ అధికారులు, జిల్లా పోలీస్ కమిషనర్ మరియు సిద్ధిపేట ఏసీపీ వారి సిఐ బృందానికి ముదిరాజ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పోల్కం లక్ష్మి నారాయణ గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నామన్నారు.

 ఇట్టి కార్యక్రమంలో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, మేడికాయల వెంకటేశం, పడిగే ప్రశాంత్, పుప్పాల బాలేష్, రమేష్, బాల నర్సు, రమేష్, గణేష్, సత్యనారాయణ, బైరయ్య తిరుపతి తదితరులు ఉన్నారు.

కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ ఆలోచనవిధానాలకు అనుగుణంగా ముదిరాజులకు వాట కల్పించాలి! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ముదిరాజ్ హక్కుల సాధనసమితి అధ్యక్షులు

కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ ఆలోచన విధానాలకు అనుగుణంగా ముదిరాజులకు రాజకీయలలో వాట కల్పించాలి!

కృష్ణస్వామి ముదిరాజ్ జయాంతి సందర్భంగా నివాళులు అర్పించిన ముదిరాజులు!

ముదిరాజులను తక్షణమే బి.సి "ఏ" చేర్చకుంటే ప్రభుత్వనికి గుణపాఠం తప్పదు!

హైదరాబాదు నగర రూపకల్పన వెనుక కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారి శ్రమ ఎంతో ఉందని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు అన్నారు.

కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారి జయంతిని పురస్కరించుకొని శనివారం నాడు చిన్నకోడూరు మండల కేంద్రంలోని ముదిరాజ్ పెద్దమ్మ ఫంక్షన్ హాల్ లో ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు మెడికల్ వెంకటేశం ముదిరాజ్, మాజీ వైస్ ఎంపీపీ కీసరి పాపయ్య, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షులు ఇట్టబోయిన శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకు పెద్దలు, చికెన్ సత్తి ముదిరాజ్ గార్లతో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు కలిసి కృష్ణ స్వామి ముదిరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడుతూ 1933 నుండి హైదరాబాద్ నగర కార్పొరేటర్ గా కార్పొరేషన్ చైర్మన్ గా పాత్రికేయునిగా కవిగా కార్టునిస్టుగ ముదిరాజ్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షునిగా అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమై హైదరాబాద్ నగర దశ దిశలను అభివృద్ధి పరచడానికి అనేక ఆలోచనలతో నగరాన్ని రూపకల్పన చేసి ఈనాడు అభివృద్ధిలో పరుగులు తీయడమే కాకుండా ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా గుర్తింపు రావడానికి కొరివి కృష్ణస్వామి గారి రూపకల్పనేని ఆయన అన్నారు తెలంగాణ ప్రభుత్వం ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చినప్పటికీ కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ గారి జయంతి వర్ధంతులను అధికారికంగా జరుపకపోవడం బాధాకరమని ప్రభుత్వం ఆయనను గుర్తించి ఆయన జయంతి వర్ధంతులను అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తూ ముదిరాజు జాతిని బీసీఏలో చేర్చాలని కృష్ణ స్వామి పోరాటం చేశారని ఆయన ఆలోచనకు అనుగుణంగా ముదిరాజులను బిసి ఏలో చేరుస్తూ రాజకీయంలో వాటా కల్పించాలని జంగిటి డిమాండ్ చేశారు ఇట్టి కార్యక్రమంలో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, మేడికాయల వెంకటేశం, కీసరి పాపయ్య, ఇట్టబోయిన శ్రీనివాస్, చెరుకు పెద్దలు, చికెన్ సత్తి ముదిరాజ్, కొత్త శంకర్, కోరబోయిన పెద్ద శ్రీనివాస్, తుమ్మల తిరుపతి, అంబటి కనకయ్య, దాసరి రాజశేఖర్, కోరబోయిన రవి, గుడిపల్లి వికాస్, కోరబోయిన యాదగిరి, శరత్ బాబు, చెరుకు సతయ్య, ఉప్పరబోయిన సంతు తదితరులు పాల్గొన్నారు,

కనగల్ మండలం తుర్కపల్లి శక్తి కేంద్రంలో గడప గడపకి మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమం

భారతీయ జనతా పార్టీ మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు,జిల్లా పార్టీ మరియు కనగల్ మండల అధ్యక్షులు పర్సనబోయిన బిక్షం గారి పిలుపుమేరకు గురువారం తుర్కపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని

 తుర్కపల్లి, హైదలపురం, గౌరారం,అమ్మగూడెం లచ్చగూడెం,బొమ్మ పల్లి  బూతులలో మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించి, హైదలపురం, తుర్కపల్లి లోని గడపగడపకు వెళ్లి గ్రామ ప్రజలకు, కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం ప్రవేశ పెట్టిన, వివిధ రకాల సంక్షేమ పథకాలను వివరించి భారతీయ జనతా పార్టీ మద్దతు కొరకై 9240015366 

టోల్ ఫ్రీ నెంబర్ కి మిస్ కాల్ ఇప్పించి, రాబోయే స్థానిక ఎన్నికల్లో BJP పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది..

ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మరియు తుర్కపల్లి ఎలక్షన్ ప్రబారి దాసరి వెంకన్న, తుర్కపల్లి శక్తి కేంద్ర ఇన్చార్జ్ అదిమల్ల దేవేందర్, బూత్ అధ్యక్షులు చింతల శంకర్, అదిమల్ల రాఖీష్, అదిమళ్ళ వెంకన్న, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

అఖిల భారత 10వ జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలి.

బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో మేమెంతో మాకాంతా వాటా దక్కాలని, దేశవ్యాప్తంగా తక్షణమే బిసి కులగణన నిర్వహించి జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో బీసీల రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆగస్టు 7వ తేదీన గోవా రాష్టంలోని శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన అఖిల భారత 10వ జాతీయ ఓబిసి మహాసభను విజయవంతం చేయాలని బిసి యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు దీనికి సంబంధించిన కరపత్రాలు, గోడపత్రికలను శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో బీసీ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలువురు బీసీ యువజన సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి పిలుపు మేరకు నేడు నల్గొండ జిల్లా కేంద్రంలో జాతీయ ఓబీసీ 10వ మహాసభ గోడపత్రికలను, కరపత్రాలను ఆవిష్కరించడం జరిగిందన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ గారికి పంపించిన ఆర్డినెన్స్ ను గవర్నర్ బీసీలపై సానుకూల దృక్పథం తో నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా కేంద్రప్రభుత్వం బీసీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం పొందిన తక్షణమే పార్లమెంట్లో ప్రవేశపెట్టి 9 వ షెడ్యుల్ లో చేర్చాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా దేశ జనాభాలో 60 శాతంకు పైగా ఉన్న బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు లేకపోవడంతో విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో ప్రాతినిధ్యం దక్కక శాసించే స్థాయిలో ఉన్న బీసీలు యాచించే స్థాయికి దిగజారారన్నారు. తక్షణమే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించి బీసీల జనాభా దామాషా ప్రకారం విద్యా ఉద్యోగ ఆర్ధిక రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు విశ్వనాధుల శివకుమార్, బీసీ యువజన సంఘం నాయకులు జిల్లేపల్లి సాయి, చింతకాయల మురళి, వినయ్, చైతన్య, బి.రాజు, అనిల్ కుమార్, కె. సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.