NLG: శివన్నగూడెంకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాదే: సీఎం కేసీఆర్
నల్లగొండ జిల్లా:
మునుగోడు: మండలకేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు బిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆగం కావొద్దు ఆలోచించి ఓట్లు వేయాలని సూచించారు.
దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పాలించినప్పటికీ ఇక్కడ ఫ్లోరోసిస్ సమస్య తీర్చలేదని, వాజ్ పేయి ప్రభుత్వంలో కూడా సమస్యలు తీర్చలేదని, కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్లోరోసిస్ సమస్య తీర్చామని తెలిపారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తున్నది. కర్ణాటకలో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ ఐదు గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదని రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛన్లు మరింత పెంచుతాం, రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు ఆరోగ్య భీమా ఇస్తాం, రేషన్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇస్తామని అన్నారు.
మునుగోడు రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతమని, పూటకో పార్టీ మారే నేతలు సిద్ధాంతం లేకుండా ఎన్నికల్లో దిగుతున్నారని, డబ్బులతో ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారు. అలాంటి నేతలకు బుద్ధి చెప్పాలి. మనం చైతన్యం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కెసిఆర్ అన్నారు.
పాలమూరు రిజర్వాయర్ పూర్తి అయితే దిండి కి, శివన్న గూడెం ప్రాజెక్టుకు నీళ్లు వస్తాయని శివన్నగూడెం కు నీళ్ళు తీసుకొచ్చే బాధ్యత తనదే అని సీఎం అన్నారు. ఆ నాటి ఉద్యమ సమయంలో తన వెంట కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఉప ఎన్నికల్లో చూపించిన చైతన్యం వచ్చే ఎన్నికల్లో కూడా చూపించాలని అన్నారు
కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఇతర బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
SB NEWS TELANGANA
Oct 27 2023, 14:34