సిర్పూర్ లో బీఎస్పీ జెండా ఎగరడం ఖాయం: ఆర్ఎస్పీ
TS: సిర్పూర్ నియోజవర్గం పరిధిలోని చింతల మానేపల్లి మండలంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన ఎన్నికల ప్రచారానికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు, యువకులు ఆయనకు సాదర స్వాగతం పలికి బీఎస్పీ శ్రేణులలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ మాట్లాడుతూ.. సిర్పూర్ లో బీఎస్పీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని నందికొండ, బాబాపూర్, లంబడిహెట్టి, రణవెళ్ళి, బూరవెల్లి గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీ శ్రేణులను, ప్రజలను మమేకం చేస్తూ ప్రతి గడపను తడుతూ, బీఎస్పీ విజయానికి తోడ్పాటు ఇవ్వాలని ఓటర్లను కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.









నల్లగొండ: పట్టణ బిఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలు దుబ్బ రూప అశోక్ సుందర్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ దుబ్బ అశోక్ సుందర్, ఈ రోజు హైదరబాద్ లో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరారు.
ఈ సందర్బంగా నూతనంగా పార్టీలో చేరిన వారికి, కోమటిరెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులు అంతా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాల పై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.
AP: తిరుమలలో బ్రహ్మోత్సవాలు ముగిసినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. గత తొమ్మిది రోజులుగా తిరుమలలో బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ప్రధానంగా గరుడోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై మాడవీధుల్లో తిరిగే స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమలలో గతంలో శని, ఆదివారాలు మాత్రమే రద్దీ ఉండేది. కానీ ఇప్పుడు దసరా సెలవులు కొనసాగుతుండటంతో నేడు మంగళవారం కూడా రద్దీ ఎక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు.
నిన్న తిరుమల శ్రీవారిని 79,693 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. వీరిలో 21,864మంది తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.
Oct 25 2023, 21:26
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.5k