BC రాయ్ ట్రోపీ జాతీయ స్థాయి జూనియర్ ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన ఇద్దరు విద్యార్థులు
నల్గొండ: ఈనెల 24 వ తేదీ నుండి అక్టోబర్ 8 తేదీ వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ లో జరిగే BC రాయ్ ట్రోఫీ జాతీయస్థాయి జూనియర్ బాలుర ఫుట్బాల్ పోటీలకు, ఉమ్మడి నల్గొండ జిల్లా పక్షాన మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామానికి చెందిన రాచూరి వెంకటసాయి మరియు పిఏ పల్లి మండలం కేశ్నేనిపల్లి గ్రామానికి చెందిన రమావత్ దినేష్ లు ఎంపికయ్యారని ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన రాచూరి వెంకట సాయి , రమావత్ దినేష్ లను అసోసియేషన్ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, అధ్యక్షులు బండారు ప్రసాద్, మరియు అసోసియేషన్ సభ్యులందరూ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. గత 15 రోజుల నుండి తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, సికింద్రాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి సెలక్షన్ల లో అత్యుత్తమ ప్రతిభను కనబరచడం ద్వారా ఇద్దరు క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర ఫుట్బాల్ జట్టుకు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. రాచూరి వెంకటసాయి నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్ లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతూ, చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కోచ్ (ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అసిస్టెంట్ సెక్రెటరీ) మద్ది కరుణాకర్ సారథ్యంలో మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో నిరంతరం శిక్షణ పొందుతూ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు (ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు) దగ్గుపాటి విమల అందిస్తున్న సంపూర్ణ సహకారంతో జాతీయ స్థాయి పోటీలకు ఎన్నికైనాడని, మరియు రమావత్ దినేష్ చండూరు గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతూ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల ఫుట్బాల్ అకాడమీ కోచ్ లింగయ్య నాయక్ సారధ్యంలో శిక్షణ పొందుతూ ఇద్దరు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారని తెలియజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా క్రీడాకారులలో ఉన్న సహజ ఫుట్బాల్ క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి జాతీయస్థాయిలో అవకాశాలు కల్పిస్తూ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫుట్బాల్ క్రీడాకారులకు మంచి క్రీడా భవిష్యత్తు ను అందిస్తున్న తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ వారికి మరియు TFA ప్రధాన కార్యదర్శి GP ఫల్గుణకు మరియు వారి టీంకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ పక్షాన ప్రత్యేకమైన కృతజ్ఞతలు వారు తెలిపారు. SB NEWS
SB NEWS NALGONDA
Sep 23 2023, 15:12