నల్లగొండ: గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్
గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చివరి రోజు ఘనంగా నిర్వహించనున్న గణేష్ నిమజ్జనం పురస్కరించుకొని, నల్లగొండ మున్సిపల్ కమిషనర్ కె.వి.రమణాచారి శుక్రవారం, నల్లగొండ పట్టణంలోని గణేష్ విగ్రహాల నిమజ్జన కేంద్రాలైన వల్లభరావు చెరువు మరియు భీమసముద్రంలను పరిశీలించి, నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.
కార్యక్రమంలో పలువురు మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
SB NEWS
SB NEWS NALGONDA
STREETBUZZ NEWS



కార్యక్రమంలో పలువురు మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
SB NEWS
SB NEWS NALGONDA
STREETBUZZ NEWS 

శుక్రవారం నల్లగొండ పట్టణంలోని దొడ్డి కొమురయ్య భవన్ లో ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మహిళలపై ఆకృత్యాలు ఎక్కువ అయ్యాయని, మహిళా హక్కులు కాలరాయబడుతున్నాయని ఆరోపించారు. మహిళలపై రోజురోజుకు హింస, లైంగిక దాడులు, అత్యాచారాలు తీవ్రతరమైపోతున్నాయని భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా, మహిళల రక్షణకై మార్పు రాలేదన్నారు.
పార్లమెంటు వేదికగా మహిళా రక్షణ కోసం అనేక చట్టాలు రూపొందిస్తున్నా, ఆచరణలో ప్రభుత్వాలు సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. దేశంలో మహిళలపై ఒక పెద్ద సంఘటన జరిగినప్పుడల్లా ప్రభుత్వాలు మేలుకొని ఒక చట్టాన్ని రూపొందించి వదిలేస్తున్నాయన్నారు.
బేటి బచావో బేటి పడావో అని చెప్తున్న బిజెపి ప్రభుత్వం నేరగాళ్లకే కొమ్ముకాస్తుందని విమర్శించారు. అత్యాచారాలకు లైంగిక వేధింపులకు పాల్పడేవారిలో బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ లాంటి వారే అగ్రస్థానంలో ఉన్నారన్నారు. మహిళల పై జరుగుతున్న వివిధ రకాల దాడులను నివారించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.
మహిళా హక్కుల కోసం పోరాడుతున్న అతిపెద్ద మహిళా సంఘంగా ఐద్వా క్రియాశీలక పాత్ర పోషిస్తూ, మహిళల పట్ల జరుగుతున్న వివిధ సంఘటన పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ మహిళల ను రక్షించుకోవడం కోసం, మరిన్ని హక్కులను సాధించుకోవడం బలమైన ఉద్యమాలను నిర్మించింది అన్నారు. అందులో బాగంగానే అక్టోబర్ 5 న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళలను సమీకరించి నిర్వహిస్తున్నామని ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున కదిలి రావాలని వారు పిలుపునిచ్చారు.
ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ.. మహిళా స్వేచ్ఛా స్వాతంత్యాలను కాపాడడం కంటే వారి హక్కులను ఏలా కాలరాయాలో బిజెపి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. మహిళలపై గౌరవం ఉంటే మణిపూర్ లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను బిజెపి ఎందుకు అరికట్టడం లేదో ఈ సమాజానికి స్పష్టం చేయాలన్నారు.
కార్యక్రమంలో సిలివేరు రఘు, పగడాల రఘు, అంజి, శేఖర్, శంకర్, అభిసందేశ్, దశరథ్, పవన్, రమేష్, వెంకటేష్, కిషోర్, పాండు, శ్రీకాంత్, మారి, శ్రీశైలం, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
SB NEWS
SB NEWS NALGONDA
SB NEWS TELANGANA

రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.
శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని చెప్పింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
గురువారం ఆసిఫాబాద్ లో భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సిర్పూర్(టీ)లో 11.3 సెం.మీ వర్షపాతం కురిసింది.
SB NEWS
అక్టోబర్ 15 నుంచి 29 వరకు ఆర్టీసీలో అప్ అండ్ డౌన్, ఒకేసారి టికెట్లు బుక్ చేసుకుంటే.. తిరుగు ప్రయాణంలో టికెట్ పై 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది.
సెప్టెంబర్ 30వ తేదీ లోపు టికెట్ రిజర్వేషన్ చేసుకున్న వారికి ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని ఆర్టీసీ పేర్కొంది.
దసరా సందర్భంగా భారీగా ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ అప్ అండ్ డౌన్ టికెట్లు బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తామని వెల్లడించింది.
SB NEWS
SB NEWS TELANGANA





STREETBUZZ NEWS
నల్లగొండ జిల్లా, నకిరేకల్: అంగన్వాడీ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలుచేసి వారి సమస్యలను పరిష్కరించాలని బహుజన్ సమాజ్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, యోగి, మహేష్, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు వంటెపాక వెంకటేశ్వర్లు, అంగన్వాడీ టీచర్ హెల్పర్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పొడిశెట్టి నాగమణి, అరుణ, శోభ, చంద్రమ్మ, శుభాషిణి, జయమ్మ, లతిఫ, మంగ, లక్ష్మి, వెంకటమ్మ, బి ఎస్ పి నాయకులు, కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు.
SB NEWS
Sep 22 2023, 22:11
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
4.9k