పొగిళ్ల, కంబాలపల్లి గ్రామాల్లో భూ సర్వే నిర్వహించిన ప్రాంతాలను సందర్శించిన నల్లగొండ జిల్లా కలెక్టర్
![]()
రైతుల భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులతో ముఖాముఖి మాట్లాడి పరిష్కరించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. భూములకు సంబంధించిన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు. మహిళా సంఘాలు బంజరు భూముల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకొని విద్యుత్‌ను విక్రయించడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, పశువుల ద్వారా గోబర్ గ్యాస్ తయారీని ప్రోత్సహించాలని తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండలం, పొగిళ్ల, కంబాలపల్లి గ్రామాల్లో భూ సర్వే నిర్వహించిన ప్రాంతాలను సందర్శించారు. క్షేత్రస్థాయిలో ఆయన రైతులతో నేరుగా మాట్లాడి భూ సర్వే వివరాలు, భూముల విస్తీర్ణం, రికార్డులు, అభ్యంతరాల గురించి అడిగి తెలుసుకున్నారు.పొగిళ్ల గ్రామంలో 1,066 ఎకరాల భూమిని సర్వే చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. గ్రామంలో వాస్తవంగా సాగులో ఉన్న భూమి, అసైన్డ్ భూములు , భూములపై హక్కులు కలిగిన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూ సర్వేకు సంబంధించిన వివరాలను గ్రామంలో ప్రదర్శించాలని, అవసరమైతే గ్రామసభలో చదివి వినిపించాలని ఆదేశించారు. ఇప్పటివరకు వచ్చిన అభ్యంతరాలు , వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలేమిటని అధికారులను ప్రశ్నించారు. మొత్తం 30 అభ్యంతరాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. భూముల రికార్డులు, పట్టాదారు పాసుపుస్తకాలు, పహాణీ వివరాలు, క్షేత్రస్థాయిలో ఉన్న భూమి విస్తీర్ణాన్ని సరిపోల్చి పరిశీలించాలని సూచించారు. భూములపై అభ్యంతరాలు వ్యక్తం చేసే రైతులు తమకు సంబంధించిన ధ్రువపత్రాలను చూపించాలని తెలిపారు.
అసైన్డ్ భూములను చట్టవిరుద్ధంగా అమ్మడం, కొనడం చేయకూడదని స్పష్టం చేశారు. సర్వే వివరాలను పారదర్శకంగా ప్రజలకు తెలియజేసి, అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆయన సూచించారు. రైతులతో చర్చించి భూ సమస్యలను పరిష్కరించేందుకు, కంబాలపల్లి రైతు వేదికలో రైతులతో కలెక్టర్ సమావేశమయ్యారు. సర్వే నంబర్ల వారీగా భూ సర్వే ఎంతవరకు పూర్తయింది, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిగిందా, ఇంకా ఎన్ని సర్వేలు చేయాల్సి ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సర్వే నంబర్ 37, 50లకు సంబంధించిన సర్వే వివరాలను పరిశీలించి, పూర్తయిన సర్వే వివరాలను గ్రామసభల్లో ప్రదర్శించాలని సూచించారు. సర్వే రికార్డుల్లో ఉన్న వివరాలు, పహాణీలో నమోదైన పేర్లు, వాస్తవంగా భూములు అనుభవిస్తున్న రైతుల వివరాలను సరిపోల్చాలని ఆదేశించారు. వచ్చిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి, మిగిలిన సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు.
భూముల విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు ఉన్నా, రికార్డుల్లో తేడాలు కనిపించినా సంబంధిత రైతులు, అధికారులు కలిసి చర్చించుకోవాలని సూచించారు. అన్నదమ్ములు, ఇతర భూహక్కుదారుల మధ్య సమస్యలు ఉంటే పరస్పరం కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని అన్నారు. అన్ని వివరాలు సక్రమంగా ఉన్నవారికి నిబంధనల ప్రకారం పట్టాదారు పాసుపుస్తకాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని,
ఎల్‌నినో ప్రభావం కారణంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, వర్షాలపై ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. భూగర్భ జలాలు తగ్గే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంటలకు అవసరమైన నీటిని మాత్రమే వినియోగించాలని, ప్రతి నీటి చుక్కను పొదుపు చేయాలని తెలిపారు.
నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని తక్కువ నీటితో సాగు చేయగల పంటలు, కూరగాయల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. పశుసంపదను కాపాడుకుంటూ, అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచుకోవాలని అన్నారు.
మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగాలని, గ్రామాల్లో అందుబాటులో ఉన్న బంజరు భూములను ఉపయోగించుకొని మహిళా సంఘాలు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే అవకాశాలను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి విక్రయించడం ద్వారా మహిళా సంఘాలు ఆదాయాన్ని పెంచుకొని ఆర్థికంగా బలోపేతం కావచ్చని తెలిపారు. అలాగే పశువుల పేడతో గోబర్ గ్యాస్ తయారు చేసుకొని ఇంధన అవసరాలను తీర్చుకోవడంతో పాటు వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. రైతులు, గ్రామీణ ప్రజలు అనవసర ఖర్చులను తగ్గించుకొని, పొదుపు అలవాటును పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలియన్ చింగ్ థియాన్ మావి, ల్యాండ్ సర్వే ఏడి దేవరాజ్ , తహసిల్దార్ సత్యనారాయణ, సర్పంచ్ జటా జైహింద్ నాయక్ , మండల సర్వేయర్లు శ్రీనివాస్, హరీష్, కంబాలపల్లి సర్పంచ్ గోవిందు,
రైతులు, గ్రామస్తులు కలెక్టర్ వెంట ఉన్నారు.

పొగిళ్ల గ్రామంలో 1,066 ఎకరాల భూమిని సర్వే చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. గ్రామంలో వాస్తవంగా సాగులో ఉన్న భూమి, అసైన్డ్ భూములు , భూములపై హక్కులు కలిగిన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూ సర్వేకు సంబంధించిన వివరాలను గ్రామంలో ప్రదర్శించాలని, అవసరమైతే గ్రామసభలో చదివి వినిపించాలని ఆదేశించారు. ఇప్పటివరకు వచ్చిన అభ్యంతరాలు , వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలేమిటని అధికారులను ప్రశ్నించారు. మొత్తం 30 అభ్యంతరాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. భూముల రికార్డులు, పట్టాదారు పాసుపుస్తకాలు, పహాణీ వివరాలు, క్షేత్రస్థాయిలో ఉన్న భూమి విస్తీర్ణాన్ని సరిపోల్చి పరిశీలించాలని సూచించారు. భూములపై అభ్యంతరాలు వ్యక్తం చేసే రైతులు తమకు సంబంధించిన ధ్రువపత్రాలను చూపించాలని తెలిపారు.

హైదరాబాద్, కుత్బుల్లాపూర్: సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పోతూ సమగ్ర సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నాయకులు గట్టు రామచంద్ర, రాష్ట్ర అధ్యక్షులు ముండాల మల్లేష్ గౌడ్ మార్గదర్శకత్వంలో.. తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు సురేష్ గౌడ్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు బెల్లంకొండ జ్యోతి గౌడ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ మర్యాదపూర్వక భేటీలో ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ నాయకులకు పలు కీలక సూచనలు చేశారు. నాయకులుగా ఎదిగే క్రమంలో కేవలం తమ సామాజిక వర్గానికే పరిమితం కాకుండా, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలని హితవు పలికారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం గురించి ఆలోచించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ముఖ్య నాయకులు తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం హైదరాబాద్ అధ్యక్షులు పరుచూరి సురేష్ గౌడ్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు బెల్లంకొండ జ్యోతి గౌడ్, చెలిమిన స్వప్న గౌడ్ (బహదూర్ పల్లి డివిజన్ జనరల్ సెక్రటరీ), ఉప్పాల సాయికుమార్ గౌడ్ (నిజాంపేట్ అధ్యక్షుడు), వీరితో పాటు ఈ భేటీలో బెల్లంకొండ యాకయ్య గౌడ్, నరసింహ గౌడ్, మహేష్ గౌడ్, మాధవి గౌడ్, నేరెళ్ల కుమార్, ఇరువురి రాఘవేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం నియోజకవర్గంలోని పలు మండలాలలో పర్యటించి వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. కార్యక్రమాలలో భాగంగా మర్రిగూడ మండలం లోని శ్రీ విజయ గార్డెన్స్ లో, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మాధగోని మధు.. సోదరుడు మాధగోని సైదులు–దీపిక దంపతుల చిన్నారుల పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులను ఆయన ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
NLG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం మునుగోడు నియోజకవర్గంలోని పలు మండలాలలో పర్యటించి వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. కార్యక్రమాలలో భాగంగా
HYD: కుత్బుల్లాపూర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) ఆధ్వర్యంలో ఓపెన్ ఇంటర్ లో అడ్మీషన్స్ అన్నీ కోర్సుల్లో జరుగుతున్నాయి. చివరి తేదీ ఈనెల 30వ తేదీ అని కళాశాల అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ (AI ) కోఆర్డినేటర్ డా.మబ్బు పరశురామ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు నేరుగా కళాశాలలో లేదా 9703648173 కు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు అని తెలిపారు.
మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో, ఎస్సీ కాలనీ ఒకటో వార్డులో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గురువారం గణనాధునికి పూజలు ఘనంగా నిర్వహించారు. ఇవాళ నిమజ్జనం సందర్భంగా, ఈసారపు వీరయ్య కుటుంబ సభ్యులు 'అన్న ప్రసాద వితరణ' కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు వీరయ్య కుమారుడు డిఆర్డిఎల్ సైంటిస్ట్ ఈసారపు తిరుమల్ దంపతులు 'అన్న ప్రసాద వితరణ' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ వినాయకుని ఆశీస్సులు పొందారు.
నల్లగొండ జిల్లా:
ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ వినాయకుని ఆశీస్సులు పొందారు.
నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం యరగండ్లపల్లి గ్రామంలో, యువ చైతన్య యూత్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో, వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలంపాట ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా వినాయకుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. గణపతి బప్పా మోరియా అంటూ భక్తితో గణేశుడికి జేజేలు కొట్టారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Oct 26 2026, 00:51
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.7k