నేటి రాశిఫలాలు అక్టోబర్ 26,2024 శనివారం
మేషం
ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. శ్రమాదిక్యాతతో దూరప్రయాణాలు చెయ్యవలసిన వస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.
వృషభం
ప్రయాణాలలొ మార్గావరోధాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో తొందరపాటు మంచిదికాదు. ప్రత్యర్థుల నుంచి ధన పరంగా ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచనాలు కలుగతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
మిధునం
దూరప్రాంతాల బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
కర్కాటకం
ఆదాయనికి మించి ఖర్చులుంటాయి. నూతన రుణ యత్నాలు చేస్తారు. బంధువులతో ఆకారణ విభేదాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చికాకు పరుస్తాయి. మానసిక ప్రశాంతతకు ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనులు మండకొడిగా సాగుతాయి.
సింహం
ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తొలగుతాయి.
కన్య
వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో శ్రమధిక్యత పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. మిత్రులతో కలహా సూచనలున్నవి. వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి.
తుల
వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. రాజకీయ సభ, సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలలొ శుభవార్తలు అందుతాయి.
వృశ్చికం
నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
ధనస్సు
కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా పడుతాయి. ముఖ్యమైన పనులలో కార్యాటంకములు కలుగుతాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పని బాధ్యతలు పెరుగుతాయి.
మకరం
వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు. వృథా ఖర్చులు పెరుగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
కుంభం
ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. జీవిత భాగస్వామి నుంచి ఆకస్మిక ధనలాభలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.
మీనం
నిరుద్యోగులకు అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. విందువినోదాది కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అధిక లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభాకార్యాలలో పాల్గొంటారు.
Oct 26 2024, 13:35