/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్ణయంపై వైఎస్ షర్మిల..! Raghu ram reddy
వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్ణయంపై వైఎస్ షర్మిల..!

ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఓవైపు రచ్చ కొనసాగుతుండగానే.. మరోవైపు 4200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపుకు యాజమాన్యం సిద్ధమైంది. ఈ మేరకు వారికి క్లారిటీ కూడా ఇచ్చేసింది. దీంతో కార్మికులు మరోసారి రోడ్డెక్కారు. వీరికి నిన్న సంఘిభావం ప్రకటించిన ఏపీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల.. సీఎం చంద్రబాబుకు డెడ్ లైన్ పెట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపును అడ్డుకోకపోతే అక్కడే నిరసన దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ నుంచి ఇవాళ ఓ ప్రకటన వచ్చింది.

స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న 4200 మంది కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు నిర్ణయంపై యాజమాన్యం వెనక్కి తగ్గింది. దీంతో స్టీల్ ప్లాంట్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ వైఎస్ షర్మిక ఓ ప్రకటన విడుదల చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపుపై స్టీల్ ప్లాంట్ వెనక్కి తగ్గడాన్ని ఆమె స్వాగతించారు.

ఇది కాంగ్రెస్ పార్టీ విజయం అన్నారు. దీక్షకు దిగుతానని తాను చేసిన హెచ్చరికల వల్లే స్టీల్ ప్లాంట్ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ కార్మికులకు షర్మిల ఓ మాట కూడా ఇచ్చారు.

తాము పెట్టిన 48 గంటల గడువుకి దిగివచ్చి , యాజమాన్యం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, విశాఖ స్టీల్ ప్లాంట్ లో తొలగించిన 4200 మంది కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ విజయమని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ మీ పక్షమని, మీకోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని కార్మికులకు ఆమె తెలిపారు. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన పోరాడి గెలిచామని, ఇదే స్పూర్తితో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిద్దామన్నారు.

మోడీ మెడలు వంచి మన ఆత్మగౌరవం విశాఖ ఉక్కును పరిరక్షించుకుందామని వారికి పిలుపునిచ్చారు.

జానీమాస్టర్‌కు బెయిల్ మంజూరు.

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు రంగారెడ్డి కోర్టులో కాస్త ఊరట లభించింది. జానీ మాస్టర్‌కు కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. కేవలం ఐదు రోజులు మాత్రమే బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్‌కు రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు (Choreographer Johnny Master) రంగారెడ్డి కోర్టులో (Ranga Reddy Court) కాస్త ఊరట లభించింది. జానీ మాస్టర్‌కు కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. కేవలం ఐదు రోజులు మాత్రమే బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్‌కు ఈనెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం చంచల్ గూడా జైలులో జానీ మాస్టర్‌ ఉన్నారు. బెయిల్ మంజూరు అయిన నేపథ్యంలో 6న జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

కాగా.. అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కుంటున్న జానీ మాస్టర్‌‌ను గత నెలలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గోవాలో జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్‌ తీసుకుని హైదరాబాద్‌‌కు తరలించారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ఉప్పర్‌పల్లిలోని 13వ అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ముందు హాజరుపరిచారు. పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించి, ఇరువర్గా ల వాదనలూ విన్న న్యాయమూర్తి.. అక్టోబరు 3వ తేదీ వరకు (14 రోజుల) రిమాండ్‌ విధించారు. దీంతో ప్రస్తుతం చంచల్‌గూడ్ జైలులో ఉన్నారు. అలాగే జానీ మాస్టర్‌ను కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలవగా.. నాలుగు రోజుల పాటు కస్టడీ విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పునిచ్చింది.

దీంతో జానీమాస్టర్‌ను నాలుగు రోజుల పాటు నార్సింగ్ పోలీసులు విచారించారు. పోలీసుల కస్టడీలో బాధితురాలే తనను వేధింపులకు గురిచేసిందంటూ జానీ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ అంశానికి సంబంధించి జానీ మాస్టర్ భార్య సుమలత ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేసింది. ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో తనకు చూపించిందని.. ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లిందని పేర్కొంది. తన భర్త జానీపై లేని పోనీ ఆరోపణలు చేసిన మహిళా కోరియోగ్రాఫర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు నేపథ్యంలో సుమలత నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వివరణ కోరింది. దీంతో వివరణ ఇచ్చేందుకు నిన్న (బుధవారం) ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ ముందు సుమలత హాజరయ్యారు. మహిళా కొరియోగ్రాఫర్‌కు సంబంధించిన అన్ని ఆధారాలను ఫిల్మ్ ఛాంబర్ కమిటీకి జానీ మాస్టర్ భార్య అందించారు. సుమలత దగ్గర నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ సభ్యులు వివరాలు సేకరించారు.

కొండా సురేఖ పై అధిష్టానం సీరియస్!

తెలంగాణ మంత్రి కొండ సురేఖ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రముఖ హీరోయిన్ సమంత పై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఒక ప్రముఖ హీరోయిన్ వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి అత్యంత దారుణంగా కొండా సురేఖ చేసిన సంచలన ఆరోపణలు ప్రతి ఒక్కరిని విస్మయానికి గురిచేస్తున్నాయి.

కేటీఆర్ ను ఇరకాటంలో పెట్టాలని కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్

రాజకీయంగా మాజీ మంత్రి కేటీఆర్ ను ఇరకాటంలో పెట్టాలని చూసిన కొండా సురేఖ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆపాలంటే కేటీఆర్ సమంతను పంపించాలని అడిగాడని, నాగార్జున నాగచైతన్య సమంత పైన కేటీఆర్ దగ్గరకు వెళ్ళమని ఒత్తిడి తెచ్చారని దీనికి సమంతా అంగీకరించకపోవడంతో నాగచైతన్య విడాకులు ఇచ్చాడని మంత్రి కొండా సురేఖ దారుణమైన వ్యాఖ్యలు చేశారు.

కొండా సురేఖ రాజీనామాకు డిమాండ్

ఈ ఆరోపణలతో నోటికొచ్చినట్టు మాట్లాడే కొండా సురేఖ మంత్రి పదవికి అనర్హురాలని పెద్ద ఎత్తున ఆమె తీరు పైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఆమె తక్షణమే రాజీనామా చేయాలని ప్రత్యర్థి పార్టీల నుండి డిమాండ్ వినిపిస్తుంది. ఒక బాధ్యతయుతమైన మంత్రిగా ఉండి ఈ విధంగా ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన దారుణమైన వ్యాఖ్యలు చేయడం మన రాజకీయాలను ఎటువైపు తీసుకు వెళుతుందని ఇప్పటికే పలువురు ప్రశ్నిస్తున్నారు.

రాజకీయాలలో దిగజారుడుతనాన్ని ప్రతి ఒక్కరు నిలదీస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కొండ సురేఖ మంత్రి పదవికి అనర్హురాలని పెద్ద ఎత్తున ఆమె పైన వ్యతిరేకత వినిపిస్తోంది. రాహుల్ గాంధీకి సైతం కొండా సురేఖ యొక్క అనుచిత వైఖరి పట్ల ఫిర్యాదులు వెల్లువగా మారాయి. ఇక నాగ చైతన్య, నాగార్జున, సమంత అభిమానులు కొండా సురేఖను టార్గెట్ చేసి సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తున్నారు.

దసరాకు ముందే మంత్రి వర్గ విస్తరణ

కొండ సురేఖ తాను చేసిన అనుచిత వ్యాఖ్యలతో రాజకీయంగానే కాదు ఒక వ్యక్తిగా ఒక మహిళగా చనిపోయారని కొందరు కీర్తిశేషులు కొండ సురేఖ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆమె మంత్రి పదవికి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉన్న సమయంలో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో దసరాకు ముందే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని భావిస్తున్నారు.

అయితే ఇదే సమయంలో కొండా సురేఖపట్ల ఒక్కసారిగా వ్యక్తం అవుతున్న నిరసన ఆమె మంత్రి పదవికి గండం తీసుకొచ్చింది. కొండా సురేఖ తీరు పైన అధిష్టానం కూడా సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. సొంత పార్టీలో కూడా ఆమె పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. సురేఖ చేసిన వ్యాఖ్యలతో ఆమెకు మాత్రమే కాదు పార్టీకి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు.

కొండా సురేఖ మంత్రి పదవికి ఉద్వాసన?

ఈ క్రమంలోనే త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగిస్తారని భావిస్తున్నారు. నోటికి కంట్రోల్ లేకుండా మాట్లాడుతున్న కొండ సురేఖ కు ఉద్వాసన పలికే ఆలోచనలో కూడా అధిష్టానం ఉందని ప్రస్తుతం చర్చ జరుగుతుంది . మరోవైపున కొండ సురేఖ వ్యాఖ్యల పైన అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది? సురేఖ మంత్రి పదవి విషయంలో సీరియస్ స్టెప్ తీసుకుంటుందా అన్నది మరికొద్ది రోజుల్లో తెలియనుంది..

నేడు తిరుపతిలో వారాహి సభ.. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై ఆసక్తి..

నేడు తిరుపతి వేదికగా వారాహి బహిరంగ సభ నిర్వహించనున్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో వారాహి సభ జరగనుంది..

జ్యోతి రావ్ పూలే సర్కిల్ లో వారాహి బహిరంగ సభ నిర్వహణకు జనసేన, కూటమి నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.. అయితే, సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న సభలో వారాహి డిక్లరేషన్ ను ప్రజలకు వివరించనున్నారు పవన్‌ కల్యాణ్‌.. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత చేపట్టిన తొలి సభ కావడం..

వారాహి డిక్లరేషన్‌ ప్రకటించనుండడంతో.. ఆ డిక్లరేషన్‌లో ఎలాంటి అంశాలు ఉన్నాయి.. పవన్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.. అసలు వారాహి డిక్లరేషన్ ద్వారా పవన్ ఏమి చేబుతారనే అందరిలోను ఆసక్తి రేపుతోంది..

ఇక, ఈ సభకు రాయలసీమ జిల్లాల నుంచి భారీగా కూటమి పార్టీల శ్రేణులు హాజరవుతారని చెబుతున్నారు..

రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు..!

తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయని.. వీటి ప్రభావంతో వానలు పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని కామారెడ్డి, హైదరాబాద్, నిర్మల్, సిద్దిపేట, నాగర్ ‌కర్నూల్, మేడ్చల్-మల్కాజిగిరి సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్లు చెప్పారు. మంగళవారం హైదరాబాద్ లోని పలు చోట్లు భారీ వర్షం కురిసింది. మాదాపూర్, హైటెక్ సిటీ, కాకతీయ సొసైటీ, బోరబండ, మోతినగర్, ఎస్సాఆర్ నగర్, ఎర్రగడ్డ, అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వాన పడింది.

మంగళవారం కామారెడ్డిలోని గాంధారిలో రాష్ట్రంలో అత్యధికంగా 9.73 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. సికింద్రాబాద్ పాటిగడ్డలో 4 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. వచ్చే నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లా అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వాన పడే అవకాశం ఉందని పేర్కొంది.

భారీ వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ నిండు కుండలా మారాయి. నాగార్జున సాగర్, పులిచింతల, జూరాల, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, లోయర్ మానేరు, మిడ్ మానేరు తోపాటు అన్ని జలాశయాలు నిండిపోయాయి. ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కీలకమైన రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయాయి. ప్రత్యేకంగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లలో నిండు కుండలా మారాయి. మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతోన్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 34.4 నమోదు కాగా.. కనిష్ఠంగా 23.7 డిగ్రీల సెల్సియస్ నమోదు అయింది.

హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సీజన్ లో తెలంగాణలో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదు అయింది. ముఖ్యంగా నారాయణపేట జిల్లాలో అధిక వర్షపాతం నమోదు అయింది. హైదరాబాద్ కూడా సాధారణం కన్నా ఎక్కవ వర్షపాతం పడినట్లు చెబుతున్నారు.

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై భగ్గుమన్న హీరో నాగార్జున

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆరోపణలు గుప్పిస్తూ.. అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హీరో అక్కినేని నాగార్జున స్పందించారు.

కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రకటించారు. ‘‘ రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను, మీ ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను’’ అని నాగార్జున అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.

కాగా మీడియా సమావేశంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ అక్కినేని ఫ్యామిలీని కూడా మంత్రి కొండా సురేఖ ప్రస్తావనకు తీసుకొచ్చారు.

హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్ అలవాటు అని అన్నారు. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆరే అని, కేటీఆర్‌కు తల్లి అక్క, చెల్లి లేరా? అని పేర్కొన్నారు. హీరోయిన్ల ఫోన్లను కేటీఆర్ ట్యాప్ చేశారని, చాలా మంది హీరోయిన్లు త్వరగా పెళ్లిళ్లు చేసుకుని సినిమా ఇండస్ట్రీ నుంచి వైదొలగడానికి కేటీఆరే కారణమని పేర్కొన్నారు.

మొస్సాద్ హెడ్ క్వార్టర్‌ ధ్వంసం?

లెబనాన్‌లో ఇటీవలే సంభవించిన ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా హతం కావడానికి ప్రతీకారాన్ని తీర్చుకుంటోంది ఇరాన్. ఇజ్రాయెల్‌పై దండెత్తింది. శక్తిమంతమైన బాలిస్టిక్ క్షిపణులను సంధించింది. రాజధాని టెల్ అవివ్, జెరూసలెం సహా అనేక ప్రాంతాలపై ఈ దాడులు జరిగాయి. మొత్తం 181 మిస్సైళ్లను సంధించింది ఇరాన్.

హెజ్బొల్లాను దాదాపుగా నామరూపాల్లేకుండా చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ప్రతీకార దాడులకు దిగుతుందనే విషయం ఊహించిందే అయినప్పటికీ- గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంత భారీ ఎత్తున మిస్సైళ్లతో దాడికి దిగడం అనేది చర్చనీయాంశమైంది. ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది.

హసన్ నస్రల్లా హత్యకు ప్రతీకారంగా మొన్నటికి మొన్న ఇజ్రాయెల్‌పై లెబనాన్ యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. జెరూసలెం సహా తమ దేశ భూభాగంపై పలు చోట్ల సైరెన్ మోతలు వినిపించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ఇప్పుడు తాజాగా ఇరాన్ సైతం యుద్ధానికి దిగడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

ఈ దాడులకు ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2 అని పేరు పెట్టింది. ఇరాన్ క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొస్సాద్ ప్రధాన కార్యాలయం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అలాగే కీలకమైన ఎఫ్- 35 ఫైటర్ జెట్స్ ఎయిర్ బేస్ సైతం ధ్వంసమైందని ప్రకటించింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివ్‌కు దక్షిణ దిశగా ఉన్న టెల్ నాఫ్‌లో ఉంటుంది మొస్సాద్ ప్రధాన కార్యాలయం.

అలాగే- బీర్‌షేవా సిటీ సమీపంలో ఉండే నెవాటిమ్ ఎయిర్‌బేస్‌ సైతం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిపింది. ఎఫ్- 35 ఫైటర్ జెట్స్‌కు ఆదే ప్రధాన కేంద్రం. తాజా దాడుల్లో ఈ ఎయిర్ బేస్ ధ్వంసమైనట్లు ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ మహ్మద్ బఘేరి తెలిపారు. దీనితో పాటు నెట్జరిమ్ మిలటరీ ఫెసిలిటీని ధ్వంసం చేసినట్లు చెప్పారు.

జులై 31వ తేదీన తమ దేశంలో హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా, ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ అబ్బాస్ నిల్ఫొరౌషన్ దారుణ హత్యకు నిరసనంగానే ఈ దాడులు చేపట్టినట్లు బఘేరి స్పష్టం చేశారు. మున్ముందు ఈ దాడులు మరింత తీవ్రతరం చేస్తామని తేల్చి చెప్పారు.

కోర్‌ అర్బన్‌ రీజియన్‌ పరిరక్షణ హైడ్రాకే: దానకిశోర్‌

తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న ఏరియా) పరిధిలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలన్నింటినీ పరిరక్షించే బాధ్యతలను హైడ్రా తీసుకుంటుందని, ఓఆర్‌ఆర్‌ లోపల విపత్తుల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణకు కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్‌(M. Danakishore) అధికారులను ఆదేశించారు.

తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న ఏరియా) పరిధిలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలన్నింటినీ పరిరక్షించే బాధ్యతలను హైడ్రా తీసుకుంటుందని, ఓఆర్‌ఆర్‌ లోపల విపత్తుల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణకు కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్‌(M. Danakishore) అధికారులను ఆదేశించారు. గవర్నింగ్‌ బాడీ హైడ్రా కోసం ప్రత్యేక పాలసీ రూపకల్పన చేయనున్న నేపథ్యంలో సహకారం అందించేందుకు దానకిషోర్‌ అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (టీసీయూఆర్‌) డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ సబ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు.

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ(GHMC, HMDA), వాటర్‌ వర్క్స్‌, హైడ్రా, రెవెన్యూ, పోలీసు, అటవీ, అగ్నిమాపకశాఖ, మునిసిపాలిటీలు, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా దానకిషోర్‌ మాట్లాడుతూ కోర్‌ అర్బన్‌ రీజియన్‌లో ఉన్న అన్ని లేక్స్‌ల మ్యాపింగ్‌ కోసం ప్రొఫెషన్‌ ప్రభుత్వ ఏజెన్సీతో స్టడీ చేయించాలన్నారు. ఓఆర్‌ఆర్‌ లోపల ఫ్లడ్‌, అగ్నిప్రమాదాలు సంభవించే ప్రాంతాలు, ట్రాఫిక్‌ రిలేటెడ్‌ ఆక్రమణలు, వాటర్‌ లాగింగ్‌ తదితర వాటిని మ్యాపింగ్‌ చేపట్టాలన్నారు.

ఓఆర్‌ఆర్‌ లోపల ప్రకృతి విపత్తులు, ఆస్తుల పరిరక్షణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని హైడ్రాకు అందజేయాలని ముఖ్య కార్యదర్శి సూచించారు. సమావేశంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి రాకేశ్‌ మోహన్‌ డోబ్రియాల్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌, సీఎండీ ముషారఫ్‌ అలీ, వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, కలెక్టర్లు అనుదీప్‌, శశాంక, గౌతమ్‌, వల్లూరు క్రాంతి, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, జాయింట్‌ సీపీ జోయల్‌ డెవిస్‌, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై నాలుగు జిల్లాల కలెక్టర్లతో కమిటీ ఏర్పాటు చేయగా.. కమిటీ చైర్మన్‌గా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శశాంక, మిగతావారిని సభ్యులుగా నియమించారు. పది రోజుల్లో కమిటీ నివేదిక అందించాలని దానకిశోర్‌ సూచించారు. అదేవిధంగా ఓఆర్‌ఆర్‌ లోపల అన్ని ప్రభుత్వ ఆస్తులకు జియో ట్యాగింగ్‌ చేసే బాధ్యతను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలికి అప్పగించారు.

ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు..

ప్రకృతిని ఆరాధిస్తూ.. తీరొక్క పువ్వులను దేవతా స్వరూపంగా భావించి పూజించే ఏకైక పండుగ మన బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతికి చిహ్నం, అస్తిత్వానికి ప్రతిరూపం మన బతుకమ్మ. సమైక్య పాలనలో ఆదరణకు నోచుకోని మన బతుకమ్మ పండుగ.

తెలంగాణ (Telangana) సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ సంబురాలు నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలుకానున్నాయి. ఈరోజు నుంచి తొమ్మిదిరోజుల పాటు పూల పండుగను జరుపుకోనున్నారు తెలంగాణ ఆడపడుచులు. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ షురూ కానుంది. ఒక్కో రోజు ఒక్కో పేరుతో పిలుస్తూ బతుకమ్మ పండుగను మహిళలు జరుపుకోనున్నారు.

ప్రతీ రోజు ఒక్కో రకం నైవేద్యాన్ని తయారు చేస్తారు. అలాగే వివిధ రకాల పూలతో బతుకమ్మను పేరుస్తారు. ఈ పండుగకు పెళ్లైన ఆడపడుచులు తమ పుట్టింటికి వచ్చి బతుకమ్మను పేర్చి సంబరాల్లో పాల్గొంటారు. ఈరోజు నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ ఆడపడుచులకు పూల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ విషెస్ తెలిపారు.

నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులందరూ ఎంతో సంబురంగా జరుపుకునే బతుకమ్మ పండగ తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రత్యేకమైనదన్నారు. ‘‘ప్రకృతిని ఆరాధిస్తూ.. తీరొక్క పువ్వులను దేవతా స్వరూపంగా భావించి పూజించే ఏకైక పండుగ మన బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతికి చిహ్నం, అస్తిత్వానికి ప్రతిరూపం మన బతుకమ్మ. సమైక్య పాలనలో ఆదరణకు నోచుకోని మన బతుకమ్మ పండుగ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. ఆటపాటలతో, ఆనందోత్సాహాల మధ్య తెలంగాణ ఆడబిడ్డలందరూ బతుకమ్మ పండుగ జరుపుకోవాలని కోరుతూ...ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు

జంట’గా గంజాయి విక్రయాలు..

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట నేరాలబాట పట్టింది. డబ్బు సంపాదన కోసం గంజాయి విక్రయిస్తూ చివరకు పోలీసులకు పట్టుబడి కటకటాలపాలైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా మాచర్ల(Macharla)కు చెందిన యాపర్తి గోపి(25), ఉమాహేశ్వరి(24) ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట నేరాలబాట పట్టింది. డబ్బు సంపాదన కోసం గంజాయి విక్రయిస్తూ చివరకు పోలీసులకు పట్టుబడి కటకటాలపాలైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా మాచర్ల(Macharla)కు చెందిన యాపర్తి గోపి(25), ఉమాహేశ్వరి(24) ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

చిన్నచిన్న పనులు చేసినా ఆదాయం చాలలేదు. గంజాయి సరఫరా చేసే బంధువు శివనాగరాజు వారికి పరిచయమయ్యాడు. అతడు 2 కేజీల నుంచి 5 కేజీల వరకు హోల్‌సేల్‌గా గంజాయి విక్రయించేవాడు.

దాన్ని 200 గ్రాముల ప్యాకెట్లుగా మార్చి స్కూటీపై దంపతులిద్దరూ హైదరాబాద్‌(Hyderabad)కు వచ్చి, విక్రయించి వెళ్లిపోయేవారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌వోటీ పోలీసులు ఎల్‌బీనగర్‌ మెట్రోస్టేషన్‌(LB Nagar Metro Station) వద్ద కాపుకాసి గంజాయి విక్రయిస్తున్న గోపి, ఉమాహేశ్వరి దంపతులతోపాటు కొనుగోలు చేస్తున్న నాగోలుకు చెందిన ప్రభుచరణ్‌(23), నగేష్(24)లను అదుపులోకి తీసుకొని ఎల్‌బీనగర్‌ పోలీసులకు అప్పగించారు.

వారి నుంచి సుమారు కిలో గంజాయి, 3 సెల్‌ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం దర్యాప్తు చేస్తున్నారు.