/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై భగ్గుమన్న హీరో నాగార్జున Raghu ram reddy
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై భగ్గుమన్న హీరో నాగార్జున

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆరోపణలు గుప్పిస్తూ.. అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హీరో అక్కినేని నాగార్జున స్పందించారు.

కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రకటించారు. ‘‘ రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను, మీ ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను’’ అని నాగార్జున అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.

కాగా మీడియా సమావేశంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ అక్కినేని ఫ్యామిలీని కూడా మంత్రి కొండా సురేఖ ప్రస్తావనకు తీసుకొచ్చారు.

హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్ అలవాటు అని అన్నారు. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆరే అని, కేటీఆర్‌కు తల్లి అక్క, చెల్లి లేరా? అని పేర్కొన్నారు. హీరోయిన్ల ఫోన్లను కేటీఆర్ ట్యాప్ చేశారని, చాలా మంది హీరోయిన్లు త్వరగా పెళ్లిళ్లు చేసుకుని సినిమా ఇండస్ట్రీ నుంచి వైదొలగడానికి కేటీఆరే కారణమని పేర్కొన్నారు.

మొస్సాద్ హెడ్ క్వార్టర్‌ ధ్వంసం?

లెబనాన్‌లో ఇటీవలే సంభవించిన ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా హతం కావడానికి ప్రతీకారాన్ని తీర్చుకుంటోంది ఇరాన్. ఇజ్రాయెల్‌పై దండెత్తింది. శక్తిమంతమైన బాలిస్టిక్ క్షిపణులను సంధించింది. రాజధాని టెల్ అవివ్, జెరూసలెం సహా అనేక ప్రాంతాలపై ఈ దాడులు జరిగాయి. మొత్తం 181 మిస్సైళ్లను సంధించింది ఇరాన్.

హెజ్బొల్లాను దాదాపుగా నామరూపాల్లేకుండా చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ప్రతీకార దాడులకు దిగుతుందనే విషయం ఊహించిందే అయినప్పటికీ- గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంత భారీ ఎత్తున మిస్సైళ్లతో దాడికి దిగడం అనేది చర్చనీయాంశమైంది. ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది.

హసన్ నస్రల్లా హత్యకు ప్రతీకారంగా మొన్నటికి మొన్న ఇజ్రాయెల్‌పై లెబనాన్ యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. జెరూసలెం సహా తమ దేశ భూభాగంపై పలు చోట్ల సైరెన్ మోతలు వినిపించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ఇప్పుడు తాజాగా ఇరాన్ సైతం యుద్ధానికి దిగడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

ఈ దాడులకు ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2 అని పేరు పెట్టింది. ఇరాన్ క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొస్సాద్ ప్రధాన కార్యాలయం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అలాగే కీలకమైన ఎఫ్- 35 ఫైటర్ జెట్స్ ఎయిర్ బేస్ సైతం ధ్వంసమైందని ప్రకటించింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివ్‌కు దక్షిణ దిశగా ఉన్న టెల్ నాఫ్‌లో ఉంటుంది మొస్సాద్ ప్రధాన కార్యాలయం.

అలాగే- బీర్‌షేవా సిటీ సమీపంలో ఉండే నెవాటిమ్ ఎయిర్‌బేస్‌ సైతం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిపింది. ఎఫ్- 35 ఫైటర్ జెట్స్‌కు ఆదే ప్రధాన కేంద్రం. తాజా దాడుల్లో ఈ ఎయిర్ బేస్ ధ్వంసమైనట్లు ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ మహ్మద్ బఘేరి తెలిపారు. దీనితో పాటు నెట్జరిమ్ మిలటరీ ఫెసిలిటీని ధ్వంసం చేసినట్లు చెప్పారు.

జులై 31వ తేదీన తమ దేశంలో హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా, ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ అబ్బాస్ నిల్ఫొరౌషన్ దారుణ హత్యకు నిరసనంగానే ఈ దాడులు చేపట్టినట్లు బఘేరి స్పష్టం చేశారు. మున్ముందు ఈ దాడులు మరింత తీవ్రతరం చేస్తామని తేల్చి చెప్పారు.

కోర్‌ అర్బన్‌ రీజియన్‌ పరిరక్షణ హైడ్రాకే: దానకిశోర్‌

తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న ఏరియా) పరిధిలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలన్నింటినీ పరిరక్షించే బాధ్యతలను హైడ్రా తీసుకుంటుందని, ఓఆర్‌ఆర్‌ లోపల విపత్తుల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణకు కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్‌(M. Danakishore) అధికారులను ఆదేశించారు.

తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న ఏరియా) పరిధిలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలన్నింటినీ పరిరక్షించే బాధ్యతలను హైడ్రా తీసుకుంటుందని, ఓఆర్‌ఆర్‌ లోపల విపత్తుల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణకు కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్‌(M. Danakishore) అధికారులను ఆదేశించారు. గవర్నింగ్‌ బాడీ హైడ్రా కోసం ప్రత్యేక పాలసీ రూపకల్పన చేయనున్న నేపథ్యంలో సహకారం అందించేందుకు దానకిషోర్‌ అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (టీసీయూఆర్‌) డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ సబ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు.

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ(GHMC, HMDA), వాటర్‌ వర్క్స్‌, హైడ్రా, రెవెన్యూ, పోలీసు, అటవీ, అగ్నిమాపకశాఖ, మునిసిపాలిటీలు, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా దానకిషోర్‌ మాట్లాడుతూ కోర్‌ అర్బన్‌ రీజియన్‌లో ఉన్న అన్ని లేక్స్‌ల మ్యాపింగ్‌ కోసం ప్రొఫెషన్‌ ప్రభుత్వ ఏజెన్సీతో స్టడీ చేయించాలన్నారు. ఓఆర్‌ఆర్‌ లోపల ఫ్లడ్‌, అగ్నిప్రమాదాలు సంభవించే ప్రాంతాలు, ట్రాఫిక్‌ రిలేటెడ్‌ ఆక్రమణలు, వాటర్‌ లాగింగ్‌ తదితర వాటిని మ్యాపింగ్‌ చేపట్టాలన్నారు.

ఓఆర్‌ఆర్‌ లోపల ప్రకృతి విపత్తులు, ఆస్తుల పరిరక్షణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని హైడ్రాకు అందజేయాలని ముఖ్య కార్యదర్శి సూచించారు. సమావేశంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి రాకేశ్‌ మోహన్‌ డోబ్రియాల్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌, సీఎండీ ముషారఫ్‌ అలీ, వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, కలెక్టర్లు అనుదీప్‌, శశాంక, గౌతమ్‌, వల్లూరు క్రాంతి, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, జాయింట్‌ సీపీ జోయల్‌ డెవిస్‌, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై నాలుగు జిల్లాల కలెక్టర్లతో కమిటీ ఏర్పాటు చేయగా.. కమిటీ చైర్మన్‌గా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శశాంక, మిగతావారిని సభ్యులుగా నియమించారు. పది రోజుల్లో కమిటీ నివేదిక అందించాలని దానకిశోర్‌ సూచించారు. అదేవిధంగా ఓఆర్‌ఆర్‌ లోపల అన్ని ప్రభుత్వ ఆస్తులకు జియో ట్యాగింగ్‌ చేసే బాధ్యతను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలికి అప్పగించారు.

ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు..

ప్రకృతిని ఆరాధిస్తూ.. తీరొక్క పువ్వులను దేవతా స్వరూపంగా భావించి పూజించే ఏకైక పండుగ మన బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతికి చిహ్నం, అస్తిత్వానికి ప్రతిరూపం మన బతుకమ్మ. సమైక్య పాలనలో ఆదరణకు నోచుకోని మన బతుకమ్మ పండుగ.

తెలంగాణ (Telangana) సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ సంబురాలు నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలుకానున్నాయి. ఈరోజు నుంచి తొమ్మిదిరోజుల పాటు పూల పండుగను జరుపుకోనున్నారు తెలంగాణ ఆడపడుచులు. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ షురూ కానుంది. ఒక్కో రోజు ఒక్కో పేరుతో పిలుస్తూ బతుకమ్మ పండుగను మహిళలు జరుపుకోనున్నారు.

ప్రతీ రోజు ఒక్కో రకం నైవేద్యాన్ని తయారు చేస్తారు. అలాగే వివిధ రకాల పూలతో బతుకమ్మను పేరుస్తారు. ఈ పండుగకు పెళ్లైన ఆడపడుచులు తమ పుట్టింటికి వచ్చి బతుకమ్మను పేర్చి సంబరాల్లో పాల్గొంటారు. ఈరోజు నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ ఆడపడుచులకు పూల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ విషెస్ తెలిపారు.

నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులందరూ ఎంతో సంబురంగా జరుపుకునే బతుకమ్మ పండగ తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రత్యేకమైనదన్నారు. ‘‘ప్రకృతిని ఆరాధిస్తూ.. తీరొక్క పువ్వులను దేవతా స్వరూపంగా భావించి పూజించే ఏకైక పండుగ మన బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతికి చిహ్నం, అస్తిత్వానికి ప్రతిరూపం మన బతుకమ్మ. సమైక్య పాలనలో ఆదరణకు నోచుకోని మన బతుకమ్మ పండుగ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. ఆటపాటలతో, ఆనందోత్సాహాల మధ్య తెలంగాణ ఆడబిడ్డలందరూ బతుకమ్మ పండుగ జరుపుకోవాలని కోరుతూ...ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు

జంట’గా గంజాయి విక్రయాలు..

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట నేరాలబాట పట్టింది. డబ్బు సంపాదన కోసం గంజాయి విక్రయిస్తూ చివరకు పోలీసులకు పట్టుబడి కటకటాలపాలైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా మాచర్ల(Macharla)కు చెందిన యాపర్తి గోపి(25), ఉమాహేశ్వరి(24) ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట నేరాలబాట పట్టింది. డబ్బు సంపాదన కోసం గంజాయి విక్రయిస్తూ చివరకు పోలీసులకు పట్టుబడి కటకటాలపాలైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా మాచర్ల(Macharla)కు చెందిన యాపర్తి గోపి(25), ఉమాహేశ్వరి(24) ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

చిన్నచిన్న పనులు చేసినా ఆదాయం చాలలేదు. గంజాయి సరఫరా చేసే బంధువు శివనాగరాజు వారికి పరిచయమయ్యాడు. అతడు 2 కేజీల నుంచి 5 కేజీల వరకు హోల్‌సేల్‌గా గంజాయి విక్రయించేవాడు.

దాన్ని 200 గ్రాముల ప్యాకెట్లుగా మార్చి స్కూటీపై దంపతులిద్దరూ హైదరాబాద్‌(Hyderabad)కు వచ్చి, విక్రయించి వెళ్లిపోయేవారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌వోటీ పోలీసులు ఎల్‌బీనగర్‌ మెట్రోస్టేషన్‌(LB Nagar Metro Station) వద్ద కాపుకాసి గంజాయి విక్రయిస్తున్న గోపి, ఉమాహేశ్వరి దంపతులతోపాటు కొనుగోలు చేస్తున్న నాగోలుకు చెందిన ప్రభుచరణ్‌(23), నగేష్(24)లను అదుపులోకి తీసుకొని ఎల్‌బీనగర్‌ పోలీసులకు అప్పగించారు.

వారి నుంచి సుమారు కిలో గంజాయి, 3 సెల్‌ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం దర్యాప్తు చేస్తున్నారు.

అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం - కేంద్రానికి లేఖ, కీలక మలుపు..!!

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక అడుగు పడింది. ప్రపంచ బ్యాంకు నుంచి రూ 15 వేల కోట్ల రుణానికి సంబంధించి సూత్రపాయంగా ఆమోదం లభించింది .ఈ మేరకు కేంద్రానికి ప్రపంచ బ్యాంకు నుంచి లేఖ అందింది. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలోనే ఈ మొత్తం సీఆర్డీఏకు అందనున్నాయి. అదే సమయంలో ఏపీకి రుణంగా ఇస్తున్న ఈ మొత్తం లోనూ కేంద్ర వాటా పైన స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.

రాజధాని అమరావతికి కేంద్ర బడ్జెట్ లో రూ 15 వేల కోట్ల మేర రుణ సదుపాయం కల్పిస్తామని ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు అమరావతిలో పర్యటించారు, ఏపీ సీఎంతో పాటుగా సీఆర్డీఏ అధికారులతో సమావేశాలు నిర్వహించారు. తాజాగా కేంద్రానికి ప్రపంచ బ్యాంకు ఏపీ రాజధాని కోసం రూ 15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ లేఖ రాసింది. దీంతో, రుణం మంజూరుకు సంప్రదింపులు వేగవంతం అయ్యాయి. అందులో భాగంగా కేంద్ర ఆర్దిక శాఖ అధికారులతో ప్రపంచ బ్యాంకు అధికారులు ఈ రోజు కీలక సమావేశం నిర్వహించనున్నారు.

ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలోనే ఈ మొత్తం సీఆర్డీఏకు అందనుంది. రాజధానిలో మౌళిక వసతుల కల్పనతో పాటుగా భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లే అవుట్ ల డెవలప్ మెంట్, శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాయల భవనాల టవర్ల నిర్మాణానికి రూ 49 వేల కోట్ల ఖర్చు అవసరమని సీఆర్డీఏ అంచనా వేసింది. ఈ నెల 15వ తేదీ నాటికి సంతకాల ప్రక్రియ ముగియనుంది. ఆ వెంటనే రుణం మొత్తంలో 25 శాతం అంటే రూ 3,750 కోట్లు అడ్వాన్స్ గా తీసుకునే అవకాశం ఉంటుంది. నవంబర్ లో ఈ మొత్తం అందుతాయని అంచనా వేస్తున్నారు.

ఇక, ఏపీ రాజధానికి ప్రపంచ బ్యాంకు.. ఏడీబీ రుణం ఇస్తున్నా అది ఏపీ ప్రభుత్వం పైన భారం పడదని ఆర్దిక శాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులిస్తోంది. ఈ రుణం పై 15 ఏళ్ల మారిటోరియం ఉంటుంది. చెల్లించాల్సిన వడ్డీ నాలుగు శాతం లూపే ఉంటుందని చెబుతున్నారు. ఈ రుణం లో కేంద్రం 90 శాతం..రాష్ట్రం 10 శాతం చొప్పున భరించనున్నట్లు అధికారులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులను కూడా కేంద్రం వేరే నిధుల నుంచి సర్దుబాటు చేస్తుందని చెబుతున్నారు. అయితే, రుణం మంజూరు..విధి విధానాల పైన వచ్చే వారం ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. తాజా రుణంతో అమరావతి నిర్మాణం వేగవంతం అయ్యే అవకాశం ఉంది.

ఆలయాలల్లో ప్రభుత్వాల జోక్యం వద్దు: వీహెచ్‌పీ డిమాండ్

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారనే ఆరోపణలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి‌తో విచారణ చేయించి బాధ్యులైన దోషులను చట్టపరంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ‘‘తిరుమల లడ్డు ప్రసాదం’’లో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడినట్లు ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విశ్వహిందూ పరిషత్ ప్రతినిధుల బృందం సోమవారం తిరుపతిలో కేంద్రీయ మార్గదర్శక మండలి సమావేశం నిర్వహించింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకు అన్న భాండాగారంగా, ఆధ్యాత్మిక భాండాగారంగా సనాతన ధర్మానికి నిలయంగా ఉందన్నారు. హిందువులు పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదంపై వివాదం చెలరేగడం విచారకరం అన్నారు.

 

ఆలయ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం, ఆలయ నిర్వాహణ బాధ్యతలలో అన్య మతస్థులను నియమించడం తదితర కారణాల మూలంగా ఆలయ పవిత్రతకు విఘాతం కలుగుతోందని వీహెచ్‌పీ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలోని హిందూ ప్రార్థనా స్థలాలపై ప్రభుత్వ నియంత్రణ రాజ్యాంగ నిబంధనలు వివిధ కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా కొనసాగుతోందని..తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాలు ఆలయ, వ్యవహారాల్లో జోక్యం విరమించుకుని హిందువుల మత స్వేచ్ఛను గౌరవించాలని వీహెచ్‌పీ కేంద్రీయ మార్గదర్శక మండలి సభ్యులు కోరారు.

దేవాలయాల నిర్వాహణ బాధ్యతలను ధార్మిక పరిషత్ బోర్డులకు అప్పగించాలని ఈ సందర్భంగా వీహెచ్‌పీ కేంద్రీయ మార్గదర్శక మండలి తీర్మానించింది. ఈ బోర్డులు ఆలయ నిర్వాహణ బాధ్యతలను ప్రజాస్వామ్య, సమ్మిళిత విధానాన్ని అనుసరించే విధంగా ఉండాలని తెలిపారు.

 

ఈ బోర్డులో ప్రధానంగా సాధువులు, హిందూ సంస్థలు, పండితులతో పాటు భక్తులు సభ్యులుగా ఉండాలన్నారు. హిందువులు వారి స్వంత మతపరమైన సంస్థలను నిర్వహించే దిశగా ప్రభుత్వాలు తీసుకునే చర్యలు వివిధ వర్గాల మధ్య సామరస్యంతో పాటు విశ్వసాన్ని, గౌరవాన్ని పెంపొందించగలవని విశ్వ హిందూ పరిషత్ స్పష్టం చేసింది.

హిందూ దేవాలయాల పవిత్రతను కాపాడేందుకు, వాటి స్వయంప్రతిపత్తిని నిర్థారించే విషయంలో వీహెచ్‌పీ రాజీ పడదని పునరుద్ఘటించింది. ఈ కేంద్రీయ మార్గదర్శక మండలి సమావేశంలో పూజ్య శ్రీ విరజానంద స్వామి, పూజ్య శ్రీ సంగ్రామ మహారాజు, పూజ్య శ్రీ బెనారస్ బాబూ గురూజీ, పూజ్య శ్రీ కమలానంద భారతి స్వామీజీ, పూజ్యశ్రీ స్వస్వరూపానంద గిరి స్వామీజీ, శ్రీ బజరంగ్ బాగ్డ, శ్రీ గుమ్మళ్ళ సత్యం పాల్గొన్నారు.

దేశంలో హిందూ బోర్డు ఏర్పాటు చేయండి : బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి

బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతులు ధీరేంద్ర శాస్త్రి (బాగేశ్వర్ బాబా) భారత ప్రభుత్వం ముందు కీలక డిమాండ్ వుంచారు. ‘సనాతన్ హిందూ బోర్డు’’ ను దేశంలో ఏర్పాటు చేయాలని సూచించారు. దేశంలో వక్ఫ్ బోర్డు అనేది ఒకటి వుందని, అలాగే దేశంలోని హిందువులకు ఓ బోర్డు ఎందుకు వుండొద్దని సూటిగా ప్రశ్నించారు.

దేశంలో వెంటనే సనాతన హిందూ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. హిందూ సమాజం సంస్థాగతంగా బలంగా నిర్మాణం కావాలని, హిందూ సమాజానికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని అన్నారు.

 

ఈ కుట్రలను, మోసాలను అరికట్టడానికే ఇలా చేయాలన్నారు. హిందూమతం సమాజాన్ని, ప్రజలను, హిందూ సాంస్కృతిని, హిందువుల హక్కులను రక్షించడానికి వక్ఫ్ తరహాలోనే హిందూ బోర్డు రావాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పారు.

హిందూ సమాజం ఇప్పుడు బలహీన స్థితిలో వుందని, అందుకే సమాజ భద్రత, స్వేచ్ఛ కోసం సంఘటితం కావాలన్నారు. ఇీవలే మధ్యప్రదేశ్ సీఎం జైన్ బోర్డు విషయంలో తనతో చర్చించారని, ఇలాంటి పరిస్థితుల్లో వక్ఫ్ బోర్డు మాదిరిగానే.. హిందూ బోర్డు ఎందుకు ఏర్పాటు చేయకూడదో చెప్పాలని నిలదీశారు.

శ్రీవారి లడ్డూ, అసలు మ్యాటర్ బయటపెట్టేసిన టీటీడీ ఉద్యోగులు

తిరుమల శ్రీవారి లడ్డుల తయారి కోసం కల్తీ నెయ్యి ఉపయోగించారనే ఆరోపణల వ్యవహారం ఊహించిన మలుపు తిరిగింది. శ్రీవారి లడ్డూల తయారీ కోసం కల్తీ నెయ్యి వాడారని, ఆ కల్తీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గుజరాత్ కు చెందిన ల్యాబ్ నివేదిక ఆధారంగానే తాను ఈ విషయం బయటపెట్టానని సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నారు.

మా ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి లడ్డూల తయారీ కోసం కల్తీ నెయ్యి ఉపయోగించ లేదని, స్వచ్ఛమైన నెయ్యి ఉపయోగించామని మాజీ జగన్, టీటీడీ మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి అంటున్నారు. అయితే ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. తిరుమల శ్రీవారి ఆలయంలోని లడ్డు పోటులో వైష్ణవ బ్రాహ్మణులు ఎంతో నిష్టతో, నియమ నిబంధనలతో శ్రీవారి లడ్డులు తయారు చేస్తుంటారు. శ్రీవారి లడ్డూల తయారీ కోసం నాసిరకం నెయ్యి, నాసిరకం జీడిపప్ప, నాసిరకం యాలకులు, నాసిరకం దినుసులు ఉపయోగించారని లడ్డు పోటులో పనిచేసే సిబ్బంది ఆరోపిస్తున్నారు.

ఈ విషయం అప్పట్లో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు ఏమాత్రం పట్టించుకోలేదని, పెద్దలను ఎదిరించి ఏమీ చేయలేని పరిస్థితుల్లో తాము శ్రీవారి లడ్డూలు తయారు చేశామని తిరుమల లడ్డు పోటులోని కొందరు ఉద్యోగులు, అక్కడ పని చేస్తున్న సిబ్బంది వాపోతున్నారు. శ్రీవారి ఆలయంలో రోజుకి సుమారు మూడు లక్షలకు పైగానే లడ్డూలు తయారు చేస్తారు. ఈ లడ్డుల తయారీ కోసం 14 టన్నుల నెయ్యిని ఉపయోగిస్తామని లడ్డు పోటు సిబ్బంది అంటున్నారు.

తిరుమలలో 82,000 కిలోలకు పైగా సామర్థ్యం ఉన్న మూడు నెయ్యి యూనిట్లు ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ బాబాయ్ వైవీ. సుబ్బారెడ్డి రెండు సార్లు టీటీడీ చైర్మన్ గా పని చేశారు.. సాధారణంగా తిరుమల మాడవీధుల్లో తిరుగుతుంటే శ్రీవారి లడ్డూల తయారు చేస్తున్న సువాసనకి తిరుమల భక్తులు పరవశించి పోయేవారు. అదంతా గతంలో అని భక్తులు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీవారి లడ్డు చేతిలో పట్టుకున్నా సువాసన రావడంలేదని ఇటీవల కాలంలోని తిరుమల భక్తుల ఆరోపించిన విషయము తెలిసిందే.

నాసిరకం నెయ్యి, యాలుకలు, నాసిరకం దినుసులు, జీడిపప్పు వాడితే ఎలా సువాసన వస్తుందని, ఈ విషయంపై అప్పటి టీటీడీ డిప్యూటీ ఈవో, సూపరెండెంట్ల దృష్టికి తీసుకెళ్లామని, నాసిరకం నెయ్యి ఉపయోగించినా, నిసిరకం దినుసులు లడ్డూలు తయారు చెయ్యడానికి ఉపయోగిస్తే సువాసన రాదని తాము పదే పదే చెప్పినా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదని, ఉన్నతాధికారులను ఎదిరించి తాము ఏమీ చేయలేక సైలెంట్ గా ఉండి పోయామని తిరుమల శ్రీవారి లడ్డు పోటులో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

మొత్తం మీద శ్రీవారి లడ్డు పోటులో పనిచేస్తున్న ఉద్యోగులే నాసిరకం నెయ్యి లడ్డూల తయారీ కోసం ఉపయోగించామని ఇప్పుడు బయట పెట్టడంతో ప్రస్తుత టీటీడీ ఈవో శ్యామలరావు ఆ విషయంపై దృష్టి సారించారని తెలిసింది. శ్రీవారి లడ్డు పోటు సిబ్బంది ఫిర్యాదు చేసిన సమయంలో పనిచేసిన డిప్యూటీ ఈవో, సూపరెండెంట్ల వివరాలు తెలుసుకున్న టీటీడీ ఈవో శ్యామలరావు త్వరలోనే వారి పైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.

మొత్తం మీద నాసిరకం నెయ్యి ఉపయోగించి శ్రీవారి లడ్డూలు తయారు చేశారని, లడ్డు పోటులో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఆరోపించడం కలకలం రేపుతుంది. తిరుమల శ్రీవారి ఆలయం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సైతం గతంలో శ్రీవారి లడ్డూలో నాణ్యత లేదని, సువాసన లేదని నాసిరకం నెయ్యి, యాలకులు, జీడిపప్పు, నాసిరకం దినుసులు లడ్డూలు తయారు చెయ్యడానికి ఉపయోగిస్తున్నారని, ఈ విషయంపై అధికారులు దృష్టి సారించాలని పలుసార్లు ఆరోపించారు.

అయితే శ్రీవారి ఆలయం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోని టీటీడీ అధికారులు అలాగే లడ్డులు తయారు చేశారని శ్రీవారి భక్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు శ్రీవారి లడ్డుల తయారీలో నాసిరకం నెయ్యి ఉపయోగించారని వెలుగు చూడడంతో అప్పట్లో లడ్డూల తయారీకి ఇన్ చార్జ్ లుగా ఉన్న సూపరెండెంట్లు ఇప్పుడు భయంతో హడలి పోతున్నారని సమాచారం.

తిరుమల శ్రీవారి లడ్డు పోటులో లడ్డూలు తయారు చేస్తున్న ఉద్యోగులు చేసిన ఆరోపణలపై టీటీడీ ఉన్నతాధికారులు, టీటీడీ విజిలెన్స్, శ్రీవారి లడ్డూల కల్తీ నెయ్యి వ్యవహారంపై కూటమి ప్రభుతం ఏర్పాటు చేసిన ప్రత్యేక సిట్ అధికారులు దృష్టి సారించారని, లడ్డు పోటులో పని చేస్తున్న ఉద్యోగుల నుండి వివరాలు సేకరిస్తున్నారని తెలిసింది. శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి, నాసిరకం నెయ్యి ఉపయోగించారని లడ్డు పోటులో పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోపించడం కలకలం రేపుతోంది.

నగరం చుట్టూ డంపింగ్‌ యార్డులు..

మహానగరం చుట్టూ డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ(GHMC) కసరత్తు చేస్తోంది. జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుపై వ్యర్థాల భారం తగ్గించేలా ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించారు. ఆ భూములను బల్దియాకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లకు కమిషనర్‌ ఆమ్రపాలి(Commissioner Amrapali) లేఖ రాశారు.

మహానగరం చుట్టూ డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ(GHMC) కసరత్తు చేస్తోంది. జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుపై వ్యర్థాల భారం తగ్గించేలా ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించారు. ఆ భూములను బల్దియాకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లకు కమిషనర్‌ ఆమ్రపాలి(Commissioner Amrapali) లేఖ రాశారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని లేఖలో కోరారు.

ప్యారానగర్‌తో పాటు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలోని ఖానాపూర్‌, సంగారెడ్డి పటాన్‌చెరు(Khanapur, Sangareddy Patancheru) మండలంలోని లక్డారం, దుండిగల్‌, చౌటుప్పల్‌లోని మల్కాపూర్‌ ప్రాంతాల్లో భూములను డంపింగ్‌ యార్డు ఏర్పాటుకు గుర్తించారు. పరిసర ప్రాంతాల ప్రజలకు దుర్వాసన రాకుండా, పర్యావరణంపై ప్రభావం పడకుండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వ్యర్థాల పునర్వినియోగం, నిర్వహణ చేపడతామని అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా తడి చెత్త నుంచి బయో గ్యాస్‌, సేంద్రియ ఎరువులు, పొడి చెత్త నుంచి విద్యుదుత్పత్తికి ఏర్పాట్లు చేయనున్నారు.

ప్యారానగర్‌లోని 152 ఎకరాల స్థలాన్ని డంపింగ్‌ యార్డు కోసం గతంలో గుర్తించారు. రహదారి, ఇతరత్రా నిర్మాణ పనులూ ప్రారంభించారు. స్థానికులు అడ్డుకోవడంతో తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఇక్కడ 15 మెగావాట్ల సామర్థ్యంతో చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్‌ను నిర్మించాలని భావిస్తున్నారు. రోజూ 270 టన్నుల తడి చెత్తతో బయోగ్యాస్‌ ఉత్పత్తికి ఏర్పాటుచేయనున్నారు. చెత్తనూ భూగర్భంలోని బంకర్‌లో వేసి తడి, పొడి చెత్తగా వేరు చేస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా, ప్రస్తుతం నగరంలో రోజూ 7,500 మెట్రిక్‌ టన్నుల చెత్త వెలువడుతోంది. ప్రస్తుతం జవహర్‌నగర్‌లో లక్ష టన్నులకుపైగా టన్నుల వ్యర్థాల తడి, పొడి చెత్త కుప్పలు ఉన్నాయి.