డెలివరీ లొకేషన్ షేర్ చేయమంటూ సందేశం పంపి..
ఇప్పటి వరకు ఫెడెక్స్, సీబీఐ, ఈడీ వంటి సంస్థల పేరుతో కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ఇండియన్ పోస్టల్ సర్వీస్ పేరును కూడా దుర్వినియోగం చేస్తున్నారు. మీ పార్సిల్ డెలివరీ చేసేందుకు లొకేషన్ షేర్ చేయమంటూ సందేశం పంపిన సైబర్ నేరగాళ్లు బాధితుడి క్రెడిట్ కార్డు నుంచి రూ. 1.55 లక్షలు కాజేశారు. మీకు వచ్చిన పార్సిల్ కోసం డెలివరీ లొకేషన్ షేర్ చేయమని, లేకపోతే పార్సిల్ రిటర్న్ అవుతుందని నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి ఫోన్‌కు సందేశం వచ్చింది.
ఇప్పటి వరకు ఫెడెక్స్, సీబీఐ, ఈడీ వంటి సంస్థల పేరుతో కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ఇండియన్ పోస్టల్ సర్వీస్ పేరును కూడా దుర్వినియోగం చేస్తున్నారు. మీ పార్సిల్ డెలివరీ చేసేందుకు లొకేషన్ షేర్ చేయమంటూ సందేశం పంపిన సైబర్ నేరగాళ్లు బాధితుడి క్రెడిట్ కార్డు నుంచి రూ. 1.55 లక్షలు కాజేశారు. మీకు వచ్చిన పార్సిల్ కోసం డెలివరీ లొకేషన్ షేర్ చేయమని, లేకపోతే పార్సిల్ రిటర్న్ అవుతుందని నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి ఫోన్‌కు సందేశం వచ్చింది. పార్సిల్ కోసం ఎదురుచూస్తున్న అతడు లింక్ ఓపెన్ చేశాడు.
ఇండియన్ పోస్టల్ పేరుతో ఉన్న వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేశాడు. డెలివరీ కోసం రూ. 25 క్రెడిట్ కార్డు నుంచి చెల్లించాడు.
కొద్దిసేపటి తర్వాత మీ ఖాతా నుంచి డబ్బులు బదిలీ అయ్యాయన్న సందేశం రాగానే క్రెడిట్ కార్డును బ్లాక్ చేశాడు. బ్యాంకు అధికారులను సంప్రదించగా.. గుర్తుతెలియని వ్యక్తులు అతడి క్రెడిట్ కార్డు నుంచి రూ. 1.55 లక్షలు కాజేసి దుబాయ్‌లో ఉన్న ఖాతాలో జమ చేశారు. సైబర్ నేరగాళ్లు మోసం చేశారని తెలుసుకున్న బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Sep 24 2024, 17:53