కీచక ఆర్.ఎం.పి సమీర్ అరాచకాలు అరికట్టాలి న్యూ లైఫ్ ఆసుపత్రిని సీజ్ చేయాలని ధర్నా
-కచక ఆర్ఎంపిని ఫోక్సో కింద అరెస్టు చేయాలి
-ఆస్పత్రిని సీజ్ చేసి సమగ్ర దర్యాప్తు జరపాలి
-ఆ నలుగురు కీచకులు ఎవరో బహిర్గతం చేయాలి
-ఆర్.ఎం.పి సమీర్ ను కఠినంగా శిక్షించాలి
-బాధిత మహిళలకు ప్రజా సంఘాలు,మహిళలు, మహిళా సంఘాల మద్దతు
-ఆస్పత్రి ముందు రోడ్డుపై బైఠాయించి భారీ రాస్తారోకో
-పోలీసులు, డి ఎం హెచ్ ఓ, కలెక్టర్లకు ఫిర్యాదు
-న్యూ లైఫ్ ఆస్పత్రి సీజ్ చేసే వరకు వెళ్లేది లేదంటూ భీష్మించి కూర్చున్న మహిళలు
ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన మహిళా పట్ల దురుసుగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక ఆర్.ఎం.పి మహమ్మద్ సమీర్ పై ఫోక్సో చట్టం కింద కఠినంగా శిక్షించి ఆసుపత్రిని శాశ్వతంగా సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సాయంత్రం బాధిత మహిళ, అమే కుటుంబ సభ్యులు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఎత్మతాపూర్ గ్రామానికి చెందిన సింగిరెడ్డి స్వప్న అనే మహిళ నాగర్ కర్నూల్ పట్టణంలోని సహస్తా న్యూ లైఫ్ ఆసుపత్రికి జ్వరంతో బాధపడుతూ బుధవారం వచ్చింది. ఆస్పత్రిలో ఉన్న ఆర్ఎంపి వైద్యుడు మహమ్మద్ సమీర్ మహిళను పరీక్షిస్తూ జ్వరం ఎప్పుటి నుంచి వస్తుందని మాటల్లో పెట్టి ఎంతమంది పిల్లలు అని... వివాహమై ఎన్ని సంవత్సరాలు అయిందని అడిగాడని పిల్లలు కాలేదని చెప్పడంతో నీ భర్త వల్ల పిల్లలు పుట్టరు నా వద్దకు మూడు నెలలు వరుసగా వచ్చి నాతోపాటు నా ముగ్గురు స్నేహితుల వద్ద సంసారం చేస్తే మూడు నెలల్లో గ్యారంటీగా గర్భం వస్తుందని చెప్పడంతో తనతో పాటు ఆమె తల్లి బాధితురాలు ఇద్దరు కలిసి ఆర్ఎంపి వైద్యుడు సమీర్ ను నిలదీయగా మెడికల్ షాప్ నిర్వాహకులు తప్పించినట్లు బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ సీఐకి ఫిర్యాదులో పేర్కొంది. బుధవారం ఇంటికి వెళ్లి విషయం భర్త నరేందర్ రెడ్డితోపాటు కుటుంబ సభ్యులకు కన్నీళ్ల పర్యంతమై చెప్పడం జరిగింది. గురువారం రెడ్డి సేవా సమితి బాధ్యులతో పాటు మహిళా సంఘాలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని బాధితులు పేర్కొన్నారు.
ఆస్పత్రిని సీజ్ చేసే వరకు కదిలేది లేదు
నాగర్ కర్నూల్ పట్టణంలోని సమస్త న్యూ లైఫ్ ఆసుపత్రిని సీజ్ చేసే వరకు కదిలేది లేదని బాధితులతో పాటు ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు భీష్మించు కూర్చున్నాయి. కేసు నమోదు చేస్తున్నామని అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ కనకయ్య చెప్పిన సీజ్ చేసే వరకు కదిలేది లేదని ధర్నాతో పాటు రాస్తారోకోను పెద్ద ఎత్తున కొనసాగించారు.
న్యూ లైఫ్ ఆస్పత్రి పై సమగ్ర దర్యాప్తు జరపాలి
మహిళల పట్ల కీచకంగా వ్యవహరిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న న్యూ లైఫ్ ఆసుపత్రి తో పాటు ఆస్పత్రి నిర్వాహకుడు ఆర్ఎంపి మహమ్మద్ సమీర్ పై సమగ్ర విచారణ జరపాలని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మహిళ లు, మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఆస్పత్రిలో అనేక అక్రమాలు వెలుగు చూస్తున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కానీ పోలీసు శాఖ అధికారులు కానీ పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఇప్పటికే అనేక పర్యాయాలు ఈ ఆస్పత్రి పై ఆరోపణలు వచ్చి పలుమార్లు సీజ్ చేసిన తిరిగి ఆసుపత్రిని కొందరు రాజకీయ నాయకుల పలుకుబడితో తెరిపించడం జరిగిందని ఇలాంటి అక్రమార్కలు, దుర్మార్గులు నిర్వహిస్తున్న ఆసుపత్రులను పట్టించుకోవాలని అధికారులను కోరారు.
-అది ఆసుపత్రి యా... వ్యభిచార కూపమా
న్యూ లైఫ్ ఆస్పత్రి పై గత కొన్నేళ్లుగా అనేక ఆరోపణలు వస్తున్న పట్టించుకోవడంలేదని పలువురు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇప్పటికే అనేకమంది ఈ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోతే వారికి డబ్బుతో వెలకట్టి ఏలాంటి కేసులు కాకుండా చూసుకుంటున్నారని పలువురు విమర్శించారు. ఇటీవలే ఒక యువకుడికి సదరు ఆర్.ఎం.పి సమీర్ అతని ఫామ్ హౌస్ లో కిడ్నీ సంబంధిత వ్యాధికి నాటు వైద్యం చేసి అతని ఆరోగ్యం తీవ్రస్థాయిలో క్షీణించడానికి కారణం కాగా అతని కి కూడా కొందరు మధ్యవర్తుల సహాయంతో డబ్బులు ఇచ్చి పత్రాలు రాసుకుని తన ఆసుపత్రిని కాపాడుకున్నాడని పలువురు విమర్శించారు. ఒక మహిళను సంతానం కలగడానికి సమీర్ మాట్లాడిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందని పలువురు తీవ్రస్థాయిలో విమర్శించారు. పిల్లలు కలగడానికి అనేక రకాల వైద్య సాంకేతికత ఉందని దాని ఆధారంగా పిల్లలు కలుగుతారా అని బాధిత మహిళ అడిగితే తనతో పాటు మరో ముగ్గురి స్నేహితుల వద్ద సంసారం చేస్తే కలుగుతారని నిర్లజ్జగా చెప్పడం బట్టి చూస్తే న్యూ లైఫ్ ఆసుపత్రిలో వైద్యం కంటే వ్యభిచారమే జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పలువురు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆ నలుగురు ఎవరో డాక్టర్ సమీర్ ను విచారించి పోలీసులు అధికారులు బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఆస్పత్రిని మూయించిన సీఐ కనకయ్య
న్యూ లైఫ్ ఆసుపత్రి నిర్వాహకుడు ఆర్ఎంపి మహమ్మద్ సమీర్ ను అరెస్టు చేసి ఆసుపత్రిని సీజ్ చేయాలని ఆందోళన కారులు పట్టుబట్టడంతో సీఐ కనకయ్య వైద్యశాఖ అధికారులను సంప్రదించారు. డి ఎం హెచ్ ఓ అందుబాటులో లేరని అధికారులకు సమాచారం అందించి 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఆసుపత్రిని మెడికల్ షాపును బంద్ చేయించారు.
-న్యూ లైఫ్ ఆసుపత్రి ఆర్.ఎం.పి సమీపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు
న్యూ లైఫ్ ఆసుపత్రిని సీజ్ చేసి ఆర్ఎంపి సమీ పై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, మహిళా సంఘాల నాయకులు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడమే కాకుండా రాష్ట్ర మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ సభ్యుల కు ఫిర్యాదు చేసి వారిని నాగర్ కర్నూల్ కు రప్పించి ఈ దురాగతాలను బహిర్గతం చేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు. సీఐ కనకయ్య హామీతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలోబిజెపి నాయకులు జిల్లా జనరల్ సెక్రెటరీ ప్రమోద్ కుమార్, రాజేష్ రెడ్డి, లోహిత్ రెడ్డి, ఆంజనేయులు, ఎలిమి రాము, బొట్టు శ్రీను, శకుంతల, బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి,కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న. జిల్లా కమిటీ సభ్యుడు కృష్ణ
సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు అశోక్, రామయ్య, సురేష్
సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు వార్ల వెంకటయ్య, శివ, గోపి చారి,టిఆర్ఎస్ నాయకులు మాజీ రైతుబంధు మండల అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, లింగారెడ్డి,రెడ్డి సేవా సమితి సభ్యురాలు దొడ్ల ఇందుమతి, దొడ్ల రాధారెడ్డి, శకుంతల, నారాయణరెడ్డి, సుధాకర్ రెడ్డి, మైనారిటీ నాయకులు హబీబ్ తదితరులు పాల్గొన్నారు
Sep 19 2024, 20:31