నేడు చలో ప్రజాభవన్.. రుణమాఫీ కాని రైతుల పిలుపు
రుణమాఫీ అమలుకాని రైతులు పోరుబాట పట్టారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్న డిమాండ్‌తో గురువారం చలో ప్రజాభవన్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే బ్యాంకుల ముందు, ప్రభుత్వ ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తున్న రుణమాఫీ కాని రైతులు సోషల్‌మీడియా వేదికగా ఏకమవుతున్నారు.
రుణమాఫీ అమలుకాని రైతులు పోరుబాట పట్టారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్న డిమాండ్‌తో గురువారం చలో ప్రజాభవన్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే బ్యాంకుల ముందు, ప్రభుత్వ ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తున్న రుణమాఫీ కాని రైతులు సోషల్‌మీడియా వేదికగా ఏకమవుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం చలో ప్రజాభవన్‌కు తరలిరావాలంటూ సోషల్‌మీడియా వేదికగా ఒక యువ రైతు ఇచ్చిన పిలుపు వైరల్‌గా మారింది. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా రైతులంతా ఏకమై పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తిచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీపై రైతులకు ఇచ్చిన మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నెల 20న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో రుణమాఫీపై నిర్ణయం తీసుకొనేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతులంతా తరలిరావాలని కోరారు. తమ పోరాటానికి అన్ని కుల సంఘాలు మద్దతు తెలపాలని కోరారు. రుణమాఫీ కాలేదనే బాధ తో రైతులు చనిపోతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఏకమవుతున్న రైతులు చలో ప్రజాభవన్ ఆందోళనకు తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
ఎక్కడికక్కడ గ్రామాల వారీగా రుణమాఫీ కాని రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల సమయంలో ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. అయితే కఠిన నిబంధనలు, షరతులతో అర్హులైన రైతుల సంఖ్యలో కోత పెట్టారు. దాదాపు 70 లక్షల మంది రుణ గ్రహీతలు ఉండగా 42 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు 23 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసింది. ప్రభుత్వం పేర్కొ న్న అన్ని అర్హతలు ఉన్న రైతుల్లో చాలామందికి ఇంకా మాఫీ కాలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
Sep 19 2024, 11:25