/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz భారీ వర్షాలు.. బొర్రా గుహలు మూసివేత Raghu ram reddy
భారీ వర్షాలు.. బొర్రా గుహలు మూసివేత

భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎక్కడిక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అరకులోయ ప్రముఖ పర్యాటక కేంద్రం బొర్రా గుహలను మూసివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా బొర్రా గుహాల పర్యాటక కేంద్రాన్ని మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

భారీ వర్షాలు (Heavy Rains) జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎక్కడిక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అరకులోయ ప్రముఖ పర్యాటక కేంద్రం బొర్రా గుహలను మూసివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా బొర్రా గుహాల పర్యాటక కేంద్రాన్ని మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే చాపరాయి, కటికి జలపాతాలు, పద్మాపురం ఉద్యానవన కేంద్రం, గిరిజన మ్యూజియంలను మూసివేశారు. అలాగే అరకు ఘాట్ రోడ్డులో రాకపోకలను నిలిపివేశారు. ప్రస్తుతం అరకుకు పర్యాటకులు వెళ్లకపోవడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

మరోవైపు... మెగాద్రిగడ్డ రిజర్వాయర్ నీటి మట్టాన్ని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 61 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 57.4 అడుగులు చేరుకుందన్నారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాలలో వర్షం లేకపోవడంతో ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరిగినట్లయితే 6 గేట్లలో 4 గేట్లు తెరవడానికి ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారన్నారు. డ్యాం దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలను ఇరిగేషన్ అధికారులు అప్రమత్తం చేసి గేట్లు తెరిచే అవకాశం ఉందన్నారు. ప్రజల తాగునీటి కొరకు మేఘాద్రి గడ్డ డ్యామ్‌ను నింపుకోవడం జరుగుతుందన్నారు. రాబోయే కాలంలో ఈ నీటిని మంచి నీరుగా పనికొస్తుందని తెలిపారు. రిజర్వాయర్లలో నీళ్లు ఎక్కువగా ఉండడంతో ఈతలు కొట్టడానికి దిగవద్దని కలెక్టర్ సూచించారు.

కాగా.. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీంతో రానున్న 48 గంటల పాటు ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. అటు సీలేరు కాంప్లెక్స్‌లోని డొంక‌రాయి జ‌లాశ‌యంకు ఎగువ ప్రాంతం నుంచి అధిక‌సంఖ్య‌లో నీటినిల్వ‌లు వ‌స్తున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి డొంక‌రాయి జ‌లాశ‌యం నుంచి లక్ష 10వేలు క్యూసెక్కులు నీటిని దిగువ‌కు విడుద‌ల‌ చేశారు అధికారులు. డొంక‌రాయి జ‌ల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్ప‌త్తి అనంత‌రం ప‌వ‌ర్ కెనాల్ నుంచి 4వేల క్యూసెక్కులు నీటిని విడుద‌ల‌ చేశారు.డొంక‌రాయి జ‌లాశ‌యానికి లక్ష 10వేలు క్యూసెక్కులు నీటి నిల్వ‌లు ఇన్‌ఫ్లోగా వ‌స్తున్నాయి.

మరోవైపు రెండు రోజుల వర్షానికి ఏజెన్సీలో కొండ చరియలు విరిగిపడి ఆదివాసీల గృహాలు ధ్వంసమయ్యాయి. ఒక బాలిక వరదలో గల్లంతైంది. నలుగురు గిరిజనులకు గాయాలయ్యాయి. గూడెం కొత్తవీధి మండలం గాలికొండ పంచాయితీ చట్రపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి భారీగా కురిసిన వర్షానికి కొండపై నుంచి కొండచరియలు జారిపడ్డాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని గిరిజన గ్రామాల ప్రజలు మొర పెట్టుకుంటున్నారు.

మళ్ళీ బై ఎలక్షన్ రావడం ఖాయం.. ఎర్రబెల్లి హాట్ కామెంట్స్

మూడు స్థానాల్లో మళ్ళీ బై ఎలక్షన్ రావడం ఖాయం.. మాజీ మంత్రి ఎర్రబెల్లి హాట్ కామెంట్స్ చేశారు. జనగామ జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ మారిన ఎమ్మెల్యేల పై హై కోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలపై ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హై కోర్టు నాలుగు వారాలలో చర్యలు తీసుకోవాలని స్పీకర్ కి ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు.

నాలుగు వారాలలో చర్యలు తీసుకోకపోతే తామే సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకోవాల్సివస్తుందని హై కోర్టుక తెలిపిందన్నారు. మూడు స్థానాల్లో మళ్ళీ బై ఎలక్షన్ రావడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యధిక మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. నేడు పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించింది. అనర్హత పిటిషన్లు స్పీకర్‌ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశించింది. ఎప్పటి వరకు వాదనలు వినాలి, ఎప్పటిలోగా ప్రొసీడింగ్స్‌ పూర్తి చేయాలన్న దానిపై షెడ్యూల్‌ విడుదలకు హైకోర్టు ఆదేశించింది.

నాలుగు వారాల్లో స్టేటస్‌ రిపోర్ట్‌ ఇవ్వాలని హైకోర్టు కోరింది. నాలుగు వారాల్లో షెడ్యూల్‌ విడుదల చేయకపోతే సుమోటోగా విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. పిటిషన్ల విచారణపై షెడ్యూల్‌ రిలీజ్‌ చేయాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, బీఆర్‌ఎస్ బీ-ఫారంపై ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సోమవారం వాదనలు ముగించింది. అయితే.. కోర్టు తీర్పుతో బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలలో టెన్షన్ మొదలైంది.

నేడు 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. బీమాతోపాటు కీలక అంశాలపై నిర్ణయం

నేడు 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం(54th GST Council meeting) ఢిల్లీలో(delhi) జరగనుంది. ఈ సమయంలో బీమా ప్రీమియం, ఆన్‌లైన్ గేమింగ్ సహా పలు పన్నుల విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఆరోగ్య బీమా ప్రీమియంలపై విధించే జీఎస్టీ, రాబడి ప్రభావంపై ఫిట్‌మెంట్ కమిటీ నివేదిక సమర్పించనుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఈ కమిటీలో కేంద్ర, రాష్ట్ర పన్నుల అధికారులు ఉంటారు. మండలిలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్(nirmala sitharaman) అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి తెలంగాణ నుంచి ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క హాజరుకానున్నారు. మరోవైపు ఏపీ నుంచి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఇతర అధికారులు పాల్గొననున్నారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitharaman) నేతృత్వంలోని జీఎస్‌టి కౌన్సిల్ ఆరోగ్య బీమాపై పన్నును ప్రస్తుత 18 శాతం నుంచి తగ్గించాలా లేదా సీనియర్ సిటిజన్‌ల వంటి కొన్ని వర్గాలకు మినహాయింపు ఇవ్వాలా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతోపాటు జీవిత బీమా ప్రీమియంపై వస్తు సేవల పన్ను తగ్గింపుపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. బీమా ప్రీమియంపై పన్ను అంశంపై ఇప్పటికే ప్రతిపక్షాలు పార్లమెంటులో లేవనెత్తారు. ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలను జీఎస్టీ నుంచి తప్పించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశాయి. దీంతోపాటు ఈ విషయంపై సీతారామన్‌కు రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా లేఖ రాశారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక బిల్లుపై చర్చకు సమాధానమిస్తూ 75 శాతం జీఎస్‌టీ వసూళ్లు రాష్ట్రాలకు వెళ్తాయని, జీఎస్‌టీ కౌన్సిల్‌లో ప్రతిపాదన తీసుకురావాలని ప్రతిపక్ష సభ్యులు తమ రాష్ట్ర ఆర్థిక మంత్రులను కోరాలని అన్నారు. పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య గత నెలలో రేట్ల హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం (GoM) సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. తదుపరి విశ్లేషణ కోసం ఈ అంశాన్ని ఫిట్‌మెంట్ కమిటీకి సిఫార్సు చేశారు.

మంత్రుల బృందం (GoM) ప్రస్తుత నాలుగు స్థాయి GST స్లాబ్‌లు 5, 12, 18, 28 శాతంలో ఏదైనా మార్పుపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసింది. వస్తువులు, సేవల రేట్లను హేతుబద్ధీకరించే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని గ్రూప్ ఫిట్‌మెంట్ కమిటీని కోరింది. మరోవైపు ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర పన్ను అధికారులు జీఎస్టీ కౌన్సిల్ ముందు స్టేటస్ రిపోర్టును అందజేస్తారు. నివేదికలో అక్టోబర్ 1, 2023కి ముందు, తర్వాత ఆన్‌లైన్ గేమింగ్ సెక్టార్ నుంచి GST రాబడి సేకరణ ఉంటుంది. ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, క్యాసినోలు అక్టోబర్ 1, 2023 నుంచి ఎంట్రీ లెవల్ మొత్తాలపై 28 శాతం GSTకి లోబడి ఉంది. అంతకుముందు అనేక ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు 28 శాతం GST చెల్లించడం లేదు.

బీజేపీ అంటే భయం పోయింది.. ప్రజాస్వామ్యంపై దాడిని ప్రజలు అంగీకరించరు : రాహుల్‌

కేంద్రంలోని బీజేపీపై కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కేంద్రంలోని బీజేపీపై కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌.. అక్కడ ప్రవాస భారతీయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు. భారత్‌లో బీజేపీ, ప్రధాని మోదీకి ఎవరూ భయపడరనే (fear of BJP vanished) విషయాన్ని ఇటీవల జరిగిన ఎన్నికలు నిరూపించాయన్నారు. భారత సంప్రదాయాలు, భాషలపై బీజేపీ దాడి చేస్తోందని ఆరోపించారు.

మన సంప్రదాయాలు, భాషపై బీజేపీ దాడి చేస్తోందని ప్రజలు అంటున్నారు. ఆ పార్టీ ఎలాంటిదో వారు గ్రహించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ( Lok Sabha polls) వెలువడిన వెంటనే భారత్‌లో బీజేపీ, భారత ప్రధాని మోదీకి ఎవరూ భయపడరనే విషయం అర్థమైంది.

ప్రజాస్వామ్యంపై దాడిని తాము ఎన్నటికీ అంగీకరించబోమని ప్రజలు ఈ ఎన్నికల ద్వారా స్పష్టంగా చెప్పారు’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. అయితే, రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. భారతదేశాన్ని అవమానించే అలవాటు గాంధీకి ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలక తీర్పు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చే తీర్పునిచ్చింది తెలంగాణ హైకోర్టు. సదరు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. తాము చెప్పినట్లుగా నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే..

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చే తీర్పునిచ్చింది తెలంగాణ హైకోర్టు. సదరు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. తాము చెప్పినట్లుగా నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే.. సుమోటోగా కేసు స్వీకరించి మళ్లీ విచారణ ప్రారంభిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలలో టెన్షన్ పెరిగిపోయింది. అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? హైకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందోనని ఉత్కంఠ నెలకొంది.

ఇదిలాఉంటే.. బీఆర్ఎస్‌ పార్టీ తరఫున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి పై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందగౌడ్‌ తో పాటు.. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో పాటు పలు రాష్ట్రాల్లోని న్యాయస్థానాల తీర్పులను, ఫిరాయింపు చట్టం నిబంధనలను కోర్టు దృష్టి తీసుకెళ్లారు.

ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. పలు దఫాలుగా వాదనలు విన్నది. అనంతరం తీర్పును సోమవారం ఉదయానికి వాయిదా వేసింది. ఈ కేసులో హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది న్యాయస్థానం. మరి స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

స్లూయిజ్ గేట్ల చైన్లు తొలగించి ఉండటం చూసి షాకైన అధికారులు

ఇవాళ ప్రకాశం బ్యారేజ్ స్లూయిజ్ గేట్ల చైన్లను ఇంజినీరింగ్ అధికారులు తొలగించననున్నారు. మొత్తం 10 గేట్లు చైన్లు తొలగించి ఉండటాన్ని చూసి అధికారులు షాక్ అయ్యారు. బ్యారేజ్‌కు ఒకవైపు 6, మరో వైపు నాలుగు స్లూయిజ్ గేట్లు ఉన్నాయి. బ్యారేజ్ నీటి మట్టం తగ్గిన సమయంలో గేట్లు కింద వున్న వ్యర్థాలను బయటకు పంపేందుకు ఈ గేట్లను అధికారులు ఆపరేట్ చేయనున్నారు. ఈ గేట్లకు చైన్లు లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఇప్పటికే బ్యారేజి మూడు గేట్లు కౌంటర్ వెయిట్లను పడవలు గుద్దు కోవడంతో విరిగిపోయిన అంశంపై పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. తాజాగా స్లూయిజ్ గేట్లు చైన్లు ఊడిపోయి ఉండటంతో అధికారుల్లో సందేహాలు తలెత్తాయి. కావాలని చేశారా? లేక నిర్వహణ లేక ఊడిపోయి ఉన్నాయా? అనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ స్లూయిజ్ గేట్లు ఓపెన్ చేస్తే బ్యారేజి నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్ళిపోయే అవకాశం ఉంది.

ఇక ప్రకాశం బ్యారేజీలో దెబ్బతిన్న కౌంటర్‌ వెయిట్ల స్థానంలో కొత్తవాటి ఏర్పాటు పూర్తయింది. దెబ్బతిన్న సిమెంటు దిమ్మెల స్థానం లో ఇనుప వెయిట్లు అమర్చారు. ప్రభుత్వ సలహాదారు, గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడి పర్యవేక్షణలో.. 3 రోజులుగా బెకమ్‌ కంపెనీ నిపుణుల బృందం ఈ పనిలో నిమగ్నమైంది. బ్యారేజీ గేట్ల వెనుక సిమెంట్‌ కౌంటర్‌ వెయిట్లు దన్నుగా ఉన్నాయి. ఇటీవలి వరద ఉధృతికి ఎగువ నుంచి ఇనుప బోట్లు వచ్చి ఢీ కొట్టడంతో 64, 67, 69, 70వ నంబర్‌ గేట్ల వద్ద ఉండే వెయిట్లు దెబ్బతిన్నాయి. వాటిలో 64వ వెయిట్‌ స్వల్పంగా దెబ్బతినడంతో దానిని మార్చాల్సిన అవసరం లేదని నిర్ఱయించారు.

67, 69 కౌంటర్‌ వెయిట్లు మధ్యకు విరిగిపోయాయి. 70వ నంబరు వెయిట్‌ కు పగుళ్లు వచ్చాయి. దీంతో ఈ మూడింటి స్థానంలో స్టీల్‌ వెయిట్లు బిగించారు. వీటిని హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చారు. బిగించిన వెయిట్లలో ఇప్పుడు ఇనుము, సిమెంటు మిశ్రమం పోయాల్సి ఉంది. కొత్త కౌంటర్‌ వెయిట్లను సీఎం చంద్రబాబు ఆదివారం పరిశీలించారు. కన్నయ్యనాయుడు పనుల వివరాలను ఆయనకు వివరించారు. అదే సమయంలో 69వ నంబరు గేటు వద్ద ఇరుక్కుపోయిన మూడు బోట్లను సీఎం పరిశీలించారు. వాటిపై అధికారుల ను ప్రశ్నించారు. ఈ బోట్లపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని వారు బదులిచ్చారు.

ఆపరేషన్ బుడమేరు - "హైడ్రా" మార్క్ ప్లాన్ తో చంద్రబాబు.!!

ఆపరేషన్ బుడమేరుకు ఏపీ ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. విజయవాడ నగరాన్ని ముంచెత్తిన బుడమేరు పై ప్రభుత్వం కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తోంది. హైదరాబాద్ లో అమలు చేస్తున్న హైడ్రా తరహా ప్రణాళికలపై ఆలోచన చేస్తోంది. హైడ్రా తరహా చట్టాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఇందు కోసం పటిష్ఠ చట్టాన్ని తెస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వచ్చే మంత్రివర్గ సమావేశం లో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు.

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బుడమేరు ఆక్రమణలను తొలగిస్తామని తెలిపారు. బుడమేరు వాగు పొంగడానికి ఆక్రమణలే కారణమని సీఎం తేల్చి చెప్పారు. ల్యాండ్‌ గ్రాబర్స్‌, పొలిటికల్‌ సపోర్టుతో ఆక్రమణలకు పాల్పడ్డ వారికి బుద్ధి చెప్పే పటిష్టమైన చట్టం ఉంటుందన్నారు. కొంత మంది ఆక్రమణదారుల వల్ల లక్షలాది మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి వరదలు విజయవాడ పట్టణానికి మళ్లీ రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

కొల్లేరులో ఆక్రమణలు వల్ల నీరు వెనక్కి తన్నే పరిస్థితి ఉందని, దీనిని పరిశీలించి ఆక్రమణలు కొట్టేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయ అండతో కొందరు విచ్చలవిడిగా చేశారని మండిపడ్డారు. ప్రజా భద్రత కంటే ఈ ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదని తేల్చిచెప్పారు.

ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తున్నామన్నారు. విజయవాడలో మరోసారి ఇలాంటి వరదలు రాకుండా ఉండాలంటే ఆక్రమణలు తొలిగించాలని డిసైడ్ అయ్యారు. బుడమేరు ఆపరేషన్ చేపడతామని, భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా చూస్తామన్నారు.

రోడ్లపై మార్కింగ్‌ కలకలం

రీజనల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) కోసం వేసిన కొలతల మార్కింగ్‌ కలకలం రేపుతోంది. మండలంలోని పలు గ్రామాల నుంచి రోడ్డు వెళ్తుందని ఇప్పటికే అధికారు లు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు. కానీ, ఎక్కడ నుంచి వెళ్తుందనేది ఇప్పటికీ ప్రశ్నార్థకం.

రీజనల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) కోసం వేసిన కొలతల మార్కింగ్‌ కలకలం రేపుతోంది. మండలంలోని పలు గ్రామాల నుంచి రోడ్డు వెళ్తుందని ఇప్పటికే అధికారు లు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు. కానీ, ఎక్కడ నుంచి వెళ్తుందనేది ఇప్పటికీ ప్రశ్నార్థకం. ఐదు రోజుల క్రితం మండలంలోని పుట్టపాక, సర్వేల్‌, మల్లారెడ్డిగూడెం తదితర గ్రామాల్లో ఎవరో మార్కింగ్‌ చేశా రు.

ఈ మార్కింగ్‌ గుర్తులు ట్రిపుల్‌ఆర్‌ రోడ్డు కోసం చేసినట్టు ఆయా ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సర్వేల్‌, పుట్టపాక గ్రామాల పరిధిలో కల్వర్టులు, రోడ్లపై ఈ మార్కింగ్‌లు ఉన్నాయి. ఎస్‌- 92, ఎస్‌-93, ఎస్‌-94, ఎస్‌-95 అంటూ తెలుపు, నలుపు రంగులతో కూడిన గుర్తులు ఉన్నాయి. దీంతో రీజనల్‌ రింగ్‌ రోడ్డులో తమ భూములు పోతాయా? అంటూ రైతులు తెలిసిన వారిని ఆరా తీస్తున్నారు. ఏ గ్రామం? ఎక్కడి నుంచి, ఏ సర్వే నెంబర్లు? ఎంత వెడల్పులో రోడ్డు కోసం భూమి పోతుంది? తదితర విషయాలపై రైతులు ఆరా తీస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఆర్‌ఆర్‌ఆర్‌పై సమీక్షలు నిర్వహించాక మ్యాప్‌లు, సర్వే నివేదికలు, మార్కింగ్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ మార్కింగ్‌పై మండలంలోని సోషల్‌ మీడియాలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సంస్థాన్‌ నారాయణపురం మండలం మీదుగా గ్యాస్‌ పైప్‌ లైన్‌ కోసం ఇటీవల సర్వే చేస్తున్నారు. దీంతో ఈ గుర్తులు రీజినల్‌ రింగ్‌ రోడ్డువా? లేదా గ్యాస్‌ పైప్‌లైన్‌వా? అంటూ పలువురు ఆందోళన చెందుతుండగా, దీనిపై అధికారులు వాస్తవాలను వెల్లడించాలని రైతులు కోరుతున్నారు.

వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా కదిలొస్తున్న దాతలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో బుడమేరు వాగుకు వరద పోటెత్తింది. దీంతో విజయవాడ మహానగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బందనంలో చిక్కుకున్నాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

ఈ నేపథ్యంలో వరద సహాయక చర్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు ముందు రావాలని దాతలకు సీఎం చంద్రబాబు విజ్జప్తి చేశారు. ఈ నేపథ్యంలో పలువురు దాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి సీఎం సహాయక నిధికి ఇప్పటికే భారీగా విరాళాలు అందజేశారు.

విజయవాడలో ఆదివారం సీఎం చంద్రబాబును కలిసి పలువురు దాతలు విరాళాలు అందజేశారు. ఏపీ పోలీస్ అధికారుల సంఘం రూ.11 కోట్ల 12 లక్షల 50 వేల చెక్కును సీఎం చంద్రబాబుకు ఆ సంఘం అదికారులు అందజేశారు. అలాగే దీపక్ నెక్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఏవీ సుబ్రహ్మణ్యం రూ. కోటి అందించారు.

వాటర్ సప్లై కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రూ. 50 లక్షలు ఇచ్చింది. వై. రాజారావు రూ.10 లక్షలు, కె.సాంబశివరావు రూ.5 లక్షలు, సీహెచ్. పూర్ణ బ్రహ్మయ్య రూ.5 లక్షలు, డాక్టర్ శరత్ బాబు రూ.5 లక్షలు, సి.టీ.చౌదరి రూ.2.55 లక్షలు, శ్రీ కోవిల్ ఫ్లాట్స్ ఓనర్స్ రెసిడెంట్ అసోసియేషన్ రూ.2, 21,116, వెలగపూడి సత్యనారాయణ రూ.2 లక్షల 116 వేలు, ఎమ్. శ్రీనివాసరావు రూ.2 లక్షలు, పువ్వాడ రామకృష్ణ రూ.2 లక్షలు, సీహెచ్. శివరామకృష్ణ రూ.1 లక్షా 32 వేలు, బి. నవీన్ బాబు రూ.1 లక్షా 116 వేలు, జాస్తి శైలజారాణి రూ.1 లక్ష, జె.శాంభవి రూ.1 లక్ష, శశాంక్ చౌదరి రూ.1 లక్ష, ఎస్. సాంబశివరావు రూ.1 లక్ష, ధూళిపాళ్ల రామకృష్ణ రూ.1 లక్ష, డాక్టర్ యు.గంగాధర్‌రెడ్డి రూ.1 లక్ష, చెరుకూరి వెంకటరావు రూ.1 లక్ష, జె.సత్యనారాయణ మూర్తి రూ.1 లక్ష, ఏపీ ప్రదేశిక్ మార్వాడి సమ్మెళనం రూ.1 లక్ష, ఎన్.నాగేశ్వరరావు రూ.70 వేలు, రాణి శారదా రూ.50 వేలు, పమిడి భానుచందర్ రూ.50 వేలు, నూతక్కి వాణి రూ.50 వేలుగుత్తికొండ వెంకటేశ్వరరావు రూ.50 వేలు, కె.భవానీ రూ.35 వేలు, దేవినేని సుధారాణి రూ.30 వేలు, వి.రామకృష్ణ రూ.25 వేలు, ఎమ్.అరుణ కుమారి రూ.25 వేలు, యలమంచిలి నళిని కుమారి రూ.25 వేలు, మోహిత్ చక్రి తరుష్ రూ.20 వేలు, గద్దె ఝాన్సీరాణి రూ.10 వేలు తదితరులు సీఎం చంద్రబాబును వ్యక్తిగతంగా కలిసి చెక్కులు అందజేశారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల పరిశీలించారు. ఇంకోవైపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలపై కేంద్రం వెంటనే స్పందించింది. అందులోభాగంగా రూ. 3,300 కోట్ల ఆర్థిక సాయంగా అందించింది. ఈ మొత్తాన్ని తక్షణ సాయంగా అందించినట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే టాలీవుడ్‌లోని పలువురు నటీనటులు సైతం మేము సైతం అంటూ ముందుకు వచ్చి భారీగా విరాళాలను ప్రకటించిన విషయం విధితమే.

ఏపీ, తెలంగాణాలకు రియల్ హీరో సోనూసూద్ భారీ విరాళం!

రీల్ లైఫ్ విలన్ రియల్ లైఫ్ హీరో సోను సూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఇటీవల వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయిన వేళ వారి కోసం నేనున్నానంటూ ముందుకు వచ్చారు. గతంలో కరోనా మహమ్మారి సమయంలో నేనున్నానంటూ వలస కార్మికులకు భరోసానిచ్చి ఎంతోమందిని ఆదుకున్న సోనూసూద్ తన సేవా కార్యక్రమాలతో భారత దేశ ప్రజలతో మన్ననలు పొందుతున్నారు.

గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్

ఇక తాజాగా ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు వచ్చిన కష్టాన్ని చూసి చలించిన సినీనటుడు, గొప్ప మానవతావాది సోనూసూద్ తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. చాలామంది హీరోల కంటే భారీ మొత్తంలో విరాళాన్ని ప్రకటించి ఆయన తన పెద్ద మనసును మరొక మారు చాటుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో వరద బాధితులు ఎవరైనా ఎలాంటి సహాయం కావాలన్నా తన స్వచ్ఛంద సంస్థ ద్వారా పొందవచ్చునని ను సంప్రదించాలని సూచించారు.

ఇప్పటికే వరద బాధితులకు ఆహారం, తాగునీరు, మెడికల్ కిట్స్ అందిస్తున్నారు. నివాసం కోల్పోయిన వారికి తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో సోనూ సూద్ చారిటీ ఫౌండేషన్ కు సంబంధించిన వ్యక్తులు ఈ మేరకు సేవలు చేస్తున్నారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకు సోను సూద్ భారీగా విరాళం ప్రకటించారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 కోట్ల విరాళం

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెరొక 2.5 కోట్ల రూపాయలు చొప్పున విరాళం ప్రకటించారు. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలకు ఐదు కోట్ల రూపాయలు విరాళం ప్రకటించి, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా తమ బృందాలు పనిచేస్తాయని సోనుసూద్ పేర్కొన్నారు.

సోనూ సూద్ కు పవన్ కళ్యాణ్ థాంక్స్

ఇక సోను సూద్ ప్రకటన పట్ల ఏపీ ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు కష్ట కాలంలో ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలకు మీ తోడ్పాటు బలాన్ని ఇస్తుందని ఆయన సోను సూద్ విషయంలో కొనియాడారు. సోను సూద్ ఇచ్చిన ఈ భారీ విరాళం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.