/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz బిగ్ రిలీఫ్.. కోలుకుంటున్న బెజవాడ Raghu ram reddy
బిగ్ రిలీఫ్.. కోలుకుంటున్న బెజవాడ

బుడమేరు (Budameru) వరద నుంచి నగరం క్రమంగా కోలుకుంటోంది. బాధితులు బుధవారం వెల్లువలా ముంపు ప్రాంతం నుంచి బయటకు తరలివస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో సింగ్‌నగర్‌ నుంచి దూరప్రాంతాలైన కండ్రిక, ఆంధ్రప్రభ కాలనీ, రాజీవ్‌నగర్‌, ప్రకాష్‌నగర్‌, ఎల్‌బీఎస్‌ నగర్‌, రాధానగర్‌, డాబాకొట్లు సెంటర్‌, ఇందిరానాయక్‌ నగర్‌, పైపులరోడ్డు, తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా వరద బాధితులు సురక్షిత ప్రాంతాలకు పోటెత్తారు. తెల్లవారుజాము నాటికి రెండు నుంచి మూడు అడుగుల మేర సింగ్‌నగర్‌ దూర ప్రాంతాల్లో వరద మట్టం తగ్గింది. దీంతో గత మూడు రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడిపిన వరద బాధితులు బయటకు వచ్చేశారు. అయితే బుధవారం మధ్యాహ్నం నాటికి కండ్రిక, అంబాపురం వైపు ఉన్న ఆంధ్రప్రభ కాలనీ 11లో ఇంకా మెడలోతు నీటితోనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 75 వేల మంది బుధవారం మధ్యాహ్నానికి బయటకు వచ్చేశారు. ఇంకో 75 వేల మంది బయటకు రావల్సి ఉంది.

బాధితుల తరలింపు తక్కువగా ఉండటం వల్ల అగ్నిమాపక శకటాలు తమ పనులు నిర్వహించలేకపోయాయి. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నాయకుల పంపిన ట్రాక్టర్లు బాధితుల రాకపోకలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వరద నుంచి వచ్చే బాధితులు దాదాపుగా నాలుగు నుంచి పది కిలో మీటర్ల మేర నడుచుకుని రావటంతో వారికి స్వాంతన కలిగించేందుకు స్వచ్ఛంద సంస్థలు ఆటోలు, లారీలు, మినీవ్యాన్‌లు, ట్రాక్టర్ల వంటివి పెద్ద సంఖ్యలో నడిపాయి. పైపులరోడ్డు, గొల్లపూడి, తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపించింది.

రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఐఏఎస్‌ అధికారి కోన శశిధర్‌ బాధితుల తరలింపు విషయంలో చొరవ చూపించారు. ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసి అందులోకి స్థానిక కార్పొరేషన్‌ సిబ్బందిని వరద ముంపు ప్రాంతాల్లోకి పంపించారు. పోలీసు శాఖ నుంచి ఏడీసీపీ గున్నం రామకృష్ణ ఒకేఒక్కడుగా సింగ్‌నగర్‌ దగ్గర పనిచేశారు. అటు కోన శశిధర్‌, ఇటు గున్నం రామకృష్ణ ఇద్దరూ సమన్వయం చేసుకుంటూ వరద బాధితుల తరలింపు కోసం వాహనాలు, సిబ్బందిని పంపిస్తూ బాధితులను తరలించారు. మాజీ మునిసిపల్‌ కమిషనర్‌, ప్రస్తుత సిఎంఓలో పనిచేస్తున్న ప్రద్యుమ్న కలెక్టరేట్‌కు వచ్చిన తరువాతే బాధితుల ఆపరేషన్‌ ఓ గాడిలో పడింది

నాలుగో రోజు సింగ్‌నగర్‌ దూర ప్రాంతాల నుంచి వరద బాధితులను తీసుకువచ్చే విషయంలో ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా సమీకరించిన పడవలు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బోట్లు మూడు వంతులకుపైగా సింగ్‌నగర్‌ ఫ్లైఓవర్‌ సర్వీసు రోడ్డులోనే నిలిపేశారు. వాస్తవానికి ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో బుధవారం ప్రచురితమైన ‘కన్నీళ్లు–కష్టాలు’ కథనంపై జిల్లా యంత్రాంగం తెల్లవారుజామునే స్పందించింది. ఆహార వ్యర్ధాలతో తీవ్ర అపరిశుభ్రంగా, దుర్గంధంగా ఉన్న సింగ్‌నగర్‌ ఫ్లై ఓవర్‌ను మాత్రం పరిశుభ్రం చేశారు. ఆ తరువాత జిల్లా యంత్రాంగం ఈ బోట్లను సింగ్‌నగర్‌ నుంచి 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలకు పంపిస్తుందని భావిస్తే ఆ పని చేయలేదు. బోట్ల నిర్వాహకులకు జిల్లా యంత్రాంగం నుంచి కనీస సహకారం లేదు. కేవలం డాబా కొట్లు సెంటర్‌ పరిసర ప్రాంతాల నుంచి మాత్రమే 75 వేలకుపైగా బాధితులు బయటకు వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల తరువాత ఒకటి, రెండు అడుగులు నీటి మట్టం తగ్గటంతో శివారు ప్రాంత వాసులు కూడా తరలిరావటం పరిమిత సంఖ్యలో ప్రారంభమైంది. వీరికి ఆహారం, నీటి పంపిణీ జరగలేదు. ఎస్డీఆర్‌ఎఫ్‌ బోట్లు కూడా సర్వీసు రోడ్డు పక్కనే పెద్ద సంఖ్యలో నిలిపేశారు. చాలా బోట్లు లారీల నుంచి కూడా బయటకు తీయలేదు. ఎన్టీఆర్‌ఎఫ్‌ బోట్లు 30 శాతం వరద నీటిలోకి దిగి బాధితులను రక్షించాయి.

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను హైదరాబాద్ లో మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. 

తెదేపా కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ ను అరెస్టు చేశారు. సురేష్ ముందస్తు బెయిల్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో సురేష్ అజ్ఞాతంలోకి పారిపోయారు.

  హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సురేష్ ప్రయత్నాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీస్ ప్రత్యేక బృందాలు హైదరాబాద్ వెళ్లి సురేష్ ను అరెస్ట్ చేశారు.

సురేష్ ను గుంటూరు జిల్లాకు పోలీసులు తరలిస్తున్నారు. ముందుగా ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టనున్నారు.

వాలంటీర్లకు పిలుపు - కీలక మలుపు..!!

వాలంటీర్ల పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల సేవలను కొనసాగించటంతో పాటుగా వారికి రూ 10 వేలు వేతనం ఇస్తామని నాడు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత వారి కొనసాగింపు పైన ఎలాంటి నిర్ణయం లేదు. వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు వరదల సమయంలో వాలంటీర్ల వినియోం పైన చర్చ మొదలైంది. ఈ సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

తమ ఉద్యోగాల కొనసాగింపు పైన డైలమాలో ఉన్న వాలంటీర్లకు సానుకూల సంకేతాలు అందుతున్నాయి. మూడు నెలలుగా జీతాలు లేకుండా తమ సంబంధింత సచివాలయాలకు వెళ్లి సంతకాలకు మాత్రమే వాలంటీర్లు పరిమితం అవుతున్నారు. ఇప్పుడు వరదల సమయంలో వాలంటీర్లు ఉంటే మరింత సమర్ధవంతంగా ఇంటికే అన్ని రకాల సేవలు అందేవనే అభిప్రాయం వ్యక్తం అయింది. దీంతో, ప్రభుత్వం వీరి విషయలో పునరాలోచన చేసింది. వదర ప్రభావిత ప్రాంతాల్లో విధులకు హాజరవ్వాలని ప్రభుత్వం వాలంటీర్లను ఆదేశించింది.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల పైన అధికారులు సచివాలయ సిబ్బందితో పాటుగా వాలంటీర్లను కలిపి టెలి కాన్ఫిరెన్స్ నిర్వహించారు. సచివాలయాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి వదర సాయంలో వాలంటీర్ల విధులను స్పష్టం చేసారు. దీంతో, వాలంటీర్లు ప్రతీ ఇంటికి వెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆహారం, పాలు, మందులను అందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను తిరిగి అప్పగించారు. అయితే, సాంకేతిక కారణాలతో ఆ ఫోన్లు పని చేయటం లేదు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో అందరి సేవలు వినియోగించుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రస్తుతం విజయవాడ వరకు మాత్రమే వాలంటీర్లు విధుల్లో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. తామంతా ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని..విధుల్లో చేరేందుకు సిద్దమని వాలంటీర్ల సంఘ నేతలు చెబుతున్నారు. అయితే, ఇప్పుడు వాలంటీర్ల కొనసాగింపు పైన ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావంతో ఉన్నారు. వచ్చే వారం వాలంటీర్ల కొనసాగింపు..విధుల పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి హైకోర్టు నోటీసులు

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆమెతో పాటు భూగర్భగనులు, పర్యావరణ శాఖ ముఖ్యకార్యదర్శులకు కూడా నోటీసులు అందజేసింది. హైదరాబాద్‌‌లోని జూబ్లీహిల్స్ నివాస ప్రాంతాల్లోని కొండరాళ్లను తొలగించేందుకు కొందరు రాత్రింబవళ్లు పేలుళ్లు నిర్వహిస్తున్నారు.

దీనికి సంబంధించి పలు వార్త కథనాలు రావడంతో జడ్జి నగేశ్ భీమపాక హైకోర్టు సీజేకు లేఖ రాశారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా పేలుళ్లు నిర్వహిస్తుండటంతో సమీప ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.

దీనిని ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు బుధవారం భూగర్భగనులు, పర్యావరణ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ప్రతివాదులుగా చేర్చింది.

పేలుళ్లపై వీలైనంత త్వరగా వివరణ ఇవ్వాలని హైకోర్టు పంపిన నోటీసుల్లో పేర్కొంది. కాగా, జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలి ఈ మధ్యనే పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

చెట్లు నేలకూలడంపై మంత్రి సీతక్క విస్మయం

మేడారంలో 500 ఎక‌రాల్లో చెట్లు నేల‌కొర‌గ‌డంపై మంత్రి సీత‌క్క ఆరా తీశారు. రాష్ట్ర స‌చివాల‌యం నుంచి పీసీసీఎఫ్‌, డీఎఫ్‌ఓల‌తో టెలిఫోన్లలో మంత్రి మాట్లాడారు. రెండు రోజుల క్రితమే చెట్లు నేల‌కొరిగిన ప్రాంతాన్ని సీతక్క సందర్శించారు. ల‌క్ష చెట్ల వ‌ర‌కు నేల‌కూల‌డం ప‌ట్ల మంత్రి విస్మ‌యం చెందారు. ఈ స్థాయిలో అట‌వీ విధ్వంసం జ‌ర‌గ‌డం ప‌ట్ల ఆశ్చ‌ర్యం వ్యక్తం చేశారు.

మేడారంలో 500 ఎక‌రాల్లో చెట్లు నేల‌కొర‌గ‌డంపై మంత్రి సీత‌క్క (Minister Seethakka) ఆరా తీశారు. రాష్ట్ర స‌చివాల‌యం నుంచి పీసీసీఎఫ్‌, డీఎఫ్‌ఓల‌తో టెలిఫోన్లలో మంత్రి మాట్లాడారు. రెండు రోజుల క్రితమే చెట్లు నేల‌కొరిగిన ప్రాంతాన్ని సీతక్క సందర్శించారు. ల‌క్ష చెట్ల వ‌ర‌కు నేల‌కూల‌డం ప‌ట్ల మంత్రి విస్మ‌యం చెందారు. ఈ స్థాయిలో అట‌వీ విధ్వంసం జ‌ర‌గ‌డం ప‌ట్ల ఆశ్చ‌ర్యం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ములుగు అడవుల్లో సుడిగాలి వల్ల లక్ష చెట్ల వరకు నేలకొరిగాయన్నారు. వందల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని తెలిపారు. వృక్షాలు కూలడంపై విచారణకు ఆదేశించామన్నారు. డ్రోన్ కెమెరాల సహాయంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. అడవిలో సుడిగాలి వచ్చింది కాబట్టి ప్రాణనష్టం జరగలేదన్నారు. ఈ సుడిగాలి గ్రామాల్లో సంభవించి ఉంటే పెను విధ్వంసం జరిగేదన్నారు.

స‌మ‌క్క సార‌ల‌మ్మ త‌ల్లుల ద‌య వ‌ల్లే సుడిగాలి ఊర్ల మీదకు రాలేదన్నారు. త‌ల్లుల దీవేన‌తోనే ప్ర‌జ‌ల‌కు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ‌గ‌లిగారన్నారు. చెట్లు నేల‌కూల‌డంపై కేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ ప్ర‌త్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రం నుంచి ప‌రిశోధ‌న జ‌రిపించి కార‌ణాలు గుర్తించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. అట‌వీ ప్రాంతంలో చెట్ల‌ను పెంచేలా ప్ర‌త్యేక నిధులు మంజూరు చేయాలని సీతక్క వినతి చేశారు.

హైడ్రా పేరుతో రూ.20 లక్షలు డిమాండ్‌...

సోషల్‌ వర్కర్‌ ముసుగులో హైడ్రా పేరు చెప్పి రూ. 20 లక్షలు ఇవ్వాలని బిల్డర్లను డిమాండ్‌ చేసిన వ్యక్తిపై అమీన్‌పూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌(Sangareddy District Aminpur) మున్సిపాలిటీ పరిధిలో సాయివిల్లాస్‌ రోడ్డులో ఎంసీఆర్‌ఓ ప్రాజెక్ట్‌ పేరుతో జూబ్లీహిల్స్‌(Jubilee Hills)కు చెందిన బిల్డర్లు వాడల రాజేంద్రనాథ్‌, మంజునాథ్‌రెడ్డి అపార్ట్‌మెంట్‌ నిర్మిస్తున్నారు.

 లక్షలు ఇవ్వాలని బిల్డర్లను డిమాండ్‌ చేసిన వ్యక్తిపై అమీన్‌పూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌(Sangareddy District Aminpur) మున్సిపాలిటీ పరిధిలో సాయివిల్లాస్‌ రోడ్డులో ఎంసీఆర్‌ఓ ప్రాజెక్ట్‌ పేరుతో జూబ్లీహిల్స్‌(Jubilee Hills)కు చెందిన బిల్డర్లు వాడల రాజేంద్రనాథ్‌, మంజునాథ్‌రెడ్డి అపార్ట్‌మెంట్‌ నిర్మిస్తున్నారు. అన్ని రకాల అనుమతులు ఉన్నప్పటికీ, అపార్ట్‌మెంట్‌ పెద్దచెరువు నాలా బఫర్‌జోన్‌ పరిధిలోకి వస్తుందని, అదే కాలనీలో అద్దెకు ఉండే ఫిజియోథెరపిస్ట్‌ డాక్టర్‌ బండ్ల విప్లవ్‌సిన్హా కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు.

ఫ్లాట్లు చూసేందుకు వచ్చే కస్టమర్లకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడు. సామాజిక కార్యకర్తగా చెప్పుకునే ఆయన పలు ప్రభుత్వ శాఖలకు పదేపదే ఫిర్యాదులు చేస్తున్నాడు. ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడం ప్రారంభించాడు. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పలుమార్లు అమీన్‌పూర్‌లో పర్యటించిన సందర్భంలో ఠంచన్‌గా ప్రత్యక్షమై ఆయనతో ఫొటోలు తీయించుకున్నాడు. గత నెలలో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ వచ్చిన మరుసటి రోజు బిల్డర్లు రాజేంద్రనాథ్‌రెడ్డి, మంజునాథ్‌రెడ్డిలను అశోక్‌నగర్‌ పిస్తాహౌజ్‌ వద్దకు పిలిపించి, తనకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చాలా దగ్గర అని ఫొటోలు చూపించి బెదిరించాడు.

అపార్ట్‌మెంట్‌ కూల్చకుండా ఉండాలంటే తనకు రూ.20 లక్షలు ముట్టచెప్పాలని లేదంటే, పత్రికల్లో వార్తలు రాయించి కూల్చివేయిస్తానన్నాడు. మరోమారు గచ్చిబౌలి ఆఫ్రికన్‌ కాఫీ హౌజ్‌ వద్దకు పిలిపించి తక్షణం ఎంతోకొంత డబ్బు ఇవ్వాలని, లేదంటే కూల్చడం ఖాయమని తీవ్రంగా బెదిరించాడు. హైడ్రా కమిషనర్‌తో పాటు గతంలో మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, దామోదర రాజనర్సింహతో దిగిన ఫొటోలను చూపించి బ్లాక్‌మెయిల్‌ చేయడంతో బిల్డర్లు కంగుతిన్నారు. ఇతడి వేధింపులు భరించలేక బాధితులు అమీన్‌పూర్‌ పోలీ్‌సస్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అమీన్‌పూర్‌ ఎస్‌ఐ టి.విజయరావు తెలిపారు.

ఆర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ- ఆ తేదీలు ఇవే

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో ఈ నెల 10వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమం జరుగనుంది. 16వ తేదీ నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.

ఆ రోజున తెల్లవారు జామున సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చ‌న, శుద్ధి నిర్వ‌హిస్తారు. ఉదయం 7 నుంచి 9.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు.

అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 10 గంటల నుంచి పద్మావతి అమ్మవారి సర్వదర్శనానికి భక్తులకు అనుమతిస్తారు.

ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు 15వ తేదీ సాయంత్రం అంకురార్పణ చేస్తారు ఆలయ అర్చకులు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్ర‌హణం, సేనాధిపతి ఉత్సవాలను చేపడతారు.

ఆల‌యానికి వచ్చే భక్తులు లేదా ఇక్కడ విధుల్లో ఉండే సిబ్బంది వల్ల గానీ కొన్ని దోషాలు తెలియక జరుగుతుంటాయి. ఇలాంటి వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి విఘాతం కలకుండా నివారించడానికి ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. 16వ తేదీన పవిత్ర ప్రతిష్ఠ, 17న పవిత్ర సమర్పణ, 18న పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయి. 750 రూపాయలను చెల్లించడం ద్వారా ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు.

హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే జైలుకే

హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించి వసూళ్లకు పాల్పడితే జైలు జీవితం తప్పదని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు. గత కొద్ది రోజులు ట్రై సిటీ పరిధిలో హైడ్రా విభాగం విస్తృతంగా అక్రమ నిర్మాణాల తొలగింపులు చేపడుతున్న నేపథ్యంలో కొద్ది మంది సామాజిక కార్యకర్తల ముసుగులో బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్ పరిధిలో లేదా వాటి పరిసరాల్లో నిర్మాణం చేపడుతున్న బిల్డర్లను ఇది అక్రమ నిర్మాణమని, బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్ పరిధిలో నిర్మిస్తున్నారని హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని, అలాగే అధికారులతో వున్న ఫోటోలు చూపించి హైడ్రా విభాగంలోని ఉన్నతాధికారులతో తమకు పరిచయాలు వున్నాయని, మీకు ఎలాంటి సమస్య రాకుండా చేస్తామని ఇందుకోసం కొంత డబ్బు ముట్టజెప్పాల్సిందిగా.. లేదంటే హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని కొద్ది మంది వ్యక్తులు, సంస్థలు బిల్డర్లను బెదిరింపులు పాల్పడటంతో పాటు గత కొద్దికాలంగా బహుళ అంతస్తుల్లో, వ్యక్తిగత గృహల్లో నివాసం వుంటున్న వారి వద్ద ఇలాంటి బెదిరింపులకు పాల్పడడం జరుగుతోంది.

ఎవరైనా మిమ్మల్ని ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నట్లైతే.. అలాగే ఇతర ప్రభుత్వ విభాగాలైన రెవెన్యూ, మున్సిపల్, నీటి పారుదల విభాగాలతో పాటు హైడ్రా విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది సైతం ఎవరైనా కూడా హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ డబ్బు కావాలని ఒత్తిడి చేస్తే ప్రజలు, బిల్డర్లు తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్ లో కానీ, ఎస్పీకి, సీపీకి కానీ లేదా హైడ్రా కమిషనర్, ఏసీబీకి కూడా ఫిర్యాదు చేయాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి మంచి ఉద్దేశాలతో ఈ హైడ్రా విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా ఈ విభాగాన్ని నీరుగార్చే ప్రయత్నాలు కానీ, తప్పుదోవ పట్టించే విధంగా యత్నించే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని, ఈ విభాగం పేరుతో ఎవరైనా వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం డబ్బు వసూళ్ల చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు.

హైడ్రా పేరుతో డబ్బు వసూళ్ళకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్…

ఈ బెదిరింపు వసూళ్లకు సంబంధించి సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ ప్రాంతానికి చెందిన డా.విప్లవ్ సామాజిక కార్యకర్త ముసుగులో స్థానిక బిల్డర్ ను డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా సదరు బాధిత బిల్డర్ గత సోమవారం హైడ్రా కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును పరిశీలించిన వాస్తవాలు గ్రహించి అనంతరం హైడ్రా కమిషనర్ సూచన మేరకు ఎస్పీ సంగారెడ్డి బాధిత బిల్డర్ నుండి ఫిర్యాదు స్వీకరించారు. ఈ ఫిర్యాదుతో ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న డా.విప్లవ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు ఇవాళ ఉదయం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

శ్రీశైలం రైట్ పవర్ హౌస్‌లో భారీ పేలుడు..

శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఏడో నంబర్ యూనిట్‌లో కండెన్సర్ కాలిపోయి భారీ శబ్దాలతో పేలుడు జరిగింది. పవర్ హౌస్‌లో వచ్చిన శబ్దాలకు సిబ్బింది పరుగులు పెట్టారు.

శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఏడో నంబర్ యూనిట్‌లో కండెన్సర్ కాలిపోయి భారీ శబ్దాలతో పేలుడు జరిగింది. పవర్ హౌస్‌లో వచ్చిన శబ్దాలకు సిబ్బింది పరుగులు పెట్టారు. కాసేపు ఏం జరిగింతో అర్థంకాక ఉద్యోగులు అయోమయానికి గురయ్యారు. అసలే జలశయానికి వరద ఉద్ధృతి అధికంగా ఉండడంతో ఏం జరిగిందో అని భయాందోళనకు గురయ్యారు.

ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు ఏడో నంబర్ యూనిట్‍లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. అనంతరం సమస్యను గుర్తించిన అధికారులు సాంకేతిక లోపం తలెత్తి శబ్దాలు వచ్చినట్లు తెలిపారు. కండెన్సర్ కాలిపోయి పేలుడు సంభవించినట్లు గుర్తించి మరమ్మతులు చేపట్టారు. సమస్యను పరిష్కరించిన విద్యుత్ ఉత్పత్రి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు

మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి కాస్త తగ్గింది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 99,615క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 1,81,235క్యూసెక్కులుగా ఉంది. దీంతో జలాశయం 6గేట్లు 10అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు కాగా.. ప్రస్తుతం 883.50అడుగులకు చేరుకుంది.

సికింద్రాబాద్‌-విజయవాడ రైళ్లకు నేటి సాయంత్రం నుంచి అనుమతి!

మహబూబాబాద్‌ జిల్లాలో ఆరు చోట్ల ధ్వంసమైన రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.

క్‌ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఒక్కో ప్రాంతంలో 100 మంది చొప్పున సుమారు 600 మంది కూలీలు పనులు చేస్తున్నారు. సుమారు 200 మంది అధికారులు, సిబ్బంది పనులను పర్యవేక్షిస్తున్నారు.

బుధవారం సాయంత్రం నుంచి సికింద్రాబాద్‌-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ఆదివారం వరద ఉధృతికి ఇంటికన్నె-కేసముద్రం సెక్షన్‌లో రెండు చోట్ల 70 మీటర్ల చొప్పున ట్రాక్‌ కొట్టుకుపోయింది. మహబూబాబాద్‌-కేసముద్రం సెక్షన్‌లో నాలుగు చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.

మొత్తం 420 మీటర్ల ట్రాక్‌ కొట్టుకుపోయింది. మహబూబాబాద్‌- కేసముద్రంమధ్య పునరుద్ధరణ పనులను పూర్తి చేసి గూడ్స్‌ రైలుతో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. అయితే, ఇంటికన్నె-కేసముద్రం సెక్షన్‌లో వరద ఉధృతి తగ్గకపోవడంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.