/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz వారి రుణమాఫీపై నేడు స్పష్టత..! Raghu ram reddy
వారి రుణమాఫీపై నేడు స్పష్టత..!

రాష్ట్రంలో ₹2 లక్షల లోపు రుణమాఫీ కాని వారి సమస్యల పరిష్కారానికి నేడు రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులు చర్చించనున్నారు.

రుణమాఫీ యాప్‌లో వివరాల నమోదు, ఇతర అంశాలపై అధికారులకు వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొనాలని ఆదేశించారు.

దీంతో పాటు రూ.2 లక్షలకు పైగా రుణాల మాఫీ ఎలా చేస్తారో వెల్లడించనున్నారు.

రాజకీయంగా కాకరేపుతోన్న’హైడ్రా’.. పీక్స్‌కి చేరిన వ్యవహారం..

ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు హైడ్రాతో హైడ్రామా చేస్తున్నారని.. హైడ్రా పేరుతో సామాన్యులను ఇబ్బందిపెడుతున్న ప్రభుత్వానికి బండ్ల గూడ సలకం చెరువులో ఒవైసీ సోదరుల అక్రమ నిర్మాణాలు కపిపించడం లేదన్నారు మహేశ్వర్ రెడ్డి. అవసరమైతే హైడ్రా కమిషనర్‌కి ఒవైసీ బ్రదర్స్‌ అక్రమ నిర్మాణాలను తానే స్వయంగా చూపిస్తానని వాటినే...

హైడ్రా కూల్చివేతలు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. పెద్దోళ్ల అక్రమ నిర్మాణాలు కూలిస్తే ఒకే కానీ.. పేద వారిపైనే మీ ప్రతాపమా అని ప్రభుత్వ తీరును విపక్షాలు తప్పుబడుతున్నాయి. అయితే ఎవరెంత ఒత్తిడి తెచ్చినా.. చెరువులను పరిరక్షించే విషయంలో తగ్గేదేలేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చేసింది. అక్రమ నిర్మాణాలు చేపట్టినవాళ్లు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదని.. ముఖ్యంగా తమ పార్టీకి సంబంధించిన వారు ఉన్నా వదిలేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇన్నాళ్లూ హైడ్రా యాక్షన్‌ పై అటు , బీఆర్ఎస్‌ ఇటు బీజేపీ విమర్శలతో సాగిన రాజకీయాలు రెండు రోజులు నుంచి ఎంఐఎం వైపు మళ్లాయి. తాజాగా హైడ్రా భుజంపై తుపాకీ పెట్టి ఎంఐఎంను టార్గెట్ చేసింది బీజేపీ. హైడ్రా కూల్చివేతలు హైదరాబాద్ న్యూసిటీకే పరిమితమా అని ప్రశ్నిస్తోంది.? సీఎం రేవంత్ రెడ్డికి పాతబస్తీ చెరువుల కబ్జాలు తొలగించే దమ్ము ఉందా అని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నిలదీశారు.

ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు హైడ్రాతో హైడ్రామా చేస్తున్నారని.. హైడ్రా పేరుతో సామాన్యులను ఇబ్బందిపెడుతున్న ప్రభుత్వానికి బండ్ల గూడ సలకం చెరువులో ఒవైసీ సోదరుల అక్రమ నిర్మాణాలు కపిపించడం లేదన్నారు మహేశ్వర్ రెడ్డి. అవసరమైతే హైడ్రా కమిషనర్‌కి ఒవైసీ బ్రదర్స్‌ అక్రమ నిర్మాణాలను తానే స్వయంగా చూపిస్తానని వాటినే కూల్చే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలు కూల్చేస్తున్న హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఓవైసీ బ్రదర్స్ అనే చర్చ జోరుగా సాగుతోంది. ఒవైసీ బ్రదర్స్‌కి సంబంధించిన అక్రమ కట్టడాలపై హైడ్రా కు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి.

ఎక్స్ మాధ్యమం ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కి పాతబస్తీ వాసులు ఫిర్యాదు చేశారు. బండ్లగూడ సలకం చెరువులో ఓవైసీ బ్రదర్స్ అక్రమంగా విద్యాసంస్థలు నిర్మించారని.. చెరువులోనే బిల్డింగులు కనిపిస్తున్నా ఎందుకు కూల్చడం లేదని ఎక్స్‌లో సీఎం రేవంత్‌ను జనాలు ప్రశ్నిస్తున్నారు . దీంతో ఫాతిమా కాలేజ్‌పై వస్తున్న ఫిర్యాదులపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు. తన పై కక్ష ఉంటే తూటాలతో కాల్చాలని.. కానీ తమ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను అడ్డుకోవద్దన్నారు అక్బరుద్దీన్.

పేదలకు ఉచిత విద్యను అందించేందుకే 12 భవనాలను నిర్మించానని.. వీటిని ఉద్దేశపూర్వకంగా కొందరు తప్పుగా చూపిస్తున్నారని చెప్పారు అక్బరుద్దీన్‌. తాను బలహీనుడినయ్యానని శత్రువులు అనుకుంటున్నారని.. ఒక వేళ కూల్చివేతల వరకు వస్తే తన కాలేజీలోని విద్యార్థినులే సైన్యంగా మారి అడ్డుకుంటారని అక్బరుద్దీన్ హెచ్చరించారు. కాగా.. హైడ్రా కూల్చివేతలపై ఇప్పటికే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నెక్లెస్ రోడ్‌, GHMC కార్యాలయం సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ భవనాలు ఎఫ్టీఎల్‌లో ఉన్నాయని వాటిని కూడా ప్రభుత్వం కూల్చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు. అన్ని భవనాలకు ఒకే న్యాయం ఉండాలన్నదే తమ అభ్యంతరమన్నారు అసదుద్దీన్ ఒవైసీ. మరి హైడ్రా కూల్చివేతలపై అటు బీజేపీ ఇటు ఎంఐఎంల ప్రశ్నలకు రేవంత్ సర్కార్ దగ్గర సమాధానాలు ఉన్నాయా.. లేదా..అనేది వేచి చూడాలి.

టీటీడీ ఈవో శ్యామలరావు మీడియా సమావేశం

అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ఉత్సవాలను ఉ 8 గంటలకు, రా 7గంటలకు వాహన సేవలు

అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం చంద్రబాబు నాయుడు స్వామి వారికీ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

బ్రహ్మోత్సవాలు సమయంలో సిఫార్సు, అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు.

7 లక్షల లడ్డూలు నిల్వ ఉంచుతాం..

గరుడ సేవను 6.30 గంటలకే ప్రారంభిస్తాం.

పోలీసుల సహకారంతో

భద్రతా పరంగా పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నాం.

వాహన సేవలు జరిగే మాడ వీధులతో పాటు క్యూ లైన్లలో అన్నప్రసాదాలను నిరంతరాయంగా పంపిణీ చేస్తాం..

డీపీపీ ఆధ్వర్యంలో కళాబృందాలతో సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం.

తిరుమలలో నీటినిల్వలు మరో 130 రోజులకు సరిపడా ఉన్నాయి

మున్సిపల్ కార్పోరేషన్

25 లక్షల గ్యాలన్లు, కళ్యాణ డ్యామ్ నుండి 11 లక్షల గ్యాలన్ల నీటిని ప్రతిరోజు తీసుకుంటాం

అవసరమైతే

కండలేరు నుండి నీటిని తీసుకుంటాం

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నీటిసరఫరా చేస్తాం

భక్తులు ,స్థానికులు నీటిని పొదుపుగా వాడుకోవాలి

హైడ్రాపై ఎంఐఎం, బీఆర్‌ఎస్‌వి అడ్డగోలు విమర్శలు

రాష్ట్ర సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసి చెరువులు, కుంటలు, నాలాలు రక్షిస్తోందని కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... దూరదృష్టితో హైడ్రాను ఏర్పాటు చేసిందన్నారు. రాజకీయాలకు అతీతంగా హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. ప్రొటెక్షన్ ఆఫ్ లేక్స్ కమిటీ కూడా గతంలో వేసిందే అని చెప్పుకొచ్చారు.

తెలంగాణ సర్కార్ (Telangana Govt) హైడ్రాను (Hydra) ఏర్పాటు చేసి చెరువులు, కుంటలు, నాలాలు రక్షిస్తోందని కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ( Kisan Cell National Vice President Kodanda Reddy) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... దూరదృష్టితో హైడ్రాను ఏర్పాటు చేసిందన్నారు. రాజకీయాలకు అతీతంగా హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. ప్రొటెక్షన్ ఆఫ్ లేక్స్ కమిటీ కూడా గతంలో వేసిందే అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన కాకముంటే కాంగ్రెస్ సర్కార్ 2030 వరకు హెచ్‌ఎమ్‌డీఏ (HMDA) ద్వారా మాస్టర్ ప్లాన్ రూపొందించిందన్నారు.

తాగునీటి అవసరాల కోసం కూడా మాస్టర్ ప్లాన్‌లో లేక్స్ ప్రొటెక్షన్ చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. 2014 నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) అక్రమ నిర్మాణాలకు సపోర్ట్ చేసిందని ఆరోపించారు. హైడ్రా ఏర్పాటు చేసి ప్రజల మన్నన్నలు పొందుతున్న సీఎం రేవంత్‌పై (CM Revanth Reddy) ఎంఐఎం, బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సామాన్య ప్రజలు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారన్నారు. ప్రజలు కూడా ర్యాలీ చేస్తున్నారన్నారు. హుస్సేన్ సాగర్ కాపాడుకోవాలని విజయభాస్కర్ రెడ్డి కాలంలో బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు, నెక్లస్ రోడ్ ఏర్పాటైందన్నారు.

ప్రకృతిని కాపాడడానికి చెరువులు కాపాడాలన్నారు. హైదరాబాద్‌కు తాగునీటి అవసరాల కోసం కృష్ణ, గోదావరి నీటిని తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ సర్కారే రానున్న 30 ఏళ్ల వరకు తాగునీటి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించారని తెలిపారు. ధర్మం కోసం భగవత్ గీతను కూడా స్ఫూర్తిగా తీసుకున్నా అని సీఎం రేవంత్ నిన్న చెప్పారన్నారు. హెచ్‌ఎండీలో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని కోదండరెడ్డి వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు ఆక్రమణదారుల గుండెల్లో దడపుట్టిస్తున్నాయి. వరసగా కూల్చివేతలు చేస్తూ అక్రమార్కుల గుండెల్లో హైడ్రా నిద్రపోతోంది. పేద, ధనిక, సినిమా స్టార్లు, రాజకీయ నేతలు ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా కబ్జాలకు అడ్డుకట్ట వేస్తోంది. ప్రభుత్వ స్థలాన్ని అంగులం ఆక్రమించిన తీవ్రంగా స్పందిస్తోంది. తాజాగా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. రాయదుర్గం సర్వే నంబర్ 3, 4, 5, 72లోని ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టిన భవనాలను కూల్చివేస్తున్నారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చర్యలు చేపట్టారంటూ జీహెచ్ఎస్‌సీ టౌన్ ప్లానింగ్ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు.తమ ఇళ్లను కూల్చవద్దంటూ ఆందోళనకు దిగారు. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేతల పర్వం సాగుతోంది.

గుంటూరుజిల్లా ప్రజలకు పోలీసుల హెచ్చరిక.. వాళ్ల వివరాలు ఇవ్వాలని ఆదేశం

గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ప్రజల్ని అప్రమత్తం చేశారు. జిల్లాలో విదేశీయులకు వసతి కల్పించేవారికి కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. వెంటనే విదేశీయుల వివరాలను పోలీసులకు తెలియజేయాలని సూచించారు. దీని కోసం ఓ వెబ్‌‌సైట్‌లో వారి వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా విదేశీయులకు వసతి కల్పించి వివరాలను తెలియజేయకపోతే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు.

గుంటూరు జిల్లా ప్రజల్ని పోలీసులు అలర్ట్ చేశారు. ఒకవేళ ఎవరైనా విదేశీయులకు వసతి కల్పిస్తే వారి వివరాలు వెంటనే తెలియజేయాలని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ తెలిపారు. గుంటూరు జిల్లా పరిధిలో విద్య, ఉద్యోగాలు, పర్యాటక ప్రాంతాల సందర్శన, బంధువుల కోసం, వైద్యం కోసం విదేశీయులు వస్తున్నారని సమాచారం ఉందన్నారు. విదేశీయులకు వసతి కల్పించిన ఇళ్లు, హోటల్, గెస్ట్ హౌస్‌లు, సత్రాలు, యూనివర్శిటీలు, ఆసుపత్రులు, వివిధ సంస్థలు.. కచ్చితంగా 24 గంటల్లోగా వివరాలను తెలియజేయాలన్నారు.

ఒకవేళ వసతి కల్పిస్తే.. వెంటనే https:///indianfrro.gov.in/frro/FormC లోని Form-C లో నమోదు చేయాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. ఆయా యజమానులు సంబంధిత వివరాలతో రిజిస్టర్‌ కావాలన్నారు.. అలాగే ఆ విదేశీయుడి పాస్‌పోర్టు, వీసా వంటి వివరాలు నమోదు చేయాలి అన్నారు. ఆ వివరాలకు సంబంధించి డాక్యుమెంట్లను గుంటూరు స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసు అధికారికి అందజేయాలని సూచించారు. అక్కడి నుంచి ఆ విదేశీయుల వివరాలు బ్యూరో ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు ఆన్‌లైన్‌ ద్వారా చేరుతుందన్నారు.

విదేశీయులకు వసతి కల్పించిన వారు.. ఫారం-సి నమోదు చేసేటప్పుడు ఏవైనా సందేహాలు ఉంటే స్పెషల్‌ బ్రాంచ్‌ కార్యాలయాన్ని 0863-2233351, 2233352 నంబర్లలో సంప్రదించాలని సూచించారు జిల్లా ఎస్పీ సతీష్ కుమారు. ఒకవేళ ఎవరైనా యజమానులు వివరాలు అందించకుండా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ప్రజలకు అనుమానిత విదేశీయులు ఎక్కడైనా కనిపిస్తే.. వెంటనే వారి సమాచారాన్ని డయల్‌ 100కు, సమీపంలో ఉండే పోలీస్ స్టేషన్‌లకు, స్పెషల్‌ బ్రాంచ్‌ కార్యాలయ ఫోన్‌ నంబర్లకు తెలియజేయాలి అన్నారు

మరోవైపు గుంటూరు జిల్లా పోలీసులు వారధి పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీస్ వారి యొక్క సేవలను ప్రజలకు చేరువ చేసే క్రమంలో ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. ప్రజలు, పోలీస్ వ్యవస్థ మధ్య స్నేహపూరిత వాతావరణాన్ని నెలకొల్పుతూ సురక్షితమైన సమాజాన్ని నిర్మించటమే వారధి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. మహిళలు, విద్యార్దులు సోషల్ మీడియాలోలో తమ ఫొటోలోను అప్‌లోడ్ చేయొద్దని.. అపరిచితులకు వ్యక్తిగత వివరాలను ఇవ్వకూడదన్నారు.

ప్రజలందరూ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు ఎస్పీ. గ్రామంలోని ప్రతి ఇంటిని కూడా సీసీ కెమెరా నిఘాలో ఉంచుకోవాలని.. తల్లిదండ్రులు తమ యొక్క పిల్లల ప్రవర్తన గమనిస్తూ ఉండాలన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు దూరంగా ఉండేలా చూసుకోవాలన్నారు. తగాదాల వలన జరిగే నష్టాలు, మహిళలపై జరిగే నేరాలు, రోడ్డు ప్రమాదాల వలన జరిగే నష్టాలు ,ఆన్లైన్ సైబర్ నేరాలు గురించి వీడియో ప్రొజెక్టర్లు ద్వారా వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఊరిలో.. గ్రామ శాంతి కమిటీలు ఏర్పాటు చేయనున్నారు.. ఈ గ్రామ/వార్డు శాంతి కమిటీల సహాయంతో సంబంధిత SHOలు లా & ఆర్డర్ సమస్యలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని సేకరిస్తారు. ఆ గ్రామంలో ఏదైనా లా అండ్ ఆర్డర్ సమస్య లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే, సంబంధిత SHO లేదా పోలీసు అధికారి ఈ శాంతి కమిటీల సహాయంతో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు

తెలంగాణలో భారీ స్కాం: కూసాలు కదిలినట్టే..!!

తెలంగాణలో వెలుగులోకి వచ్చిన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కుంభకోణం వ్యవహారంలో సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలపై కేసు పెట్టారు. వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

నకిలీ బిల్లులను సమర్పించడం ద్వారా సీఎంఆర్ఎఫ్ నుంచి భారీగా నిధులను విత్ డ్రా చేసిన ఉదంతం కలకలం రేపిన విషయం తెలిసిందే. సీఎంఆర్ఎఫ్ కింద పేషెంట్లకు వైద్యం చేసినట్లు నకిలీ డాక్యుమెంట్లను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించి, వాటి ద్వారా నిధులను విడుదల చేయించుకున్నాయి ఆయా ఆసుపత్రుల యాజమాన్యం.

దీనిపై సచివాలయ రెవెన్యూ మంత్రిత్వ శాఖ సెక్షన్ ఆఫీసర్ డీఎస్‌ఎన్ మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులో పొందుపరిచారు. ఈ కుంభకోణంలో కొందరు బడా నాయకులు సైతం ఉన్నట్లు తేలింది.

దీనితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. విచారణను సీఐడీకి బదలాయించారు. రంగంలో దిగిన సీఐడీ అధికారులు తమ దర్యాప్తును ఉధృతం చేశారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పలు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యంపై ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు.హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్‌లోని పలు ఆసుపత్రులపై ఈ ఎఫ్ఐఆర్‌లు నమోదు అయ్యాయి. వాటిని ముఖ్యమంత్రి సహాయ నిధి జాబితా నుంచి తొలగించారు.

హైదరాబాద్‌లో- అరుణ శ్రీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, శ్రీ కృష్ణ ఆసుపత్రి, జననీ ఆసుపత్రి, హిరణ్య ఆసుపత్రి, డెల్టా ఆసుపత్రి, శ్రీ రక్ష ఆసుపత్రి, ఎంఎంఎస్ ఆసుపత్రి, ఏడీఆర్ఎం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, ఎంఎంవీ ఇందిరా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, శ్రీ సాయి తిరుమల ఆసుపత్రి ఉన్నాయి.ఖమ్మంలో- శ్రీకర మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి, గ్లోబల్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి, డాక్టర్ జేఆర్ ప్రసాద్ ఆసుపత్రి, శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, వైష్ణవి ఆసుపత్రి, న్యూ అమృత ఆసుపత్రి, మేఘాశ్రీ ఆసుపత్రి, ఆరెంజ్ ఉన్నాయి.

రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు : వైఎస్‌.జగన్‌

నేడు శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని …. రాష్ట్ర ప్రజలందరికీ వైసిపి అధినేత వైఎస్‌.జగన్‌ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జగన్‌ ట్వీట్‌ చేశారు. ” రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఆథ్యాత్మికంగా శక్తినిచ్చే ఈ పండుగ ప్రజలందరినీ ఏకం చేస్తుంది.

చెడును నిర్మూలించి ధర్మాన్ని కాపాడడంలో శ్రీకృష్ణుడి బోధనలు మానవాళికి ఆచరణీయం.

మనందరిపైన, రాష్ట్రంపైన శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ” అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

రుణమాఫీ వర్తించని రైతులకు అలర్ట్.. రేపటి నుంచి డైరెక్టుగా ఇంటికే..

అర్హులైనా రుణమాఫీ వర్తించని రైతుల వివరాల నమోదుకు ప్రభుత్వం ‘రైతుభరోసా పంట రుణ మాఫీ యాప్’ను తీసుకొచ్చింది. రేపటి నుంచి వారి వివరాలను నమోదు చేయాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించింది. రూ.2లక్షల లోపు మాఫీ కాని వారి రుణఖాతాలు, ఆధార్ కార్డు తనిఖీ చేసి కుటుంబ సభ్యుల వివరాలను యాప్‌లో అప్లోడ్ చేయాలంది.

తెలంగాణ ప్రభుత్వం రూ. 2 లక్షల రైతు రుణమాఫీ పథకం అమలు చేసిన సంగతి తెలిసిందే. మెుత్తం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. మెుత్తం రూ. 31 వేల కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేసినట్లు సర్కార్ వెల్లడించింది. అయితే కొందరు రైతులకు అర్హతలు ఉన్నా రుణమాఫీ వర్తించలేదు. రేషన్ కార్డు లేకపోవటం, ఆధార్ కార్డులో తప్పులు, పట్టాదార్ పాస్ పుస్తకంలోని పేరుతో సరిపోలకపోవటం వంటి కారణాలతో వారి రుణమాఫీ కాలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అటువంటి రైతులకు రైతు రుణమాఫీ వర్తించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రైతుల వివరాల నమోదుకు 'రైతు భరోసా పంట రుణమాఫీ యాప్‌' ను తెలంగాణ వ్యవసాయశాఖ రూపొందించింది. ఈ యాప్‌ను ఇప్పటికే అన్ని జిల్లాల వ్యవసాయాధికారులు, డివిజన్, మండల స్థాయిలోని వ్యవసాయ విస్తరణాధికారులకు పంపించింది. వారు రుణమాఫీ వర్తించని రైతుల సమాచారం తెలుసుకొని యాప్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రేపటి (ఆగస్టు 27) నుంచే ఈ సర్వే ద్వారా యాప్‌లో వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు.

అర్హులైనా రుణమాఫీ వర్తించని రైతుల ఇంటికే అధికారులు నేరుగా వెళతారు. ముందుగా వారి లోన్ అకౌంట్లు, ఆధార్‌ కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అనంతరం కుటుంబ సభ్యుల వివరాలు పూర్తిగా తీసుకొని యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. పంట రుణాలు ఉన్న భార్యాభర్తలే కాకుండా ఇంట్లో 18 ఏళ్లు దాటిన వారి కుటుంబ సభ్యుల ఫొటోలు కూడా తీసుకుంటారు. ఆ తర్వాత కుటుంబ యజమానితో ధ్రువీకరణపత్రం సైతం తీసుకుంటారు. అందులో యజమాని తన లోన్ అకౌంట్, సంబంధిత బ్యాంకు బ్రాంచి వివరాలతోపాటు రుణమాఫీ కోసం కుటుంబ సభ్యుల వివరాలను తాను ఇష్టపూర్వకంగా రాసి ఇస్తున్నట్లు పేర్కొంటూ సంతకం చేయాల్సి ఉంటుంది. అందులోనే ఫోన్ నెంబర్ కూడా రాయాలి. వీటిని ధ్రువీకరిస్తూ గ్రామ కార్యదర్శి అటెస్టేషన్‌ చేయాలని వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం ఘనంగా ఏర్పాట్లు.. భక్తుల కోసం కొత్తగా.. టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమవుతోంది. అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకూ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్షించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, పురటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని టీటీడీ ఈవో అభిప్రాయపడ్డారు. అన్నివిభాగాల అధికారులు, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 4న ధ్వజారోహణం నిర్వహిస్తామని.. అదే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.

బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, అలాగే రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. గరుడ వాహనసేవ మాత్రం సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. బ్రహ్మోత్సవాల కోసం సుమారు ఏడు లక్షల లడ్డూల బఫర్‌ స్టాక్‌ ఉంచారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా కామన్‌ కమాండ్‌ సెంటర్‌ ద్వారా భద్రత పర్యవేక్షించనున్నారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్‌ దీపాలంకరణలు, వాహనసేవలు వీక్షించేందుకు మాడ వీధుల్లో గ్యాలరీలు, పెద్ద డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు.

మరోవైపు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అక్టోబర్‌ 4 నుంచి 12వ తేదీ వరకు కాటేజి దాతలకు గదుల కేటాయింపు ఉండదని టీటీడీ ఈవో తెలిపారు. అలాగే తిరుమలలో గదులు లభించని భక్తులు తిరుపతిలో బస చేయాలని కోరారు. ఇక బ్రహ్మోత్సవాల కోసం 4,000 మంది శ్రీవారి సేవకులు, తిరుమలలోని అన్ని విభాగాల్లో భక్తులకు సేవలందించనున్నారు. ఇక అక్టోబరు 8న గరుడసేవ సందర్భంగా ఘాట్‌ రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలను టీటీడీ రద్దు చేసింది. అలిపిరి పాత చెక్‌పోస్టు, శ్రీవారిమెట్టు వద్ద ద్విచక్రవాహనాల పార్కింగ్‌ ఏర్పాట్లుచేస్తున్నారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా 8 ప్రథమ చికిత్సా కేంద్రాలు

మరోవైపు శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తులకు అసౌకర్యం కలగకుండా టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో నూతనంగా 8 ప్రధమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే తిరుమల, తిరుపతిలో ఆరు డిస్పెన్సరీలు నడుస్తున్నాయి. వీటి ద్వారా భక్తులకు, ఉద్యోగులకు, స్థానికులకు వైద్య సేవలు అందిస్తున్నారు. వీటితో పాటుగా అదనంగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో రెండు,రాంబగీచ అతిథి గృహాలు, తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రము, శిలా తోరణం, బాట గంగమ్మ ఆలయము, పాపానాశనం, 7వ మైలు వద్ద ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

ఏపీలో స్పేస్ పార్క్ ఏర్పాటుపై డిప్యూటీ సీఎం చర్చలు..

శాస్త్ర, సాంకేతిక రంగం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలో స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశమై.. అంతరిక్ష రంగంలో సంస్థ చేసిన పరిశోధనల గురించి తెలుసుకున్నారు. స్పేస్ కిడ్జ్ సంస్థ పరిశోధనలు, తయారు చేసిన శాటిలైట్ల గురించి డిప్యూటీ సీఎంకు సంస్థ ప్రతినిధులు వివరించారు. ఇటీవల తయారుచేసిన అతి చిన్న శాటిలైట్ డిప్లయర్‌ను పవన్ కళ్యాణ్‌కు చూపించి.. దాని పని విధానం, ఉపయోగాలను వివరించారు.

పిల్లల్లో దాగిఉన్న అపరిమితమైన ఊహాశక్తిని వెలికి తీసి.. వారిని శాస్త్రవేత్తలుగా తయారుచేయడమే లక్ష్యంగా స్పేస్ కిడ్జ్ సంస్థ పనిచేస్తుంది. విద్యార్థి దశలోనే శాస్త్ర, సాంకేతిక రంగాలపై మక్కువ పెంచడమే ఈ సంస్థ లక్ష్యం. ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనవైపు విద్యార్థులు మళ్లించే ఉద్దేశంతో సంస్థ పనిచేస్తుంది. దేశంలో యువ శాస్త్రవేత్తలను తయారుచేయడమే లక్ష్యంగా స్పెస్ కిడ్జ్ సంస్థ పనిచేస్తోంది. ముఖ్యంగా పలు ఉపగ్రహాలను ఈ సంస్థ అభివృద్ధి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో సంస్థ కార్యకలాపాలను విస్తృతం చేసే లక్ష్యంతో స్పెస్ కిడ్జ్ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిశారు.

విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విద్యార్థులు శాస్త్రవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో స్పెస్ పార్క్ ఏర్పాటుపై స్పెస్ కిడ్జ్ ప్రతినిధులతో ఆయన చర్చించారు. అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని తెలిపారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంపొందించడం ఎంతైనా అవసరమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. శాస్ర్తవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాస్త్ర, సాంకేతిక రంగాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. సాంకేతికతను ఉపయోగించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇదే సమయంలో విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికితీసి.. వారిని శాస్త్ర, సాంకేతిక రంగాల వైపు ఆకర్షితులయ్యేలా ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.