/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz కోహ్లి చేసిన ఆ తప్పుతోనే వరల్డ్ కప్ కోల్పోయాం: రోహిత్ Raghu ram reddy
కోహ్లి చేసిన ఆ తప్పుతోనే వరల్డ్ కప్ కోల్పోయాం: రోహిత్

2019 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీఫైనల్స్‌లోనే నిష్క్రమించడానికి గల కారణాలను రోహిత్ శర్మ వివరించాడు. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి పేలవమైన వ్యూహాలే తమ జట్టు ఓటమికి పరోక్ష కారణమని పేర్కొన్నాడు. అయితే ఈ వ్యాఖ్యలను భారత జట్టు కెప్టెన్ రోహిత్ తాజాగా చేయలేదు. గతంలో చేసిన ఈ కామెంట్స్ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

2019 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో ఓటమికి ప్రధాన కారణం భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానంలో సరైనోడే లేకపోవడమే అని హిట్ మ్యాన్ పేర్కొన్నాడు. నాలుగో స్థానంలో అంబటి రాయుడు అని ఈ మెగాటోర్నీకి ముందు టీమ్ మేనేజ్మెంట్ ఓ అంచనాకు వచ్చింది. కానీ అనూహ్యంగా రాయుడును ఆ ప్రపంచకప్‌కు ఎంపిక చేయలేదు.

అయితే నాలుగో స్థానంలో ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే ఫలితం మరోలా వచ్చి ఉండేదని రోహిత్ పేర్కొన్నాడు. కివీస్‌తో జరిగిన సెమీస్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ 72 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ''నాలుగో స్థానంలో వచ్చే బ్యాటర్ జట్టుకు ఎంతో ముఖ్యమని నేను భావిస్తాను. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ ఎలా ఆలోచిస్తారనే దానిపై ఇది ఆధారపడి ఉంది. ధోనీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే బాగుండేది అని నా అభిప్రాయం'' అని రోహిత్ పేర్కొన్నాడు.

2019 వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా రోహిత్ నిలిచిన విషయం తెలిసిందే. 81 సగటుతో 648 పరుగులు చేశాడు. దీనిలో అయిదు శతకాలు కూడా ఉన్నాయి. కాగా, ఆ తర్వాత జరిగిన టీ20 ప్రపంచకప్ అనంతరం రోహిత్ టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే. హిట్ మ్యాన్ సారథ్యంలో టీమిండియా 2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్, 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్స్‌‌కు చేరింది. ఇటీవల జరిగిన 2024 టీ20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచింది.

తెలంగాణలో మరో ఐదురోజులు వానలే వానలు..!

తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. నిన్న సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు కురవగా.. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాపాతం రికార్డయ్యింది. మరో వైపు రాగల ఐదురోజుల పాటు తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. నిన్న సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు కురవగా.. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాపాతం రికార్డయ్యింది. మరో వైపు రాగల ఐదురోజుల పాటు తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది.

పలుచోట్ల గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వస్తాయని.. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని తెలిపింది.

హైడ్రా లిస్టులో ప్రముఖులు - కూల్చివేత జాబితా ఇదే..!!

హైడ్రా ఇప్పుడు సంచలనంగా మారింది. హీరో నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో ఒక్క సారిగా హైడ్రా నిర్ణయాల పైన ఉత్కంఠ పెరుగుతోంది. హైడ్రా ఇప్పటి వరకు పలువురు ప్రముఖుల ఆక్రమణలు కూల్చి వేసింది. 18 చోట్ల కూల్చివేతలు చేసినట్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజుతో సహా సునీల్ రెడ్డికి సంబంధించిన ఆక్రమణలను కూల్చివేసింది. ప్రభుత్వానికి చెందిన 43 ఎకరాల స్థలం ఇప్పటి వరకు స్వాధీనం చేసుకుంది

హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. నగర పరిధిలోని పలు చెరువుల్లో ఉన్న ఆక్రమణలను తొలిగిస్తోంది. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో 43 ఎకరాల స్థలం స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి హైడ్రా నివేదిక ఇచ్చింది. జాబితాలో పలు రంగాలకు చెందిన ప్రముఖలు ఉన్నారు. చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్రాజు, కావేరీ సీడ్స్ భాస్కర్రావు, ప్రొ కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలు కూల్చివేసినట్లు రిపోర్ట్ లో వెల్లడించింది. లోటస్పాండ్, మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్ నగర్, గాజుల రామారం, అమీర్ పేట్ లో అక్రమ కట్టడాలు కూల్చేసినట్లు హైడ్రా రిపోర్ట్ లో పేర్కొంది

18 చోట్ల కూల్చివేత

ఇక, హైడ్రా నివేదిక ప్రకారం బంజారా హిల్స్ లో ఆక్రమించుకున్న రెస్టారెంట్ భవనం కూల్చివేసారు. చింతల్ చెరువులో కబ్జాలను కూల్చివేసినట్లు వెల్లడించింది. నందగిరి హిల్స్ లోఎకరం స్థలం స్వాధీనం చేసుకుంది. నందగిరి హిల్స్ కబ్జాలను అడ్డుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదు చేసింది. రాజేంద్రనగర్ చెరువులు కబ్జాలు కూల్చివేసింది. ఎంఐఎం ఎమ్మెల్యే మోబిన్ నిర్మిస్తున్న భవనం కూల్చివేసినట్లు నివేదికలో వెల్లడించింది. ఎంఐఎం ఎం ఎల్ సి మిర్జా బేగ్ నిర్మించిన రెండంతస్తుల భవనం కూల్చివేసినట్లు పేర్కొంది. చందానగర్ ఏర్ల చెరువులో కబ్జాలు నిర్మూలించింది

ప్రముఖుల పై గురి

ప్రగతి నగర్ ఎర్రగుంట లో నిర్మించిన అక్రమ కట్టడాలు కూల్చివేసినట్లు రిపోర్టులో పేర్కొంది. బోడుప్పల్ చెరువులో నిర్మించిన ఆక్రమణలతో పాటుగా గండిపేట చెరువులో నిర్మించిన ఫామోజులు కూల్చివేసినట్లు వెల్లడించింది. మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు సంబంధించిన ఒరో స్పోర్ట్ కూల్చివేసినట్లు రిపోర్టు చేసింది. టీటీడీ మాజీ సభ్యుడు కావేరి సీడ్స్ భాస్కర రావుఫామ్ హౌస్ కూల్చివేసింది. బీజేపీ నేత సునీల్ రెడ్డి ఫామ్ హౌస్ ఆక్రమించి కట్టటం తో కూల్చింది. ప్రో కబడ్డీ యజమాని అనుపమ అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా మాదాపూర్ లోని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో ఇప్పటి వరకు హైడ్రా స్వాధీనం చేసుకున్న భూముల గురించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

ఘనంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు

52వ జన్మదిన వేడుకల సందర్భంగా భూపాల్ రెడ్డి తన స్వగ్రామమైన ఉరుమండ్లలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు

అనంతరం వి.టి.కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితుల కోలాహలం మరియు వేద పండితుల ఆశీర్వచనాల మధ్యలో భారీ కేక్ ను భూపాల్ రెడ్డి కట్ చేశారు

ఈ సందర్భంగా మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ భూపాల్ రెడ్డి కి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

52వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు కంచర్ల భూపాల్ రెడ్డి గారిని భారీ గజమాలతో సత్కరించారు

కంచర్ల భూపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు... అనాథ శరణాలయంలో అన్నదాన కార్యక్రమాలు మరియు గొల్లగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు పంచడమే కాకుండా అనాధలకు దుప్పట్లు కూడా పంపిణీ చేశారు

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు భోనగిరి దేవేందర్, నల్గొండ, కనగల్ మండల అధ్యక్షులు దేప వెంకట్ రెడ్డి, ఐతగోని యాదయ్య, మహిళా నాయకులు శరణ్య రెడ్డి,కొప్పుల విమలమ్మ మరియు తదితర ప్రముఖ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

ఎవ్వరినీ వదిలేది లేదు.. చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వండి: మంత్రి పొన్నం

చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని మంత్రి పొన్నం హెచ్చరించారు. ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని చెప్పారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ చెరువులు ఆక్రమణకు గురయ్యాయో ఆయా సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

గ్రేటర్ హైదరాదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఉక్కుపాదం మోపుతోంది. చెరువులను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తుంది. ఇప్పటికే నగరం, శివారు ప్రాంతాల్లోని చాలా అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. శనివారం (ఆగస్టు 24) మాదాపూర్‌లో సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూడా కూల్చేశారు. దీంతో హైడ్రా అంటేనే అక్రమ నిర్మాణదారులు వణికుపోతున్నారు.

ఈ నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్ నగరానికి ఇంఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్న పొన్నం ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువల ఆక్రమణలపై తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రకృతి, పర్యావరణాన్ని కాపాడాలని.. జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యయానే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే దానిని ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంత పెద్ద వాళ్లు ఉన్నా చెరువులు , కుంటలు ఆక్రమణకు గురైతే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఈరోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్ తరాలకు ఇచ్చే వరం ఇది అని అన్నారు. మీ ప్రాంతంలో చెరువులు ఆక్రమణకు గురైతే ఎంత పెద్ద వారైనా.. ఏ పార్టీ వారైనా వదిలేది లేదని ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు.

ముఖ్యంగా హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ చెరువుల పరిరక్షణకు జరుగుతున్న కార్యక్రమంలో జంట నగరాల్లో హైదరాబాద్ ,రంగారెడ్డి ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. ప్రకృతిని, భవిష్యత్ తరానికి చెరువులను అందించటం కోసం ఈ ప్రక్రియలో స్వచ్ఛందంగా పాల్గొనాలని సూచించారు. మీ ప్రాంతంలోని చెరువులను రక్షించుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా, వ్యక్తిగతంగా, ఉద్దేశ్యపూర్వకంగా పోరాటం చేయటం లేదని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పరివర్తన తేవాలని చేస్తున్న చర్యలో భాగంగానే హైడ్రాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనలో తీసుకున్న గొప్ప చర్య ఇది అని అన్నారు. ఎక్కడెక్కడైతే చెరువుల ఆక్రమణకు గురయ్యేయో అక్కడ సమాచారం ఇవ్వాలని మంత్రి ప్రజలకు సూచించారు.

హైడ్రా దూకుడు.. నెక్ట్స్ టార్గెట్ ఎవరు...?

నగరంలో ఒక సంచలనం.. కబ్జాలు, అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణలు అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ హైడ్రా. ఇప్పటికే నగరంలోచాలా చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. తాజాగా మాదాపూర్‌లోని నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను సయితం కూల్చివేసింది. ఇక ఇప్పుడు హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఎవరు?

నగరంలో ఒక సంచలనం.. కబ్జాలు, అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణలు అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ హైడ్రా. ఇప్పటికే నగరంలోచాలా చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. తాజాగా మాదాపూర్‌లోని నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను సయితం కూల్చివేసింది. ఇక ఇప్పుడు హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఎవరు? ఏం జరగబోతోంది?. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఆక్రమణలు చేసిన ప్రముఖుల్లో టెన్షన్ పెంచుతోంది.

ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ఇప్పుడు అందరి దృష్టి మాజీ మంత్రి మల్లారెడ్డిపై హైడ్రా అధికారులు దృష్టిసారించినట్టు తెలుస్తోంది. చెరువులు, నాలాలు ఆక్రమించి మల్లారెడ్డి నిర్మించిన యూనివర్సిటీ, కాలేజీ, హాస్పిటల్‌పై హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. మల్లారెడ్డి ఆక్రమించి నిర్మించిన చెరువులు, నాలాలను హైడ్రా అధికారులు పరిశీలించారు.

రేపో, మాపో మల్లారెడ్డి అక్రమ కట్టడాలను కూల్చివేతకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చట్ జిల్లా, ఘట్‌కేశరి మండలం, వెంకటాపూర్‌లోని అనురాగ్ విశ్వవిద్యాలయం భవనాలను వెంకటాపూర్ నాదం చెరువులో నిర్మించారని నీటిపారుదలశాఖ ఏఈ ఐటీ కారిడర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున ఫైర్-కోర్టులోనే తేల్చుకుంటా..!

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గచ్చిబౌలిలోని తన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అక్రమ కట్టడం పేరుతో ఇవాళ కూల్చివేయడాన్ని టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు హైడ్రా, తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ చర్యలతో ప్రజలు తమను తప్పుగా అనుకోకుండా ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. చట్టవిరుద్ధంగా చేసిన కూల్చివేతపై కోర్టులోనే తేల్చుకుంటానని నాగార్జున వెల్లడించారు.

స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని అక్కినేని నాగార్జున తన ప్రకటనలో తెలిపారు. తమ ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం, చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలిపేందుకు ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. అదో ఓ పట్టా భూమి అని, ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదని నాగార్జున పేర్కొన్నారు. అది ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం అన్నారు. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపైనా కోర్టు స్టే ఇచ్చిందన్నారు.

స్పష్టంగా చెప్పాలంటే ఈ కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగిందని నాగార్జున తెలిపారు. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదన్నారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడినని తెలిపారు.

తాజా పరిణామాల వల్ల, తాము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముందని, ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే తమ ప్రధాన ఉద్దేశమన్నారు. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా తాము కోర్టును ఆశ్రయిస్తామని, అక్కడ తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు నాగార్జున తెలిపారు.

సినీ హీరో నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత

టాలీవుడ్‌ సినీ హీరో నాగార్జునకు చెందిన మాదాపూర్‌ ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం అధికారులు శనివారం తెల్లవారుజాము నుండి కూల్చివేస్తున్నారు. కచ్చితమైన ఆధారాలతో అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కన్వెన్షన్‌ను కూల్చివేస్తున్నారు.

తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్‌ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. మరోవైపు ఎన్‌ కన్వెన్షన్‌ కు వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు మూసి వేశారు.

ఎన్‌ కన్వెన్షన్‌ కు వెళ్లడానికి మీడియాకు అనుమతి లేదంటూ భారీ కేడ్లను ఏర్పాటు చేశారు.

కూల్చివేతలను చిత్రీకరించడానికి మీడియాకు అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు పెట్టారు.

వినేశ్‌.. పంట పండింది!

ఒలింపిక్‌ పతకం సాధించాలన్న రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ కల చెదిరి ఉండొచ్చు. కానీ, ఆమె పాపులారిటీ అమాంతం పెరిగింది. దీంతో ఫొగట్‌ను తమ ఉత్పత్తుల ప్రచారకర్తగా నియమించుకోవడానికి పలు కంపెనీలు క్యూ కడుతున్నాయి. అలాగే పారి్‌సలో పతకాలు సాధించిన మరికొందరు అథ్లెట్ల బ్రాండ్‌

ఒలింపిక్‌ పతకం సాధించాలన్న రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ కల చెదిరి ఉండొచ్చు. కానీ, ఆమె పాపులారిటీ అమాంతం పెరిగింది. దీంతో ఫొగట్‌ను తమ ఉత్పత్తుల ప్రచారకర్తగా నియమించుకోవడానికి పలు కంపెనీలు క్యూ కడుతున్నాయి. అలాగే పారి్‌సలో పతకాలు సాధించిన మరికొందరు అథ్లెట్ల బ్రాండ్‌ వ్యాల్యూ కూడా భారీగా పెరిగింది. ప్యాకేజింగ్‌ ఫుడ్‌, హెల్త్‌, న్యూట్రిషన్‌, జ్యుయెలరీ, బ్యాంకింగ్‌, ఎడ్యుకేషన్‌ ఇలా పలు రంగాలకు చెందిన కంపెనీలు అథ్లెట్లతో ఒప్పందాలు చేసుకోవడానికి పోటీపడుతున్నాయి.

పారిస్‌కు ముందు ఫొగట్‌ ఎండార్స్‌మెంట్‌ ఫీజు రూ. 25 లక్షలు ఉంటే.. ఇప్పుడు రూ. 75 లక్షల నుంచి కోటి రూపాయలకు పెరిగిందని ఓ ఎగ్జిక్యూటివ్‌ చెప్పాడు. పతకం నెగ్గకపోయినా.. ఆమె చూపిన ధైర్యం, హుందాతనం అందరి హృదయాలను గెలుచుకొందన్నాడు. విశ్వక్రీడల్లో 50 కిలోల విభాగం ఫైనల్‌ ముందు 100 గ్రాములు ఎక్కువ బరువు ఉందనే కారణంతో వినేశ్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. నైకీ, కంట్రీ డిలైట్‌తో ఫొగట్‌ ఒలింపిక్స్‌కు ముందే అగ్రిమెంట్‌ చేసుకొంది. ఇక, రజతం సాధించిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా, రెండు కాంస్యాలతో చరిత్ర సృష్టించిన షూటర్‌ మను భాకర్‌కు కూడా భారీ డిమాండ్‌ నెలకొంది. చోప్రా బ్రాండ్‌ వాల్యూ 30 నుంచి 40 శాతం దాకా పెరిగి.. సుమారు రూ. 330 కోట్లకు చేరుకొందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

భారత్‌లో క్రికెటర్ల తర్వాత చోప్రాకే ఎక్కువ పాపులారిటీ అనడంలో సందేహం లేదు. నీరజ్‌ ఎండార్స్‌మెంట్‌ ఫీజు గతంలో రూ. 3 కోట్లు ఉంటే.. మెగా క్రీడల తర్వాత రూ. 4 నుంచి 4.5 కోట్లకు పెరిగిందట. మరోవైపు యూత్‌లో సూపర్‌ క్రేజ్‌ తెచ్చుకొన్న భాకర్‌ను తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకొనేందుకు కంపెనీలు పెద్ద మొత్తంలో ఒప్పందాలు చేసుకోవడానికి సిద్ధమయ్యాయి. గతంలో ప్రకటనల కోసం ఏడాదికి రూ. 25 లక్షలు మను తీసుకునేది. అయితే, అదిప్పుడు ఏకంగా ఆరు రెట్లు పెరిగి రూ. 1.5 కోట్లకు చేరిందని టాక్‌.

సీఎం రేవంత్ నిజ స్వరూపం బయటపడింది

సీఎం రేవంత్ రెడ్డి నిజస్వరూపం బయట పడిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. గురువారం ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... జనగామకు వచ్చి కొమురవెల్లి మల్లన్న మీద ఓట్టు వేసి ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు... ఏ ఊర్లో అయినా వంద శాతం రుణమాఫీ అయ్యిందా? ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదు’’ అని చెప్పారు.

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిజస్వరూపం బయట పడిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (MLA Harish Rao) వ్యాఖ్యలు చేశారు. గురువారం ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... జనగామకు వచ్చి కొమురవెల్లి మల్లన్న మీద ఓట్టు వేసి ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు... ఏ ఊర్లో అయినా వంద శాతం రుణమాఫీ అయ్యిందా? ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదు’’ అని చెప్పారు. రుణమాఫీ మొత్తం కాలేదని కాంగ్రెస్ మంత్రులే ఒప్పుకున్నారన్నారు. తెలంగాణ ప్రజలను కాపాడాలని యాదాద్రి నర్సింహాస్వామిని వేడుకున్నానన్నారు. ఆగస్టు నెల వచ్చినా ఊర్లల్లో చెరువులు నింపడం లేదన్నారు.

రైతు భీమా, రైతు బంధు, చెరువులు నింపిన ఘనత కేసీఆర్ ది అని తెలిపారు. జాబ్ క్యాలెండర్ ఏమైంది..? రెండు లక్షల ఉద్యోగాలు ఏవి..? ప్రశ్నించారు. ‘‘పోలీసులను హెచ్చరిస్తున్న.. మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదు’’ అని అన్నారు. చీఫ్ సెక్రటరీ మెడలు వంచైనా సరే రుణమాఫి చేయిస్తామని స్పష్టం చేశారు. మోసం రేవంత్ రెడ్డి ది, పాపం కాంగ్రెస్ పార్టీది అంటూ హరీష్‌రావు వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ విషయంలో సీఎం, మంత్రులవి తలోమాట అన్నారు. ప్రభుత్వంలో సమన్వయం లేక గందరగోళం ఏర్పడిందన్నారు.

రుణమాఫీపై పార్లమెంట్ ఎన్నికల్లో దేవుడి మీద ఒట్టేసి ప్రమాణాలు చేసిన సీఎం మాట తప్పారని మండిపడ్డారు. రైతులందరికీ రుణమాఫీ అందేవరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పోరాటం వల్లే 40% రుణమాఫీ అందుతుందన్నారు. తాము రైతుబంధు పథకంలో 72వేల కోట్లు ఇచ్చామని తెలిపారు. రుణమాఫీ విషయంలో తాము కాంగ్రెస్ నాయకులలాగా హామీలు ఇవ్వలేదన్నారు. ఇంకా 22లక్షల మంది రైతులకు రుణమాఫీ అందేవరకు వానాకాలం రైతు భరోసా పంటలు కోతకు వచ్చినప్పుడు ఇస్తారా అంటూ ప్రభుత్వాన్ని హరీష్‌రావు ప్రశ్నించారు.