హైడ్రా లిస్టులో ప్రముఖులు - కూల్చివేత జాబితా ఇదే..!!
హైడ్రా ఇప్పుడు సంచలనంగా మారింది. హీరో నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో ఒక్క సారిగా హైడ్రా నిర్ణయాల పైన ఉత్కంఠ పెరుగుతోంది. హైడ్రా ఇప్పటి వరకు పలువురు ప్రముఖుల ఆక్రమణలు కూల్చి వేసింది. 18 చోట్ల కూల్చివేతలు చేసినట్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజుతో సహా సునీల్ రెడ్డికి సంబంధించిన ఆక్రమణలను కూల్చివేసింది. ప్రభుత్వానికి చెందిన 43 ఎకరాల స్థలం ఇప్పటి వరకు స్వాధీనం చేసుకుంది
హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. నగర పరిధిలోని పలు చెరువుల్లో ఉన్న ఆక్రమణలను తొలిగిస్తోంది. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో 43 ఎకరాల స్థలం స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి హైడ్రా నివేదిక ఇచ్చింది. జాబితాలో పలు రంగాలకు చెందిన ప్రముఖలు ఉన్నారు. చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్రాజు, కావేరీ సీడ్స్ భాస్కర్రావు, ప్రొ కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలు కూల్చివేసినట్లు రిపోర్ట్ లో వెల్లడించింది. లోటస్పాండ్, మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్ నగర్, గాజుల రామారం, అమీర్ పేట్ లో అక్రమ కట్టడాలు కూల్చేసినట్లు హైడ్రా రిపోర్ట్ లో పేర్కొంది
18 చోట్ల కూల్చివేత
ఇక, హైడ్రా నివేదిక ప్రకారం బంజారా హిల్స్ లో ఆక్రమించుకున్న రెస్టారెంట్ భవనం కూల్చివేసారు. చింతల్ చెరువులో కబ్జాలను కూల్చివేసినట్లు వెల్లడించింది. నందగిరి హిల్స్ లోఎకరం స్థలం స్వాధీనం చేసుకుంది. నందగిరి హిల్స్ కబ్జాలను అడ్డుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదు చేసింది. రాజేంద్రనగర్ చెరువులు కబ్జాలు కూల్చివేసింది. ఎంఐఎం ఎమ్మెల్యే మోబిన్ నిర్మిస్తున్న భవనం కూల్చివేసినట్లు నివేదికలో వెల్లడించింది. ఎంఐఎం ఎం ఎల్ సి మిర్జా బేగ్ నిర్మించిన రెండంతస్తుల భవనం కూల్చివేసినట్లు పేర్కొంది. చందానగర్ ఏర్ల చెరువులో కబ్జాలు నిర్మూలించింది
ప్రముఖుల పై గురి
ప్రగతి నగర్ ఎర్రగుంట లో నిర్మించిన అక్రమ కట్టడాలు కూల్చివేసినట్లు రిపోర్టులో పేర్కొంది. బోడుప్పల్ చెరువులో నిర్మించిన ఆక్రమణలతో పాటుగా గండిపేట చెరువులో నిర్మించిన ఫామోజులు కూల్చివేసినట్లు వెల్లడించింది. మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు సంబంధించిన ఒరో స్పోర్ట్ కూల్చివేసినట్లు రిపోర్టు చేసింది. టీటీడీ మాజీ సభ్యుడు కావేరి సీడ్స్ భాస్కర రావుఫామ్ హౌస్ కూల్చివేసింది. బీజేపీ నేత సునీల్ రెడ్డి ఫామ్ హౌస్ ఆక్రమించి కట్టటం తో కూల్చింది. ప్రో కబడ్డీ యజమాని అనుపమ అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా మాదాపూర్ లోని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో ఇప్పటి వరకు హైడ్రా స్వాధీనం చేసుకున్న భూముల గురించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
Aug 25 2024, 20:57