సీఎం రేవంత్ నిజ స్వరూపం బయటపడింది
సీఎం రేవంత్ రెడ్డి నిజస్వరూపం బయట పడిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. గురువారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... జనగామకు వచ్చి కొమురవెల్లి మల్లన్న మీద ఓట్టు వేసి ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు... ఏ ఊర్లో అయినా వంద శాతం రుణమాఫీ అయ్యిందా? ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదు’’ అని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిజస్వరూపం బయట పడిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (MLA Harish Rao) వ్యాఖ్యలు చేశారు. గురువారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... జనగామకు వచ్చి కొమురవెల్లి మల్లన్న మీద ఓట్టు వేసి ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు... ఏ ఊర్లో అయినా వంద శాతం రుణమాఫీ అయ్యిందా? ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదు’’ అని చెప్పారు. రుణమాఫీ మొత్తం కాలేదని కాంగ్రెస్ మంత్రులే ఒప్పుకున్నారన్నారు. తెలంగాణ ప్రజలను కాపాడాలని యాదాద్రి నర్సింహాస్వామిని వేడుకున్నానన్నారు. ఆగస్టు నెల వచ్చినా ఊర్లల్లో చెరువులు నింపడం లేదన్నారు.
రైతు భీమా, రైతు బంధు, చెరువులు నింపిన ఘనత కేసీఆర్ ది అని తెలిపారు. జాబ్ క్యాలెండర్ ఏమైంది..? రెండు లక్షల ఉద్యోగాలు ఏవి..? ప్రశ్నించారు. ‘‘పోలీసులను హెచ్చరిస్తున్న.. మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదు’’ అని అన్నారు. చీఫ్ సెక్రటరీ మెడలు వంచైనా సరే రుణమాఫి చేయిస్తామని స్పష్టం చేశారు. మోసం రేవంత్ రెడ్డి ది, పాపం కాంగ్రెస్ పార్టీది అంటూ హరీష్‌రావు వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ విషయంలో సీఎం, మంత్రులవి తలోమాట అన్నారు. ప్రభుత్వంలో సమన్వయం లేక గందరగోళం ఏర్పడిందన్నారు.
రుణమాఫీపై పార్లమెంట్ ఎన్నికల్లో దేవుడి మీద ఒట్టేసి ప్రమాణాలు చేసిన సీఎం మాట తప్పారని మండిపడ్డారు. రైతులందరికీ రుణమాఫీ అందేవరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పోరాటం వల్లే 40% రుణమాఫీ అందుతుందన్నారు. తాము రైతుబంధు పథకంలో 72వేల కోట్లు ఇచ్చామని తెలిపారు. రుణమాఫీ విషయంలో తాము కాంగ్రెస్ నాయకులలాగా హామీలు ఇవ్వలేదన్నారు. ఇంకా 22లక్షల మంది రైతులకు రుణమాఫీ అందేవరకు వానాకాలం రైతు భరోసా పంటలు కోతకు వచ్చినప్పుడు ఇస్తారా అంటూ ప్రభుత్వాన్ని హరీష్‌రావు ప్రశ్నించారు.
Aug 22 2024, 17:53