అమరావతికి ప్రపంచ బ్యాంకు నుంచి బిగ్ అప్డేట్ - కీలక మలుపు..!!
అమరావతిలో కీలక అడుగు పడింది. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం రూ 15 వేల కోట్ల రుణం ఇప్పించేందుకు ముందుకు వచ్చింది. తాజాగా ప్రధానితో సీఎం చంద్రబాబు సమావేశం సమయంలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. రాజదానిలో న్యాయ పరంగా ఉన్న ఇబ్బందులను అధిగమించి మందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమరావతికి రుణం అంశంలో ప్రపంచ బ్యాంకు నుంచి కీలక సమాచారం వచ్చింది.
అమరావతి వచ్చే వారం అత్యున్నతస్థాయి ప్రపంచ బ్యాంకు బృందం రానుంది.14 మంది సభ్యులతో కూడిన బృందం రానున్నట్లు సీఆర్‌డీఏకు సమాచాం ఇచ్చారు. అమరావతి రాజధానికి ప్రాజెక్టుల వారీగా ఎంత మేర రుణం ఇవ్వగలుగుతామన్నది ఈ బృందం నిర్ణయిస్తుంది. దీంతో ఈ బృందానికి సవివర నివేదికలను అందించేందుకు వీలుగా సీఆర్‌డీఏ కమిషనర్ భాస్కర్ కొద్ది రోజులుగా వివిధ శాఖల అధికారులతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీఆర్‌డీఏ విభాగాలను సమీక్షిస్తున్నారు.
ఈ సమీక్షల్లో అమరావతిలో శాశ్వత ప్రభుత్వ కాంప్లెక్స్‌లో భాగంగా నిర్మించే సచివాలయ టవర్లు, హైకోర్టు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్, ఎన్‌జీఓ, సెక్రటరీలు, జడ్జీల భవనాలు, ప్రభుత్వ టైప్ - 1, టైప్ - 2 భవనాలు, ఎల్‌పీఎస్ ఇన్ర్ఫా, ట్రంక్ ఇన్ర్ఫా, రాజధాని సంబంధిత ప్రాజెక్టులు, ప్రతిపాదిత ప్రాజెక్టులన్నింటిపైనా సమగ్ర సమాచారాన్ని ఆయా విభాగాలు సిద్ధం చేసేలా నిర్దేశించారు. దాదాపుగా ఆయా శాఖలు నివేదికలన్నీ సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. అమరావతి రాజధాని ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులను ఇంతకు ముందు వచ్చిన ప్రపంచ బ్యాంకు ఫోర్‌మెన్ బృందం రెండు రోజుల పాటు అమరావతిలో పర్యటించి ప్రాథమిక పరిశీలన జరిపింది.
ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా భేటీ అయ్యింది. అమరావతి ప్రణాళికల గురించి బృంద సభ్యులకు చంద్రబాబు వివరించారు. ఈ బృందం వెళ్లిపోయిన వెంటనే రుణాన్ని నిర్ణయించే కీలక బృందం రాకకు సంబంధించిన సమాచారం వచ్చింది. ఈ కమిటీకి సీఆర్‌డీఏ నుంచి ఆయా ప్రాజెక్టుల వారీగా ఎంతెంత నిధులు అవసరమన్న లెక్కలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాజెక్టుల వారీగా సీఆర్‌డీఏ కూడా రుణం ఎంత అవసరమన్న లెక్కలను కూడా సంబంధిత విభాగాలతో సిద్ధం చేయిస్తోంది. అమరావతి రాజధానిలోని కీలక ప్రాజెక్టులకు లోన్ కాంపోనెంట్ ఎంతెంత ఇవ్వాలన్నది 14 మంది సభ్యులతో కూడిన అత్యున్నత కమిటీ నిర్ణయిస్తుంది.
Aug 18 2024, 15:08