చరిత్రలో ఈరోజు... జూన్ 27...
సంఘటనలు
1787: 1787 జూన్ 27 నాడు జారీ చేసిన ఉత్తరువులు ప్రకారం, ఆ నాటి ఈస్ట్ ఇండియా కంపెనీ, జిల్లా కలెక్టరుకి, న్యాయధిపతి (జడ్జ్) అధికారాలను, మేజిస్ట్రేట్ అధికారాలను ఇచ్చింది. కొన్ని పోలీసు అధికారాలను కూడా ఇచ్చింది. 1793 లో, బెంగాల్ లో, శాశ్వత కౌలుదారీ పద్ధతి (పెర్మనెంట్ సెటిల్మెంటు పద్ధతి), ప్రవేశపెట్టిన తరువాత, కలెక్టరుకు ఇచ్చిన ఈ న్యాయధిపతి (జడ్జ్) అధికారాలను, మేజిస్ట్రేట్ అధికారాలను, పోలీసు అధికారాలను తొలగించారు. కాని, మరలా 1831లో కలెక్టరు కి, తిరిగి న్యాయాధికారాలను (మేజిస్ర్టేట్ అధికారాలను), ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చింది.
2007: యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి పదవికి టోనీ బ్లెయిర్ రాజీనామా, కొత్త ప్రధానిగా గోర్డాన్ బ్రౌన్ నియామకం.
జననాలు
1838: బంకిం చంద్ర ఛటర్జీ, వందేమాతరం గీత రచయిత. (మ.1894)
1917: ముక్కామల అమరేశ్వరరావు, రంగస్థల నటుడు, దర్శకుడు. (మ.1991)
1933: రమేష్ నాయుడు, తెలుగు సినీ సంగీత దర్శకుడు. (మ.1987)
1939: బొజ్జా తారకం దళితనేత, హైకోర్టు న్యాయవాది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు. హేతువాది. (మ.2016)
1939: రాహుల్ దేవ్ బర్మన్ ,సంగీత దర్శకుడు .(మ.1994).
1967: గంగాధర శాస్త్రి , గాయకుడు,సంగీత దర్శకుడు.
1971: దీపేంద్ర, నేపాల్ రాజు (మ.2001).
1980: సురభి ప్రభావతి, తెలుగు రంగస్థల నటి.
1992: కార్తీక నాయర్ , దక్షిణ భారత చలన చిత్ర నటి.(నటి రాధ కుమార్తె)
మరణాలు
1927: కాళ్ళకూరి నారాయణరావు, నాటక కర్త, సంఘ సంస్కర్త, ప్రథమాంధ్ర ప్రచురణ కర్త, జాతీయవాది, ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు. (జ.1871)
1978: జవ్వాది లక్ష్మయ్యనాయుడు, కళాపోషకులు, శాసనసభ సభ్యులు. (జ.1901)
2005: సాక్షి రంగారావు, రంగస్థల, సినిమా నటుడు. (జ.1942)
2008: మానెక్‌షా, భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్. (జ.1914)
2009: ఏరాసు అయ్యపురెడ్డి, న్యాయ శాస్త్ర కోవిదుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు, రాష్ట్ర మంత్రి.
2019: మహమ్మద్ బాజి కోరాపుట్‌కు చెందిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1917)
2019: విజయ నిర్మల , తెలుగు సినీ నటి, మహిళా దర్శకురాలు.(జ.1946)
Jun 27 2024, 10:27