కూలి రేట్ల పెంపుకై కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బయలుదేరిన హమాలీ కార్మికులు
కూలి రేట్ల పెంపుకై కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు బయలుదేరి వెళ్లిన హమాలీ కార్మికులు ..* తెలంగాణ రాష్ట్రంలో సివిల్ సప్లయి కార్పొరేషన్ లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు కూలి రేట్లు క్వింటాకు ఎగుమతి దిగుమతి రూ.40/-పెంచాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రోజున సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ (AITUC) ఆధ్వర్యంలో కూలి రేట్లు పెంచాలని *చలో కమిషనర్ భవన్ (మహాధర్నా)* సందర్బంగా భువనగిరి నుండి కార్మికులు హైదరాబాద్ తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ హమాలీ కార్మికులకు రెండు సంవత్సరాలకు ఒకసారి కూలి రేట్లు పెంచేందుకు గత ప్రభుత్వాలు జీవో విడుదల చేశాయని దాని ప్రకారం జనవరి 2024 సంవత్సరం నుండి హమాలీ కార్మికుల రేట్లు పెంచాలని కానీ సివిల్ సప్లయి కమీషనర్ ఆరు నెలలు గడిచిన పట్టించుకోవడంలేదని అన్నారు. హమాలీ కార్మికులు చాలీచాలని వేతనాలు తీసుకుంటూ ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా అందించే నిత్యవసర వస్తువులను పేద బడుగు బలహీన వర్గాలకు అందించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
కానీ హమాలీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం శ్రమ దోపిడీగురిచేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లిన రేపు మాపు అంటూ కాలయాపన చేస్తుంది, తప్ప సమస్యలను పరిష్కరించడం లేదని అన్నారు హమాలి కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ప్రతి కార్మికునికి ఈ ఎస్ ఐ, పి ఎఫ్, బోనస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు హమాలీ కార్మికులకు బెనిఫిట్స్ పెన్షన్ సౌకర్యం 50 సంవత్సరాలు నిండిన హమాలీ కార్మికులకు నెలకు 5వేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని అన్నారు ,మహిళా స్వీపర్లకు నెలకు రూ.10వేలు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, జిల్లా కమిటీ సభ్యులు సామల భాస్కర్, సివిల్ సప్లై హమాలి వర్కర్స్ యూనియన్ భువనగిరి పాయింట్ అధ్యక్షులు ముదిగొండ బసవయ్య, నాయకులు మామిండ్ల సత్యనారాయణ, గొరవంతల శ్రీను, బొజ్జ గణేష్, పిన్నం జగన్, పల్లెర్ల మైసయ్య, కొండ మల్లేష్, స్వామి, వెంకటేష్, బాలరాజ్, నర్సింహా, మల్లేష్, పాండు, తదితరులు పాల్గొన్నారు.
Jun 11 2024, 18:55