కామ్రేడ్ పల్లెర్ల బిక్షపతి అకాల మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు : సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్
సిపిఎం సీనియర్ నాయకుడు కామ్రేడ్ పల్లెర్ల బిక్షపతి అకాల మృతి ప్రజా ఉద్యమాలకు, పోరాటాలకు తీరని లోటని సిపిఎం జిల్లా కార్యదర్శి యండి.జహంగీర్ అన్నారు.ఆదివారం భువనగిరి మండల పరిధిలోని చీమలకొండూరు గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ పల్లెర్ల బిక్షపతి (ధర్మబిక్షం) గారి అకాల మృతికి సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరఫున సంతాపాన్ని ప్రకటించి వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసినారు.ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ కామ్రేడ్ బిక్షపతి విద్యార్థి దశలో కమ్యూనిస్టు రాజకీయాలకు ఆకర్షితులై విద్యార్థుల సమస్యల పరిష్కారంకై ఎస్ఎఫ్ఐ చేరి అనేక ఉద్యమాలు నిర్వహించాడుని అన్నారు. యువజన నాయకుడిగా నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాలపై నిర్వహించిన అనేక పోరాటాలలో ముందున్నారని అన్నారు. సిపిఎం పార్టీ సభ్యుడిగా భువనగిరి మండల నాయకుడిగా అనేక కూలీ ,భూమి పోరాటాలకు నాయకత్వం వహించి గ్రామంలో మండలంలో కూలీ పోరాటాలు నిర్వహించి కూలీ రేట్లు పెరగడానికి తమ పాత్ర పోషించాడని, గ్రామంలో పేదలు సాగు చేసుకుంటున్నా ప్రభుత్వ భూములకు నూతన పాసుబుక్కులు సాధించడంలో, చెరువుషికం భూములను కాపాడడంలో బిక్షపతి పాత్ర చాలా కీలకమని జహంగీర్ తెలియజేశారు. సామాజిక ఉద్యమాలలో, మండల, గ్రామ సమగ్ర అభివృద్ధికి జరిగిన పోరాటాలలో తన పాత్ర గొప్పదని బిక్షపతి జీవితాంతం ఎర్రజెండా చేతబట్టి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపినాడని, క్రమశిక్షణతో సమ సమాజంకోసం, దోపిడి రహిత సమాజ నిర్మాణం కోసం, ఎర్రజెండా రాజ్యం కోసం కష్టజీవుల రాజ్యం కోసం సిపిఎం నాయకత్వంలో కామ్రేడ్ బిక్షపతి అనేక పోరాటాలలో ముందుండి పని చేశారని వారి మృతి సిపిఎం ఉద్యమానికి తీరని లోటని వారి ఆశయ సాధన కోసం రానున్న కాలంలో ప్రజా పోరాటాలను ఉదృతం చేయాలని జహంగీర్ పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, భువనగిరి పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, సంగీత డైరెక్టర్, ప్రజానాట్యమండలి సీనియర్ కళాకారుడు మద్దూరి ఐలయ్య, సిపిఎం సీనియర్ నాయకులు బొల్లెపల్లి కుమార్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య, కొండా అశోక్, అన్నంపట్ల కృష్ణ, మండల కమిటీ సభ్యులు పాండాల మైసయ్య, చీమలకొండూరు శాఖ కార్యదర్శి బొడ అంజనేయులు, ముస్త్యలపల్లి శాఖ కార్యదర్శి కళ్లెం లక్ష్మీనరసయ్య, ముత్తిరెడ్డిగూడెం శాఖ కార్యదర్శి కూకుట్ల కృష్ణ, గ్రామ శాఖ సభ్యులు వడ్డబోయిన వెంకటేష్, పల్లెర్ల వినోద్, రాగుల పోశయ్య, రాగుల కిష్టయ్య, బలిత రాజు, జిల్లాపల్లి నవీన్, పద్మ,సరిత, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Jun 04 2024, 09:15