చౌటుప్పల్ లో విత్తన, ఎరువుల డీలర్ షాపులను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే
యాదాద్రి భువనగిరి జిల్లా:నకిలీ విత్తనాలు అమ్మిన కృత్రిమ కొరత సృష్టించిన కఠిన చర్యలు తీసుకుంటామని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండాగే డీలర్లను హెచ్చరించారు. శుక్రవారం నాడు చౌటుప్పల్ లోని ధనలక్ష్మి ఫర్టిలైజర్స్ అండ్ సీడ్స్ షాప్ ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఇన్వాయిస్ బిల్లులు, పత్తి, వరి విత్తనం ప్యాకెట్లను పరిశీలించి దాని లోని లాట్ నంబర్స్, ఇన్వాయిస్ లు ఎక్కడినుండి తెచ్చారు, డీలర్ షిప్ వివరములు, రిజిస్టర్ లో నమోదు చేసిన వివరాలు అన్ని క్షుణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విత్తన డీలర్లు ప్రభుత్వం నుండి అనుమతి పొందిన విత్తనాలను మాత్రమే రైతులకి విక్రయించాలని, రైతులకు కావాల్సిన విత్తనాలు అందుబాటులో ఉంచాలని, రైతులకు విత్తనాలు కొన్న తర్వాత రసీదులు ఇవ్వాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో డీలర్లు అనుమతి లేని విత్తనములు, నకిలీ విత్తనములు, ప్యాకింగ్ చేయకుండా లూస్ గా ఉన్న విత్తనములు రైతులకు అందుబాటులో ఉంచకూడదని తెలిపారు. రైతులు కూడా తప్పనిసరిగా లైసెన్సు ఉన్న డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని, విత్తనాలు కొన్న దానికి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని, సీజన్ అయిపోయే వరకు బిల్లులను, విత్తన ప్యాకెట్లని భద్రపరచుకోవాలని కోరారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో విత్తన బ్యాగు మీద విత్తన తయారీ తేదీ, గడువు తేదీలను తప్పనిసరిగా సరిచూసుకోవాలని, బీటీ టు పత్తి విత్తనాలు అన్ని రకాలు ఒకే రకమైన దిగుబడిస్తాయి కాబట్టి రైతులు దయచేసి ఒకే రకం పత్తి విత్తనాలు డిమాండ్ చేయకుండా నచ్చిన విత్తనాలను తీసుకోవాల్సిందిగా సూచించారు. గ్రామాల్లో ఎవరైనా లూజు పత్తి విత్తనాలు ఎటువంటి ప్యాకింగ్ లేకుండా ఉండే విత్తనాలను, బీటీ త్రీ పత్తి విత్తనాలు అమ్మినట్లయితే వారి దగ్గర కొనకూడదని, ప్రభుత్వ అధికారులకు అటువంటి నకిలీ విత్తనాలపై సమాచారం ఇవ్వాలని, రైతులు కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ 7288878404 ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు. జిల్లాలోని 240 విత్తన డీలర్లను, గోదాములను విస్తృతంగా తనిఖీ చేయుటకు నాలుగు సీడ్ స్క్వాడ్ బృందాలతో పాటు ప్రతి మండలంలో మండల వ్యవసాయ అధికారి, తాసిల్దారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో మండల స్థాయి తనిఖీల బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, నకిలీ విత్తనాలు రాకుండా, అలాగే డీలర్లు గారిని డిస్ట్రిబ్యూటర్లు కానీ పత్తి విత్తనాలు, ఇతర విత్తనాలను బ్లాక్ మార్కెట్ చేయకుండా, విత్తనాల కొరత చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, అధికారులు పాల్గొన్నారు.
Jun 01 2024, 17:29