తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో జర్నలిస్టులను గుర్తించాలి : తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ షానూర్
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన జర్నలిస్టులను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం రోజున జిల్లా కేంద్రంలోని ఎస్వీ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమాలను ప్రపంచ నలుమూలలకు తెలిసేలా చేసింది జర్నలిస్టులు మాత్రమే అని పేర్కొన్నారు.
విద్యార్థి సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వ్యాపారస్తులు, కవులు, కళాకారులు, రచయితలు, మహిళా సంఘాలు,ఇలా ఎన్నో సబ్బండ వర్గాలు చేసిన ఉద్యమాలను చూసి నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిందని అన్నారు. దాని వెనుక ముమ్మాటికి జర్నలిస్టుల పాత్ర ఉందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని జర్నలిస్టు సంఘాలు వారు ప్రత్యక్ష పరోక్ష ఉద్యమాల్లో పాల్గొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ప్రధాన కారకులైన జర్నలిస్ట్ లని విషయాన్ని గత ప్రభుత్వం మర్చిపోయిందని,మరోసారి గుర్తు చేస్తూ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మర్చిపోవద్దని తెలిపారు. ఈ ప్రభుత్వమైనా జర్నలిస్టులను గుర్తించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపరాజు వెంకన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు గడ్డం సత్యనారాయణ, మండల కార్యదర్శి శివ, బలరాం రెడ్డి, శ్రీనివాస్, కనకయ్య తదితరులు జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.
May 31 2024, 14:43