/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి ఉద్యోగాలు ఇవ్వండి: కూచిమల్ల కుమార్ నిరుద్యోగ ఉద్యమ కళాకారుడు Vijay.S
నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి ఉద్యోగాలు ఇవ్వండి: కూచిమల్ల కుమార్ నిరుద్యోగ ఉద్యమ కళాకారుడు

తెలంగాణ నిరుద్యోగ ఉద్యమ కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని నిరుద్యోగ ఉద్యమ కళాకారుడు కూచిమల్ల కుమార్  విలేకరుల సమావేశంలో ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం భుజాన గొంగడేసి కాళ్లకు గజ్జ కట్టి ధూంధాం కార్యక్రమాలు ఎన్నో చేశామని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజు మా గళంతోనే ధూంధాం కార్యక్రమాలు మొదలు అయ్యేవని, మా కళాకారుల ఆటపాటలతో ఉద్యమానికి ఊపిరి పోశామని అన్నారు. తెలంగాణ ఉద్యమ మలిదశ సమయంలో కూలీ పనులు చేసుకుని జీవనం గడిపే మేము పనులు మాని ఉద్యమంలో పాల్గొంటే మా కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన కళాకారులను పక్కనపెట్టి ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు మేము ఉద్యమకారులమని గొప్పలు చెప్పుకుంటున్నారని, అలా చెప్పుకునే వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు? ఎక్కడ? పాల్గొన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేము చేసిన త్యాగాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించి కళాకారుల ఉద్యోగ ప్రకటన చేసి నిజమైన కళాకారులను గుర్తించి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

భీమలింగం కత్వకు నూతన గేట్లు ఏర్పాటు, ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన రైతులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని బీమలింగం కత్వ గేట్లు పాడయిపోయాయి. వాటి స్థానంలో మూడు నూతన గేట్లను తన సొంత నిధులతో ఎర్పాటు చేయించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గేట్లు ఎర్పాటు చేయడం జరిగింది. గేట్ల ఏర్పాటు వలన రైతులకు ఎంతగానో లబ్ది చేకూరుతుందని రైతులు హర్శం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి క్రుతజ్ణతలు తెలిపారు.


ముస్త్యాల పల్లి లో వర్డ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆశ్రం హెడ్ ఆఫ్ సంస్థ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని ముస్త్యాలపల్లి గ్రామంలో వర్డ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆశ్రమ్ హెడ్ ఆప్ సంస్థ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం చేయడం జరిగిందని సొసైటీ డైరెక్టర్ కళ్లెం లక్ష్మీ నరసయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది .కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కండ్ల అద్దాలు వెంటనే ఇవ్వడం జరిగింది. గుండె పరీక్షలు, ఈసీజీ, రక్తము ,మూత్రము, షుగర్, బీపీ , దంత పరీక్షలు నిర్వహించి మందులు, సిరప్ లు ఇవ్వడం జరిగినది. ఎక్స్రేలు తీయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు అందరు వినియోగించుకొని స్వచ్ఛంద సంస్థను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ చంద్రయ్య , పెద్దలు మాజీ ఉపసర్పంచ్ సీనియర్ నాయకులు వడ్డే బిక్షపతి , మరియు మాజీ సర్పంచ్ గంధ మల్ల హేలేందర్ , పెద్దలు గంధ మల్ల జానకిరామ్ , వడ్డేమాన్ బిక్షపతి, వడ్డేమాన్ రాములు, మరియు రావుల మల్లేష్, ఆశ్రయం సంస్థ డైరెక్టర్ జయరాజు , డాక్టర్ జయంత్ , మేడమ్ డాక్టర్ సంధ్యారాణి ఎంబిబిఎస్ , వర్డ్స్ సొసైటీ డైరెక్టర్ కళ్లెం లక్ష్మీ నరసయ్య, డానియల్ ,యువకులు కళ్లెం రాజు, కళ్లెం రత్నం, కళ్లెం సామ్సన్ ,కళ్ళెం సొలమోను, గంటపాక రామ్ చరణ్, తదితరులు పాల్గొన్నారు.




మోత్కూరులో బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా వీర సావర్కర్ జయంతి వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ బిజెపి పట్టణ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో వీర సవర్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది ఈ సందర్భంగా జిల్లా కోశాధికారి గుజ్జ సోమ నరసయ్య గారు మాట్లాడుతూ స్వాతంత్ర వీర దామోదర సావర్కర్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. అభినవ్ భారత్ సొసైటీ స్థాపకుడు ఫ్రీ ఇండియా సొసైటీ స్థాపకుడు, విప్లవ రాజకీయాలకు ఆధ్యుడు హిందూ మహాసభ స్థాపకుడు, భారత ప్రధమ స్వాతంత్య్రోద్యమ చరిత్ర రచయిత, రాష్ట్రీ స్వయంసేవక్ సంఘ స్థాపనకు ప్రేరకుడు, హిందుత్వ భావజాలానికి ఆధ్యుడు, అఖండ భారత్ స్పూర్తి ప్రదాత, హిందీని జాతీయ భాషగా ప్రతిపాదకుడు, వేద సంస్కృతి ప్రచారకుడు, అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పోచం సోమయ్య జిల్లా నాయకులు గౌరు శ్రీనివాస్ ఏనుగు జితేందర్ రెడ్డి జక్క మోహన్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు గుదే మధుసూదన్ ప్రధాన కార్యదర్శిలుచేకూరి మల్లేశం రాధారపు మల్లేశం నాయకులు ముత్తినేని తిరుమలేష్ జినుకల దశరథ మామిడాలయాకేష్ బత్తిని సతీష్ నల్ల పోగులవెంకన్న నరుకుడు బిందెల శీను తదితరులు పాల్గొన్నారు.

అమెరికాలో మృతి చెందిన సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది : ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం యాదగిరి పల్లి గ్రామానికి చెందిన గుండ్ల సౌమ్య ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో సౌమ్య కుటుంబాన్ని మంగళవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సౌమ్య మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇండియాకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. సౌమ్య తల్లిదండ్రులను ఓదార్చారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.



ముక్తాపూర్ లో కల్తీ పాల తయారీ పై ఎస్ఓటి పోలీసుల దాడులు

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని ముక్తాపూర్ లో ప్రశాంత్ అనే వ్యక్తి కల్తీ పాలు తయారు చేస్తున్నాడన్న సమాచారంతో పాల కేంద్రం పై భువనగిరి ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు .దాడిలో 60 లీటర్ల కల్తీ పాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ 250 ఎంఎల్, థోల్పూర్ మిల్క్ పౌడర్ 8 కేజీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన తీసుకుంటామని తెలిపారు.

భువనగిరిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్

యాదాద్రి భువనగిరి జిల్లా నల్గొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో భాగంగా భువనగిరిలో తన ఓటు హక్కు వినియోగించుకున్న ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి మరియు సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండి ఇమ్రాన్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిత్రపక్షాలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమని అన్నారు.

వలిగొండ శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్న యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు సంజయ్ కుమార్ ముదిరాజ్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వర్కట్ పల్లి గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు సంజయ్ కుమార్ ముదిరాజ్ నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమని అన్నారు.

భువనగిరి మండల సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ ముదిగొండ రాములు మృతికి సంతాపం తెలిపిన సిపిఎం భువనగిరి మండల కమిటీ

భువనగిరి మండల సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ ముదిగొండ రాములు మృతికి సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ, మండల కమిటీ తరఫున సంతాపాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ తెలియజేసినారు. రాములు గారి సొంత గ్రామమైన బస్వాపురంలో కామ్రేడ్ రాములు భౌతిక కాయానికి సిపిఎం తరుపున పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ కామ్రేడ్ రాములు గారి మృతి కష్టజీవులకు కార్మికులకు ప్రజాతంత్ర వాదులకు ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. రాములు రజక వృత్తిదారుల సమస్యల పైన ఉమ్మడి జిల్లాలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి పనిచేశాడని, సిపిఐ మండల కార్యదర్శిగా ఈ మండలంలో వామపక్ష పార్టీలు తీసుకున్నా అనేక కార్యక్రమాల్లో ఐక్య ఉద్యమాలలో ముందుండి పని చేశారని, వామపక్షా ఐక్యతకు కృషి చేశాడని వారి అకాల మృతి ప్రజా ఉద్యమాలకు తీరనిలోటని వారి ఆశయ సాధన కోసం వామపక్షవాదులు కృషి చేయవలసిన అవసరం ఉందని తెలియజేశారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఇంకా ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శివర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణ , మండల కమిటీ సభ్యులు రాసాల వెంకటేశం , శాఖ కార్యదర్శి నరాల చంద్రయ్య , సభ్యులు మధ్యపురం బాల్ నర్సింహ, ఉడుత విష్ణు , మచ్చ భాస్కర్ , ముదిగొండ కృష్ణ , ఉడుత వెంకటేశం , రాసాల దేవెందర్,యం.ఏ.రహీమాన్ , రాసాల ఐలయ్య , ఉడుత ధషరత , నరాల వెంకటేశం , కావడి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తీన్మార్ మల్లన్న గెలుపు కోరుతూ వలిగొండ లో గోపరాజుపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో సోమవారం పట్టభద్రుల ఉప ఎన్నికల్లో భాగంగా వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి చట్టసభలకు పంపాల్సిందిగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజు పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సలిగంజి బిక్షపతి మాట్లాడుతూ... మిత్రుపక్షాలు బలపరిచిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు సలిగంజి బిక్షపతి, ఎంపీటీసీ నీలం లలిత బాబురావు, మాజీ అధ్యక్షులు పులగూర్ల లింగారెడ్డి, సిపిఎం మండల నాయకులు గాజుల ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాలకూర్ల మల్లేశం, కీసర్ల మహేందర్ రెడ్డి, యాదవ సంఘం అధ్యక్షులు చిల్లర స్వామి, నాయకులు కోమటిరెడ్డి మల్లారెడ్డి , పులగూర్ల కొండల రెడ్డి, ఎనుగుల విష్ణు, ఎర్ర భూపాల్ తదితరులు పాల్గొన్నారు.