/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సిడి ని విడుదల చేసిన వలిగొండ ఎస్సై డి మహేందర్ Vijay.S
VijayaKumar

May 26 2024, 18:54

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సిడి ని విడుదల చేసిన వలిగొండ ఎస్సై డి మహేందర్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన అమరులకు జ్ఞాపకాలను గుర్తు చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం.ఆధ్వర్యంలో ఆదివారం వలిగొండ ఎస్సై డి మహేందర్ చేతుల మీదుగా సిడి విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ మండల అధ్యక్షులు మారగోని శ్రీనివాస్ గౌడ్. మాట్లాడుతూ... ఆనాటి తెలంగాణ.రాష్ట్రం కోసం. కొట్లాడి అమరులైన కుటుంబాలను గుర్తు చేసుకుంటూ అనేక కష్టాలకు నష్టాలకు గురైన ఉద్యమకారులను గుర్తించాలని ఆనాటి పోరాటాలను జ్ఞాపకం చేసుకుంటూ భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో సిడి విడుదల చేయడం జరిగిందన్నారు .అలాగే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు తెలంగాణ ఉద్యమకాలరుల ఫోరం పూర్తి మద్దతు ప్రకటిస్తుందన్నారు .ఈ సమావేశంలో. మల్లం వెంకటేశం కన్నె కంటి శ్రీనివాసచారి. మంటి. రమేష్. డేగల అంజయ్య. ఎస్ బిక్షపతి. మంటి.. శంకర్. మంటి లింగయ్య.మహేష్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

May 26 2024, 18:27

తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆత్మకూరు మండల అధ్యక్షులుగా గడ్డం నాగరాజు ఏకగ్రీవ ఎన్నిక

యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆత్మకూరు మండలం అధ్యక్షులుగా గడ్డం నాగరాజును ఆదివారం రోజున జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానుర్ బాబా ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా నియామకమైన మండల కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. వారిలో గౌరవ అధ్యక్షులుగా నోముల రవీందర్ రెడ్డి,ఉపాధ్యక్షులుగా షేక్ అజిజ్, కార్యదర్శిగామేడి శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శిగా గుర్రం మల్లేష్, సహాయ కార్యదర్శిగా పానుగంటి బాలగంగాధర్, కోశాధికారిగా కట్టే కోలా రమేష్, కార్య వర్గ సభ్యులుగా సురేష్ శివ తదితరులు ఎన్నుకున్నారు.

VijayaKumar

May 26 2024, 17:38

జూన్ 15, 16 తేదీలలో భువనగిరిలో జరుగు సిపిఎం రాజకీయ శిక్షణ తరగతుల జయప్రదం కై ఆహ్వాన సంఘం ఏర్పాటు: ఎండి జహంగీర్ సిపిఎం జిల్లా కార్యదర్శి

జూన్ 15, 16 తేదీలలో రెండు రోజులపాటు భువనగిరి పట్టణ కేంద్రంలో జరిగే సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల జయప్రదంకై ఏర్పాటుచేసిన ఆహ్వాన సంఘం సమావేశంలో ముఖ్య అతిథులుగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న సిపిఎం నాయకత్వానికి పార్టీ సభ్యులకు రాజకీయంగా చైతన్యం కలిగించడం కోసం జూన్ 15,16 తేదీలలో భువనగిరి పట్టణ కేంద్రంలో రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని వారు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ప్రజా ప్రయోజనకర పథకాలను ప్రజలకు నేరుగా చేరేలా బాధ్యత తీసుకోవాలని, ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు కాలయాపన జరిగిన, ప్రస్తుతం ప్రజా సమస్యలను నియోజకవర్గాల వారీగా అధ్యయనం చేసి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని వారు అన్నారు. ఈ నేపథ్యంలో సిపిఎం నాయకత్వానికి, పార్టీ సభ్యులకు రాజకీయ చైతన్యం కలిగించి, గ్రామీణ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతర కార్యక్రమాలను రూపొందించి ప్రజా పోరాటాలను నిర్వహించడం కోసం భవిష్యత్ ప్రజా ఉద్యమాలను ఉదృతం చేయడం కోసం ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని వారు అన్నారు. అదేవిధంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ

భువనగిరి పట్టణ కేంద్రంలో నిర్వహించే సిపిఎం రాజకీయ శిక్షణ తరగతులకు అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, విద్యావంతులు, వ్యాపారస్తులు సహకరించి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని వారు కోరారు. అనంతరం శిక్షణ తరగతుల ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ అధ్యక్షులు గద్దె నరసింహ, అధ్యక్షులు బట్టుపల్లి అనురాధ, ప్రధాన కార్యదర్శి మాయ కృష్ణ, చీప్ ప్యాటరన్స్ గా సంగు నరేందర్, సంగు రమాదేవి, ఉదయగిరి మధుమోహన్,పోకల దయానంద్, జిట్టా ధనాపరెడ్డి, ఉపాధ్యక్షులు గంధమల్ల మాతయ్య, బందెల ఎల్లయ్య, ఓవల్దాస్ అంజయ్య, బర్ల వెంకటేష్, దాసరి మంజుల, కార్యదర్శులుగా బండి రవి, పర్వతి బాలకృష్ణ, దండు గిరి, కల్లూరి నాగమణి, కొండెం నాగభూషణం, ప్రచార కార్యదర్శులు కొలుపుల వివేక్, వనం రాజు, చింతల శివ, ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ,గడ్డం వెంకటేష్,నాయకులు లావడ్య రాజు,బోడ భాగ్య, లలిత, మాయ రాణి,గీస అంజయ్య, నరాల నరసింహ,గంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

May 26 2024, 17:25

పాలస్తీనా పై ఇజ్రాయేల్ దాడులు ఆపాలని ఈనెల 29న OU లో జరిగే సదస్సును జయప్రదం చేయాలని పోచంపల్లి లో కరపత్రాలు ఆవిష్కరణ

యాదాద్రి భువనగిరి జిల్లా:ఆరు నెలలుగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న పాశవిక దాడులను ఆపాలని, ఇజ్రాయెల్ కి భారత్ నుండి ఆయుధాల సరఫరా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పి.డి.ఎస్.యూ-పి.వై.ఎల్. రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఓయూలో ఈ నెల 29న జరిగే సదస్సును జయప్రదం చేయాలని , పోచంపల్లి లో సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోచంపల్లి పట్టణ కార్యదర్శి పగడాల శివ మాట్లాడుతూ జియోనిస్ట్ ఇజ్రాయిల్ పాలకులు పాలస్తీనాను దురాక్రమిస్తున్నారని,పాలస్తీనా ప్రజల జాతి ఆకాంక్షలను అణచివేయడానికి పాలస్తీనాపై బాంబు, వైమానిక దాడులు చేస్తూ మారణ హెూమాన్ని సృష్టిస్తున్నారు.

ఈ మారణహోమానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పాలస్తీనా ప్రజలను దుర్మార్గంగా అణిచివేస్తున్నారు. ఇజ్రాయిల్ తన దురాక్రమనను యదేచ్ఛగా సమర్థించుకుంటుంది. రక్షణ కొరకే పాలస్తీనాపై దాడులు చేస్తున్నామని చెప్తున్నా వీరి అసలు లక్ష్యం పాలస్తీనా ప్రజలను నిర్మూలించడమే.గాజాలో ఇప్పటివరకు దాదాపు 35వేల మంది, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో ఇజ్రాయిల్ సాయుధ బలగాలచే వందలాది మంది పాలస్తీనియన్లు చంపబడ్డారు. ఆధునిక చరిత్రలో ఇది అతి పెద్ద మారణహోమం. ఇది నేటికీ కొనసాగుతుంది. ఇజ్రాయిల్ దురాక్రమిత దాడుల్లో పాలస్తీనా వైద్యులు చంపబడ్డారు. హాస్పిటల్స్ ధ్వంసమయ్యాయి, పాఠశాలలు, కళాశాలలు, లైబ్రరీలు, విశ్వవిద్యాలయాలు బాంబు దాడులకు గురై శిధిలాలుగా మిగిలాయి. ఈ దాడులను వెంటనే ఆపాలని, భారత్ సరఫరా చేస్తున్న ఆయుధ సామగ్రిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి.వై.ఎల్.-పి.డి.ఎస్.యూ. నాయకులు బి.రాకేష్,సోమేశ్,యూ.అన్వేష్, పరమేష్, దిలీప్, ఆర్.అన్వేష్,ఎస్.నాగరాజు,పవన్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

May 26 2024, 17:16

బెల్లి లలితక్క ఆశయాలను కొనసాగిస్తాం: డాక్టర్ భూక్య సంతోష్ నాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో తెలంగాణ గాన కోకిల బెల్లి లలితక్క 25వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో *లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు భూక్య సంతోష్ నాయక్ మాట్లాడుతూ పాటనే జీవితంలో మలుచుకొని చివరి శ్వాస వరకు, స్వ రాష్ట్రం కోసం తెలంగాణ ఆస్తిత్వం కోసం, ఉద్యమించిన వీర వనిత, నిరుపేద కుటుంబంలో పుట్టి పొట్టకూటికోసం పత్తి మిల్లులో పనిచేసి, అక్కడ కార్మికుల హక్కుల కోసం సిఐటియులో చేరి కార్మిక హక్కులను సాధించింది, ఫ్లోరైడ్ తో బాధపడుతున్న ప్రజలను తన పాట ద్వారా చైతన్యపరిచి, 1996లో ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఐక్యవేదిక ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో 1997 మార్చి 8న బోనగిరిలో జరిగిన దగబడ్డ తెలంగాణ సభలో పెళ్లి లలితక్క కీలక పాత్ర పోషించింది ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలో తెలంగాణ మహాసభలో తన పాట ద్వారా జనాలను చైతన్యపరిచింది, తన ఎదుగుదలను ఓర్వలేక కొంతమంది దుండగులు ఆమెను హతమార్చడం జరిగింది, తెలంగాణ ప్రభుత్వం బెల్లి లలితక్క కుమారుడిని ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, ట్యాంక్ బండ్ పై బిళ్ళలు తప్ప విగ్రహం ఏర్పాటు చేయాలి, అమరవీరుల కుటుంబాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలనీ కొనియాడారు, ఈ కార్యక్రమంలో పడాల శ్రీనివాస్,బాలు యాదవ్,రాజు, ఐలేష్, నరసింహ యాదవ్, కనకరాజు రాజు, ప్రవీణ్ బాలరాజు, జీవన్, వెంకటస్వామి* తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

May 26 2024, 08:23

సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులతోనే అధిక దిగుబడులు

రైతులందరూ తమ పంట పొలాలలో సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు పాటించి భూసార పరీక్ష ఫలితాలకు అనుగుణంగా సేంద్రియ రసాయనిక ఎరువులు సూక్ష్మ పోషకాలు సమపాల్లో వాడినట్లయితే నేల ఆరోగ్యం మెరుగుపడి అధిక దిగుబడులు పొందవచ్చునని కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మన గ్రోమోర్ సెంటర్ యాదాద్రి భువనగిరి జిల్లా మార్కెటింగ్ మేనేజర్ జానకయ్య అన్నారు .వలిగొండ మండలంలోని గొల్నే పల్లి గ్రామంలో నిర్వహించిన రైతు అవగాహన పద్ధతుల్లో పాల్గొని వారు మాట్లాడుతూ ...రైతులు తమ పంట పొలాల్లో తప్పనిసరిగా మన గ్రూప్ మార్ వలిగొండ వారు అందిస్తున్న హలో గ్రోమోర్ శాస్త్రవేత్తల సలహాలు పంటపొలాల క్షేత్రస్థాయి పరిశీలనలు ఉచిత భూసార పరీక్ష సేవలు వినియోగించుకుని పెట్టుబడి వేయాలి.

పెట్టుబడులు తగ్గించుకొని రాబడులు అధిక ఆదాయం పొందవచ్చని సూచించారు వానకాలం పంట సమయం ఆసన్నమైనది కాబట్టి విత్తనాల కోసం గుర్తింపు పొందిన డీలర్ల వద్ద రసీదు పొంది విత్తనాలు కొనుగోలు చేయాలని అన్నారు. అలాగే వరి పంటలు మొన్న పురుగు నివారణ కోసం ముందస్తుగా నారుమడిలోనే సమగ్ర సన రక్షణ చర్యలు చేపట్టుకోవాలని చర్యలు సూచించారు. వలిగొండ మేనేజర్ రమేష్ ,ఫీల్డ్ ఆఫీసర్ అనిల్ ,మరియు గ్రామం మాజీ సర్పంచ్ జోగు యాదయ్య , ఔశెట్టి స్వామి, వీరారెడ్డి ,జలంధర్ రెడ్డి ,అంజిరెడ్డి ,బండ వెంకటేష్ ,సత్యనారాయణ ,నరసింహ ,శంకరయ్య ,పాండు ,రాములు ,మల్లారెడ్డి ,శ్రీను, బీరప్ప, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

May 26 2024, 08:08

సాక్షర భారత్ కోఆర్డినేటర్ల మండల అధ్యక్షుడు ఆత్మహత్య
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన బుగ్గ బీరప్ప తండ్రి రాజయ్య, వయస్సు 45 ఇతను గతంలో 2010 నుండి 2018 వరకు సాక్షర భారత్ ప్రోగ్రాంలో ఉద్యోగిగా పనిచేశాడు, ఇతను వికలాంగుడు, సాక్షర భారత్ గ్రామ కోఆర్డినేటర్ల మండల అధ్యక్షుడు, 2018 తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి సమాచారం లేకుండా ఉద్యోగం నుండి తొలగించారు , పైగా వికలాంగుడు కాబట్టి వేరే పని చేయలేని పరిస్థితిలో కుటుంబ పోషణ కోసం ఒక చిన్న కిరాణం షాపు పెట్టుకున్నాడు ఆ కిరాణం షాపు నడవక అప్పులు చేశాడు, ఒకవైపు అప్పులుఎక్కువ అయినాయి. ఒకవైపు ఉద్యోగం వస్తదని ఆశతో ఉండే వాడు కాని ఈ ప్రభుత్వం లో కూడా ఉద్యోగం రాదేమో అని నిరాశ చెందాడు, ఆర్థిక సమస్యలతో సతమతమైతూ, నిరాశ తో మనసు కలత చెంది నిన్న పురుగుల మందు తాగడంతో హుటా హుటిన హైదరాబాద్ ప్రభుత్వ గాంధీ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. కావున ప్రభుత్వం అతని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కుటుంబం లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వానికి సాక్షర భారత్ గ్రామ కోఆర్డినేటర్స్ తరఫున డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో సాక్షర భారత్ మండల కోఆర్డినేటర్ కొమిరే. బాలేశ్వర్ సాక్షర భారత్ గ్రామ కోఆర్డినేటర్లు మల్లం ధనమ్మ రొయ్యల రజిత మస్కు నరసింహ నీలం నరేందర్ బందెల రాజు గంగాధర్ రామ్మూర్తి సుజాత అనిత బాల నరసింహ సునీత బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

May 26 2024, 07:52

గోపరాజుపల్లి గౌడ సంఘం అధ్యక్షుడిగా పాలకూర్ల మల్లేశం ఏకగ్రీవ ఎన్నిక

యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలంలోని గోపరాజుపల్లి గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడిగా పాలకూర్ల మల్లేశం ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది శనివారం  ఎన్నికల అధికారి కే దశరథ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు సమక్షంలో ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా పాలకూర మల్లేశం మాట్లాడుతూ నా మీద నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు గౌడ సంఘం సభ్యులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలిపారు .సంఘం అభివృద్ధి కోసం పనిచేస్తానని ఆయన అన్నారు. ఉపాధ్యక్షులుగా పాలకూర్లర్ ఎల్లయ్య. కార్యదర్శిగా నలబోలు మచ్చగిరి. కమిటీ సభ్యులు గాజుల రాజయ్య ,గాజుల మల్లయ్య ,గాజుల వెంకటేశం, పాలకూర్ల వెంకటేశం , పాలకూర్ల రాములు ,గుండు స్వామి.నీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాజుల అంజయ్య. పాలకూర్ల యాదయ్య , పాలకూర్ల అంజయ్య, పాలకూర్ల ఆనందం, పాలకూర్ల శీను .గాజుల వెంకటేశం .పాలకూర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

May 24 2024, 15:58

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం: ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని గాయత్రి హైస్కూల్ లో వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా సమావేశం నిర్వహించారు .ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న స్థానికుడు అని అన్నారు. అనేక పోరాటాలు చేసినారని తెలిపారు. జిల్లాలో అత్యధిక గ్రాడ్యుయేట్ ఓటర్లు వలిగొండ మండలం లో ఉన్నారని తెలిపారు .ఈ కార్యక్రమంలో వలిగొండ మండల ఎంపీపీ నూతి రమేష్ రాజ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, గరిసే రవి, బోల్ల శ్రీనివాస్, పాలకూర్ల వెంకటేశం, కాసుల వెంకన్న ,వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.


VijayaKumar

May 23 2024, 15:23

జిల్లాలో వివిధ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని వివిధ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు వరి వేస్తే ఊరి అని కేసీఆర్ అంటే... ఇప్పుడు దొడ్డు ఒడ్లు వేస్తే ఉరి అని రేవంత్ అంటున్నాడని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైతులను అడిగి తెలుసుకున్నారు. బీబీనగర్ మండలంలోని రాఘవాపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడారు అనంతరం యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం రుద్రవెల్లి గ్రామంలోని రైతు కల్లాలను పరిశీలించి బిజెపి వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
.