బెల్లి లలితక్క ఆశయాలను కొనసాగిస్తాం: డాక్టర్ భూక్య సంతోష్ నాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో తెలంగాణ గాన కోకిల బెల్లి లలితక్క 25వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో *లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు భూక్య సంతోష్ నాయక్ మాట్లాడుతూ పాటనే జీవితంలో మలుచుకొని చివరి శ్వాస వరకు, స్వ రాష్ట్రం కోసం తెలంగాణ ఆస్తిత్వం కోసం, ఉద్యమించిన వీర వనిత, నిరుపేద కుటుంబంలో పుట్టి పొట్టకూటికోసం పత్తి మిల్లులో పనిచేసి, అక్కడ కార్మికుల హక్కుల కోసం సిఐటియులో చేరి కార్మిక హక్కులను సాధించింది, ఫ్లోరైడ్ తో బాధపడుతున్న ప్రజలను తన పాట ద్వారా చైతన్యపరిచి, 1996లో ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఐక్యవేదిక ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో 1997 మార్చి 8న బోనగిరిలో జరిగిన దగబడ్డ తెలంగాణ సభలో పెళ్లి లలితక్క కీలక పాత్ర పోషించింది ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలో తెలంగాణ మహాసభలో తన పాట ద్వారా జనాలను చైతన్యపరిచింది, తన ఎదుగుదలను ఓర్వలేక కొంతమంది దుండగులు ఆమెను హతమార్చడం జరిగింది, తెలంగాణ ప్రభుత్వం బెల్లి లలితక్క కుమారుడిని ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, ట్యాంక్ బండ్ పై బిళ్ళలు తప్ప విగ్రహం ఏర్పాటు చేయాలి, అమరవీరుల కుటుంబాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలనీ కొనియాడారు, ఈ కార్యక్రమంలో పడాల శ్రీనివాస్,బాలు యాదవ్,రాజు, ఐలేష్, నరసింహ యాదవ్, కనకరాజు రాజు, ప్రవీణ్ బాలరాజు, జీవన్, వెంకటస్వామి* తదితరులు పాల్గొన్నారు.
May 26 2024, 17:16