/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులతోనే అధిక దిగుబడులు Vijay.S
సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులతోనే అధిక దిగుబడులు

రైతులందరూ తమ పంట పొలాలలో సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు పాటించి భూసార పరీక్ష ఫలితాలకు అనుగుణంగా సేంద్రియ రసాయనిక ఎరువులు సూక్ష్మ పోషకాలు సమపాల్లో వాడినట్లయితే నేల ఆరోగ్యం మెరుగుపడి అధిక దిగుబడులు పొందవచ్చునని కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మన గ్రోమోర్ సెంటర్ యాదాద్రి భువనగిరి జిల్లా మార్కెటింగ్ మేనేజర్ జానకయ్య అన్నారు .వలిగొండ మండలంలోని గొల్నే పల్లి గ్రామంలో నిర్వహించిన రైతు అవగాహన పద్ధతుల్లో పాల్గొని వారు మాట్లాడుతూ ...రైతులు తమ పంట పొలాల్లో తప్పనిసరిగా మన గ్రూప్ మార్ వలిగొండ వారు అందిస్తున్న హలో గ్రోమోర్ శాస్త్రవేత్తల సలహాలు పంటపొలాల క్షేత్రస్థాయి పరిశీలనలు ఉచిత భూసార పరీక్ష సేవలు వినియోగించుకుని పెట్టుబడి వేయాలి.

పెట్టుబడులు తగ్గించుకొని రాబడులు అధిక ఆదాయం పొందవచ్చని సూచించారు వానకాలం పంట సమయం ఆసన్నమైనది కాబట్టి విత్తనాల కోసం గుర్తింపు పొందిన డీలర్ల వద్ద రసీదు పొంది విత్తనాలు కొనుగోలు చేయాలని అన్నారు. అలాగే వరి పంటలు మొన్న పురుగు నివారణ కోసం ముందస్తుగా నారుమడిలోనే సమగ్ర సన రక్షణ చర్యలు చేపట్టుకోవాలని చర్యలు సూచించారు. వలిగొండ మేనేజర్ రమేష్ ,ఫీల్డ్ ఆఫీసర్ అనిల్ ,మరియు గ్రామం మాజీ సర్పంచ్ జోగు యాదయ్య , ఔశెట్టి స్వామి, వీరారెడ్డి ,జలంధర్ రెడ్డి ,అంజిరెడ్డి ,బండ వెంకటేష్ ,సత్యనారాయణ ,నరసింహ ,శంకరయ్య ,పాండు ,రాములు ,మల్లారెడ్డి ,శ్రీను, బీరప్ప, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

సాక్షర భారత్ కోఆర్డినేటర్ల మండల అధ్యక్షుడు ఆత్మహత్య
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన బుగ్గ బీరప్ప తండ్రి రాజయ్య, వయస్సు 45 ఇతను గతంలో 2010 నుండి 2018 వరకు సాక్షర భారత్ ప్రోగ్రాంలో ఉద్యోగిగా పనిచేశాడు, ఇతను వికలాంగుడు, సాక్షర భారత్ గ్రామ కోఆర్డినేటర్ల మండల అధ్యక్షుడు, 2018 తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి సమాచారం లేకుండా ఉద్యోగం నుండి తొలగించారు , పైగా వికలాంగుడు కాబట్టి వేరే పని చేయలేని పరిస్థితిలో కుటుంబ పోషణ కోసం ఒక చిన్న కిరాణం షాపు పెట్టుకున్నాడు ఆ కిరాణం షాపు నడవక అప్పులు చేశాడు, ఒకవైపు అప్పులుఎక్కువ అయినాయి. ఒకవైపు ఉద్యోగం వస్తదని ఆశతో ఉండే వాడు కాని ఈ ప్రభుత్వం లో కూడా ఉద్యోగం రాదేమో అని నిరాశ చెందాడు, ఆర్థిక సమస్యలతో సతమతమైతూ, నిరాశ తో మనసు కలత చెంది నిన్న పురుగుల మందు తాగడంతో హుటా హుటిన హైదరాబాద్ ప్రభుత్వ గాంధీ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. కావున ప్రభుత్వం అతని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కుటుంబం లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వానికి సాక్షర భారత్ గ్రామ కోఆర్డినేటర్స్ తరఫున డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో సాక్షర భారత్ మండల కోఆర్డినేటర్ కొమిరే. బాలేశ్వర్ సాక్షర భారత్ గ్రామ కోఆర్డినేటర్లు మల్లం ధనమ్మ రొయ్యల రజిత మస్కు నరసింహ నీలం నరేందర్ బందెల రాజు గంగాధర్ రామ్మూర్తి సుజాత అనిత బాల నరసింహ సునీత బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

గోపరాజుపల్లి గౌడ సంఘం అధ్యక్షుడిగా పాలకూర్ల మల్లేశం ఏకగ్రీవ ఎన్నిక

యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలంలోని గోపరాజుపల్లి గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడిగా పాలకూర్ల మల్లేశం ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది శనివారం  ఎన్నికల అధికారి కే దశరథ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు సమక్షంలో ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా పాలకూర మల్లేశం మాట్లాడుతూ నా మీద నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు గౌడ సంఘం సభ్యులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలిపారు .సంఘం అభివృద్ధి కోసం పనిచేస్తానని ఆయన అన్నారు. ఉపాధ్యక్షులుగా పాలకూర్లర్ ఎల్లయ్య. కార్యదర్శిగా నలబోలు మచ్చగిరి. కమిటీ సభ్యులు గాజుల రాజయ్య ,గాజుల మల్లయ్య ,గాజుల వెంకటేశం, పాలకూర్ల వెంకటేశం , పాలకూర్ల రాములు ,గుండు స్వామి.నీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాజుల అంజయ్య. పాలకూర్ల యాదయ్య , పాలకూర్ల అంజయ్య, పాలకూర్ల ఆనందం, పాలకూర్ల శీను .గాజుల వెంకటేశం .పాలకూర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం: ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని గాయత్రి హైస్కూల్ లో వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా సమావేశం నిర్వహించారు .ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న స్థానికుడు అని అన్నారు. అనేక పోరాటాలు చేసినారని తెలిపారు. జిల్లాలో అత్యధిక గ్రాడ్యుయేట్ ఓటర్లు వలిగొండ మండలం లో ఉన్నారని తెలిపారు .ఈ కార్యక్రమంలో వలిగొండ మండల ఎంపీపీ నూతి రమేష్ రాజ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, గరిసే రవి, బోల్ల శ్రీనివాస్, పాలకూర్ల వెంకటేశం, కాసుల వెంకన్న ,వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.


జిల్లాలో వివిధ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని వివిధ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు వరి వేస్తే ఊరి అని కేసీఆర్ అంటే... ఇప్పుడు దొడ్డు ఒడ్లు వేస్తే ఉరి అని రేవంత్ అంటున్నాడని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైతులను అడిగి తెలుసుకున్నారు. బీబీనగర్ మండలంలోని రాఘవాపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడారు అనంతరం యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం రుద్రవెల్లి గ్రామంలోని రైతు కల్లాలను పరిశీలించి బిజెపి వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
.
ప్రశ్నించే గొంతుక, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగు రాకేష్ రెడ్డిని గెలిపించాలని వలిగొండలో విస్తృత ప్రచారం

వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నత విద్యావంతుడు ప్రశ్నించే గొంతుక ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి మీ మొదటి1 ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వలిగొండ మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతి ఓటర్ ని కలిసి ఓటు వేయాలని ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ సురకంటి వెంకట్ రెడ్డి, వలిగొండ ఎంపీటీసీ పల్సం రమేష్ గౌడ్, పిఎ సిఎస్ డైరెక్టర్ కొమురెల్లి సంజీవ రెడ్డి , మండల సీనియర్ నాయకులు ఐటిపాముల సత్యనారాయణ, కొండూరు వెంకటేశం గౌడ్, ఐటిపాముల ప్రభాకర్ ,ఎస్సీ సెల్ అధ్యక్షులు శాంతి కుమార్, పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ ఆఫ్రొజ్, గ్రంథాలయ చైర్మన్ పబ్బు వెంకటరమణ ,మాజీ మత్స్య గిరిగుట్ట ధర్మకర్త పోలేపాక బిక్షపతి ,మాజీ మార్కెట్ డైరెక్టర్ కాసుల మధుసూదన్ గౌడ్ ,పోలేపాక సత్యనారాయణ, బల్గురి నరేష్ రెడ్డి, దొంతర పోయిన నరేష్, ఈతప నరసింహ, పోలేపాక శ్రీశైలం ,బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


కొమ్మాయిగూడెం లో ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి జారిపడి గీత కార్మికుడు మృతి

తాటి చెట్టు నుండి పడి గీతా కార్మికుడు మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని కొమ్మాయిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన గీత కార్మికుడు బోయపల్లి మల్లయ్య గౌడ్ గురువారం ఉదయం తాటి చెట్టు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు . కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.ఎక్సైజ్ అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి ప్రభుత్వపరంగా రావాల్సిన ఎక్స్గ్రేషియా మంజూరు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కల్లు గీతా కార్మిక సంఘం నాయకులు కోరారు.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ను గెలిపించండి : కాసుల వెంకన్న జిల్లా సీనియర్ నాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలో బుధవారం రోజున వరంగల్ ఖమ్మం నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న ను కాంగ్రెస్ పార్టీ బలపరిచినది. మే 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో విద్యావంతులు, ఉద్యోగులు యువకులు మేధావులు తదితర వర్గాలకు చెందిన మేధావులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్లగొండ జిల్లా మేధావులు విద్యావేత్తలు ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి బహుమతిగా అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాసుల వెంకన్న కోరారు. గత ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచినారు. అదే స్థానం వరంగల్ ఖమ్మం నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీకి జరుగుతున్న ఉప ఎన్నికలలో తీన్మార్ మల్లన్నను మొదటి ప్రాధాన్యత ఓటుతో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విద్యావంతులని మేధావులని నిరుద్యోగ యువతీ యువకులని ఆయన కోరారు. తీన్మార్ మల్లన్న గెలిపించుకొని నిరుద్యోగ యువతీ యువకులు, ఉద్యోగ ప్రకటనలు వెలుపడే విధంగా తీన్మార్ మల్లన్న ద్వారా రేవంత్ రెడ్డి ని ఉద్యోగ క్యాలెండర్ వేసే విధంగా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వలిగొండ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కంకల కిష్టయ్య వలిగొండ గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు కొండూరు అజయ్ కుమార్, సీనియర్ నాయకుడు మైసొల్ల యాదగిరి, అనిల్ యువసేన నాయకుడు కొండూరు సాయి, పబ్బు శెట్టయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.

దాసిరెడ్డిగూడెం గ్రామ గౌడ సంఘం అధ్యక్షులుగా బొడిగె ఐలయ్య గౌడ్ ఎన్నిక

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని దాసిరెడ్డిగూడెం గ్రామ గౌడ్ సంఘం నూతన కమిటీ ఎన్నికను బుధవారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కో - అపరేటివ్ ఇన్స్పెక్టర్ కె. దశరథ ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో దాసిరెడ్డిగూడెంలోని గౌడ సంఘ సభ్యుల సమక్షంలో ఎన్నికను నిర్వహించారు. ఈ ఎన్నికలు దాసిరెడ్డి గూడెం గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడిగా బొడిగె అయిలయ్య గౌడ్ ఉపాధ్యక్షులుగా దంతూరి దుర్గయ్య గౌడ్, కార్యదర్శిగా బాలగొని మల్లయ్య గౌడ్, డైరెక్టర్లుగా బాలగొని బిక్షపతి గౌడ్, దంతూరి యాదయ్య గౌడ్, బాలగోని సత్తయ్య గౌడ్, గోద అచ్చయ్య గౌడ్, కాటం గణేష్ గౌడ్, బందారపు రాములు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ కార్యక్రమంలో దాసిరెడ్డి గూడెం గ్రామ గౌడ కుల పెద్ద గౌడ్ బాలగోని బిక్షపతి గౌడ్, బందారపు లింగస్వామి గౌడ్, దంతూరి సత్తయ్య గౌడ్, బాలగొని నరసింహ గౌడ్, దంతూరి మల్లయ్య గౌడ్, బొడిగె కృష్ణ స్వామి గౌడ్, దంతూరి పరమేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి మండల CPI కార్యదర్శి ముదిగొండ రాములు ను పరామర్శించిన CPI రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు

యాదాద్రి భువనగిరి జిల్లా  గత సంవత్సరం నుండి భువనగిరి మండల సిపిఐ కార్యదర్శి ముదిగొండ రాములు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు వారి ఆరోగ్యం క్షీణిస్తున్న విషయం తెలుసుకున్న వెంటనే వారిని పరామర్శించడానికి స్వయంగా బస్వాపురం గ్రామానికి వచ్చారు .ముదిగొండ రాములు గురించి కుటుంబ సభ్యులతో వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు చివరి దశలో ఉన్న రాములను చూసి దిగ్బ్రాంతి చెందారు కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరినారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావుతో పాటు పరామర్శించిన వారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్ భువనగిరి ఎంపీపీ నరాల నిర్మల ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వస్తువుల అభిలాష్ సిపిఐ పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు దాసరిలక్ష్మయ్య మండల కార్యవర్గ సభ్యులు ఉడత రాఘవులు చిక్క బిక్షపతి మరిపెళ్లి రాములు సోమన ఐలయ్య భువనగిరి పట్టణ సహాయ కార్యదర్శి చింతల మల్లేశం చింతల పెంటయ్య తోపాటు కుటుంబ సభ్యులు భార్య ముదిగొండ లక్ష్మి కుమారులు శివకుమార్ ఠాగూర్ కూతురు వెన్నెల తదితరులు ఉన్నారు .