ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం ను కలిసిన వలిగొండ మండలంలోని RRR భూ బాధితులు
![]()
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని వర్కట్ పల్లి ,గోకారం గ్రామాల నుండి రీజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు.. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం గురువారం సాయంత్రం నాలుగు గంటలకి హైదరాబాద్ లోని వారి నివాసంలో కలిసి, తమ సమస్యల్ని వివరించారు. గతంలో గ్యాస్ పైప్ లైన్ కోసం తమ భూములు పోయాయని అన్నారు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కూడా తమ భూముల నుండి పోతుందని ,దీనికోసం మిగిలిన భూమి కూడా పోతే జీవనాధారం కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. అందుచేత అలైన్మెంట్ మార్చేలా ...ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని, బాధిత రైతులు ప్రొఫెసర్ కోదండ రామ్ ను కోరారు. ఈ సందర్భంగా ...ప్రొఫెసర్ కోదండరాం సానుకూలంగా స్పందించారని రైతులు తెలిపారు . ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుండు దానయ్య ,మాడుగుల గోపి, వెంకటేశం, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

























వలిగొండ మండల కేంద్రంలో ,అంబేద్కర్ చౌరస్తా, అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా యుద్ధ నౌక గద్దర్ 75వ జయంతి సందర్భంగా గద్దర్ ఫోటోకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు . ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గద్దర్ విప్లవ పార్టీ కార్యకర్త ,రచయిత, గాయకుడు ,గద్దర్ గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్ విప్లవ కవి ,ఈయనకు గద్దర్ అను పేరును స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన గద్దర్ పార్టీ కు గుర్తుగా తీసుకోవడం జరిగిందని అన్నారు.కళాకారులు మాట్లాడుతూ ఆయన పాడే పాటలకు ప్రజల్లో చైతన్యం కలిగిస్తుంటాయి.. దళిత పేదలు అనుభవిస్తున్న కష్టా నష్టాలను ఆయన బృందం కళ్ళకు కట్టినట్టుగా పాటలు, నాటకాల రూపంలో తెలియజేసేవారు. ఆయన పాడిన పాటలకు మేము ఆకర్షితులమై కళాకారులంగా ఇప్పుడు మేము జీవిస్తూనే ఉన్నాము... ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ ,వెనకబడ్డ కులాలకు ఎంతో చైతన్యాన్ని స్ఫూర్తిని నింపారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు, ఎస్సీ , ఎస్ టి, బీసీ ,మైనార్టీ సంఘాలు, రాజకీయ నాయకులు ,ఘనంగా జయంతిని నిర్వహించారు .ఈ కార్యక్రమంలో కొత్త రామచందర్ ,మామిండ్ల రత్నయ్య, రవీందర్, పెరమండ్ల యాదగిరి ,సాయిని యాదగిరి, ఆకుల వెంకటేశం ,సత్తిరెడ్డి, కొండూరు సత్తయ్య, శీను, గోదా అచ్చయ్య ,పోలె పాక సత్యనారాయణ ,లోతుకుంట సర్పంచ్ బిక్షపతి ,కందుల అంజయ్య, బిక్షపతి, నరసింహ, పోలేపాక బిక్షపతి, పవన్ కుమార్ ,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.






యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి పై దాడి ఘటనలో , పక్షపాత ధోరణితో , దురుసుగా.. వ్యవహరించిన పోలీసు అధికారుల తీరుపై.. మంగళవారం హైదరాబాదులో తెలంగాణ డిజిపి కి బిఆర్ఎస్ నేతలు వినతిపత్రం అందజేశారు. దాడి ఘటనలో పోలీసు అధికారులు వ్యవహరించిన తీరుపై , చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ...నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి ,సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జా దీపిక, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనమండలి సభ్యులు... ఎల్ రమణ ,మాజీ శాసనసభ్యులు.. భాస్కరరావు, శానం పూడి సైది రెడ్డి , పైళ్ళ శేఖర్ రెడ్డి, కోరు కంటి చందర్ ,మాజీ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి ,సిహెచ్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.


యాదాద్రి భువనగిరి జిల్లా లోని మోటకొండూరు మండలం దిలావర్‌పూర్ గ్రామంలో జరిగిన సామూహిక హత్య కేసులో భువనగిరి కోర్టు సంచలన తీర్పు..


Feb 01 2024, 21:31
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1.0k