నేడు బిఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశం

బీఆర్‌ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గస్థాయి విస్తృతస్థాయి సమావేశాలు శనివారం నుండి ప్రారంభం కానున్నాయి.

రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమా వేశాలు నిర్వహించను న్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహిం చనున్నారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించా ల్సిన వ్యూహం, పార్టీ పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తల సలహాలు, సూచనలను స్వీకరిస్తారు.

ఈ సమావేశాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు, మాజీ మంత్రులు టీ హరీశ్ రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కడియం శ్రీహరి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, ఎల్ రమణ హాజరుకానున్నారు.

తెలంగాణభవన్‌లో ప్రతిరోజు ఒకటి చొప్పున లోక్‌సభనియోజకవర్గాలవారీగా సన్నాహక సమావే శాలను నిర్వహించింది. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు.

ఈ సమావేశాలకు పార్టీ శ్రేణులనుంచి అద్భుతమైన స్పందన రావడం, వారిలోని ఉత్సాహాన్ని చూసిన పార్టీ నాయకత్వం దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీ నియోజకవర్గస్థాయిలోనూ సమావేశాలు నిర్వహిం చాలని నిర్ణయించారు.
ఈ సమావేశాల్లో పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి, వాటిని క్రోడీకరించి పార్టీ అధినేత కేసీఆర్‌కు నివేదించను న్నారు.
Jan 27 2024, 19:31