జనవరి 3 నుండి పార్లమెంట్ నియోజకవర్గాల భారీగా బిఆర్ఎస్ పార్టీ సమావేశాలు..
![]()
జనవరి మూడో తేదీ నుంచి బిఅర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు
లోక్ సభ ఎన్నికలకు గులాబీ పార్టీ సన్నద్దం
![]()
వచ్చే నెల మూడు నుంచి సన్నాహక సమావేశాలు
తెలంగాణ భవన్ వేదికగా ముఖ్యనేతలతో వరుస భేటీలు
పార్లమెంట్ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో సమయత్తమవుతుంది. ఇందులో భాగంగా జనవరి మూడో తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నది. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితర ముఖ్యనాయకులు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు తెలంగాణ భవన్ లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు కొనసాగుతాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో... మధ్యలో మూడురోజుల విరామమిచ్చి, మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను సంక్రాంతి తరువాత పార్టీ కొనసాగించనున్నది.
మొదట జనవరి 3న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంతో ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది.
తేదీలవారీగా పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహాక సమావేశాల వివరాలు ఇలా ఉన్నాయి...
• 3న ఆదిలాబాద్
• 4న కరీంనగర్
• 5న చేవెళ్ల
• 6న పెద్దపల్లి
• 7న నిజామాబాద్
• 8న జహీరాబాద్
• 9న ఖమ్మం
• 10న వరంగల్,
• 11న మహబూబాబాద్
• 12న భువనగిరి
సంక్రాంతి అనంతరం..
• 16న నల్గొండ
• 17న నాగర్ కర్నూలు
• 18న మహబూబ్ నగర్
• 19న మెదక్
• 20న మల్కాజ్ గిరి
• 21 సికింద్రాబాద్ మరియు హైదరాబాద్
ఈ సమావేశాలకు ఆయా పార్లమెంట్ పరిధిలోని ముఖ్యులందరినీ ఆహ్వానించనున్నారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల యంపిలు, నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇంచార్జీలు, జిల్లాపార్టీ అద్యక్షులు మొదలుకొని పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు సమావేశాలకు హాజరవుతారు.
తెలంగాణ భవన్ లో జరిగే ఈ సమావేశాల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మీటింగ్ కు హాజరయ్యే ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుని పటిష్టమైన కార్యాచరణను రూపొందించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం స్వల్ప ఓట్ల శాతం తేడాతోనే అనేక సీట్లు చేజారిన నేపథ్యంలో.. వాటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా జరగబోతున్న ఈ సమీక్షల అనంతరం ప్రజాక్షేత్రంలో ప్రచారపర్వాన్ని బలంగా నిర్వహించేందుకు కూడా పార్టీ యంత్రాంగం కసరత్తు చేస్తోంది.


తిరుమల: 8వ రోజుకు చేరుకున్న వైకుంఠ ద్వార దర్శనం.. ఎల్లుండి అర్దరాత్రితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం.. ఎల్లుండి వరకు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన టీటీడీ.
ఏపీకి సంబంధించిన పొలిటికల్ బ్రేకింగ్ న్యూస్ ఇది. పొత్తులపై క్లారిటీ వచ్చేసింది. 2024 ఎన్నికల్లో 2014 సీనే రిపీట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఏపీలో పొత్తులపై సంక్రాంతికల్లా బీజేపీ నిర్ణయం తీసుకోనుంది. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ బాధ్యతలను ముగ్గురు బీజేపీ జాతీయ నేతలకు అప్పగించింది హైకమాండ్. టీడీపీతో పొత్తుపై BJPలో అభిప్రాయ సేకరణ పూర్తైనట్లు తెలిసింది. టీడీపీ-
జనసేనతో కలిసి వెళ్లాలని ఏపీ బీజేపీ మెజార్టీ నేతల సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పొత్తు వల్ల 3 పార్టీలకు జరిగే లాభనష్టాలపై ఇప్పటికే నివేదిక కూడా రెడీ అయిందట. ఈ రిపోర్ట్‌ను మోదీ ఆఫీసుకు కూడా అందజేశారట. పార్లమెంటరీ బోర్డులో చర్చించాక పొత్తులపై తుది నిర్ణయం వెల్లడి కానుంది.
హైదరాబాద్: ఫిలింనగర్ లో మరోసారి డ్రగ్స్ పట్టివేత.. పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తి అరెస్టు.. 20 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ .. పబ్ కు వచ్చే కొంత మందికి డ్రగ్స్ అమ్మినట్లుగా గుర్తింపు.. డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిని పట్టుకునేందుకు రంగంలో దిగిన నాలుగు బృందాలు.
హైదరాబాద్: హ్యాండ్లూమ్, మార్కెటింగ్, సహకార శాఖలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష.. టెక్స్ టైల్స్ కోసం ఉన్న కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..
ఆదాయం పెంచుకునేలా కార్పొరేషన్లను బలోపేతం చేయాలి.. కోహెడ మార్కెట్ ను అత్యాధునిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేయాలి. దేశంలోనే బెస్ట్ మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దాలి.. మార్కెట్లలో సోలార్ ఎనర్జి ప్యానల్స్ ఏర్పాటు చేయాలి-మంత్రి తుమ్మల
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన 22 ల్యాండ్ క్రూజర్ల వ్యవహారంలో కీలక మలుపు

మారు మూల పల్లె వరకు సంక్షేమ పథకాలు అందాలి అన్నదే మా లక్ష్యం.. తండాలు, పేదల దగ్గరికి పాలన అందిస్తాం.. పదేళ్లు ప్రభుత్వం - ప్రజలకు ఎంత దూరంగా ఉంది అనేది ప్రజా వాణి చూస్తే అర్థం అవుతుంది.. ప్రజావాణిలో వచ్చిన అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తాం.. ప్రజలు హైదరాబాద్ వరకు వచ్చే ఇబ్బంది రాకుండ ఉండేలా.. ప్రభుత్వమే ప్రజల దగ్గరకు పోవాలి అని నిర్ణయం తీసుకున్నాం-సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్.. ఆరు గ్యారంటీల దరఖాస్తును లాంచ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు.
Dec 30 2023, 09:19
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
16.9k