తెలంగాణలో నూతనంగా ఎన్నుకోబడిన మంత్రులకు కేటాయించిన శాఖలు...
ఎనుముల రేవంత్ రెడ్డి,సీఎం
(పురపాలక పరిపాలన&పట్టణ అభివృద్ధి, సాధారణ పరిపాలన, లా అండ్ ఆర్డర్,అన్ని ఇతర కేటాయించని పోర్ట్ఫోలియోలు),
2. మల్లు భట్టి విక్రమార్క-ఆర్ధిక, విద్యుత్ & ప్లానింగ్,
3.నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి-
ఇరిగేషన్ & క్యాడ్, ఫుడ్ & సివిల్ సప్లై
4. దామోదర రాజనరసింహా -వైద్య ఆరోగ్య,కుటుంబ సంక్షేమ, విజ్ఞానశాస్త్రం, సాంకేతికత
5.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి-రహదారులు & భవనాలు, సినిమాటోగ్రఫీ
6.దుద్దిల శ్రీధర్ బాబు-ఐటీ,ఇండస్ట్రీస్ & కామర్స్ లెజిస్లేటివ్ అఫైర్స్
7.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి-రెవిన్యూ, గృహ&సమాచార శాఖ.
8. పొన్నం ప్రభాకర్- రవాణా, బిసి సంక్షేమం
9. కొండా సురేఖ- దేవాదాయ,అటవీ, పర్యావరణ శాఖ.
10. ధనసరి సీతక్క- పంచాయితీ రాజ్ గ్రామీణ అభివృద్ధి (గ్రామీణ నీటి సరఫరాతో సహా) స్త్రీ, శిశు సంక్షేమం,
11.తుమ్మల నాగేశ్వరరావు- వ్యవసాయశాఖ, మార్కెటింగ్, సహకారం& చేనేత వస్త్రాలు.
12. జూపల్లి కృష్ణారావు- ప్రొహిబిషన్ ఎక్సైజ్, పర్యాటకం & సంస్కృతి, పురావస్తు శాఖ.

ఎనుముల రేవంత్ రెడ్డి,సీఎం
హైదరాబాద్: ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో నేడు ప్రమాణం చేయించనున్న ప్రోటెమ్ స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్: రాజ్ భవన్‌లో అక్బరుద్దీన్ ఒవైసీతో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ తమిళిసై.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు
హైదరాబాద్: మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రశ్నించే గొంతుకు ప్రాణం పోసిన గడ్డ మల్కాజ్‌గిరి.. కొడంగల్‌లో నడిరాత్రి ప్రజాస్వామ్యాన్ని నిర్దాక్షిణ్యంగా హత్యచేసిన సందర్భాన్ని చూసి మల్కాజ్‌గిరి చలించింది.. కేవలం 14రోజుల వ్యవధిలోనే నన్ను తమ గుండెల్లో పెట్టుకుంది.. ప్రశ్నించే గొంతుకై తెలంగాణ మొత్తానికి రక్షణగా నిలబెట్టింది.. నన్ను దేశానికి పరిచయం చేసిన ఘనత మల్కాజ్‌గిరి ప్రజలదే. -రేవంత్ రెడ్డి
యశోద డాక్టర్ల ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన కేసీఆర్ గారి తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స..
ఢిల్లీ బయల్దేరిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. నేరుగా పార్లమెంట్‌కు వెళ్లనున్న రేవంత్ రెడ్డి.. మల్కాజ్‌గిరి ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న రేవంత్ రెడ్డి.. తర్వాత రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ.. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై రాహుల్‌తో చర్చ.. కేబినెట్‌లో మిగతా బెర్తులపైనా అధిష్ఠానంతో చర్చించనున్న రేవంత్ రెడ్డి.
హైదరాబాద్: అసెంబ్లీకి ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. రేపు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. అసెంబ్లీకి బస్సు ప్రారంభించనున్న సీఎం.. ప్రయాణించనున్న మహిళా మంత్రులు.. అసెంబ్లీలో ఏర్పాట్లు పరిశీలించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
అమరావతి: కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవాలి.. కేసీఆర్ కు గాయమైందని తెలిసి బాధపడ్డాను.. కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.. ఎన్నో సవాళ్లను అధిగమించిన కేసీఆర్ ఈ అనారోగ్య పరిస్థితులనూ మనోధైర్యంతో అధిగమిస్తారనే నమ్మకం ఉంది.. పూర్తి స్వస్థత పొంది మళ్ళీ ప్రజలకు, సమాజానికీ తన సేవలు కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నాను- పవన్ కళ్యాణ్
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు యశోద హాస్పిటల్ కు వెళ్లిన ఆరోగ్యశాఖ కార్యదర్శి.. ఆసుపత్రి వైద్యులను అడిగి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న వైద్యాధికారులు.. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్ సెక్రటరీకి చెప్పిన యశోద ఆస్పత్రి డాక్టర్లు.. కేసీఆర్ కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచన..
Dec 09 2023, 14:40
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
18.3k