ప్రజల తీర్పును గౌరవిద్దాం..
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో ఎర్రవెల్లిలోని తన నివాసంలో సమావేశం అయిన మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు.. కేసీఆర్‌ని కలిసి ఆశీర్వాదం తీసుకున్న తాజాగా గెలిచిన అభ్యర్థులు.. శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్..
ప్రజల తీర్పును గౌరవిద్దాం.. రాజ్యాంగ బద్దంగా జనవరి 16 వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉండే.. కానీ, ప్రజల తీర్పుతో హుందాగా తప్పుకున్నాం.. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏమి జరుగుతుందో వేచి చూద్దాం.. త్వరలో తెలంగాణ భవన్ లో పార్టీ సమావేశం.. ఎన్నికల ఫలితాలపై సమీక్ష.. త్వరలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకుందాం-కేసీఆర్

బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో ఎర్రవెల్లిలోని తన నివాసంలో సమావేశం అయిన మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు.. కేసీఆర్‌ని కలిసి ఆశీర్వాదం తీసుకున్న తాజాగా గెలిచిన అభ్యర్థులు.. శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్..

హైదరాబాద్: తెలంగాణ రెండో శాసనసభ రద్దు.. మంత్రి మండలి ప్రతిపాదనతో సభ రద్దు.. అధికారిక ప్రకటన విడుదల చేసిన రాజ్‌భవన్
తెలంగాణలో కొనసాగుతోన్న రాజీనామాల పర్వం.. ఇంటెలిజెన్స్ ఓఎస్‌డీ ప్రభాకర్‌రావు రాజీనామా.. సీఎస్‌కు రాజీనామా లేఖలు పంపిన తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు డా. దూది మెట్ల బాలరాజ్ యాదవ్, రవీందర్ సింగ్, డా. వాసుదేవ రెడ్డి, మన్నే క్రిశాంక్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, పల్లె రవికుమార్ గౌడ్, పాటి మీద జగన్ మోహన్ రావు, అనిల్ కూర్మాచలం, గజ్జెల నగేష్, మేడె రాజీవ్ సాగర్, డా. ఆంజనేయులు గౌడ్, సతీష్ రెడ్డి, రామచంద్ర నాయక్, గూడూరి ప్రవీణ్, వాల్యా నాయక్ తదితరులు.. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్‌రావు రాజీనామా
మెదక్: కూలిన దుండిగల్ ఎయిర్‌పోర్టు శిక్షణ విమానం.. విమాన ప్రమాదంలో ఇద్దరు మృతి.. పైలెట్, ట్రైనీ పైలెట్ సజీవదహనం.. తూప్రాన్ రావెల్లి శివారులో ఘటన.. గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు.
పశ్చిమ గోదావరి: తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల చిరుజల్లులు.. ఈరోజు, రేపు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన జిల్లా కలెక్టర్లు.. ఇంకా చేలల్లో వరి ధాన్యం.. వర్షం ఎక్కువైతే వరి రైతులకు ఇబ్బందికర పరిస్థితులు.. నర్సాపురం తీర ప్రాంతంలో అప్రమత్తమైన అధికారులు.. పేరుపాలెం బీచ్‌లోకి ఈరోజు, రేపు పర్యాటకుల అనుమతి నిరాకరణ.
హైదరాబాద్: ఇవాళ కాంగ్రెస్ ఎల్పీ సమావేశం.. ఉదయం 9.30 గంటలకు గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో సీఎల్పీ భేటీ.. ఇప్పటికే హోటల్ ఎల్లాకు చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. సీఎల్పీ సమావేశంలో సీఎల్పీ నేత ఎన్నిక.. పరిశీలకుడిగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, జార్జ్, దీపా దాస్ మున్షి, అజయ్, మురళీధరన్
ఢిల్లీ: నేటి నుంచి 22 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు.. టీఎంసీ ఎంపీ మహువాపై ఎథిక్స్ కమిటీ నివేదిక మీద రానున్న చర్చ.. సభ ముందుకు రానున్న 24 బిల్లులు.. ఐపీసీ, సీఆర్‌పీసీ స్థానంలో కొత్త బిల్లులు.. చర్చకు అవకాశం రానున్న ప్రెస్-పీరియాడికల్స్ బిల్లు.. ఎన్నికల కమిషనర్ల నియామకంలో సీజేఐ ప్రమేయం లేకుండా అమలు చేసే బిల్లు.. పలు సమస్యలపై చర్చకు విపక్షాల డిమాండ్.. సమావేశాలపై 5 రాష్ట్రాల ఫలితాల ప్రభావం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: కంటోన్మెంట్‌లో రెండో రౌండ్ పూర్తయ్యే సరికి 3406 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్, చార్మినార్, కార్వాన్, బహదూర్‌పురా, చంద్రాయణగుట్ట, మలక్‌పేట్‌లో ఆధిక్యంలో ఎంఐఎం అభ్యర్థులు,
Dec 05 2023, 09:00
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.5k