/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: కాంగ్రెస్ లో చేరిన లెంకలపల్లి గ్రామ బీజేపీ బూత్ అధ్యక్షుడు కర్నాటి నాగరాజు Mane Praveen
NLG: కాంగ్రెస్ లో చేరిన లెంకలపల్లి గ్రామ బీజేపీ బూత్ అధ్యక్షుడు కర్నాటి నాగరాజు

నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం:

మర్రిగూడెం: మండలంలోని, లెంకలపల్లి గ్రామ బీజేపీ బూత్ అధ్యక్షుడు కర్నాటి నాగరాజు.. బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. కాంగ్రెస్ నాయకులు అబ్బనబోయిన దశరథ, నందికొండ లింగారెడ్డి ఆధ్వర్యంలో మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

శుక్రవారం నల్లగొండ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచార షెడ్యూల్

నల్లగొండ పట్టణం

ఉదయం 8:00 గంటలకు భాస్కర్ టాకీస్

17 వ వార్డు ఆర్జాలబావి : ఉ " 9:00 గంటలకు

9 వ వార్డు వెంకటరమణ కాలనీ : ఉ " 10:00 గంటలకు

సాయంత్రం

నల్లగొండ మండలం

మేళ్ళ దుప్పల పల్లి :సా"4:00 గంటలకు

 తొరగాల్ :సా" 5:00 గంటలకు

కనగల్ మండలం

జంగబాయ్ గూడెం : సా" 6:00 గంటలకు

ఇరుగంటి పల్లి : సా"7:00 గంటలకు

చిన్న మాదారం : సా"8:00 గంటలకు

చెట్ల చెన్నారం : సా"9.00 గంటలకు

బాబాసాయి గూడెం : 9.30 నిముషాలకు

బిజెపి నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు

కేతేపల్లి: మర్రి శోభ ఆధ్వర్యంలో ఘనంగా ఆర్ఎస్పి పుట్టినరోజు వేడుక

నల్లగొండ జిల్లా:

నకిరేకల్ నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ మహిళా కన్వినర్ మర్రి శోభ ఆధ్వర్యంలో, నేడు బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామం లో కుటుంబ సమేతంగా, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. 

ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పలువురు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

NLG: ఎన్జీ కళాశాలలో పీజీ సీట్లకు నవంబర్ 25న కౌన్సెలింగ్

నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల నందు పీజీ- పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో 2023-24 విద్యా సంవత్సరానికి మిగిలిన సీట్లను.. ఈ నెల 25న స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయబడును. కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ CPGET-2023 నిబంధనల ప్రకారం సీట్లను భర్తీ చేయడం జరుగుతుంది. కళాశాలలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో 13 సీట్లు, ఎమ్మెస్సీలో జువాలజీ 24 సీట్లు, ఎం.కాంలో 35 సీట్లు, ఎంఏ తెలుగులో 24 సీట్లు ఎంఏ ఎకనామిక్స్ 43 సీట్లు, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ లో 20 సీట్లు ఖాళీగా ఉన్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యస్.ఉపేందర్ తెలిపారు.

డిగ్రీలో 50% శాతం మార్కులు కలిగినవారు 3 పాస్ ఫోటోలు, 3 జతల జీరాక్స్ సర్టిఫికెట్లు, ఒరిజినిల్ సర్టిఫికేట్లతో కౌన్సెలింగ్ కు హాజరు కాగలరు, కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ రాయని వారు కూడా ఈ సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని డిగ్రీ పూర్తి చేసుకొని 50% పర్సంటేజ్ తో ఉండాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉపేందర్ తెలిపారు.

విద్యార్థులు కోర్సు ఫీజుతో పాటు యూనివర్సీటీ ప్రాసెసింగ్ ఫీజు రూ.2100 చెల్లించాలన్నారు. స్పాట్ అడ్మిషన్లలో చేరిన విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ వర్తించదు. పూర్తి వివరాలకు కళాశాల కార్యాలయం నందు సంప్రదించాలన్నారు.

చిట్యాల: బి ఎస్ పి లో భారీగా చేరికలు

నల్లగొండ జిల్లా: బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని ఆధ్వర్యంలో , చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన పలువురు నాయకులు బిఎస్పి పార్టీ లో చేరారు. బి ఆర్ ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు ఏర్పుల తిరుమలయ్య, ఏర్పుల కుర్రు మురళి కృష్ణ, ఏర్పుల వెంకటేష్, చింతకింది రామ చంద్ర ప్రసాద్,ఏర్పుల బిక్షం, చింతకింది తిరుమలయ్య, చింత కింది సంజీవ,ఏర్పుల మల్లేష్, చిరుమర్తి ధర్మయ్య, చింతకింది వెంకటేష్,ఏర్పుల ఉపేందర్,ఏర్పుల భాస్కర్,ఏర్పుల నరేష్,ఏర్పుల క్రాంతి కుమార్, చింత కింది గణేష్, చిరుమర్తి రవి కుమార్ 50 మంది యువకులు బహుజన్ సమాజ్ పార్టీలోకి చేరారు.

బీఎస్పీ నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ కేవలం బహుజన్ సమాజ్ పార్టీ అని, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల వల్ల సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆరోపించారు. యువత ఇప్పుడు బీఎస్పీ పార్టీ వైపు చూస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఈ నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్,గ్యార శేఖర్,సైదులు, యాదగిరి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

NLG: పొత్తు ధర్మాన్ని కాపాడాలి.. రాజగోపాల్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి: సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం.

నల్లగొండ జిల్లా , మునుగోడు: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తో సిపిఐ పెట్టుకున్న పొత్తు ధర్మాన్ని ప్రతి కార్యకర్త కాపాడాలని మునుగోడు లో సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం సిపిఐ కార్యకర్తలకు సూచించారు. గురువారం మండలంలోని కొరటికల్ గ్రామంలో సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సత్యం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. బిజెపికి వ్యతిరేకంగా 27 పార్టీలతో దేశంలో ఇండియా కూటమి ఏర్పడిందని అన్నారు. ఉప ఎన్నికల్లో బిజెపిని అంతమొందించడానికి బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నామని కానీ ఇప్పుడు రాష్ట్రంలో బిజెపి, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఏకమయ్యాయని, దేశంలో బిజెపిని రాష్ట్రంలో బిఆర్ఎస్ ఓడగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. కరుడుగట్టిన కమ్యూనిస్టులు పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసిన చరిత్ర ఈ కొరటికల్ గ్రామానికి చరిత్ర ఉందని అన్నారు.

భారత కమ్యూనిస్టు పార్టీ 200 దేశాలలో పార్టీ బలంగా ఉందని, మనదేశంలో కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టులు పరిపాలన చేస్తున్నారని గుర్తు చేశారు. భారతదేశంలో పొత్తు లేకుండా పోటీ చేసే పార్టీలు లేవని అన్నారు. ఈ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త నికార్సుగా కూలం కుశంగా పనిచేయాలని, ఈ గ్రామంలో భారీ మెజార్టీ దిశగా ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని సూచించారు.

కాంగ్రెస్ కార్యకర్తలు సిపిఐ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి రాజగోపాల్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కష్టపడాలని పిఎసిఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే  అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తె మంత్రి అయితాడని, ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురుజ రామచంద్రం, సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, సిపిఐ మండల సహాయ కార్యదర్శి మందుల పాండు, ఆ గ్రామ కార్యదర్శి మునుగోటి దయాకర్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దండు లింగస్వామి, సిపిఐ కార్యకర్తలు మిరియాల యాదయ్య, కృపాటి లింగయ్య, రొమ్ముల యాదయ్య, అన్నం వెంకన్న, మందుల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

YBD: తాళ్ళసింగారం లో బిఆర్ఎస్ కి భారీ షాక్

చౌటుప్పల పట్టణ కేంద్రంలోని 2.వ వార్డు తాళ్ళ సింగారంలో BRS పార్టీ సీనయర్ నాయకులు మాజీ ఎంపీటీసీ బండారి మార్క్ BRS పార్టీకి రాజీనామ చేసి కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు..

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుర్వి నర్సింహా, కోసనం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇచ్చిన టిడిపి నాయకులు
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం:
అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గ టిడిపి ఇంచార్జీ జక్కలి ఐలయ్య యాదవ్ అధ్యక్షతన, చౌటుప్పల్ లోని టిడిపి కార్యాలయంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. టీడీపీ శ్రేణుల ఆహ్వానం మేరకు  చౌటుప్పల్ లోని టిడిపి కార్యాలయానికి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాజగోపాల్ రెడ్డి వ్యక్తిత్వం చూసి పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి ఆయనను గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఎన్నికలో నా మీద అభిమానంతో వ్యక్తిగతంగా నాకు సహకరించిన వారికి మరియు తెలుగుదేశం పార్టీ తరపున నాకు మద్దతు ప్రకటిస్తున్న వారికి పేరు పేరునా అందరికీ ధన్యవాదాలు రాజ్ గోపాల్ రెడ్డి అని తెలిపారు.
TS: కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క తమ్ముడు పై దాడి.. కంటతడి పెట్టిన బర్రెలక్క...

నాగర్ కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ నియోజక వర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క (శిరీష).. తమ్ముడు పై నిన్న దాడి జరిగింది. ఒక 25 ఏళ్ల నిరుద్యోగి, పేదింటి బిడ్డ, అనేక రకాల కష్టాలు చవిచూసిన విద్యార్థిని, ఉద్యోగం కోసం పరీక్షలకు ప్రిపేర్ అవుతూ, కొంతకాలం హైదరాబాద్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుని హాస్టల్లో ఉండి చదువుకున్నా.. నోటిఫికేషన్లు సరిగా రాకపోవడం, వచ్చిన నోటిఫికేషన్లు కొన్ని రద్దు కావడం, పలు కారణాలతో విసిగివేసారిన ఈ అమ్మాయి.. ఎమ్మెల్యే నోటిఫికేషన్ పడిందని అప్లై చేసుకొని కొల్లాపూర్ ఎమ్మెల్యే బరిలో నిలిచింది. 

కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శిరీష సోషల్ మీడియాలో గతంలో చేసిన ఓ వీడియో బాగా వైరల్ అయి బర్రెలక్క గా పేరుపొందింది. ఆ వీడియో ద్వారా ఆమె పబ్లిక్ లో విశేష ఆదరణ పొందింది. ఎమ్మెల్యే బరిలో దిగిన ఈమెకు విద్యార్థులు, నిరుద్యోగుల నుండి బాగా మద్దతు లభించింది. ప్రచారానికి స్వచ్ఛందంగా కొంతమంది చందాలు సైతం ఇచ్చారు. అయితే ఎమ్మెల్యే బరిలో ఉన్న తనను మానసికంగా దెబ్బతీయాలని తన తమ్ముడి పై ప్రత్యర్ధులు దాడి చేశారని మీడియాతో నిన్న ఆమె వెల్లడించారు. 

నియోజకవర్గ సమస్యల పైన, రాష్ట్ర సమస్యల పైన అవగాహన తనకు ఉందని, నియోజకవర్గ ప్రజల ప్రధాన సమస్యలను తను తీరుస్తానని తనను గెలిపించాలని ప్రచారం మొదలు పెట్టిందో లేదో ఆమె తమ్ముడు పై దాడి జరిగింది. అయితే తన ఎదుగుదలను చూసి తట్టుకోలేకనే ప్రత్యర్ధులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు ఆమె అన్నారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని నిన్న రాత్రి పోలీసులను కోరారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

NLG: బెహన్ జీ కుమారి మాయావతి సభకు బయలుదేరిన బిఎస్పి సాగర్ నియోజకవర్గ నాయకులు

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా, నేడు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బెహన్ జీ కుమారి మాయావతి.. సూర్యాపేట లో జరిగే బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేయుచున్న సందర్భంగా సాగర్ నియోజకవర్గం హాలియా పట్టణ కేంద్రం నుండి సూర్యాపేట కు బీఎస్పీ నాయకులు బయలుదేరారు.

ఈ సందర్భంగా బిఎస్పీ సాగర్ నియోజకవర్గ అధ్యక్షుడు ముదిగొండ వెంకటేశ్వర్లు ... మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం లో పేద , బడుగు , బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పని చేసే నిజమైన పార్టీ కేవలం బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే అని అన్నారు. సాగర్ నియోజకవర్గం లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఏనుగు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ సాగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బత్తుల ప్రసాద్, నియోజకవర్గ సహాయ కార్యదర్శి కుక్కముడి ముత్యాలు, నియోజకవర్గ మహిళా కన్వీనర్ బైరాగి విజయ, గుర్రంపోడు మండల అధ్యక్షుడు కొమ్ము రమేష్ , అనుముల మండల అధ్యక్షుడు జిల్లా మధు, నియోజకవర్గ సొషల్ మీడియా ఇన్చార్జ్ మామిడి నరేందర్ ,సంగారం గ్రామ శాఖ అధ్యక్షుడు తరి రవి తదితరులు పాల్గొన్నారు.