/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png
నల్లగొండ: కోమటిరెడ్డి ని గెలిపించాలని తెలంగాణ జన సమితి ప్రచారం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని.. భారీ మెజార్టీ తో గెలిపించాలని తెలంగాణ జన సమితి నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు.
SRPT: వట్టే జానయ్య పై దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం
సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు మండలం గట్టికల్ గ్రామంలో ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో, బిఎస్పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ ప్రచారానికి వెళ్ళారు. ప్రత్యర్థులు వట్టే జానయ్య పై గొడ్డళ్లు, కత్తులతో దాడి చేశారు . దీంతో జానయ్య తృటిలో తప్పించుకోగా ఆయన అనుచరుడు కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉదృత వాతావరణం ఏర్పడింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
నల్గొండ: నేడు జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం సాయంత్రం 3 గంటలకు నకిరేకల్‌లో ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొననున్నారు.
నల్గొండలో సాయంత్రం 4 గంటలకు ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు సీఎం కేసీఆర్ బహిరంగ సభ బీఆర్‌ఎస్ నేతలకు బ్రహ్మాస్త్రం లాంటిది దీన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యేలు తీవ్రంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
సీఎం పర్యటన షెడ్యూల్ ముందస్తుగానే ఖరారు కావడంతో ఆ తేదీలకు రెండురోజుల ముందు గడపగడపకూ ప్రచారాన్ని సైతం పక్కనపెట్టి ఎమ్మెల్యేలు కీలక నేతలు సీఎం సభకు ఏర్పాట్లు జనసమీకరణలో నిమగ్నమవుతున్నారు.బీఆర్‌ఎస్ నేతలు కార్యకర్తలతో పాటు, సాధారణ జనాన్ని సభకు తరలించేందుకు వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు.
TS: బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే బోయ లను గిరిజనులు గా ప్రకటిస్తామని: కేసీఆర్
జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్ నియోజక వర్గంలో బీఆర్ఎస్ నాయకులు నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. వాల్మీకి బోయ లను బీసీ లో కలిపింది కాంగ్రెస్ పార్టీ అని, బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే బోయ లను గిరిజనులు గా ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి బతుకులు తప్ప ఏం లేవని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ చేసిన అన్యాయాలను సరిదిద్దుకొస్తున్నామని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో రూ. 200 ఉండే పింఛన్ ను రూ. 2వేలకు పెంచామని చెప్పారు. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పింఛన్ రూ.5 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. బిఆర్ఎస్ ను గెలిపించినట్లయితే అన్ని రకాల లాభాలు జరుగుతాయని అన్నారు.
TS: ఆదివాసీల కోసం కాంగ్రెస్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది: ప్రియాంక గాంధీ
ఖానాపూర్: తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఖానాపూర్ లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతూ.. క్రికెట్ వరల్డ్ కప్ ఉన్నప్పటికీ తన కోసం వచ్చినందుకు ధన్యవాదాలు అంటూ ప్రసంగం ప్రారంభించారు. ఇక్కడ జల్ జంగిల్ జమీన్ కోసం కోట్ల మంది ఉన్నారని, ఆదివాసీ సమాజం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులకు పక్కా పట్టాలు వచ్చాయన్నారు.
ఇందిరాగాంధీ చనిపోయి 40 సంవత్సారాలు అవుతున్నా ఆమె అందరి మదిలో ఉన్నారని గుర్తు చేశారు. ఇందిరా గాంధీ చేసిన మంచి పనులే ఆమెని ప్రజల దగ్గరకు చేర్చాయన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అంతే బాధ్యతగా కాంగ్రెస్ నిర్వహించిందన్నారు. తెలంగాణా ప్రజల ఇబ్బందులు చుసి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఇచ్చినా.. కేసీఆర్ వచ్చి అంతా ఆగం చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఏ ఉద్దేశంతో ఇచ్చిందో అది కేసీఆర్ నెరవేర్చలేదని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ వ్యాపార వేత్తలకు భారీ రుణమాఫీ లను ఇచ్చారని.. రైతులకు ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ రైతులు, రైతు కూలీలు, కార్మికులు అందరికీ అన్యాయం జరిగిందన్నారు. కెసీఆర్ ప్రభుత్వ తప్పులను బీజేపీ ప్రశ్నించదని, బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే అన్నది ప్రజలు గమనించాలన్నారు. రైతుల కోసం బీజేపీ తెచ్చిన నల్ల చట్టాలకు కేసీఆర్ మద్దతు తెలిపారని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కి బీజేపీ సపోర్ట్ చేస్తే, ఢిల్లీలో బీజేపీకి బీఅర్ఎస్ సపోర్ట్ చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళల కోసం ప్రత్యేక పథకాలను తీసుకు వస్తామన్నారు
కెసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగుల సమస్యలు తీరలేదని, కేవలం కెసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. కెసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయని, తాము అధికారంలోకి రాగానే, తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అన్ని సమస్యలు తీరతాయన్నారు. ధరణి పోర్టల్ తో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని రకాల పంటలు, దాన్యం ధరలు పెంచి రైతులను ఆదుకుంటామన్నారు.
NLG: ప్రభుత్వ ఉపాధ్యాయులకు 40 రోజుల ఉచిత ఆన్లైన్ ఆంగ్ల భాష బోధన తరగతులు
నల్లగొండ: రాష్ట్ర పరిశోధన విద్యాసంస్థ వారి సహకారంతో విల్ టు కెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ డైరెక్టర్ రామేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో, జిల్లా ఉపాధ్యాయులకు 40 రోజుల ఉచిత ఆన్లైన్ శిక్షణా తరగతులు నిర్వహించబడుతున్నాయి.
ఈ ప్రోగ్రాంలో భాగంగా ఒక రోజు ఫిజికల్ క్లాస్ పట్టణంలోని టీటీడి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 600 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా అకాడమిక్ మానిటరింగ్ అధికారి రామచంద్రయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ తరగతుల యొక్క ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ పాఠశాలలలో చదివే ప్రతి విద్యార్థి కూడా తెలుగు మాట్లాడినట్టుగా ఇంగ్లీష్ మాట్లాడేటట్టు చేయటమన్నారు. ఉపాధ్యాయులు ఎంతో శ్రద్ధగా తరగతులకు హాజరు కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.
విల్ టు కెన్ సంస్థ డైరెక్టర్ రామేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు తెలంగాణలో 20 జిల్లాల ఉపాధ్యాయులకు ఈ తరగతులను పూర్తి చేశామని, అలాగే ఎస్సీఈఆర్టీ సహకారంతో మొత్తం తెలంగాణలో మిగతా జిల్లాలకు కూడా క్లాసెస్ త్వరలో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశం ఇచ్చిన ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కు, ఇంత మంచి సహకారాన్ని అందించిన డి ఈ ఓ, ఏ.ఎం.ఓ. కు రామేశ్వర్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బక్కా శ్రీనివాస చారి, పగిళ్ల సైదులు మరియు 600 మంది టీచర్లు పాల్గొన్నారు.
TS: ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగిస్తే సహించేది లేదు: సంగారెడ్డి ఎస్పి
సంగారెడ్డి: జిల్లా ప్రజలు ఎలాంటి ఒత్తిళ్ళకు తలొగ్గకుండా తమ ఓటుహక్కును స్వేచ్చ గా వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ అన్నారు. జిల్లాలో శనివారం వివిధ సమస్యాత్మక పోలీసు స్టేషన్ లు, బోర్డర్ చెక్ పోస్ట్ లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగిస్తే ఎంతటి వారైనా సహించేది లేదని హెచ్చరించారు.
TS: జనవరి నుంచి అందరికీ కొత్త రేషన్ కార్డులు అందిస్తాం: మంత్రి గంగుల కమలాకర్
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ రూరల్ మండలంలోని దుబ్బపల్లి, ఫకీర్ పేట, జూబ్లీ నగర్ ఏరియాల్లో మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి నుంచే రేషన్ కార్డులు లేని అర్హులందరికీ కొత్త కార్డులు అందజేస్తామన్నారు.
కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు ఏదో ఒక రూపంలో ప్రతి ఇంటికి అందించిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ తోనే ఇక్కడి ప్రాంతం అభివృద్ది చెందుతుందన్నారు. కోట్ల రూపాయల నిధులతో గ్రామాల రూపు రేఖలు మారిపోయాయని తెలిపారు.
RR: కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాల గురించి వివరించిన మల్ రెడ్డి రంగారెడ్డి
ఆదిభట్ల మున్సిపాలిటీ లోని ఆదిభట్ల గ్రామం,గంగా నగర్ కాలనీ,బొంగులూరు, మంగళపల్లి , సాహెబ్ గూడ,ఎంపీ పటేల్ గూడ,కొంగరకలాన్, కొంగరకలాన్ తండాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాల గురించి వివరించారు
1) మహాలక్ష్మి:
- మహిళలకు ప్రతీ నెల ₹2500,
- కేవలం ₹500 కే వంట గ్యాస్ సిలిండర్.
- ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం.
2) రైతు భరోసా:
- ప్రతీ ఏటా రైతులకు & కౌలు రైతులకు ఎకరానికి ₹15,000.
- ₹12,000 వ్యవసాయ కూలీలకు.
- వరి పంటకు 500 బోనస్.
3) గృహ జ్యోతి:
- ప్రతి కుటుంబానికి ప్రతీ నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్.
4) ఇందిరమ్మ ఇళ్లు:
- ఇల్లు లేని వారికి ఇంటి స్థలం & ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు.
- ఉద్యమకారులకు 250 చ.గ ఇంటి స్థలం.
5) యువ వికాసం:
- విద్యార్థులకు ₹5 లక్షల విద్యా భరోసా కార్డు.
- ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్.
6) చేయూత:
- వృద్ధులు,వితంతువులు, వికలాంగులు,బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు,కల్లుగీత కార్మికులు,నేత కార్మికులు,ఎయిడ్స్,ఫైలేరియా బాధితులకు నెలకు రూ.4,000 పింఛన్.
- పేదలకు 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా.
ఈ సందర్భంగా హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
Nov 20 2023, 14:42