/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Purandeshwari: ఎన్నికలకు ఐదారు నెలల సమయమే.. నేతలకు పురంధేశ్వరి దిశానిర్ధేశం Yadagiri Goud
Purandeshwari: ఎన్నికలకు ఐదారు నెలల సమయమే.. నేతలకు పురంధేశ్వరి దిశానిర్ధేశం

Purandeshwari Speech in BJP State Leaders Meeting: విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. కమిటీల బలోపేతంపై చర్చించారు. కమిటీల్లో మార్పు చేర్పులు, సంస్థాగత అంశాలపై సమీక్షించారు..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మీడియా సమావేశంలో ప్రసంగించారు. తనపై గురుతర బాధ్యతలు ఉన్నాయన్న పురంధేశ్వరి.. పార్టీని బలోపేతం చేయడం తన ఒక్కరి వల్లే సాధ్యం కాదన్నారు. ప్రతి కార్యకర్త సహకారం అందించినప్పుడే పార్టీ బలోపేతం సాధ్యం అవుతుందన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని ప్రజలకు చేరువ చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. 2014 తర్వాత పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఒంటరిగా వెళ్లాలని చాలా మంది సూచించారన్నారు. పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ముందు కసరత్తు చేయాలని అధినాయకత్వం సూచించిందని పురంధేశ్వరి అన్నారు..

ఎన్నికలకు ఐదారు నెలల సమయమే ఉందని.. అన్ని స్థాయిల్లోని కమిటీలను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు.. రాజకీయంగా వేసే అడుగుల పైనా ఆలోచించాలన్నారు. ఏపీలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పాలిస్తోందని.. మద్యం డిస్టిలరీస్ అన్నీ అధికార పార్టీ పెద్దల సన్నిహితులకే ఇచ్చారని ఆరోపించారు. మద్యం అమ్మకాల్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతోందన్నారు. సీఎం ఇంటి సమీపంలో అత్యాచారం జరిగినా న్యాయం జరగని పరిస్థితి నెలకొందని విమర్శించారు. పదో తరగతి పిల్లవాడిని.. ఓ ఉపాధ్యాయుడిని పట్ట పగలు చంపేస్తోన్న పరిస్థితి ఉందన్నారు. యాప్ నొక్కితే చాలు పోలీసులొచ్చేస్తారని సీఎం జగన్ చెప్పారు.. కానీ అలా జరుగుతోందా..? అని ప్రశ్నించారు. యువతకు ఉపాధి అన్నారు.. కానీ అలా జరగడం లేదన్నారు..

TTD: శ్రీవాణి ట్రస్టుపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తితిదే ఈవో

తిరుమల: శ్రీవారి ఆలయంలో సోమవారం సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహించనున్నట్లు తితిదే ఆలయ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. పుష్పపల్లకిపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీనివాసుడు రేపు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని తెలిపారు..

ఆణివార ఆస్థానం నిర్వహిస్తున్నందున.. సోమవారం వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేశారు. దీంతో నేడు వీఐపీ సిఫారసు లేఖలను అనుమతించరు.

శ్రీవాణి ట్రస్టుపై కొందరు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఈవో ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఇప్పటికే 9 లక్షల మంది దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. '' శ్రీవాణి ట్రస్టుపై మరో ఆరోపణ వచ్చింది. కావాల్సిన వారికి ఆలయాలు నిర్మాణ కాంట్రాక్ట్‌ ఇస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. జీర్ణోద్ధరణలో భాగంగానే పార్వేట మండపం నిర్మాణం జరుగుతుంది. పార్వేట మండపాన్ని కూల్చివేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు'' అని ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు..

Chandrababu: రాజకీయ కారణాలతో టీచర్‌ను చంపడం దారుణం: చంద్రబాబు

రాజాం: విజయనగరం జిల్లా రాజాంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ హత్యను తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాజకీయ కారణాలతో ఒక టీచర్‌ను చంపడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు..

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలకు ప్రభుత్వ పెద్దలు, అధికారుల ఉదాసీన వైఖరే కారణమని ధ్వజమెత్తారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని కోరారు.

రాజాంలో నివాసముంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ (58) శనివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. ఆయన్ను ప్రత్యర్థి వర్గం బొలెరో వాహనంతో ఢీకొట్టి హతమార్చి.. రోడ్డుప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అక్కడి పరిస్థితులను చూసి ఇది హత్యేనని కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఘటనాస్థలం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు విచారణ చేపట్టగా, హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని నిర్ధారణ అయింది. మృతుడి కుమారుడు శ్రావణ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు తెర్లాం మండలం ఉద్దవోలుకు చెందిన మరడాన వెంకటనాయుడు, మోహనరావు, గణపతి, రామస్వామిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ రవికుమార్‌ తెలిపారు.

సాంప్రదాయాలను చాటిచెప్పే బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం.. తలసాని శ్రీనివాస్ యాదవ్

తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గోల్కొండలో బోనాలు ప్రారంభమయ్యాయని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుతున్నాయని అన్నారు.

లాల్‌దర్వాజా అమ్మవారికి మంత్రి తలసాని పట్టువస్త్రాలు సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బోనాల సందర్బంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, రాజకీయాలకు అతీతంగా బోనాల జాతర జరుగుతోందని చెప్పారు.

ఏ ప్రభుత్వాలు దేవాలయాలకు నిధులు ఇవ్వడం లేదని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం బోనాలకు ప్రత్యేక నిధులు కేటాయించిందని మంత్రి తలసాని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు. ఢిల్లీలో కూడా బోనాలు చేసి మన సంప్రదాయంను చాటి చెప్పారన్నారు. కుల మతాలకు అతీతంగా ఐక్యతతో బోనాల ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. ప్రశాంతంగా బోనాల ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నానని మంత్రి తలసాని అన్నారు...

తెలంగాణ సర్కార్‌కు పెండింగ్’’ గండం : కేసీఆర్‌కు కొత్త టెన్షన్.?

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో చాలా వాటిని బీఆర్ఎస్ ఇప్పటికీ అమలు చేయడం లేదు. అదిగో ఇదిగో అంటూ ప్రభుత్వం ఇప్పటి వరకు కాలం వెళ్లదీసింది. తీరా అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ప్రస్తుతం ఆ పార్టీకి టెన్షన్ పట్టుకున్నది. షెడ్యూలు వచ్చేలోపు ప్రధాన హామీలను అమలు చేయకపోతే ఇబ్బంది వస్తుందని ఎమ్మెల్యేల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్నది.

దీంతో ఏ హామీలను పూర్తి చేయాలి? ఏ హామీలను పెండింగ్‌లో పెట్టాలి? అనే విషయంపై సీఎం కేసీఆర్‌ క్లారిటీకి రావడం లేదని టాక్. ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్న పథకాలను ముందు పూర్తి చేసి, మిగతా వాటిని పెండింగ్‌లో పెడితే ఎలా ఉంటుందని ఆయన ఆరా తీస్తున్నట్టు సమాచారం. కొన్ని స్కీమ్స్‌ను పెండింగ్‌లో పెడితే కేసీఆర్ క్రెడిబులిటీకి సమస్య వస్తుందనే అనుమానాలు గులాబీ లీడర్లను వెంటాడుతున్నాయి.

ఖజానా ఖాళీ?

ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అన్ని హామీలను పూర్తి చేయడం సాధ్యం కాని పని. ప్రతి నెలా ఉద్యోగుల జీతాల చెల్లింపులు, తీసుకున్న అప్పులకు కిస్తీలు కట్టడం కూడా ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. వాటికి తోడు ప్రస్తుతం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను పెండింగ్‌లో పెట్టలేని పరిస్థితి.

ఆర్థిక పరిస్థితులు కారణంగా ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి చేయడం కూడా డౌటే. దీంతో ప్రజలను మానసికంగా సిద్ధం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రస్తుత పథకాలు తమ వల్ల మాత్రమే అమలవుతాయని, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సాధ్యం కాదని మంత్రులు పదే పదే చెపుతున్నారు. పథకాలు అమలు కాకుంటే ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్ముతారా? అనే అనుమానం గులాబీ లీడర్లను వెంటాడుతున్నది.

అటకెక్కిన నిరుద్యోగ భృతి

నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. అనంతరం అధికారం చేపట్టాక తొలి ఏడాది దీని కోసం బడ్జెట్‌లో సుమారు రూ.1800 కోట్లను ప్రభుత్వం కేటాయించారు. వివిధ రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి ఏవిధంగా అమలవుతుందో స్టడీ చేయాలని ఆఫీసర్లను ఆదేశించింది. కాస్త హడావుడి చేసి ఆతర్వాత నుంచి బడ్జెట్‌లో నిధులు కేటాయించడమే మానేసింది. చివరికి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామనే పేరుతో నిరుద్యోగ భృతి హామీని అటకెక్కించారు.

ఊసేలేని రైతు రుణమాఫీ

అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.లక్షలోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రకటించారు. అధికారం చేపట్టాక ఇందుకోసం బడ్జెట్‌లోనూ నిధులు కేటాయించారు. కానీ ఇప్పటి వరకు కేవలం రూ.25 వేల లోపు రుణాలను మాత్రమే మాఫీ చేసింది. వచ్చే ఎన్నికల లోపు ఈ హామీని పూర్తి చేస్తారా? లేదా? అనే దానిపై అనుమానాలు మొదలయ్యాయి. రైతు‌బంధు డబ్బులు అకౌంట్‌లో పడిన వెంటనే బ్యాంకులు వాటిని పాత అప్పుకింద జమ చేసుకుంటున్నాయి.

గృహలక్ష్మి నిబంధనలకే పరిమితం

సొంత జాగా ఉన్న వారు ఇల్లు నిర్మించుకునేందుకు గృహలక్ష్మి స్కీమ్ కింద ఈ ఏడాది ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 3 వేల మందికి రూ.3 లక్షల చొప్పున సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు ఆ స్కీమ్ అమలు కోసం కేవలం నిబంధనలు మాత్రమే రూపొందించింది. కానీ ఒక్క దరఖాస్తు కూడా స్వీకరించలేదు. డబుల్ బెడ్ రూం స్కీమ్‌ను సైతం పెండింగ్‌లో పెట్టింది. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇండ్లను సైతం పంపిణీ చేయలేదు.

నత్తనడకన దళితబంధు

దళితబంధు స్కీమ్ అమలు కేవలం ప్రకటనకే పరిమితమైంది. ఈ ఏడాది ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 11 వందల మందికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని సర్కారు ప్రకటించింది. కానీ ఇంతవరకూ లబ్ధిదారుల ఎంపిక పూర్తికాలేదు. తమ పేరును లిస్టులు నమోదు చేయించాలని అర్హులు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొన్ని చోట్ల దళారులు దందా మొదలు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు సైతం వస్తున్నాయి.....

ఒక్కొక్కరికి ఓ టెంపుల్.. బోనాల పండుగ వేళ సర్కార్ కీలక నిర్ణయం..!

హైదరాబాద్ :జులై 16

రాష్ట్రంలో ఎపుడైనా ఎన్నికలొచ్చే పరిస్థితులున్నందున ప్రజల్లోకి వెళ్లేందుకు అధికార బీఆర్ఎస్ పార్టీ అందుబాటులో ఉన్న అన్నిమార్గాలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తుంది.

ఆదివారం నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆషాడమాసపు బోనాలు జరుగుతున్నందున ఆయా ఆలయాల్లో అమ్మవారికి పట్టువస్త్రాలకు సమర్పించేందుకు ప్రజాప్రతినిధులకు అధికారికంగా ఆలయాలను కేటాయిస్తూ రాష్ట్ర దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సర్కారు తరపున పట్టువస్త్రాలు సమర్పించే ప్రతినిధిలా హాజరుకావాలని సూచించింది.

ఇందులో భాగంగా ఎమ్మెల్సీ, ప్రభుత్వవిప్ ఎంఎస్.ప్రభాకర్‌రావుకు కార్వాన్‌లోని దర్బార్ మైసమ్మ ఆలయం, మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి పాతబస్తీ గౌలీపురాలోని మహంకాళీ ఆలయం, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డికి ఉప్పుగూడలోని మహాంకాళీ ఆలయాన్ని కేటాయిస్తూ ఎండోమెంట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ మేయర్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆదివారం ఆమె పాతబస్తీ గౌలీపురాలోని మహంకాళీ ఆలయానికి వచ్చి, పట్టువస్త్రాలు సమర్పించేందుకు హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది...

జనసేన అధినేత పవన్‌ కల్యా ణ్‌ సోమవారం తిరుపతిలో పర్యటించనున్నారు

అమరావతి :జూలై 16

జనసేన అధినేత పవన్‌ కల్యా ణ్‌ సోమవారం ఉదయం తిరుపతిలో పర్యటించనున్నారు. శ్రీకాళహస్తి లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జనసేన నేత కొట్టే సాయి పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. సాయిపై దాడి చేసిన సీఐ అంజు యాదవ్‌పై చర్య తీసుకోవాలని జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పిస్తారు.

జనసేనలోకి ఆమంచి సోదరుడు

ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్‌ సోదరుడు ఆమంచి శ్రీనివాసులు(స్వాములు) జనసేనలో చేరారు. శనివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడారు. రాజ్యాధికారం ఎవరి సొత్తూ కాదని, దాన్ని జన్మహక్కులా భావించి, నియంత పాలన చేస్తానంటే కుదరదని అన్నారు. వైసీపీ దాష్టీకాలపై తెగించి పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ పోరాటంలో ఎవరిపై దెబ్బపడినా తనపై దెబ్బ పడినట్లే భావిస్తానన్నారు. ఆమంచి స్వాములు లాంటి నాయకుల బలమే జనసేనకు కావాలన్నారు. స్వాములు జనసేనలో చేరడం వల్ల ప్రకాశం జిల్లాలోనే కాకుండా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా పార్టీకి బలం చేకూరిందన్నారు...

ఆదిలాబాద్‌లో టమాటా లారీ బోల్తా, ఎగ‌బ‌డ్డ జ‌నం.. పోలీసుల‌ భారీ బందోబస్తు

ఆదిలాబాద్ :జులై 16

దేశ వ్యాప్తంగా టమాటా రేటు ఆకాశాన్నంటుతున్న పరిస్థితుల్లో ఆదిలాబాద్‌ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలో నేషనల్‌ హైవే 44 పై టమాటాలను తరలిస్తున్న లారీ ఆదివారం తెల్లవారుజామున బోల్తా పడింది.

దీంతో రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయిన టమాటాలను తీసుకెళ్లేందుకు జనం ఎగబడ్డారు. అందినకాడికి టమాటాలను తీసుకెళ్లారు.

సమాచారం అందుకున్న రైతులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో లారీ చుట్టూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బోల్తాపడిన లారీ కర్నాటకలోని కోలార్‌ నుంచి టమాటాల లోడ్‌తో ఢిల్లి వెళుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ లారీలో 18 ట‌న్నుల ట‌మాటాలు ఉండ‌గా.. మార్కెట్ రేట్ ప్ర‌కారం దాదాపు 30 ల‌క్ష‌లు విలువ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం అందుతోంది.......

43 మంది డీఎస్పీ స్థాయి అధికారుల బదిలీ.. ఆర్డర్స్ జారీ చేసిన డీజీపీ

తెలంగాణలో 43 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయం ఇవ్వాల శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

వీరిలో పలు డివిజన్‌లలో పనిచేస్తున్న ఎస్‌డీపీవో డీఎస్పీ లు ఉన్నారు. కొంతమందిని పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌కు ఎటాచ్‌ చేస్తూ డీజీపీ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు.

ఇక.. సార్వత్రిక ఎన్నికల ముందు పెద్ద ఎత్తున పోలీసు అధికారుల బదిలీలు జరగడం గమనార్హం....

రంగ రంగ వైభవంగా బోనాల జాతర

హైదరాబాద్‌:జులై 16

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లాల్‌దర్వాజా అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. బోనాల జాతరతో హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

అమ్మవారిని దర్శించుకోడానికి ఆదివారం తెల్లవారుజామునుంచే భక్తులు పోటెత్తారు. ఆలయం దగ్గర బోనాలతో మహిళలు బారులు తీరారు. లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు పెట్టారు. కాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

పాత బస్తీ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న బోనాల జాతరకు పోలీసులు 15 వందల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనాలు జరిగే పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించి బోనాలు ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు...