/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz తిరుమలలో భక్తుల రద్దీ.. Yadagiri Goud
తిరుమలలో భక్తుల రద్దీ..

తిరుపతి:జులై 16

తిరుమల తిరుపతి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు (Devotees) నిండిపోయి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి.

స్వామివారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.

కాగా నిన్న శనివారం శ్రీవారిని 87,171 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం 3.68 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీవారికి 38,273 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు...,.

మందు బాబులకు షాక్..ఇవాళ, రేపు వైన్ షాపులు బంద్..

తెలంగాణ మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చింది కేసీఆర్ సర్కార్. ఇవాళ మద్యం షాపులను క్లోజ్ చేయనుంది సర్కార్. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు అంటే 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు..

హైదరాబాద్ మహానగరంలో బోనాల పండుగ ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నిర్ణయం ప్రకారం… హైదరాబాద్ మహానగరం లోని కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సౌత్ ఈస్ట్, సౌత్ వేస్ట్, మల్కాజ్గిరి మరియు మహేశ్వరం జోన్లలో ఒకరోజు పాటు వైన్ షాపులను బంద్ చేయనున్నారు. సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సౌత్ జోన్ మరియు ఎల్బీనగర్ డివిజన్ లలో.. ఇవాల్టి నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు అంటే రెండు రోజులపాటు మద్యం దుకాణాలను మూసివేస్తారు. ఈ విషయం తెలియడంతోనే నిన్న అర్ధరాత్రి వరకు మద్యం కొనుగోలు జరిగాయి..

Tirupati: శ్రీవారి ఆశీస్సులతో దేశవాళీ గోజాతుల అభివృద్ధి.. పుట్టిన దూడలను పరామర్శించిన జవహార్ రెడ్డి

tirupati: తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో తలపెట్టిన దేశవాళీ గోజాతుల అభివృద్ధి ప్రయత్నం సత్ఫలితాలిస్తోందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యార్శి జవహార్ రెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు.గతంలో తాను తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన సమయంలో దేశవాళీ గోజాతుల అభివృద్ధి ప్రాజెక్టుకు రూపకల్పచేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

శ్రీ వెంకటేశ్వరస్వామి గోసంరక్షణశాలలో ఆరు ఆవులు దూడలకు జన్మనిచ్చిన విషయాన్ని తెలుసుకున్న జవహార్ రెడ్డి... ఆవుదూడలను పరామర్శించారు. దేశవాళీ గోజాతులను అభివృద్ధి ప్రాజెక్టు సత్ఫలితాలనిస్తుండటం ఆనందంగా ఉందని జవహార్ రెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు.

దేశీయ గోజాతి పశువులను అభివృద్ధి చేయడంతో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి పాల ఉత్పత్తులను తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి నిత్యసేవల్లో వినియోగించేందుకు ఇబ్బంది ఉండదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డి తెలిపారు. నెల రోజుల వ్యవధిలో ఆరు ఆవులు మేలు జాతి దూడలకు జన్మనిచ్చాయి. మరి కొన్ని రోజుల్లో 13 ఆవులు దూడలకు జన్మనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు..

మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధం : తీన్మార్ మల్లన్న

మేడ్చల్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించారు. విపక్ష పార్టీలు ప్రశ్నించే గొంతు మిగిలాలంటే తనపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులను పోటీకి నిలుపొద్దని తీన్మార్ మల్లన్న అన్నారు.

గత పది సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎదుర్కొంటున్న ఏకైక వ్యక్తి తానేనని అన్నారు. రాష్ట్రంలో ఏ వ్యక్తి మీద పెట్టని కేసులు తనపై పెట్టారని, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇంతకన్నా అర్హత ఏముంటదని మల్లన్న ప్రశ్నించారు.

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి డిపాజిట్లు కూడా రావని చేసిన వ్యాఖ్యలకు తీన్మార్ మల్లన్న స్పందిస్తూ డిపాజిట్ల స్పెల్లింగ్ చెప్పిన తర్వాత మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యల పై స్పందిస్తానన్నారు. శనివారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ బాలుర బాలికల ఉన్నత పాఠశాల 9, 10వ తరగతి విద్యార్థులకు తీన్మార్ మల్లన్న నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లన్న టీం సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు......

మంత్రుల పర్యటనతో కొండగట్టులో భక్తులకు తప్పని ఇక్కట్లు

•తిండీతిప్పలు లేక మూడు గంటల నిరీక్షణ

కొండగట్టులో అంజన్న భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వై జంక్షన్ నుంచి జేఎన్టీయూ కాలేజ్ వరకు ట్రాఫిక్ జాం అయ్యింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ మంత్రులు, ఎమ్మెల్యేలు రావడంతో ఆలయంలోనికి భక్తులను ఆలయ అధికారులు అనుమతించ లేదు.

అంజన్నను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు తిండీతిప్పలు లేకుండా మూడు గంటల పాటు ఆలయ ముఖ ద్వారం వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.

వై జంక్షన్ నుంచి జేఎన్టీయూ కాలేజ్ మధ్యలో గల స్థలంలో మొక్కలు నాటే కార్యక్రమం ఉండడం వల్ల మంత్రుల కాన్వాయ్ రోడ్డపై ఉంచి భక్తుల వాహనాలకు పోలీసులు అనుమతించ లేదు. దీంతో రెండు, మూడు కి.మీ. మేర ట్రాఫిక్ జాం తో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంత్రులు వస్తే తమకేంటని భక్తులు ప్రశ్నించారు. మనస్ఫూర్తిగా స్వామి వారి దర్శనం చేసుకోవడానికి కూడా వీలు లేకుండా అధికారులు ప్రవర్తించారని భక్తులు తెలిపారు...

కార్యకర్తలకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సీరియస్ వార్నింగ్

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ రూల్స్‌ను అతిక్రమించే కార్యకర్తలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గాంధీ భవన్ మెట్లపై ధర్నా చేస్తున్న కార్యకర్తలపై అధ్యక్షుడు మండిపడ్డారు. గాంధీ భవన్ మెట్లపై ఇక ధర్నాలు చేస్తే సస్పెండ్‌ చేస్తామని రేవంత్‌ హెచ్చరించారు. గాంధీ భవన్ మెట్లపై ధర్నా చేసే వారి వివరాలు సేకరించాలని నాయకులకు రేవంత్ ఆదేశించారు.

కార్యకర్తలకు సమస్య ఉంటే వినతి పత్రం ఇవ్వాలన్నారు. అంతేకాని పార్టీ ఆఫీసులో ధర్నాలు చేస్తే మాత్రం పార్టీ వ్యతిరేక చర్యగా చూస్తామని రేవంత్ పేర్కొన్నారు. పార్టీ లైన్ దాటితే సస్పెండ్ చేయాలని సంబంధిత నాయకులకు రేవంత్ ఆదేశించారు. మండల కమిటీలో చోటు దక్కని వారు వరుసగా ధర్నాలు చేస్తున్న నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.

పార్టీ పదవుల్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ కొందరు నాయకులు గాంధీభవన్‌లో ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. శనివారం కూడా గాంధీ భవన్‌కు రేవంత్‌ వచ్చేసరికి ఆలేరు నియోజకవర్గం తురకపల్లికి చెందిన కొందరు ఆందోళన చేస్తూ కనిపించారు. వారి వివరాలు తెలుసుకున్న తర్వాత ఆందోళనలపై రేవంత్‌ తీవ్రంగా స్పందించారు. ఆలేరు నియోజకవర్గంలో 8 మండలాలకు 7 మండలాల అధ్యక్షులను నియోజకవర్గ ఇంఛార్జి బీర్ల ఐలయ్య, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి అనుకూలంగా ఉన్నవారినే నియమించామని రేవంత్ గుర్తుచేశారు. ఒక్క మండలం మహిళకు ఇవ్వడాన్ని వ్యతిరేకించడం ఏంటని ప్రశ్నించారు. తక్షణమే ఆందోళన విరమించకుంటే సస్పెండ్ చేసేందుకు వివరాలు సేకరించాలని నేతలకు రేవంత్ ఆదేశించారు...

రేవంత్ పవర్ కట్ వ్యాఖ్యాల‌ను ప్ర‌తి గ‌డ‌ప గ‌డ‌ప‌కు చేర‌వేయండి… బిఆర్ఎస్ కార్యక‌ర్త‌ల‌కు కెటిఆర్ పిలుపు

కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తిస్తే ఉచిత విద్యుత్ ర‌ద్దే అని, రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి అని బిఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపు ఇచ్చారు.. బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల‌తో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ‌నివారం టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ఈ నెల 17 నుంచి 10 రోజుల పాటు బీఆర్ఎస్ రైతు స‌మావేశాలు నిర్వ‌హించాల‌న్నారు. 3 పంట‌లు బీఆర్ఎస్ నినాదం.. 3 గంట‌ల క‌రెంటు కాంగ్రెస్ విధానం పేరిట స‌భ‌లు నిర్వ‌హించాల‌ని సూచించారు. రైతుల‌కు కాంగ్రెస్ నేత‌లు క్ష‌మాప‌ణ చెప్పేలా తీర్మానాలు చేయాల‌న్నారు.

ప్ర‌తీ రైతు వేదిక వ‌ద్ద రైతు స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని కోరారు. ఎక‌రానికి గంట విద్యుత్ చాల‌న‌టం రైతుల‌ను వ‌మానించ‌డ‌మే అని అన్నారు. 24 గంట‌ల విద్యుత్ వ‌ద్ద‌న్న కాంగ్రెస్ కుట్ర‌ను రైతుల‌కు వివ‌రించాల‌ని సూచించారు. క‌టిక చీక‌ట్ల కాంగ్రెస్ కావాలా..? వెలుగు జిలుగుల‌ బీఆర్ఎస్ కావాలా..? తెలంగాణ రైతులు తేల్చుకోవాల్సిన త‌రుణ‌మిది అని కేటీఆర్ పేర్కొన్నారు...

రేపటి నుండి హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్:జులై 15

బోనాల జాతర సంబురంగా జరుగుతోంది. ఈ సందర్భంగా అంబర్‌పేట్‌లోని మహంకాళి ఆలయంలో జులై 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ వరకు జరిగే ఉత్సవాల సందర్భంగా సిటీ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. ఈ రూట్లో వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్ డైవర్షన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ రూట్లో జర్నీ చేసే వారు ట్రాఫిక్లో చిక్కుకుని ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

దారి మళ్లించే ప్రదేశాలు..

జులై 16వ తేదీ ఉదయం 6 గంటల నుండి జులై 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ రూట్లలో దారి మళ్లింపు చర్యలు అమలులోకి ఉంటాయి.

ఉప్పల్ నుండి అంబర్‌పేట్ వైపు వచ్చే అన్ని జిల్లాల బస్సులు, సిటీ బస్సులు, భారీ వాహనాలు ఉప్పల్ x రోడ్డులో హబ్సిగూడ – తార్నాక – అడిక్‌మెట్ – విద్యా నగర్ – ఫీవర్ హాస్పిటల్ – T.Y మీదుగా మళ్లిస్తారు. మండలి – టూరిస్ట్ హోటల్ Jn. – నింబోలిఅడ్డ – చాదర్‌ఘాట్ & C.B.S. తిరిగి వచ్చే మార్గం వైస్ వెర్సాగా ఉంటుంది.

కోటి నుండి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు, సిటీ బస్సులు నింబోలిఅడ్డ – టూరిస్ట్ హోటల్ – TY మండలి – ఫీవర్ హాస్పిటల్ అడిక్‌మెట్ – తార్నాక – హబ్సిగూడ – ఉప్పల్ X రోడ్ల మీదుగా తిరుగు మార్గంలో మళ్లిస్తారు.

ఉప్పల్ నుండి అంబర్‌పేట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను రాయల్ జ్యూస్ కార్నర్ – మల్లికార్జున నగర్ – డి డి కాలనీ – సిండికేట్ బ్యాంక్ శివం రోడ్ వద్ద మళ్లిస్తారు. గోల్నాక, మూసారాంబాగ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను సీపీఎల్‌ వైపు మళ్లిస్తారు. అంబర్‌పేట్ – సల్దానా గేట్ – అలీ కేఫ్ X రోడ్లు మరియు తిరుగు మార్గంలో వైస్ వెర్సా ఉంటుంది.

ఈ రూట్లలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలుంటాయని, ఎటువంటి అడ్డంకులు లేకుండా గమ్యస్థానాలకు చేరుకోవడానికి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని సిటీ పోలీసులు కోరారు...

మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్:జులై 15

రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కీసర మండంలో శనివారం పర్యటిస్తున్నారు. కీసర మండలం రాంపల్లి దయారా గ్రామంలో అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో

ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో కుట్టు మిషన్ల పంపిణి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గ్రామానికి చెందిన మహిళలకు మూడునెలల పాటు టైలరింగ్ శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది...

SB NEWS

అసంఘటిత రంగ కార్మికుల బతుకులను భారంగా మార్చుతున్న మోడీ ప్రభుత్వం

•బడా కార్పోరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెడుతున్న బీ జే పీ కేంద్ర ప్రభుత్వం..

•ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.జనార్ధన్...

బడుగు జీవుల, అసంఘటిత రంగ కార్మికుల బతుకులను భారంగా మార్చుతున్న కేంద్ర ఆర్ ఎస్ ఎస్, బీ జే పీ మోడీ ప్రభుత్వం,బడా కార్పోరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ,దేశ సంపదను దోచిపెడుతున్నదని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.జనార్ధన్ అన్నారు.

శనివారం నాడు నల్గొండ పట్టణం లోని శ్రామిక భవన్ (సీపీఐ ఎం-ఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయం) లో ఐ ఎఫ్ టి యు నల్గొండ జిల్లా కమిటీ సమావేశం,

జిల్లా అధ్యక్షుడు బొంగరాల నర్సింహ అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశానికి హాజరైన IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్ధన్ మాట్లాడుతూ,దేశంలో ముప్ఫై అయిదు కోట్లకు పైగా ఉన్న అసంఘటిత కార్మికుల జీవనోపాధి రోజు రోజుకు కడు దయణీయంగా మారుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు,నిత్యవసర వస్తువుల ధరలను పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం,కార్మికుల కూలీ రేట్లు,వేతనాలను పెంచడంలో అశ్రద్దగా, మొండిగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.

కార్మికుల శ్రమ మూలంగా అనేక కర్మాగారాల్లో ఉత్పత్తి అవుతున్న సంపదను,కార్మికుల శ్రమను,వివిధ రంగాలకు చెందిన యాజమాన్యాలు యదేచ్ఛగా దోచుకోవడానికి మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి,నాలుగు లేబర్ కోడ్ లుగా ముందుకు తెచ్చిందని ఆరోపించారు.

రాష్ట్రంలో కేసిఆర్ బీ ఆర్ ఎస్ ప్రభుత్వం,75 షెడ్యూల్డ్ జీ ఓ లకు గెజిట్ లు లేకుండా కాలయాపన చేస్తుందని,75 షెడ్యూల్డ్ పరిశ్రమలలో ఒక కోటి ఇరవై లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని, జీ ఓ లకు గెజిట్ ఇవ్వకపోవడంతో కార్మికులు నష్టపోతున్నారని అన్నారు.

కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటన గా,జూలై,ఆగస్టు నెలలో పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రచార కేంపైన్ నిర్వహిస్తుందని,అందులో భాగంగానే జూలై 20 న,హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని, క్విట్ ఇండియా కు పిలుపు నిచ్చిన ఆగస్టు 9 నాడు హైదరాబాద్ సిటీలో, అన్ని జిల్లా కలెక్టరేట్ ల ముందు మహా ధర్నాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలలో అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.

ఈ సమావేశంలో IFTU జిల్లా అధ్యక్షుడు బొంగరాల నర్సింహ, ప్రధాన కార్యదర్శి బొమ్మిడి నగేష్,జిల్లా నాయకులు కత్తుల చంద్రశేఖర్, దాసరి నర్సింహ, రావుల వీరేశ్,జానీ,అశోక్ పాషా,స్వామి,ముత్తు,ఎం.డి జానీ,రవి,తదితరులు పాల్గొన్నారు.